elaborate arrangements
-
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
-
రంజాన్‌కు విస్తృత ఏర్పాట్లు
ముకరంపుర : రంజాన్ మాసంలో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముస్లిం మతపెద్దలు, ప్రతినిధులు, అధికారులతో రంజాన్ మాసంలో చేయూల్సిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈద్గా, మసీదులకు మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయించాలని సూచించారు. వర్షాకాలంలో రంజాన్ మాసం వస్తున్నందున ఆహారం కల్తీ కాకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు, పండ్ల ధరల నియంత్రణకు తనిఖీలు చేయాలన్నారు. అన్ని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో నీటి సరఫరా సరిగా చేయాలని, ఇబ్బందులుంటే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఏ రోజు చెత్త అదే రోజు తొలగించాలని, వీధిదీపాలు అమర్చాలని సూచించారు. రంజాన్ మాసంలో ముస్లింలు కోరిన వెంటనే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు 5కిలోల చక్కెర పంపిణీ చేయాలని కోరగా.. వెంటనే ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. మసీదులకు వెళ్లే డ్రైనేజీలు మరమ్మతులుంటే వెంటనే చేయాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ ఏర్పాటు రంజాన్ మాసంలో ఏమైనా సమస్యలుంటే తెలుపుటకు కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నెంబర్ 18004254731 ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇది కార్యాలయం పనివేళల్లో పని చేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 9490163835 నెంబర్‌కు ఫోన్ చేస్తే.. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి 8331017552 నెంబర్‌కు ఫోన్ చేస్తే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సమస్యను పరిష్కరిస్తారని, ఇతర ప్రాంతాలలో సంబంధిత డీఈలను సంప్రదించాలని సూచించారు. ట్రాఫిక్ టీంల ఏర్పాటు : ఎస్పీ ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రత సమస్యలు లేకుండా గత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ టీంలను ఏర్పాటు చేసి నమాజ్‌కు వెళ్తున్న వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సమస్యలుంటే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మకూడదని కోరారు. ఈ సమావేశంలో డీఆర్వో టి.వీరబ్రహ్మయ్య, జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఎస్వో చంద్రప్రకాశ్, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ రమణాచారీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస్, డీపీవో కుమారస్వామి, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ హమీద్, సంబంధిత అధికారులు, ముస్లిం నాయకులు మహ్మద్ ఆరిఫ్, ఎస్ఏ.మోసిన్, అబ్బాస్‌షమీ, మహ్మద్ షకీర్, సయ్యద్ అక్బర్ హుస్సేన్, మహ్మద్ తాజ్, సయ్యద్ బర్కత్ అలీ, ఖమ్రెద్దీన్, సిరాజ్ హుస్సేన్, సాజిత్ అలీ, బాబుజానీ, సలీం, షాహెద్ నిహాల్ తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు ఈస్ట్: అన్ని శాఖల సమన్వయంతో జేఈఈ పరీక్షలకు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో నాగబాబు చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్సీ సమావేశ మందిరంలో బుధవారం జేఈఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డీఆర్వో నాగబాబు పరీక్షల కన్వీనర్ కోటేశ్వరరావు,అడిషనల్ ఎస్పీలు తిరుపాల్,శ్రీనివాసులు,ఇతర అధికారులు సమీక్షించారు. సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చారు. అనంతరం డీఆర్వో నాగబాబు మీడియాతో మాట్లాడుతూ పరీక్ష రాసే విద్యార్థుల,తల్లిదండ్రులకు నగరంలోని పలు కల్యాణ మండపాలు,షాదీఖానాలలో వసతి ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.పరీక్ష జరిగే 4వ తేదీన రైల్వేస్టేషన్, బస్టాండ్ అన్ని కళాశాలల వద్ద పరీక్షా సెంటర్ల చిరునామా తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్షలు నిర్వహించే అన్ని కళాశాలల యజమానులు రైల్వేస్టేషన్, బస్టాండుల నుంచి బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.పరీక్షా కేంద్రాల్లో మంచినీరు,టెంట్లు ,విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష జరిగే సమయంలో హాలు వెలుపల తల్లిదండ్రులకు వసతిని ఏర్పాటు చేసేలా కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 43 కేంద్రాల్లో 33 వేల మంది విద్యార్థులు ఉదయం పేపర్ -1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతుందని మొత్తం 33 వేల మంది విద్యార్థులు హాజరవుతారని,మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్షకు 12 వేల మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.మొత్తం 43 సెంటర్లలో పరీక్ష జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్టాండు,పల్నాడు బస్టాండు,లాడ్జి సెంటర్,రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా, బ్రహ్మానంద రెడ్డి స్టేడియం,గుజ్జనగుండ్ల సెంటర్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో మొత్తం 82 ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యాన్ని కలుగచేస్తాయన్నారు. పరీక్ష కన్వీనర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు కేఎల్పీ పబ్లిక్ పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, పరీక్షా అబ్జర్వర్లకు సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. -
కొత్త సంవత్సరానికి టీటీడీ సిద్ధం
దర్శన, బస ఏర్పాట్లపై ఈవో సమీక్ష అన్నిరకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు సాక్షి, తిరుమల: జనవరి ఒకటో తేదీన శ్రీవారి దర్శనం, బస ఏర్పాట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం సమాయత్తమైందని ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. మంగళవారం వివిధ విభాగాల అధికారులతో వారు సమీక్షించారు. టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఇతర అన్ని విభాగాలు సమన్వయ సహకారంతో పనిచేయాలని ఆదేశించారు. సర్వదర్శనం, కాలిబాట భక్తుల దివ్యదర్శనం, వీఐపీ దర్శనం, నిర్దేశిత దర్శన సమయాలు, భక్తులను అనుమతించే వేళలను వారు విలేకరులకు వివరించారు. ఒకటోతేదీ దర్శన ఏర్పాట్లివీ.. ఒకటో తేదీ వీఐపీ దర్శనం వేకువజామున 2గంటల నుంచి ప్రారంభిస్తారు. ప్రతీఒక్క వీఐపీ తరఫున ఆరుగురిని అనుమతిస్తారు. టికెట్టు ధర రూ.1000గా నిర్ణయించారు. ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. వ్యక్తిగతంగా వస్తేనే అనుమతిస్తారు. సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. వీఐపీ టికెట్లను మూడు విభాగాలుగా నిర్ణయించారు. మొదటి విభాగంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సుపథం నుంచి అనుమతిస్తారు. వీరంతా రాంభగీచా వద్ద వాహనాలు పార్క్‌చేసి సుపథం ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి ప్రవేశించాలి. రెండో విభాగంలో ఎంపీలు, ఎంఎల్ఏలు గోకులం నుంచి మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్, మూడో విభాగం టికెట్లు కలిగిన వారిని లేపాక్షి వద్ద రూ.300 టికెట్ల ప్రవేశం నుంచి అనుమతిస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మాత్రమే దివ్యదర్శనం టికెట్లు ఇస్తారు. వీరిని అర్ధరాత్రి తర్వాత నారాయణగిరి ఉద్యావనం నుంచి క్యూలోకి అనుమతిస్తారు. 25వేల మందికి దర్శనం కల్పించాలని నిర్దేశించుకున్నారు. సర్వదర్శనం భక్తులను డిసెంబర్ 31న సాయంత్రం 5గంటల నుంచి అనుమతిస్తారు. పలు సేవలు రద్దు వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లిదండ్రుల దర్శనాన్ని రద్దు చేశారు. ఒకటో తేదీ, రెండో తేదీ ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తుల రద్దీవల్ల రూ.300 టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. ఇప్పటికే రూ.50 సుదర్శనం టికెట్లు పొందిన 4,800 మందిని నిర్ణీత వేళల్లో దర్శనానికి అనుమతిస్తారు. బస ఏర్పాట్లు డిసెంబరు 31న గదుల కోసం సిఫారసులు స్వీకరించరు సాధారణ భక్తులకే సీఆర్వోలో గదులు కేటాయిస్తారు. దాతలు నేరుగా వస్తేనే గదులు ఇస్తారు. వారి సిఫారసుకు గదులు కేటాయించరు. ప్రత్యామ్నాయంగా సేవా టికెట్ల కేటాయింపు జనవరి ఒకటవ తేదీ, 11వ తేదీ వైకుంఠ ఏకాదశి, 12వ తేదీ ద్వాదశి, ఫిబ్రవరి 6న రథసప్తమి రోజుల్లో సుప్రభాతం, అర్చన, తోమాల, కల్యాణోత్సవం, అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లను రద్దు చేశామని జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆయా తేదీల్లో ఆన్లైన్ ద్వారా పొరపాటున 1496 మందికి సేవా టికెట్లు కేటాయించారన్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా ఆయా సేవా టికెట్లను 2014, ఏప్రిల్ 1వ తేది నుంచి జూన్ 30వ తేదీ మధ్య తేదీల్లో కేటాయిస్తామన్నారు. ఈ టికెట్లను డిసెంబర్ 25 నుంచి 30వ తేదీలోపు భక్తులు పొందవచ్చన్నారు. అన్ని వివరాలు టీటీడీ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. తిరుమలలో తరగని రద్దీ మూడు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. మంగళవారం సైతం భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడింది. వరుస సెలవులు, ఏడాది చివరి వారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 40,423 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.