Dwaraka Nagar
-
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే వెళ్లిపోయారు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలోని ద్వారకానగర్‌లో అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆచూకీ తెలిసింది. తమను వెతకవద్దంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు ఈ నెల 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఉన్నతాధికారులు మూడు ప్రత్యేక పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. అదృశ్యమైన తర్వాత రోజు ముగ్గురు యువతులు తాము చైన్నైలో ఉన్నట్లు తండ్రికి మెసేజ్ పంపారు. పోలీసులు రంగంలోకి దిగి, ఫోన్ లోకేషన్ ఆధారంగా వారు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి, పట్టుకున్నారు. ద్వారకానగర్ బుదిల్‌పార్క్ సమీపంలో నివసిస్తున్న మింది అనూరాధ(22), తులసీ(20), కోమలి(17) సొంత అక్కాచెల్లెళ్లు. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ‘అమ్మా.. మేం చనిపోతున్నాం. మమ్మల్ని వెతకొద్దు’ అని తమ తల్లి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ పంపారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మంగళవారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మళ్లీ తల్లి మొబైల్ ఫోన్‌కి తాము చెన్నైలో క్షేమంగా ఉన్నామని మెసేజ్ పెట్టారు. వారు చెన్నైకి ఎందుకు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు విశాఖపట్నం నుంచి చెన్నైకి ఓ ప్రైవేట్ బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ ఒకరోజు ఉండి, బెంగళూరుకు వెళ్లినట్లు తేల్చారు. వారిని బెంగళూరులో పట్టుకుని, విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. ఇష్టం లేని వివాహం చేస్తున్నారన్న కారణంతోనే అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. (‘మేం చనిపోతున్నాం.. మా కోసం వెతకద్దు’) -
ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం
సాక్షి, విశాఖపట్నం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం మంగళవారం నగరంలో కలకలం రేపింది. పైగా తాము చనిపోతామని, తమను వెతకొద్దంటూ తల్లికి మెసేజ్ పంపించడం ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనలోకి నెట్టింది. ద్వారకానగర్ బుదిల్‌పార్క్ సమీపంలో నివసిస్తున్న మింది అనురాధ (22), తులసీ(20), కోమలి(17) అక్కాచెల్లెళ్లు. వీరిలో తులసీ, కోమలి విశాఖలోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. వీరంతా సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లారు. అదే సమయంలో తల్లి లక్ష్మి మొబైల్‌కు మెసేజ్ పంపారు. దీంతో తల్లిదండ్రులు అప్రమత్తమై ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి అదృశ్యం కావడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే మంగళవారం మళ్లీ తల్లి మొబైల్‌కి తాము చెన్నైలో క్షేమంగా ఉన్నామని మెసేజ్ పెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు వారెందుకు అలా మెసేజ్ పెట్టారు.. చెన్నై ఎందుకు వెళ్లారో వివరాలు తెలియరాలేదు. పోలీసులు ఆ వివరాలకోసం దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ పక్క ప్లానింగ్ అధికారి కొడుకు:మరో పక్క న్యాయవాది కొడుకు!
విశాఖపట్నం: ద్వారకా నగర్లో ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డెక్కారు. రెండు వర్గాలు చీలిపోయి గొడవపడ్డారు. రుషికొండ సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. వారు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు తోసుకున్నారు. ఓ గ్రూపుకు జీవీఎంసీ ప్లానింగ్ అధికారి కొడుకు నాయకత్వం వహించగా, మరో గ్రూపుకు ఓ న్యాయవాది కొడుకు నాయకత్వం వహిస్తున్నారు. పట్టణంలోని పోలీసులు మాత్రం వీరి గొడవలను పట్టించుకోవడంలేదు. ** -
వీఆర్ఓ పరీక్షకు ఉచిత అవగాహన తరగతులు
ద్వారకానగర్, న్యూస్‌లైన్ : వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు 23, 24 తేదీల్లో ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు విక్టరీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ జి.వెంకటశివ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2న పరీక్ష నిర్వహించనున్న దృష్ట్యా ప్రశ్నాసరళిపై వివిధ సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ద్వారకానగర్ నాల్గవ లైన్ గాయత్రి కాలేజీ దరి విక్టరీ స్టడీ సర్కిల్లో గానీ, 9246666225 నంబర్‌లోగానీ సంప్రదించాలని కోరారు. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీలో.. వెంకోజీపాలెం : వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ డెరైక్టర్లు ఎస్.వెంకటశ్రీనివాస్, ఎం.శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులు ఈనెల 23 నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు ద్వారకానగర్ మూడో లైన్‌లోని సంస్థ కార్యాలయంలో జరుగుతాయని తెలిపారు. వివరాలకు 9490263306, 7396449365లో సంప్రదించాలని కోరారు. -
విదేశీ ఉద్యో‘గాలం’
విశాఖపట్నం, న్యూస్‌లైన్: కువైట్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం. పెద్ద మొత్తంలో జీతం. ఇంకా మరెన్నో సదుపాయాలు.. అని నిరుద్యోగులకు ఆశ చూసి సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యక్తి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన విక్టర్ ఫ్రెడ్డీ డిసౌజా ‘క్వీనీటెక్ క్విక్ సొల్యూషన్స్’ పేరిట నాలుగు నెలల క్రితం ద్వారకానగర్ అరుణోదయ కాంప్లెక్స్‌లో కార్యాలయం ప్రారంభించాడు. కువైట్‌లోని సీ డ్రిల్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తానని క్వికర్.కామ్, ఓఎల్ఎక్స్.కామ్, ట్విట్టర్.కామ్‌లో యాడ్స్ పోస్టు చేశాడు. రూ.30 వేల నుంచి రూ. 60 వేల వరకు జీతమని కంపెనీ ఫ్రొఫైల్ సైట్లో పొందుపరిచాడు. ఆకర్షితులైన బంగ్లాదేశ్, చెన్నై, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది క్వీనీటెక్ ఉచ్చులో పడ్డారు. విశాఖకు చెందినవారు 25 మంది ఉన్నారు. వీరికి పలు దఫాలుగా ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు నిర్వహించారు. పోస్టును బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆన్లైన్ ద్వారా వసూలు చేశారు. సుమారు రూ. 6 కోట్లకు పైగా వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత ఈ నెల 5న, తరువాత 11న వీసాలు వస్తాయన్నారని పేర్కొన్నారు. 14న డెరైక్ట్‌గా పంపిస్తామని సంస్థ నుంచి ఫోన్ రావడంతో ద్వారకానగర్‌లోని సంస్థ కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. ఇక్కడ డిసౌజా లేకపోవడం, ఫోన్ ఆపేసి ఉండటంతో హెచ్ఆర్ని బాధితులు నిలదీశారు. తనకు సంబంధం లేదని ఆమె చేతులెత్తేయడంతో బాధితులు కార్యాలయంపై డాడికి దిగారు. అనంతరం ద్వారకాజోన్ పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఎలియాబాబు కేసు నమోదు చేశారు. కువైట్‌లో ఉద్యోగమని.. ట్విట్టర్లో యాడ్ చూశాను. కువైట్‌లో ఉద్యోగమని మా తమ్ముని కోసం రూ.లక్షన్నర కట్టాను. వీసా వచ్చేస్తుందంటూ రెండు వారాలుగా వాయిదా వేస్తున్నారు. గురువారం కచ్చితంగా నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు. తీరా డిసౌజా ఫోన్ ఆపేసి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. -రవి, విశాఖపట్నం ఆకర్షణీయమైన జీతమని... క్వికర్‌లో యాడ్ చూశాను. కంపెనీ ప్రొఫైల్ చూసి నిజమని నమ్మాను. సీ డ్రిల్ కంపెనీలో ఆకర్షనీయమైన జీతమని డబ్బులు కట్టాను. ఎండీ డిసో జా పత్తా లేకుండా పోయాడు. హెచ్ఆర్ను నిలదీస్తే తాను ఉద్యోగినని...తనకెలాంటి సంబంధం లేదంటోంది. దీంతో పోలీసులను ఆశ్రయించాను. -సంతోష్‌కుమార్, అక్కయ్యపాలెం