ee pass
-
పెండింగ్‌లో లక్ష దరఖాస్తులు
ఉపకారవేతనాల అప్లికేషన్ల పరిశీలనలో కళాశాలల తాత్సారం సాక్షి, హైదరాబాద్: నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యానికి తోడు కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి విద్యార్థులకు శాపంగా మారింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించకపోవడంతో వారికి లబ్ధి ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి సంక్షేమ శాఖలు విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజులను పంపిణీ చేస్తోంది. కానీ పలు కళాశాలలు గతేడాదికి సంబంధించి పూర్తిస్థాయిలో దరఖాస్తులను కూడా సంక్షేమాధికారులకు సమర్పించకపోవడంతో వారికి స్కాలర్షిప్లు అందకుండాపోయాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరీలకు చెందిన లక్షమంది విద్యార్థులు ఉపకార వేతనాలకు నోచుకోలేకపోయారు. సాధారణంగా ఈపాస్ వెబ్సైట్లో వచ్చిన స్కాలర్షిప్ దరఖాస్తును వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యం పరిశీలించి, వాటిని సంక్షేమ శాఖ అధికారికి పంపాలి. ముందుగా వచ్చిన దరఖాస్తులను సమర్పించినప్పటికీ... ఆ తరువాత వచ్చినవాటిని మాత్రం కళాశాలలు పట్టించుకోలేదు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 14.11 లక్షల మంది ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 12.3 లక్షల దరఖాస్తులు కాలేజీలు పరిశీలించి సంక్షేమ శాఖకు చేరవేశాయి. మరో 80 వేల దరఖాస్తులు కాలేజీ స్థాయిలోనే తిరస్కరణకు గురికాగా, 1.01 లక్షల దరఖాస్తులు మాత్రం కాలేజీల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. నిలిచిన ఈపాస్ సేవలు... ఈ విద్యాసంవత్సరంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంక్షేమాధికారులకు పంపితే తప్ప కాలేజీలకు ఈ నిధులు అందే అవకాశం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈపాస్ వెబ్సైట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే వీలు లేకుండా పోయింది. రెండు వారాల్లో ఈపాస్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆ తరువాత నిధుల లభ్యతను బట్టి వారికి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తారు. -
ఈ-పాస్ ద్వారా విత్తన వేరుశనగ పంపిణీ
ఏప్రిల్ మొదటికి 3.90 లక్షలక్వింటాళ్లు సేకరించాలి కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అగ్రికల్చర్ : ఈ సారి ఖరీఫ్‌లో ఈ-పాస్ విధానం ద్వారా రైతులకు రాయితీ విత్తన వేరుశనగ పంపిణీకి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోనశశిధర్ వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తిని ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక రెవెన్యూభవన్‌లో విత్తన సేకరణ, పంపిణీ అంశంపై జేసీ-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్‌తో కలిసి వ్యవసాయశాఖ, సేకరణ ఏజెన్సీలు, ఎన్జీవోలతో సమీక్షించారు. అర్హులైన ప్రతి రైతుకూ 33 శాతం రాయితీతో 90 కిలోల(మూడు బస్తాలు) చొప్పున విత్తనకాయలు అందజేసేందుకు ఈ సారి కొత్త పద్ధతి అవలంబించనున్నట్లు తెలిపారు. ఎఫ్పీ షాపుల్లో మాదిరి ఆన్లైన్ బయోమెట్రిక్, ఈ -పాస్ పద్ధతి ద్వారా చేపట్టేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ సారి జిల్లాకు కేటాయించిన 3.90 లక్షల క్వింటాళ్ల కే-6, కే-9, ధరణి రకాల విత్తనకాయలను ఏప్రిల్ మొదటి నాటికి నిల్వ చేయాలని సేకరణ ఏజెన్సీలైన ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్‌లను ఆదేశించారు. గతేడాది విత్తన సేకరణ ఆలస్యం కావడంతో పంపిణీ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఈసారి అవి పునరావృతం కాకుండా ఉండాలంటే ముందస్తుగా సరఫరా చేయాలన్నారు. ప్రస్తుత రబీలో కమ్యూనిటీ మేనేజ్మెంట్ సీడ్ సిస్టం (సీఎంఎస్ఎస్) కింద సాగు చేసిన వేరుశనగ ద్వారా 63,900 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ఇది జిల్లా సరిహద్దులు దాటకుండా ఇక్కడే కొనుగోలు చేయాలని ఆదేశించారు. విత్తన సేకరణ, పంపిణీ ప్రక్రియ ఈ సారి సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు, సేకరణ ఏజెన్సీల అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప'రేషన్'
సర్వర్ డౌన్‌తో సక్రమంగా పనిచేయని ఈ పాస్ యంత్రాలు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని చౌక దుకాణం నంబర్ 33లో ఉదయం 8 గంటల నుంచి 15 మంది కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు. ఈ-పాస్ యంత్రాలు సరిగా పని చేయక రోజుకు 20 మందికి కూడా రేషన్ ఇవ్వలేని పరిస్థితి. బత్తలపల్లి మండల కేంద్రంలో ఉదయమే రేషన్ షాపును తెరిచారు. సర్వర్ సక్రమంగా పని చేయక పంపిణీ ఆలస్యమైంది. దీంతో లబ్ధిదారులు సాయంత్రం దాకా పడిగాపులు కాయాల్సి వచ్చింది. రేషన్ షాపుల్లో నిత్యావసరాలు తీసుకోవడానికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈపాస్ మిషన్లు సరిగా పని చేయకపోవడమే ఇందుకు కారణం. వారం రోజులుగా లబ్ధిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.ఈపాస్ యంత్రాలకు సర్వర్ పనిచేయక ఇటు డీలర్లు, అటు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల వేలిముద్రలు పడక కార్డుదారులకు సమస్యలు తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 63 మండలాలకు కలిపి 2,983 చౌక దుకాణాలు , 12,37,571 కార్డులు ఉన్నాయి. గతంలో నిత్యావసరాలు నేరుగా ఇచ్చేవారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇచ్చిన ఈపాస్ మెషీన్లు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. దినసరి కూలీల సమస్యలు వర్ణణాతీతం : ఒక్కో రేషన్ షాపు పరిధిలో 200 నుంచి 500 మధ్య రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డు దారులంతా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎప్పుడు సర్వర్ పని చేస్తుందా.. అని ఉదయం నుంచి సాయంత్రం దాకా చౌక దుకాణం వద్ద వేచి ఉంటున్నారు. దినసరి కూలీలు తమ రోజు కూలిని పోగొట్టుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని లబ్ధిదారులు కోరుతున్నారు. డీలర్లకూ తప్పని తిప్పలు ఈపాస్ విధానం వల్ల రేషన్ డీలర్లకూ తిప్పలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులో ఉంటే 10 నుంచి 20 మందికి మాత్రమే రేషన్ పంపిణీ చేయగల్గుతున్నారు. రేషన్ సకాలంలో అందకపోవడంతో డీలర్లతో లబ్ధిదారులు గొడవలకు దిగుతున్నారు. -
ఈ- పాస్‌తో అక్రమాలకు చెక్
జిల్లాలో 2,930 చౌక దుకాణాల్లో అమలు నెలసరి 550 టన్నుల మిగులు అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ పాస్ విధానం అమలు చేయడంతో చౌక దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. గతంలో జిల్లాలో ప్రతినెలా 400 నుంచి 500 టన్నుల సబ్సిడీ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరిలేది. ప్రస్తుతం నూతన విధానం వల్ల ఆ మేరకు బియ్యం మిగులుతోంది. ఆన్‌లైన్‌తో కట్టుదిట్టం.. గతంలో చౌక దుకాణాలకు సరఫరా అయిన బియ్యం వంద శాతం పంపిణీ చేసినట్లు డీలర్లు తప్పుడు లెక్కలు చూపించేవారు. బోగస్ కార్డులు, గ్రామాల్లో లేనివారి కార్డులకు బియ్యాన్ని పంపిణీ చేసినట్లు లెక్కల చూపి స్వాహా చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పంపిణీ చేసిన బియ్యం వివరాలు ఈ-పాస్ యంత్రంలో నమోదవుతాయి. ఆ లెక్కలు నేరుగా ఆన్లైన్లో అప్లోడ్ అవుతాయి. పంపిణీ చేయని బియ్యం లెక్క రికార్డు అవుతుంది. ఆన్లైన్లో మిగులు బియ్యం నమోదును గుర్తించి మరుసటి నెల కోటాలో ఆ మొత్తం తగ్గించి బియ్యం సరఫరా చేస్తారు. డీలర్ ఎలాంటి అవకతవకలకు పాల్పడే వీలుండదు. 32 షాపులకు ‘ఈ- పాస్’ లేదు జిల్లాలో 2962 చౌకదుకాణాలు ఉండగా ప్రస్తుతం 2930 దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలవుతోంది. 32 దుకాణాలకు ఈ యంత్రాలు ఇంకా అందాల్సి ఉంది. ఇక జిల్లావ్యాప్తంగా ఏడు చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలకు సిగ్నల్ సమస్య ఉంది. దీన్ని కూడా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరింత పటిష్టం చేస్తాం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పాస్ విధానాన్ని మరింత పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకున్నాం. డీలర్లు సక్రమంగా యంత్రాలను ఉపయోగించకపోవడంతో అవి పాడవుతున్నాయి. యంత్రాలను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లకు అవగాహన కల్పించి, వారి ద్వారా వీఏఓ, వీఆర్ఓ, ఆర్ఐ, సీఎస్డీటీకు శిక్షణ ఇప్పిస్తున్నాం. వీరు మాస్టర్ ట్రైనీలుగా వారి పరిధిలోని డీలర్లకు ఈ నెల 23 నుంచి శిక్షణ ఇస్తున్నారు. - బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ -
ఐదు దాటితే అంతే...
ఈ-పాస్ విధానంతో ఇంకా తప్పని ఇక్కట్లు రేషన్ పంపిణీలో కొత్త నిబంధనతో కష్టాలు సూళ్లూరుపేట: చౌకడిపో దుకాణాల్లో సరుకులు పొం దేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంతో ఎంతోమంది లబ్ధిదారులకు సరుకులు అందకుండా ఇబ్బందులుపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నెలా 5వ తేదీ లోపే సరుకులు పొందాలి అనే నిబంధనను కొత్తగా తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి తెల్లరంగు రేషన్‌కార్డు ఇచ్చి బియ్యం, కిరోసిన్, కంది పప్పు, చక్కెర తదితర వస్తువులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పండగలు వచ్చినపుడు రాష్ట్రప్రభుత్వం ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పేరుతో మరో ఐదు రకాలు వస్తువులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకు ప్రతి నెలా 20వ తేదీవరకు సరుకులు ఇస్తూ వచ్చారు. నకిలీకార్డులు ఏరివేతకు సంబంధించి ఇటీవల ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన సామెతలా తయారైంది పరిస్థితి. నకిలీ కార్డులు పట్టుబడ్డాయో లేదో గాని నిజంగా నిరుపేదలైన వారికి వేలిముద్రలు సరిపోక సరుకులు అందడం లేదు. చాలా మంది బాధితులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. ఈ విధంగా లబ్ధిదారులు సతమవుతుంటే ఇప్పుడు మళ్లీ కొత్తవిధానాన్ని తీసుకొచ్చి పేదవాళ్ల కడుపుమీద వాత పెట్టే పనికి ప్రభుత్వం పూనుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెలా ఐదో తేదీలోపు సరుకులు తీసుకోవాలనే నిబంధనను లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాంబట్టు, మేనకూరు, శ్రీసిటీ సెజ్‌ల్లోని పలు కంపెనీలో పనిచేసే కార్మికులు చాలామందికి ఐదో తరువాత నెల జీతాలు వస్తాయి. జిల్లాలో పరిస్థితి కూడా ఇంచుమించుగా ఐదో తేదీలోపు సరుకులు పొందలేని పరిస్థితులున్నా యి. ఐదో తేదీని ఆఖరు తేదీగా పెడితే చౌకడిపో దుకాణాల్లో సరుకులు ఎవరూ తీసుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ-పాస్‌తో రూ.10 కోట్లు ఆదా సరుకుల పంపిణీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ఈ- పాస్ విధానాన్ని తీసుకొచ్చి సుమారు రూ.10 కోట్లు విలువచేసే సరుకులు ఆదా చేసినట్టుగా అధికారులు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 8.31 లక్షలున్న తెల్ల రేషన్ కార్డులు నేడు 7,70,359కి చేరినట్లు సమాచారం. వీటిని కూడా వడపోసేందుకు సరుకుల పంపిణీని ఐదో తేదీకి కుదించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే సరుకులు ఇంకా మిగిలిపోయే అవకాశంఉంది. మొత్తానికి నూతన విధానలతో ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకులు పంపిణీని 15 తేదీని ఆఖరు రోజుగా ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఈ-పాస్ మిషన్ల సమస్యలను పరిష్కరిస్తాం
డీఎస్ఓ తిప్పేనాయక్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్) : ప్రజాపంపిణీలో కీలకంగా మారిన ఈ-పాస్ మిషన్లలో ఏర్పడే సాంకేతిక సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తిప్పేనాయక్ తెలిపారు. ఇందుకోసం మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రైనర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు గురువారం సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో మొదలయ్యాయి. డీఎస్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి 5 మంది రెవెన్యూ సిబ్బందిని ఎంపిక చేసి వారికి ఈ-పాస్ మిషన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 8 మంది డీలర్లకు ఒక మాస్టర్ ట్రైనన్‌ను నియమిస్తున్నామన్నారు. ఈ-పాస్ మిషన్లలో ప్రధానంగా వేలిముద్రలు పడకపోవడం అనే సమస్య ఉందని, దీనికి తగిన పరిష్కారాన్ని చూపుతున్నట్లు తెలిపారు. అనంతరం అర్బన్ ఏఎస్ఓ వెంకటేష్ నాయక్ ఈ-పాస్ మిషన్లలో వచ్చే సమస్యలు, వాటి నివారణ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్ఓ రాజారఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
నిలదీతలు... నీళ్లు నమలడాలు!
గార మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీసిన వైఎస్ఆర్ సీపీ సభ్యులు వైఎస్ఆర్ సీపీ సభ్యులతో గొంతు కలిపిన పలువురు టీడీపీ సభ్యులు గార: ఈ పాస్ విధానంపై మండల సర్వసభ్య సమావేశంలో విపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీలు పలు సమస్యలను లేవనెత్తగా టీడీపీ సభ్యులు సైతం గొంతు కలపడం విశేషం. ఎంపీపీ గుండ అమ్మలు భా స్కరరావు అధ్యక్షతన ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అ నుసంధానం చేయాలనే తీర్మానంతో పాటు వైఎస్సార్సీపీ లేవనెత్తిన నీటి తీరువా పన్ను వసూళ్లు నిలిపివేయాలన్న అంశంపై చర్చ జరిగింది. సమావేశంలో ఎంపీడీఎ ఆర్.స్వరూపారాణి, సర్పంచ్‌లు బరాటం రామశేషు, అంబటి అంబి క, మైలపల్లి లక్ష్మీజనార్ధనరావు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఈపాస్ విధానం అమలు సరిగా లేదని తూలుగు ఎంపీటీసీ కొయ్యాన సంధ్యానాగభూషణం తెలి పారు. అయితే ఆధార్ అనుసంధానమే అసలు సమస్య అని తహశీల్దార్ సమాధానం చెప్పగా... అదే ఆధార్‌తో పింఛన్లు ఇస్తున్నారు కదా అని వమరవల్లి సర్పంచ్ లోపింటి భవాని రాధాకృష్ణారెడ్డి ప్రశ్నించగా సమాధానం కరువైంది. దీనిపై వైఎస్ఆర్ సీపీతో పాటు టీడీపీ సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లులు చెల్లించని విషయాన్ని కళింగపట్నం సర్పంచ్ పొట్నూరు కృష్ణమూర్తి సభ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో మండలంలోని ఆరు పంచాయతీల్లో పంటలు పండలేదని, వీటికి సంబంధించి నీటి తీరువా పన్ను కట్టాలనడం భావ్యం కాదని మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్, కొర్లాం సర్పంచ్ పీస శ్రీహరిరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తీ ర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు.