E pass system
-
వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు
సాక్షి, హైదరాబాద్: పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఈ–పాస్ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ–పాస్ అవసరమైన వారు సంబంధిత పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో పొందుపర్చిన వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే ఈ పాసులు జారీ చేస్తామని, వాటి సహాయంతో సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. (పోలీసులపై దాష్టీకాలా?) Dear Citizens Who Got Stranded in Telangana due to #LockDown & want to leave for their Homes in other States in India can Apply for E-PASS by submitting required information @ the given link.https://t.co/WCLZ5nScIl After due verification ur E-PASS will b sent to u,to move ahead. pic.twitter.com/yasu3Ck3YG — DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 2, 2020 కోవిడ్ ’ఫ్రీ’ చేసి పంపండి రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులతో కూడిన బృందాలు స్క్రీనింగ్ చేయాలి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ఉత్తర్వులు లాక్డౌన్ కారణంగా ఉండిపోయి ఇప్పుడు తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారిని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుకు 2, 3 కిలోమీటర్ల ముందే పరీక్షలు నిర్వహించాలి. రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులతో కూడిన బృందం వారందరికీ పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించాలి. లేవని నిర్ధారిస్తూ ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లో సర్టిఫై చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వాహనాలకు కూడా నిర్దేశిత నమూనాలో పర్మిట్లు జారీ చేయాలి. వాహనం నంబర్‌తో పాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే అంశాలను పర్మిట్‌లో పేర్కొనాలి. స్క్రీనింగ్ చేసే బృందాలు అవసరం మేరకు 24 గంటలు పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని వెల్లడించారు. -
అమల్లోకి రేషన్ పోర్టబులిటీ
రేషన్‌డీలర్లు పనితీరును మెరుగుపర్చుకోవాలి ఈ-పాస్ సర్వర్ కెపాసిటీని పెంచుతాం పౌరసరఫరాల శాఖ డెరైక్టర్ రవిబాబు గూడూరు టౌన్ : ఈ-పాస్ విధానంలో భాగంగా వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఏ రేషన్ దుకాణం నుంచైనా వినియోగదారులు సరుకులను తీసుకువెళ్లేలా రేషన్ పోర్టబులిటీని బుధవారం నుంచి అమలు చేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డెరైక్టర్ రవిబాబు తెలిపారు. గూడూరులోని 3వ వార్డులో ఉన్న 11వ రేషన్ దుకాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్‌ను పెంచేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని 11వ నంబరు చౌక దుకాణాంలో అతి తక్కువమంది రేషన్ తీసుకున్నారని, అదే సమయంలో 13లో 60 మంది వరకు సరుకులు తీసుకున్నట్లు సమాచారం రావడంతో దుకాణాన్ని పరిశీలించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1.50 లక్షల మంది ఈ-పాస్ విధానం ద్వారా సరుకులు తీసుకుంటున్నారని, దీనిని 3 లక్షలకు పెంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ-పాస్ సర్వర్ కెపాసిటీని పెంచి సరుకులను అందజేయడంలో అలసత్వం లేకుండా చూస్తామన్నారు. ఆయన వెంట డీఎస్ఓ ధర్మారెడ్డి, ఆర్డీఓ రవీంద్ర, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ ఉన్నారు. -
ఈ సారైనా.. పాస్ అయ్యేనా?
ఈ పద్ధతిలో జిల్లాలో 2 లక్షల మందికే సరకులు 6.5 లక్షల మందికి పాతపద్ధతిలోనే పంపిణీ మే 1 నుంచి ఏజెన్సీలో కూడా అమలు సాక్షి, విశాఖపట్నం : ఈ-పాస్ విధానం జిల్లాలో తుస్సుమంది. అధికారులను.. డీలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇక సామాన్యప్రజల సహనానికి పరీక్షగా నిలిచింది. ప్రారంభించిన తొలి నెలలో నాలుగో వంతు మందికి మించి ఈ మెషీన్ల ద్వారా సరకులు అందించలేని దుస్థితి ఏర్పడింది. మిగిలిన వారికి పాతపద్ధతిలోనే సరకులు పంపిణీ పూర్తి చేయడంతో గండం గడిచి పిండం బయట పడినట్టయ్యింది. జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల పరిధిలో 274 రేషన్‌షాపులో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు నుంచి దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయిపోవడం, సెల్నెట్వర్క్ సిగ్నెల్స్ పనిచేయకపోవడం, మెషీన్లు మొరాయించడం వంటి సమస్యలతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. రోజుకు పట్టుమని పదిమందికి కూడా సరఫరా చేయలేకపోయేవారు. ఈ విధానం ద్వారా పంపిణీ మా వల్ల కాదని, పాతపద్ధతిలోనే పంపిణీ చేస్తామని డీలర్లు చెప్పడం.. ఏదేమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో 15వ తేదీ వరకు కనీసం జిల్లాలో 20 శాతం మంది కార్డుదారులకు కూడా సరకులు పంపిణీచేయలేకపోయారు. చివరకు క్షేత్ర స్థాయి సాంకేతిక సమస్యలను గుర్తించిన యంత్రాంగం ఈ నెల వరకు పాతపద్ధతి (డిజిటల్ కీ రిజిస్ట్రర్)లోనే పంపిణీ చేసేందుకు గ్రీన్సిగ్నెల్ఇచ్చింది. రెండు రోజుల గడువు పెంచింది. దీంతో 20వ తేదీ నాటికి కిరోసిన్ మినహా మిగిలిన నిత్యావసరాల పంపిణీని పూర్తి చేయగలిగారు. కిరోసిన్‌ను మాత్రం ఈనెల 25వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు గడువు ఇచ్చారు. కె.కోటపాడు, బుచ్చియ్యపేటల్లో ఒక్కొక్కరికే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ఈ పాస్ మెషీన్ల ద్వారా 2,09,982 కార్డులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగిలిన6,26,548 మందికి పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. జీవీఎంసీ పరిధిలో 412 షాపుల పరిధిలో 3,68,496 కార్డుదారులుండగా, కేవలం 86,311 కార్డులకు మాత్రమే ఈపాస్ విధానంలో సరకులు పంపిణీ చేయగలిగారు. మిగిలిన 2,70,419 కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేయగలిగారు. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, భీమిలి మున్సిపాలిటీలతో పాటు పెందుర్తి, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, ఆనందపురం, పరవాడ మండలాల్లో 274 షాపుల పరిధిలో 4,68,034 కార్డుదారులకు ఈ పాస్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా, 1,23,671 కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగిలిన 3,44,363 కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. ఈ-పాస్ ద్వారా జీవీఎంసీ పరిధిలో 23.72 శాతం మందికి, ఇతర మున్సిపాల్టీలతో పాటు ఎంపిక చేసిన మండలాల్లో 26.42శాతం మందికి సరకులు ఇవ్వగలిగారు. బుచ్చియ్య పేటలో 272, కె.కోటపాడులో 501 కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం ఒక్కొక్కరికి మాత్రమే ఈపాస్ద్వారా పంపిణీ చేయగలిగారు. విశాఖపట్నం రూరల్-2లో కూడా 17 మందికి మాత్రమే పంపిణీ చేశారు. మెషీన్ల పనితీరుపై టెస్టింగ్ డ్రైవ్ వచ్చేనెలలో ఈ పరిస్థితిని అధిగమించేందుకు గురవారం నుంచి ఈ పాస్ మెషీన్ల పనితీరుపై ప్రత్యేకంగా టెస్టింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరో పక్క ఏజెన్సీలో పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ డిపోల్లో కూడా మే 1వ తేదీ నుంచి ఈ పాస్ ద్వారా సరుకుల పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. తొలినెలలో ఎదురైనా అవరోధాలను అధిగమించేందుకు ఇకనైనా పగడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది. -
రేషన్‌కూ ఈ-పాస్!
శ్రీకాకుళం పాతబస్టాండ్:ప్రజాపంపిణీ విధానాన్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయడం ద్వారా పేదలకు సరుకులను ఈ-పాస్ విధానంలోనే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పెలైట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. వీటిలో శ్రీకాకుళం జిల్లా కూడా ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ విధానం అమలుకు జిల్లాకు 1919 ఈ-పాస్, ఎలక్ట్రానికి కాటాల సెట్లు మంజూరు చేసింది. వీటిని రేషన్ డీలర్లకు అందజేస్తారు. ఈ యంత్రాలను సరఫరా చేసే టెండరును ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. త్వరలో ఈ యంత్రాలు జిల్లాకు చేరనుండగా.. రెండు మూడు నెలల్లో పూర్తిగా ఆధునిక విధానంలోనే సరుకులు సరఫరా చేయనున్నారు. జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 7.90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 1989 రేషన్ డిపోల పరిధిలో ఉన్న ఈ కార్డుదారులకు ప్రస్తుతం మాన్యువల్ విధానంలో సరుకులు సరఫరా చేస్తున్నారు. పంపిణీ ప్రక్రియను ఇప్పటికే ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయడం దాదాపు పూర్తి కావచ్చింది. కొత్త ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. తొలిదశలో ఈ పథకాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.49,710 విలువ చేసే ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాటాల సెట్‌ను ప్రతి డీలరుకు అందజేస్తారు. పని చేసే విధానం ఈ-పాస్ యంత్రాల్లో రేషన్‌కార్డుల నెంబర్లు, కార్డుదారుల కుటుంబంలోని ఒకరి బొటనవేలి ముద్ర ముందుగానే నిక్షిప్తం చేస్తారు. సరుకుల పంపిణీ సమయంలో లబ్ధిదారుని రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడంతోపాటు, బొటనవేలి ముద్ర తీసుకుంటారు. యంత్రంలో నిక్షిప్తమైన వాటితో అవి సరిపోలితే ఆ కార్డుకు అందజేయాల్సిన సరుకుల వివరాలతో ఒక స్లిప్ వస్తుంది. దాని ఆధారంగా ఎలక్రాటనిక్ కాటాలో సరుకులు తూచి లబ్ధిదారుడికి అందజేస్తారు. లబ్ధిదారులకు కష్టం ఈ-పాస్ విధానం అమల్లోకి వస్తే లబ్ధిదారులతో పాటు డీలర్లు కూడా గురికాక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలామంది డీలర్లపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే 500 కంటే ఎక్కువ రేషన్ కార్డులున్న డిపోలను విభజించి కొత్తవారికి డిపోలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. వీటికి తోడు ఈ-పాస్ విధానం అమల్లోకి వస్తే సరుకుల పంపిణీలో ఇబ్బందులు తప్పవంటున్నారు. కాగా పేద లబ్ధిదారులు ఉపాధి కోసం నెలల తరబడి వలస వెళుతుంటారు. వారి తరఫున కుటుంబ సభ్యుల్లో ఎవరికి వీలుంటే వారు వెళ్లి సరుకులు తీసుకుంటుంటారు. కానీ ఈ-పాస్ విధానంలో ఎవరో ఒకరి వేలిముద్ర మాత్రమే నమోదై ఉంటుంది. అందువల్ల ప్రతి నెలా ఆ వ్యక్తి మాత్రమే వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. వలస వెళ్లిన వారికి, కూలి పనులకు వెళ్లేవారికి ఇది ఇబ్బందికరమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.