EChallan
-
అలర్ట్: ఈ–చలాన్ పేరిట సైబర్ మోసాలు
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్ లింక్‌లు పంపుతున్నారు. అందులో.. మీ వాహనాలపై ఉన్న ఈ–చలాన్లు చెల్లించండని.. పేర్కొంటున్నారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని వచ్చే ఎస్ఎంఎస్లో నకిలీ వెబ్సైట్ లింక్ ఉంటుందని, వాహనదారులు దీన్ని క్షుణ్ణంగా గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ–చలాన్‌కు సంబంధించిన నిజమైన వెబ్‌లింక్ echallan.parivahan.gov.in కాగా దీన్ని కొద్దిగా మార్పు చేసి సైబర్ నేరగాళ్లు challaanparivahan.inను పంపుతున్నట్టు తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘డిజిటల్ అరెస్టు’ మోసగాడి పట్టివేత రాయదుర్గం: ‘డిజిటల్ అరెస్ట్’ కేసులో మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్స్పెక్టర్ కె రామిరెడ్డి నేతృత్వంలో పుణేలో ఈ మేరకు నిందితుడు కపిల్‌కుమార్ (42)ను అరెస్ట్ చేశారు. ఇతను 40 ఏళ్ల మహిళను లక్ష్యంగా చేసుకొని డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడ్డాడు. బాధితురాలికి ఆమె పేరుతో ఉన్న సమస్యకు సంబంధించి ఢిల్లీ హైకోర్టునుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన మహిళను మీ బ్యాంకు ఖాతా ద్వారా మోసపూరిత కార్యకలాపాలు, మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగాయని పేర్కొన్న నిందితులు డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను 24 గంటలపాటు భయపెట్టారు. అనంతరం భారీ మొత్తం నగదును బదిలీ చేయించుకున్నారు. ఈ కేసులో ఈ కేసులో ఏ1గా కింగ్‌శుక్ శుక్లా, ఏ2గా కపిల్‌కుమార్ ఉన్నారు. పనిచేసే సంస్థకే కన్నం బంజారాహిల్స్: నమ్మకంగా పనిచేస్తూ పనిచేసే సంస్థకే ఉద్యోగి దాదాపు రూ.1.40 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏషియన్ ముక్తా ఏ2 సినిమాస్‌లో దాదాపు ఏడున్నర ఏళ్లుగా విశ్వనాథ్‌రెడ్డి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో అతని భార్య సఫియా నజీర్ మేనేజర్‌గా పనిచేస్తుంది. ఈ నెల 18న ఏషియన్ ముక్తా సంస్థలో అంతర్గతంగా నిర్వహించిన ఆడిటింగ్‌లో భాగంగా విశ్వనాథ్‌రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. చదవండి: సైబర్ మోసాల నుంచి తప్పించుకోండిలా..నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి సంస్థ రూ.1,47,08,928 నిధులను తన భార్య, సోదరుడు రాసిం రాజశేఖర్, స్నేహితుడు శశాంక్ పేరుతో ఉన్న ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. హిందుస్థాన్ కోకోకోలా బేవరేజస్, సాయి నైన్ ఎంటర్ప్రైజెస్ల పేర్లతో మొత్తం నాలుగు ఖాతాల్లోకి ఈ మొత్తం డబ్బును మళ్లించినట్లు గుర్తించారు. ఆడిటింగ్‌లో భాగంగా ఈ నిధుల గోల్మాల్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏషియన్ ముక్తా ఏ2 సినిమాస్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ సునీల్ నారంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 316 (4), 318 (4), 335, 336 (3), 338, రెడ్ విత్ 3(5)ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులుతిరుపతి క్రైమ్: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గత వారం రోజుల్లో పలుమార్లు నగరంలోని ప్రముఖ హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ బాంబులు పెట్టామని మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్న దుండగులు తాజాగా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో బాంబు పెట్టామని ఆదివారం బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసు యంత్రాంగం ఇస్కాన్ టెంపుల్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టింది. జాఫర్ సాధిక్ అనే పేరుతో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. -
చలానా చిక్కులకు చెల్లుచీటీ
బనశంకరి: మోటారు వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘన కేసుల్లో పాత పద్ధతిలో జరిమానా విధిస్తున్న రవాణా శాఖ హైటెక్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చలానాలు జారీచేయనున్నారు. పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ (పీడీఏ) పరికరాల ద్వారా జరిమానా విధిస్తారు. ఎలక్ట్రానిక్ – చలాన్ వ్యవస్థతో నగదు రహిత లావాదేవీలు జరుగుతాయి. ప్రస్తుతం మోటారు వాహనాల ఇన్స్‌స్పెక్టర్లు వాహనాలను తనిఖీల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనదారులకు చెక్ రిపోర్టు రాసి కేసు నమోదు చేస్తారు. వాహనాల యజమానులు, లేదా డ్రైవర్లుకు జరిమానా రశీదును అందిస్తారు. నగదు ఉంటే వారు అక్కడికక్కడే జరిమానా చెల్లిస్తారు. నగదు లేని వారు ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి చెల్లించడం సాధారణం. పలు రాష్ట్రాల్లో ఈ – చలాన్ ఈ–చలాన్ వ్యవస్థ జారీకాబడితే మాన్యువల్ వ్యవస్థ ఉండదు. జరిమానా చెల్లింపులకు పెద్దగా శ్రమ ఉండదు. ట్రాఫిక్ పోలీసులు, ఎంవీఐల వద్ద ఉండే పీడీఏ పరికరాల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు స్కైప్ చేసి యూపీఐ ద్వారా జరిమానా కట్టేయవచ్చు. ఆ వెంటనే ఎస్ఎంఎస్ చెల్లింపుదారుకు వస్తుంది. ఇలా నగదు చెల్లింపుల్లో జరిగే అవినీతికి కొంచైమెనా అడ్డుకట్ట పడుతుంది. ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లో ఇప్పటికే ఇ–చలాన్ వ్యవస్థ అమల్లో ఉంది. రాష్ట్రంలో 67 ఆర్టీఓ కార్యాలయాల పరిదిలో సుమారు 200 మంది మోటారువాహనాల ఇన్స్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. ఇ–చలాన్ వసూలుకు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారు. క్షణాల్లో వాహన సమాచారం పీడీఏ పరికరాలను వాహన సమాచారం ఉండే సారథి–4 వాహన్–4 సర్వర్లతో అనుసంధానిస్తారు. అధికారులు పీడీఏ పరికరాల్లో వాహనాల నంబరు నమోదు చేయగానే ఆ వాహన యజమాని, లైసెన్స్, ఆర్సీ సమాచారం, గతంలో పెండింగ్ జరిమానాలు ఉంటే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ట్యాక్స్ పెండింగ్ కూడా తెలుపుతుంది. బెంగళూరులోని రాజాజీనగర ఆర్టీఓ పరిధిలో ప్రయోగాత్మకంగా ఇ–చలాన్ వ్యవస్థ అమల్లో ఉండగా ఉత్తమ స్పందన లభించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇ–చలాన్ వ్యవస్ద అమలుచేయాలని తీర్మానించామని రవాణాశాఖ కమిషనర్ ఏఎం.యోగేశ్ తెలిపారు. -
టీఆర్ఎస్ నేతలకు షాక్.. ఫ్లెక్సీలపై పెనాల్టీలు
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకొని పలువురు టీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల వంటివి భారీగా ఏర్పాటు చేశారు. వాటితో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా ద్వారా పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందించిన ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్(సీఈసీ) ఈ చలానాల జారీ ప్రారంభించింది. వాటిని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా సీఈసీ ఖాతాకు అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నుంచి పార్టీ డివిజన్ స్థాయి నాయకుల వరకు పెనాల్టీల ఈ– చలానాలు జారీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ఫ్లెక్సీలున్నప్పటికీ పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకే పెనాల్టీలు వేయడంతో, పెనాల్టీలు పడనివి అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ► మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్పార్క్, పంజగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, తార్నాక, ప్యాట్నీ ఈస్ట్‌మారేడ్‌పల్లి, మెట్టుగూడ, తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ– చలానాలు జారీ చేశారు. ఒక్కో ఫ్లెక్సీకి రూ. 5వేల వంతున చలానాలు జారీ అయ్యాయి. ► హైటెక్‌సిటీలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల వంతున రెండింటికి లక్ష రూపాయల చలానాలు జారీ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట ఏర్పాటైన వాటికి, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన వాటికి పెనాల్టీలు విధించా రు. బుధవారం సాయంత్రం వరకు తలసానిపై ఇరవైకి పైగా, పార్టీ జనరల్సెక్రటరీపై దాదాపు ఇరవై ఫ్లెక్సీలకు ఈచలానాలు జారీ చేశారు. ► టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి హుస్సేన్‌సాగర్‌లో బోట్‌కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50వేలు, రూ.15వేలు వంతున రెండు ఈ– చలానాలు జారీ అయ్యాయి. గచ్చిబౌలిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన షేక్‌హమీద్‌కు లక్ష రూపాయల వంతున రెండు ఈ– చలానాలు జారీ చేశారు. ఈచలానాల జారీ ఇంకా కొనసాగుతుండటంతో కచ్చితంగా ఎంత మొత్తం అనేది తెలియడానికి సమయం పట్టనుంది. తగ్గేదేలే.. ► పెనాల్టీలు వేసినా తాము తగ్గేది లేదని, పార్టీపై.. అగ్రనాయకులపై తమ అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నట్లుగా పలువురు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు తదితరమైన వాటితో స్వాగతాలు పలికారు. పెనాల్టీలు పడినా సరే అధిష్టానం దృష్టిలో పడితే చాలన్నట్లుగా కొందరు వీటిని ఏర్పాటు చేశారు. ► ట్విట్టర్ వేదిక ద్వారా కొందరు పౌరులు టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లు కారు అని అన్న మీరే ఇలా వ్యవహరించారేం? అని ప్రశ్నించారు. మేం నిబంధనలు పాటించాలి కానీ మీ పార్టీ పాటించవద్దా అని పేర్కొన్నారు. బెంగళూర్‌లో ఫ్లెక్సీలు, గుట్కా, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారని పోస్ట్‌చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటదో తెలియని నగరంలో ఒక్కసారిగా గాలిదుమారం వీస్తే రోడ్డున పోయే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. -
వాహన దారులకు బంపర్ ఆఫర్
-
బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు విశేష స్పందన వస్తోంది. నిమిషానికి 700 పెండింగ్ చలాన్లను అధికారులు క్లియర్ చేస్తున్నారు. బైక్‌లు, ఆటోలకు 75 శాతం, కారు, లారీ, హెవీ వెహికిల్స్‌కు 50 శాతం రాయితీని తెలంగాణ పోలీసులు కల్పించిన విషయం తెలిసిందే. మాస్క్ చలాన్లపై 90 శాతం రాయితితో వాహనాదారు పెద్ద ఎత్తున క్లియర్ చేసుకుంటున్నారు. చలాన్ల రయితీ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉండనుంది. గత నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 6.19 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు ప్రత్యేక అవకాశం కల్పించిన తెలంగాణ పోలీసులు వాహనదారులకు మరో శుభవార్త చెప్పారు. చలాన్ల చెల్లింపుల కోసం గంటల తరబడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే చలానాలు చెల్లించాలని సూచించారు. ఈ-చలాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు. అటు మీ సేవ, ఈ సేవలో కూడా చలానాలు చెల్లించేలా అవకాశం కల్పించారు ట్రాఫిక్ పోలీస్‌లు. -
నేటి నుంచే 'ట్రాఫిక్' డిస్కౌంట్
హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనులకు పాల్పడి..పెద్ద మొత్తంలో జరిమానాలు బకాయిపడ్డ వాహనదారులకు గొప్ప రిలీఫ్. జరిమానాలో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగం ముందుకొచ్చింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానా బకాయి మొత్తాన్ని సగానికి తగ్గించుకోవడానికి అవకాశం కల్పించే ‘ట్రాఫిక్ మెగా లోక్ అదాలత్’ బుధవారం నుంచి ప్రారంభంమైంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి గుర్తించుకోవాల్సిన అంశాలివీ... ఎన్నాళ్ళు, ఎక్కడ? బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోషామహల్‌లోని పోలీసుస్టేడియం ప్రాంగణంలో. ట్రాఫిక్ విభాగం పది కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఎవరు రావచ్చు? హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఏ కమిషనరేట్ నుంచి జారీ అయిన ఈ–చలాన్లు అయినా ఈ లోక్ అదాలత్ ద్వారా తగ్గింపు పొందవచ్చు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన కేసుల్లో మాత్రం తగ్గింపు లేదు. ఏమేమి తీసుకురావాలి? వాహనయజమానే రావాల్సిన అవసరం లేదు. వారి తరఫున ఎవరైనా హాజరుకావచ్చు. వచ్చేప్పుడు ఈ–చలాన్ ప్రింట్ ఔట్, డ్రైవింగ్ లైసెన్స్ కాపీ/నెంబర్, ఆధార్ కార్డ్ (తప్పనిసరి కాదు), వాహనచోదకులు సెల్‌ఫోన్ నెంబర్ తీసుకురావాలి. ఈ మెగా లోక్ అదాలత్‌లో జరిమానా బకాయిలు చెల్లించిన వాహనచోదకులు కచ్చితంగా రసీదు తీసుకోవాలి. ఈ–చలాన్ స్టేటస్ తెలుసుకోండిలా: వాహనచోదకులు తమ వాహనంపై జారీ అయి ఉన్న పెండింగ్ ఈ–చలాన్ వివరాలు నగర ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ (www.htp.gov.in), సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ (www.ctp.gov.in) లతో పాటు (Hyderabad Traffic Live, Telangana EChallan, Telangana Traffic Police) మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారానూ తెలుసుకోవచ్చు.