ఏఎఫ్ఆర్సీ సభ్యుడిగా నిమ్మ వెంకటరావు
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగాధిపతి, ఎడ్సెట్ పూర్వ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్ అండ్ ఫీజ్ రెగ్యులారిటీ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ కమిటీలో స్థానం పొందిన ఇద్దరు విద్యావేత్తలలో ఆచార్య నిమ్మ వెంకటరావు ఒకరు. కమిటీలో ఫీజుల నిర్ణయ కమిటీ చైర్మన్గా జస్టిస్ జి.కృSష్ణమోహన్, ప్రవేశాల కమిటీæ చైర్మన్గా జస్టిస్ టి.రంగారావు, సభ్యులుగా ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య ఎల్.వేణుగోపాల రెడ్డి, పాఠశాల విద్యాశాఖ మెంబర్ సెక్రటరీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వి.దుర్గా భవాని, ఏఐసీటీఈ రీజినల్ అధికారి ఎం.సుందరేశన్, చార్టెడ్ అకౌంటెంట్ బి.లోకనాథం ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులుగా ఉన్న ఈ కమిటీలో ఏయూ ఆచార్యునికి స్థానం లభించడం పట్ల ఏయూ అధికారులు, ఆచార్యులు హర్షం వ్యక్తం చేశారు.