E pass machines
-
పోరుబాటలో రేషన్ డీలర్లు !
పౌరసరఫరా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనటంలో ఎటువంటి సందేహం లేదు. రేషన్ డిపోలను ్రౖక్రమేణా ప్రైవేటుకు అప్పగిస్తుండడం ఒకఎత్తయితే, బియ్యం మినహా ఇతర అన్ని వస్తువుల సరఫరాను నిలిపివేయడం ఇప్పటికే జరిగాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ నమ్ముకుని ఉన్నటువంటి డీలర్లను ప్రభుత్వం పొమ్మనలేక పొగపెట్టి సాగనంపే ప్రయత్నాలు చేస్తుండడంతో వారు పోరుబాట పట్టే యోచనలో ఉన్నారు... సాక్షి,విజయవాడ: పేదలకు ఎంతో ఉపయుక్తంగా వుండే చౌకధరల దుకాణాల వ్యవస్థను ప్రభుత్వం క్రమేణా బలహీనం చేస్తోంది. ఇప్పటికే ఒక్క బియ్యం మినహా అన్ని వస్తువులను ఆపేసిన ప్రభుత్వం ప్రజలను క్రమంగా ప్రైవేటుకు అలవాటు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.. నామినీ తొలగింపు, హెల్పర్స్‌కు నో.... గతంలో రేషన్ డీలర్లతో పాటు ఇద్దరు నామినీల వేలిముద్రలు ఆన్లైన్లో తీసుకునేవారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ–పోస్ మిషన్ ఆపరేట్ చేసేందుకు వీలుఉండేది. అయితే ఈ విధానానికి స్వస్తి పలికి, కేవలం జీవిత భాగస్వామి మాత్రమే నామినీగా ఉండాలనే నిబంధన విధించారు. జిల్లాలో 2,147 రేషన్ దుకాణాలు ఉండగా...73 మంది డీలర్ల జీవిత భాగస్వాములు రేషన్ దుకాణం నిర్వహించే స్థితిలో లేరు. కొందరు డీలర్లు ఒంటరిగా జీవిస్తుండగా, మరికొంతమంది అనారోగ్యంతో మంచంలో ఉన్నాను. కొంతమంది ఆదాయం సరిపోక భాగస్వాములు వేరే ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే జీవిత భాగస్వామి కాకుండా హెల్పర్‌కు అవకాశం కల్పించమని డీలర్లు కోరుతుంటే, ఈ నెలలో జీవితభాగస్వామిని కూడా నామినీగా అధికారులు తొలగించారు. దుకాణం నడిపేది ఏలా ? రేషన్ డీలర్ ఒకరి వేలి ముద్ర మాత్రమే తీసుకున్నారు. ఒక్క రేషన్ డీలరే దుకాణం నడపాలంటే చాలా కష్టం అతనే కార్డుదారుడు చేత వేలిముద్ర వేయించాలి. డబ్బులు తీసుకుని సరుకులు కాటా వేయాలి, రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల హెల్పర్ ఉంటే ఉపయుక్తంగా వుంటుందన్న డీలర్ల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షనేతను కలవొద్దంటూ హుకుం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన కొంతమంది డీలర్లు ఆయన్ను కలిసి తమ సమస్యలను వివరించేందుకు సిద్ధపడ్డారు. అయితే ఈ సమాచారం తెలుగుదేశం పార్టీ నేతలకు, పౌరసరఫరాల అధికారులకు తెలిసింది. దీంతో డీలర్లు సంఘానికి చెందిన కొంతమంది నేతల్ని పిలిచి ప్రతిపక్షనేత వద్దకు వెళ్లవద్దంటూ హుకుం జారీ చేశారు. ఆ విధంగా వెళ్లిన డీలర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తమకు కొత్తనిబంధనలు పెట్టి ప్రభుత్వం మరింత ఇబ్బంది పెడుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని లేదంటే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని డీలర్ల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. మొరాయిస్తున్న ఈ–పోస్ మిషన్లు ఈ– పోస్ మిషన్లు పాతపడిపోవడంతో పాటు సాఫ్ట్వేర్ సరిగా స్పందించడం లేదు. దీంతో రేషన్ డీలర్లకు బియ్యం ఇవ్వడం ఇబ్బందిగా మారింది. ఈ–పోస్ మిషన్లు మార్చి కొత్తవి ఇవ్వమని డీలర్లు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు కేవలం ఒక్క బియ్యం మాత్రమే సరఫరా చేయడం వల్ల తమకు కనీసం ఆదాయం రావడం లేదని, అందువల్ల తమకు గౌరవ వేతనం లేదా క్లాస్–4 ఉద్యోగస్తులుగా భావించి జీతం ఇవ్వమని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. సమస్యలు పరిష్కరించకుంటేమే1 నుంచి బంద్.. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ దృష్టికి శుక్రవారం తీసుకువెళ్లాం. ఆయన వృద్ధులైన రేషన్ డీలర్లకు నామినీలు పెట్టుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మా సమస్యలు పరిష్కరించకుంటే మే1వ తేది నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం. – మండాది వెంకట్రావ్, రేషన్ డీలర్లఅసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
చార్జింగ్ లేదని దించేశారు..
సూరారం: ఎక్కడైనా బస్సు మొరాయిస్తే ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపిస్తారు. కానీ టికెట్లు జారీ చేసే (ఈ–పోస్) మెషిన్ చార్జింగ్ అయిపోయిందనే సాకుతో కుత్బుల్లాపూర్ పరిధిలోని హెచ్ఎంటీ రోడ్డులో ప్రయాణికులను బస్సులోంచి దించేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో అటువైపు బస్సులు రాకపోవడంతో చాలాసేపు ఎదురుచూసి ఇతర బస్సుల్లో ప్రయాణించారు. కండాక్టర్ ముందుగానే మెషిన్‌ను చెక్ చేసుకొని ఉండాల్సిందిగా ప్రయాణికులు పేర్కొన్నారు. -
విచిత్రం
సాధారణంగా జిల్లాలో కుటుంబాల కంటే రేషన్ కార్డులు తక్కువగా ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాల సంఖ్యకు సరిసమానంగా అయినా రేషన్ కార్డులుండటం సహజం. అయితే జిల్లాలో పరిస్థితి మాత్రం విచిత్రం. కుటుంబాల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు లక్ష వరకు అధికంగా రేషన్ కార్డులు ఉన్నాయి. డబుల్ ఎంట్రీలు, బోగస్ రేషన్ కార్డులు ఇలా అన్ని కలుపుకుని లక్ష వరకు అదనంగా కార్డులు జిల్లాలో ఉండటం గమనార్హం. ఇటీవలే ఈపాస్ మిషన్లను కూడా ట్యాంపరింగ్ చేసిన ఘనులు జిల్లాలో ఉన్నారు. దీంతో ప్రతి నెలా వందల టన్నుల రేషన్ బియ్యం జిల్లాలో పక్కదారి పడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో మొత్తం 1,873 మంది రేషన్ డీలర్ల ద్వారా 8,74,120 మందికి తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇది అధికారిక గణాంకాలు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రం 7,78,420 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా జనాభా సుమారు 29.64 లక్షలు ఉంది. వాస్తవానికి దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలను గుర్తించి వారికే ప్రతి నెలా రేషన్ సరఫరా చేయాల్సి ఉంది. వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని వారిని గుర్తిస్తారు. ప్రతి పదేళ్లకోసారి జనగణన జరుగుతుంది. అది కూడా సగటున జిల్లా జనాభా ప్రతి పదేళ్లకు 5 నుంచి 10 శాతం లోపు పెరుగుతుంది. ఉద్యోగరీత్యా జిల్లాకు వచ్చే వారు, వ్యాపార నిమిత్తం వచ్చే వారు ఇలా అనేక కేటగిరీల వ్యక్తులు ఉన్నారు. ఈ క్రమంలో సగటున 10 శాతం పెంపుదలను ప్రామాణికంగా తీసుకున్నా వారిలో 6 శాతం మంది దారిద్య్రరేఖ దిగువున ఉన్న మిగిలిన వారు మధ్యతరగతి వారు ఉన్నారు. జిల్లాలో పరిస్థితి మాత్రం గణాంకాలకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికే కుటుంబాల సంఖ్య కంటే 94 వేల కార్డులు అధికంగా ఉన్నాయి. వీటిలో డబుల్ ఎంట్రీలు, బోగస్ కార్డులు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే అధికారుల వాదన దీనికి భిన్నంగా ఉంది. గడిచిన ఏడేళ్లలో పెళ్లిళ్లు ఎక్కువ జరిగి వేరు కాపురాలు, కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన కుటుంబాల సంఖ్య 2.50 లక్షల వరకు ఉంది. అంటే ఇప్పటికే సగటున 7 నుంచి 10 లక్షలు జిల్లా జనాభా పెరిగింది. దీనిని ప్రామాణికంగా తీసుకుంటే ఉన్న కార్డులు పెద్ద ఎక్కువేమీ కాదని వాఖ్యానిస్తున్నారు. ఈ–పాస్ ట్యాంపరింగ్ ఘనులు రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్ జిల్లాలోనే జరిగింది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు డీలర్లతో కుమ్మక్కై ఈ–పాస్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ విలువ ప్రకారం రూ.20 లక్షలు విలువ చేసే బియ్యాన్ని బహిరంగ మార్కెట్లోకి తరలించి విక్రయించారు. ఈ వ్యవహరంలో కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిపి 46 మందిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో 41 మంది డీలర్లను సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన దుకాణలకు సమీపంలోని డీలర్లకు ఇన్చార్జిలుగా నియమించారు. అలాగే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి.ధర్మారెడ్డిని బాధ్యుడ్ని చేసి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో గత నెలలో నూతన డీఎస్‌ఓగా ఎంవీ రమణను నియమించారు. అయితే జిల్లాలో గతంలో సస్పెండ్ అయిన డీలర్ల వల్ల 30 డిపోలు, తాజాగా సస్పెండ్ అయిన 41 మంది వల్ల మరో 41 దుకాణాల డీలర్ల పోస్టులు ఖాళీలయ్యాయి. జిల్లాలో డబుల్ ఎంట్రీలు, బోగస్ కార్డుల సంఖ్య కొంత ఎక్కుగానే ఉంది. అనధికారిక సమాచారం ప్రకారం వీటి సంఖ్య 10 నుంచి 12 వేల వరకు ఉండవచ్చు ముఖ్యంగా కోవూరు, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, ఉదయగిరి, వెంకటగిరిలో అధికంగా ఉన్నాయి. ఇంటి పేరుతో సçహా ఒక కార్డు, ఇంటి పేరు లేకుండా మరో కార్డు.. ఇలా డబుల్ ఎంట్రీ కార్డులతో పాటు, వేల సంఖ్యలో బోగస్ కార్డులు ఉన్నాయి. అధికారులు నామాత్రంగా తనిఖీలు నిర్వహించి మామూళ్లతో సరిపెట్టుకోవటంతో కార్డులు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. జిల్లాకు తాను కొత్తగా వచ్చానని అన్నింటినీ పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ రమణ సాక్షి ప్రతినిధికి తెలిపారు. అన్నింటినీ పరిశీలించి బోగస్ ఉంటే తొలగించటంతో పాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఈ–పాస్ కష్టాలు ఇంతింత కాదయా..
రామాయంపేట(మెదక్): రేషన్ దుకాణాల్లో అమర్చిన ఈ–పాస్ మిషన్లతో లబ్ధిదారులు నానా కష్టాలు పడుతున్నారు. ఓ వైపు వేలి ముద్రలు గుర్తించక ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు సిగ్నల్ కష్టాలూ వెంటాడుతున్నాయి. మండల పరిధిలోని దంతేపల్లి గ్రామంలో సిగ్నల్ రాకపోవడంతో ఆ రేషన్ డీలర్ ఈ–పాస్ మిషన్‌ను పొలాల వద్దకు తీసుకెళ్లి లబ్ధిదారులతో వేలి ముద్రలు వేయిస్తున్నాడు. దీంతో లబ్ధిదారులు రేషన్‌షాపుకు బదులుగా పొలాల వద్దకూ వెళ్లక తప్పని దుస్థితి నెలకొంది. -
ప‘రేషన్’
అనంతపురం అర్బన్ : జిల్లాలో రేషన్ కోసం పేదలు ఇబ్బంది పడుతున్నారు. కార్డులు రద్దు చేయడంతో కొందరికి.. కార్డు ఉన్నా వేలిముద్రలు సరిపోలడం లేదంటూ మరికొందరికి, కొత్త కార్డులు మంజూరు కాక ఇంకొందరికి రేషన్ అంద డం లేదు. ఈ-పాస్ యంత్రాలలో వేలిముద్రలు సరిపోలక రేషన్ అందని వారు జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉంటారని అధికారిక అంచనా. వీరు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. మండల స్థాయి అధికారుల ముందు వెళ్లబోసుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది. దీంతో ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. కార్డులు రద్దయిన పేదల పరిస్థితి మరింత దయనీయం. రోజు వారీ కూలీనాలి చేసుకుని బతుకులీడ్చే వీరికి రేషన్ సరుకులు కొంతవరకు ఆకలి బాధను తీర్చేవి. ఇప్పుడు అవి కూడా అందకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి. మరోవైపు కొత్తగా తెల్లకార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న పేదల సంఖ్య పెరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం రాకముందు జిల్లాలో 11,14,477 తెల్ల కార్డులు ఉండేవి. అనర్హుల ఏరివేతంటూ అధికారులు 94,014 కార్డులు రద్దు చేశారు. కొత్తగా కార్డుల కోసం 17,104 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,449 మందికి ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 10,27,912 తెల్లకార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు సంబంధించి 40,15,694 మంది సభ్యులుండగా.. ఆధార్ అనుసంధానం 31,79,946 మందికి పూర్తయ్యింది. అనుసంధానం కాని వారు 89,525 మంది, పెండింగ్‌లో ఉన్నవారు 51,933, తిరస్కరించిన వారు 6,94,290 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,934 చౌక దుకాణాలున్నాయి. ప్రస్తుతం 1,193 దుకాణాల్లో ఈ -పాస్ విధానం అమలు చేస్తున్నారు. వీటిలో వేలిముద్రలు సరిపోలడం లేదంటూ దాదాపు 20 వేల మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం లేదు. అదే 2,934 దుకాణాల్లోనూ ఈ- పాస్ అమలు చేస్తే ఇలాంటి వారి సంఖ్య 50 వేలకు పైగానే చేరుకుంటుంది. వృద్ధుల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేక వేలిముద్రలు సరిగా పడవు. ప్రధానంగా ఇలాంటి వారే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఏ దిక్కూ లేని వారు అన్నపూర్ణ కార్డు ద్వారా వచ్చే బియ్యంతో బతుకీడుస్తున్నారు. ఇలాంటి వారికి బియ్యం అందకపోతే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు కోటా కింద 16,292.59 టన్నుల బియ్యం కేటాయించారు. లబ్ధిదారులకు పంపిణీ చేయగా 2,743 టన్నులు మిగులు చూపించారు. వేలిముద్రలు సరిపోలక, ఆధార్ లింక్ కాకపోవడం వల్లే ఈ బియ్యం పంపిణీ కాలేదని పౌర సరఫరాల శాఖ సిబ్బందే చెబుతుండడం గమనార్హం.