మార్కెట్లోకి ‘మోటో ఈ4’ స్మార్ట్‌ఫోన్స్
ధర శ్రేణి రూ. 8,999–రూ. 9,999
న్యూఢిల్లీ: మోటరోలా సంస్థ తాజాగా తన ‘ఈ’ సిరీస్‌లో నాల్గవ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘మోటో ఈ4’ స్మార్ట్‌ఫోన్ కేవలం ఆఫ్‌లైన్ రిటైల్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.8,999. ‘మోటో ఈ4 ప్లస్’ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.
ధర రూ.9,999. ఈ4ప్లస్‌లో 5.5 అంగుళాల డిస్ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఆఫ్‌లైన్‌లో విక్రయించే హ్యాండ్సెట్స్ ధరలను తగ్గిస్తామని లెనొవొ ప్రకటించింది.