early morning
-
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
భారతీయ వంటల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దీని వల్ల వంటలకు సువాసనను, రుచిని అందించడమే కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.ఉదయాన్నే శుభ్రమైన కరివేపాకును నమిలి తినవచ్చు. లేదా కరివేపాకు నీటిని తాగవచ్చు.కరివేపాకు డీటాక్స్ వాటర్ గ్లాసుడు నీళ్లలో కొంచెం కరివేపాకులు వేసి మరిగించాలి. అలాగే పుదీనా ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి. దీనికి కొద్దిగా తేనె లేదా, నిమ్మరసం కలపు కొని తాగవచ్చు.జీర్ణక్రియలో సహాయపడుతుందిఫైబర్ నిండిన కరివేపాకు జీర్ణవ్యవస్థకు మంచిది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. కరివేపాకు నీటిని ఉదయాన్నే మోతాదుగా తీసుకుంటే మంచిది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది: కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్ లక్షణం శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.జుట్టు పెరుగుదలకు గ్రేట్: జుట్టుకు సహాయపడే గుణాలకు ప్రసిద్ధి చెందిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యానికి సాయపడుతుంది.చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది: యాంటీఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు చర్మానికి హాని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అల్పాహారానికి ముందు క్రమం తప్పకుండా ఈ నీటిని తాగితే చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సహజమైన, ప్రకాశవంతమైన మెరుపు వస్తుంది.రోగనిరోధకశక్తికి బూస్టర్: కరివేపాకులో పోషకాలు ఎక్కువ. ఫైబర్ ఎక్కువ విటమిన్ సీ, ఇతర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన కరివేపాకు సహజంగానే రోగనిరోధక శక్తి బూస్టర్‌లా పనిచేస్తుంది. కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు , వ్యాధులకు వ్యతిరేకంగా శరీర శక్తి పెరుగుతుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: కరివేపాకు గుండె ఆరోగ్యానికి చాలామంచిది. అవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకున్న కరివేపాకు నీళ్లతో గుండె సంబంధిత సమస్యలును నివారించుకోవచ్చు.బ్లడ్ షుగర్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. హై పోగ్లైసీమిక్ లక్షణాలతో కూడిన కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థ వంతంగా సమతుల్యం చేస్తుంది.అధిక బరువు: ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. కరివేపాకు వాటర్ ఆకలిని నియంత్రిస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. నోట్: ఇది అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు డైటీషియన్ లేదా మీ వైద్యుడిని సంప్రదించండి. -
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు. -
నిద్ర కళ్లతో టీవీ చూద్దాం
బోల్ట్ పరుగు తీసే క్షణాలను చూడాలనుకుంటున్నారా..? భారత క్రీడాకారులు సగర్వంగా పతకాన్ని ముద్దాడుతుంటే ఆనందించాలని భావిస్తున్నారా..? అయితే నిద్రకళ్లతో టీవీ చూడటానికి సిద్ధం కండి. ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడల పండగ ఒలింపిక్స్ వచ్చేసింది. శుక్రవారం రాత్రి జరిగే ప్రారంభోత్సవ (భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున గం. 4.30 నుంచి) కార్యక్రమంతో అధికారికంగా క్రీడలకు తెరలేవనుంది. 17 రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలింపిక్స్ ఈసారి బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో నగరంలో జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం రియో ఎనిమిదిన్నర గంటలు వెనక ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ మన కాలమానం సాయంత్రం ఆరు గంటల నుంచి పోటీలు జరుగుతాయి. ఇవి రాత్రి మొత్తం ఉంటాయి. ఉదయం ఏడు గంటల వరకూ సాగుతాయి. బోల్ట్ 100 మీటర్ల పరుగు మన కాలమానం ప్రకారం 15వ తేదీ ఉదయం గం.6.55కి ఉంటుంది. అర్ధరాత్రి దాకా మెలకువగా ఉండటమో... లేక తెల్లవారుజామున త్వరగా లేవడమో... అనుకూలతను బట్టి ఏదో ఒక సమయంలో నిద్ర కళ్లతో అయినా టీవీ ఆన్ చేద్దాం. పండుగను ఆస్వాదిద్దాం. -
ఇద్దరు యువకుల దుర్మరణం
ఎం.నాగులపల్లి (ద్వారకాతిరుమల) : రాషీ్ట్రయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి పంచాయతీ పరిధిలో మంగళవారం వేకువజామున ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పి.కన్నాపురం పంచాయతీ సత్తాల గ్రామానికి చెందిన అన్నెం రాజేష్ (32), అన్నెం నరసింహరావు (28) వరుసకు సోదరులు. విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు పయనమైన రాజేష్‌ను భీమడోలు బస్టాండ్ వద్ద దింపేందుకు వేకువజామున 5 గంటల సమయంలో నరసింహరావు తన ద్విచక్రవాహనంపై రాజేష్‌తో బయలుదేరాడు. ఘటనాస్థలం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా వీరిని ఢీకొట్టింది. దీంతో వాహనంతో సహా వీరిద్దరూ రోడ్డు పక్కన పంట పొలాల్లోకి ఎగిరిపడ్డారు. పొలంలోని విద్యుత్ స్తంభానికి వీరు తగలడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఓ హైటెక్ బస్ ముందు వెళుతున్న లారీని అతివేగంతో నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేసే సమయంలో వీరిని ఢీకొట్టిందని స్థానికులు అంటున్నారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.నాగవెంకటరాజు, సిబ్బంది ఘటనా స్థలం వద్ద మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసింహరావుకు గతేడాది వివాహం కాగా భార్య గర్భిణి. వ్యవసాయ కూలీలుగా కుటుంబాలను పోషిస్తున్న వీరి మృతితో గ్రామం శోకసంద్రంగా మారింది. -
ఉదయం వేళ వ్యాయామం ఎలా మేలు చేస్తుంది?
వ్యాయామం ఉదయం వేళలోనే చేయాలని చెబుతుంటారు. దీనికి ఏదైనా కారణం ఉందా? దయచేసి వివరించండి. - సుకుమార్, హైదరాబాద్ పూర్వకాలం నుంచి చాలా పనులు ప్రాతఃకాలంలోనే మొదలుపెట్టి ఎండ ముదిరే వేళకు కాస్త విరామం ఇచ్చి, చల్లబడే వేళకు మళ్లీ మొదలుపెట్టేవారు. పొలం పనులు, తోట పనులు, చేపలు పట్టడం వంటివాటిని సూర్యోదయం కాకముందునుంచే మొదలుపెట్టేవారు. అలాగే వ్యాయామాన్ని కూడా సూర్యోదయం కాకముందే చేయడం అన్నది మొదటి నుంచీ ఉన్న అభ్యాసమే. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి... ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి త్వరగా అలసిపోవడం, త్వరగా చెమటపట్టడం వంటివి ఉండవు. ఇక రోజు గడుస్తున్న కొద్దీ అలసట పెరుగుతుంది. ఉదయం వేళలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి న్యూరోట్రాన్స్మిటర్ల, హార్మోన్ల, ఎంజైమ్‌ల పనితీరు ఉదయం వేళల్లో బాగుంటుంది. ఆ మూఢనమ్మకం వెనక శాస్త్రీయత ఇదే... రాత్రుళ్లు దెయ్యాలు సంచరిస్తుంటాయానే మూఢనమ్మకం కొందరిలో బలపడటానికి కారణాన్ని చూద్దాం. ఈ మూఢనమ్మకం ప్రాచుర్యంలోకి రావడానికి శాస్త్రీయ కారణం ఉంది. మన దేశంలో పొలాల్లో పని చేసే వారు అక్కడే ఉండిపోవాల్సి వస్తే రాత్రుళ్లు చెట్ల కింద పడుకునే వారు. రాత్రివేళల్లో చెట్లలో కిరణజన్యసంయోగ క్రియ జరగదు. కేవలం శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది. కాబట్టి రాత్రివేళల్లో చెట్లు ఆక్సిజన్‌ను గ్రహించి, కార్బన్‌డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి. చెట్లు రాత్రిళ్లు కార్బన్‌డైఆక్సైడ్‌ను వెలువరించే సమయంలో వాటి కింద పడుకున్న వారికి ఊపిరి ఆడదు. దాంతో గుండెల మీద ఎవరో కూర్చున్నట్లు భ్రమపడుతుంటారు. అందుకే ఈ దెయ్యపు భ్రాంతి. ఇక మళ్లీ ఉదయం వేళ సూర్యుడి కిరణాలు ప్రసరించగానే, కిరణజన్య సంయోగ క్రియ మొదలై చెట్లు ఆక్సిజన్‌ను వెలువరించడం ప్రారంభమవుతుంది. అందుకే ఉదయం వేళల్లో వాతావరణంలోకి తాజా ఆక్సిజన్ వెలువడటం జరుగుతుంది కాబట్టి ఆ టైమ్ వ్యాయామానికి మంచి వేళగా పరిగణించవచ్చు. ఇక ఉదయపు సూర్యకాంతి విటమిన్-డి ఉత్పాదనకు తోడ్పడుతుంది. ఆ వేళలో ప్రసరించే అల్ట్రా వయొలెట్ కిరణాలు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఉదయం వేళల్లో వ్యాయామం చేయడం మంచిది. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలులు, పరిస్థితుల కారణంగా నిర్దిష్టంగా ఆ వేళలోనే వ్యాయామం చేయాలనే నిబంధన పెట్టుకోకుండా... సమయం, తీరిక దొరికినప్పుడు వ్యాయామం చేయడం మంచిది. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్