Elaine Thompson
-
'స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్'గా ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్ 2022 అవార్డు గెలుచుకున్నాడు. మెన్స్ విభాగంలో వెర్స్టాపెన్.. ''వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డు దక్కించుకున్నాడు. క్రికెటేతర క్రీడల నుంచి అవార్డు అందుకున్న జాబితాలో వెర్స్టాపెన్ నిలిచాడు. టైగర్‌వుడ్స్, రోజర్ ఫెదరర్, ఉసెన్ బోల్ట్ లాంటి దిగ్గజాల సరసన నిలిచిన వెర్స్టాపెన్ ఫార్ములా వన్ నుంచి ఈ ఘనత అందుకున్న నాలుగో రేసర్‌గా నిలిచాడు. ఇంతకముందు లూయిస్ హామిల్టన్, సెబాస్టియన్ వెటెల్, మైకెల్ షుమాకర్‌లు లారెస్ స్పోర్ట్స్ అవార్డును గెలుచుకున్నారు. ఇక మహిళల విభాగంలో జమైకన్ స్ప్రింటర్ ఎలైన్ థాంప్సన్ హెరా.. ''లారెస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు''ను దక్కించుకుంది. ఈమె టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టింది. టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకాను.. ''బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్'' పురస్కారాన్ని సాధించింది. ఇక ఇటలీ పరుషుల ఫుట్‌బాల్ జట్టు ''వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్''గా ఎంపికైంది. ఎలైన్ థాంప్సన్ హెరా, జమైకన్ స్ప్రింటర్ కాగా ఆదివారం(ఏప్రిల్ 24న) ఇటలీలో జరిగిన ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 63 ల్యాప్‌ల రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 32 నిమిషాల 07.986 సెకన్లలో ముగించి కెరీర్లో 22వ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చదవండి: అందరి దృష్టి సింధు, లక్ష్యసేన్ పైనే Sakshi Dhoni: జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య 🏆 The #Laureus22 World Sportsman of the Year Award winner is @Max33Verstappen Max won his first @F1 Championship in thrilling style in 2021. The @redbullracing driver had ten Grand Prix wins during the year and a record 18 podium finishes 👏 pic.twitter.com/8QmjeyDcCr — Laureus (@LaureusSport) April 24, 2022 Blessed and Highly favored. Happy Sunday 😊. Laureus Sportswoman of the Year #history#Historybook#hiswill#myfaith#perserverance#humble#WR#patience#believe pic.twitter.com/aAEWLCR0u3 — Elaine Thompson-Herah (@FastElaine) April 24, 2022 -
మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో జమైకా క్లీన్‌స్వీప్
స్ప్రింట్ రేసుల్లో జమైకా మహిళా అథ్లెట్లు మరోసారి తమ ఆధిపత్యం చాటుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల రేసులో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్ చేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ జమైకా తొలిసారి క్లీన్‌స్వీప్ చేసింది. 1928 ఒలింపిక్స్‌లో తొలిసారి మహిళల 100 మీటర్ల రేసును ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు జమైకా మాత్రమే రెండు పర్యాయాలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకుంది. 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ ఎలైన్ థాంప్సన్ హెరా ‘టోక్యో’లోనూ మెరుపు వేగంతో దూసుకుపోయి రెండోసారి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచింది. జమైకాకే చెందిన షెల్లీ ఆన్ ఫ్రేజర్‌కు రజతం... షెరికా జాక్సన్‌కు కాంస్యం లభించాయి. టోక్యో: స్ప్రింట్ బుల్లెట్ ఉసేన్ బోల్ట్ ‘రియో’ ఒలింపిక్స్‌లో ఆగిపోయాడు. కానీ... జమైకన్లు మాత్రం సాగిపోతున్నారు. పరుగు పెడితే... పతకం మెడలో పడిందా... లేదా అన్నట్లు ట్రాక్‌పై చెలరేగిపోతున్నారు. మహిళల 100 మీటర్ల పరుగులో అయితే ఎలైన్ థాంప్సన్ హెరా... బోల్ట్‌లా కాదు ముమ్మాటికి బోల్ట్‌నే తలపించింది. కొత్త ఒలింపిక్ రికార్డుతో స్వర్ణం చేజిక్కించుకుంది. ట్రాక్‌పై ఆమె మెరుపు వేగంతో దూసుకొచ్చేసింది. ఆమెకు సమీప దూరంలో ఎవరూ లేరు. ఈ 100 మీటర్ల షార్ట్ డిస్టెన్స్‌లో ఇంత వ్యత్యాసం చూపడం ఒక్క బోల్ట్‌కే సాధ్యమైంది. ఇప్పుడదే వేగాన్ని ఎలైన్ థాంప్సన్ కనబరిచింది. మిగిలిన పతకాలను కూడా ఆమె సహచరులే పట్టేశారు. దీంతో ఈ ఈవెంట్‌ను జమైకన్లే క్లీన్‌స్వీప్ చేశారు. శనివారం జరిగిన మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో ఎలైన్ థాంప్సన్ పోటీని అందరికంటే ముందుగా 10.61 సెకన్లలో ముగించింది. తద్వారా ఆమె 33 ఏళ్ల ఒలింపిక్ రికార్డును తిరగరాసింది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన ఫ్లారెన్స్ గ్రిఫిత్ జాయ్‌నెర్ నెలకొల్పిన 10.62 సెకన్ల రికార్డు 0.01 సెకను తేడాతో ఎలైన్ తన పేర లిఖించుకుంది. ఈ ఈవెంట్లో షెల్లీ అన్ ఫ్రేజర్ (10.74 సెకన్లు) రజతం గెలుపొందగా, షెరికా జాక్సన్ (10.76 సెకన్లు) కాంస్యం నెగ్గింది. బీజింగ్ ఒలింపిక్స్ (2008)లోనూ జమైకన్ అమ్మాయిలు ఇలాగే క్లీన్‌స్వీప్ చేశారు. కానీ ఆనాడు ఉసేన్ బోల్ట్ రికార్డు (9.69 సెకన్లు) ప్రదర్శన ముందు అమ్మాయిల ఘనత చిన్నబోయింది. అప్పుడు షెల్లీ అన్ ఫ్రేజర్ బంగారం గెలిచింది. షెల్లీ మళ్లీ లండన్ (2012)లోనూ స్వర్ణం నిలబెట్టుకుంది. మొత్తం మీద ఆమె ఖాతాలో నాలుగు (2 స్వర్ణాలు, 1 రజతం, రియోలో కాంస్యం) ఒలింపిక్ పతకాలున్నాయి. ఈ జమైకన్ లేడి చిరుతలకు క్లీన్‌స్వీప్ చేసేందుకు మరో అవకాశం 200 మీటర్ల స్పింట్ రేసు కల్పించనుంది. పైగా ఆ ఈవెంట్లో ఎలైన్ థాంప్సన్ డిఫెండింగ్ చాంపియన్. 200 మీటర్ల పరుగులో కూడా పతకాలన్నీ ఊడ్చేస్తే స్ప్రింట్‌లో జమైకన్లకు తిరుగుండదేమో! నేడే పురుషుల 100 మీటర్ల ఫైనల్ అందరూ గుడ్లప్పగించి చూసే అథ్లెటిక్ ఈవెంట్ పురుషుల 100 మీటర్ల పరుగు పోటీ నేడు జరగనుంది. బీజింగ్ (2008) నుంచి రియో (2016) దాకా ఉసేన్ బోల్ట్ వేగమే కనబడిన ఒలింపిక్స్‌లో ఇప్పుడు కొత్త చాంపియన్ స్ప్రింటర్‌ను చూడబోతున్నాం. జమైకన్ దిగ్గజం బోల్ట్ రిటైరైన తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్‌లో స్ప్రింట్‌ను శాసించేది ఎవరో కొన్ని గంటల్లోనే తేలనుంది. ఆదివారమే జరిగే మూడు సెమీఫైనల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు... ఆ తర్వాత అత్యుత్తమ సమయం నమోదు చేసిన మరో ఇద్దరు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మొత్తం ఎనిమిది మంది ఫైనల్లో పోటీపడతారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6.20 ఫైనల్ పోటీ జరుగుతుంది. ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణాన్ని నిలబెట్టుకున్న నాలుగో అథ్లెట్ ఎలైన్. గతంలో వ్యోమియా టైయస్ (అమెరికా; 1964, 1968)... గెయిల్ డెవర్స్ (అమెరికా; 1992, 1996)... షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా; 2008, 2012) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
ఒలింపిక్ విజేతకు షాక్
ఎలైన్ థామ్సన్ ఘోర వైఫల్యం మహిళల 100 మీటర్ల విజేత టోరీ బోవీ లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో మరో సంచలనం... ఈసారి మహిళల విభాగంలో! 100 మీటర్ల పరుగులో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఎలైన్ థామ్సన్‌కు పరాభవం ఎదురైంది. కనీసం ఆమె పతకం కూడా గెలవలేకపోయింది. 10.98 సెకన్లతో ఐదో స్థానంతో సరి పెట్టుకుంది. ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టోరీ బోవీ 10.85 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. మారీ జోసీ లౌ (ఐవరీకోస్ట్–10.86సె) రజతం గెలుచుకోగా, షిఫర్స్ (నెదర్లాండ్స్–10.96సె) కాంస్యం నెగ్గింది. 2015 బీజింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 4్ఠ100 రిలేలో స్వర్ణం, 200 మీ. పరుగులో రజతం సాధించిన థామ్సన్... గత ఏడాది రియోలో 100మీ., 200 మీ. రెండింటిలోనూ స్వర్ణాలు సొంతం చేసుకుంది. తాజా ఫలితంతో రియోలో పరాజయానికి బోవీ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ ఒలింపిక్స్‌లో ఆమె 100 మీ. లో రజతం, 200 మీ.లో కాంస్యం గెలుచుకుంది. -
కవోరి ఇచో... నాలుగోసారి
రియో డి జనీరో: జపాన్ రెజ్లర్ కవోరి ఇచో వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణాలు గెలిచిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. 58 కేజీల ఫ్రీస్టయిల్ ఫైనల్స్‌లో రష్యన్ రెజ్లర్ కోబ్లోవాను ఓడించి రియో స్వర్ణాన్ని దక్కించుకుంది. మొదటి రౌండ్లో ఇచో వెనకపడ్డప్పటికీ.. అనుభవాన్ని రంగరించి.. రెండు, మూడు రౌండ్లలో ఆధిక్యాన్ని కనబరిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం (48 కేజీల విభాగంలో) గెలిచిన ఇచో.. ఆ తర్వాత బీజింగ్ (48 కేజీలు), లండన్ (58 కేజీలు)ల్లోనూ పసిడి పతకాలు నెగ్గింది. థాంప్సన్ సిగలో మరో స్వర్ణం అనూహ్యంగా మహిళల 100మీటర్ల రేసులో స్వర్ణం గెలిచిన జమైకన్ అథ్లెట్ ఎలైన్ థాంప్సన్.. 200 మీటర్ల రేసులోనూ (21.78 సెకన్లు) బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 22.15 సెకన్లతో డచ్ మహిళ డాఫ్నే షిపర్స్ రజతాన్నందుకుంది. మరోవైపు, పురుషుల 200 మీటర్ల సెమీస్‌లో 19.78 సెకన్ల టైమింగ్‌తో బోల్ట్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో బోల్ట్‌కు ఇదే అత్యుత్తమ టైమింగ్. అమెరికా స్టార్ అథ్లెట్ గాట్లిన్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. నెమార్ రికార్డు గోల్ బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్ వేగవంతమైన గోల్‌తో ఒలింపిక్స్ చరిత్రపుటల్లోకి ఎక్కాడు. హోండురస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి 15 సెకన్లలోనే గోల్‌తో ఈ రికార్డు సాధించాడు. ఈ విజయంతో (6-0) ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆతిథ్య దేశం.. ఫైనల్లో జర్మనీతో తలపడుతుంది. -
లేడీ చిరుత
థాంప్సన్ ‘తుఫాన్’ మహిళల 100 మీటర్ల పరుగులో సంచలనం విజేతగా నిలిచిన ఎలైన్ థాంప్సన్ ఫ్రేజర్‌కు మూడో స్థానం రియో: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మహిళా అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న జమైకా సూపర్ స్టార్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ కల చెదిరింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలవాలన్న ఆమె కోరిక తీరలేదు. ఆదివారం ఇక్కడ జరిగిన 100 మీటర్ల రేసులో జమైకాకే చెందిన ఎలైన్ థాంప్సన్ అగ్ర స్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. 24 ఏళ్ల థాంప్సన్ 10.71 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. ఫ్రేజర్ (10.86 సె.) కాంస్యంతో సరి పెట్టుకోగా... టోరీ బోవీ (అమెరికా-10.83 సె.) రజత పతకం సాధించింది. ‘లైన్‌ను దాటాక నేను గెలిచానని అర్థమైంది. అసలు ఎలా సంబరాలు చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. జమైకాలో మా వర్గానికిచెందిన వారు భారీ స్క్రీన్ పెట్టి ఈ రేస్ చూసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఉందో అసలు ఊహించలేను’ అని థాంప్సన్ ఉద్వేగంగా చెప్పింది. 2008, 2012 ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్లో స్వర్ణం గెలిచిన ఫ్రేజర్‌కు ఈ సారి మూడో స్థానం మాత్రమే లభించింది. అయితే తన ఓటమిపై నిరాశ చెందడం లేదని, జమైకా అథ్లెటే స్వర్ణం సాధించడం పట్ల గర్వపడుతున్నానని ఫ్రేజర్ వ్యాఖ్యానించింది. 100మీటర్ల రేస్‌లో ఏడుగురు అథ్లెట్లు 11 సెకన్లలోపే పరుగు ముగించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో వేగవంతమైన మహిళగా థాంప్సన్ ప్రపంచంలో ఫాస్టెస్ట్ అథ్లెట్లకు, జమైకా దేశానికి ఉన్న అనుబంధం కొత్తది కాదు... అలాగే ఆయా విజేతల నేపథ్యాలు కూడా దాదాపుగా ఒకే తరహాలో ఉంటాయి. పేదరికం, ఆ తర్వాత ఎవరో ఒకరి ప్రోత్సాహంతో అద్భుతాలు చేయడం లాంటి వాస్తవాలు కూడా కొత్త కాదు. ఇప్పుడు ఇదే జాబితాలో వరల్డ్ ఫాస్టెస్ట్ ఉమన్ అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ కూడా చేరింది. ఒక్క బిడ్డను కూడా పోషించలేని కడు పేదరికం ఎలైన్ తల్లిదండ్రులది. దాంతో ఏడేళ్ల వయసులోనే అమ్మమ్మ తనతో తీసుకెళ్లిపోయింది. ఆమే అన్నీ అయి మనవరాలిని పెంచింది. ఇప్పుడు స్టార్ అథ్లెట్‌ను వెనక్కి తోసి ఒలింపిక్స్ స్వర్ణంతో థాంప్సన్... అమ్మమ్మకు అరుదైన బహుమతి అందించింది. సాక్షి క్రీడా విభాగం పాఠశాల స్థాయిలో ఎలైన్ పెద్దగా పరుగెత్తింది లేదు. సరిగా రన్నింగ్ చేయడం రాదంటూ ఆమెను స్కూల్ జట్టులోంచి కూడా తీసేశారు. అయితే అక్కడి కోచ్ పాల్ ఫ్రాన్సిస్... థాంప్సన్‌లో ప్రతిభను గుర్తించాడు. ఇప్పుడు కాకపోయినా సరైన దిశలో శిక్షణ ఇస్తే మున్ముందు విజయాలు దక్కుతాయని నమ్మాడు. అందుకే స్కాలర్ షిప్ ఇప్పించి మరీ కింగ్‌స్టన్‌లో కోచింగ్ సెంటర్లో చేర్పించాడు. అక్కడినుంచే ఆమె అసలు పరుగు ప్రారంభమైంది. దీనికి కొనసాగింపుగా జమైకాలో అథ్లెట్ల అడ్డా అయిన ఎంవీపీ ట్రాక్ అండ్ ఫీల్డ్ క్లబ్లో కూడా థాంప్సన్‌కు అవకాశం దక్కింది. ఫ్రాన్సిస్ సోదరుడు స్టీఫెన్ ఇక్కడ హెడ్ కోచ్ కావడం కూడా ఈ జమైకా అమ్మాయికి కలిసొచ్చింది. కోచ్ ప్రోత్సాహం, మార్గనిర్దేశనంలో ఇక్కడే అథ్లెటిక్స్ను ఆమె మరింత సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించింది. స్కూల్, జూనియర్ స్థాయిలో వరుస విజయాలతో జమైకాలో గుర్తింపు లభించింది. అంతకంతకూ ఎదుగుతూ... ఇతర అథ్లెట్లతో పోలిస్తే ఎలైన్ కెరీర్ చాలా వేగంగా దూసుకుపోయింది. 2013నుంచి 100 మీటర్ల పరుగులో ప్రతీ ఏడాది థాంప్సన్ టైమింగ్‌లో మెరుగుదల ఉండటం విశేషం. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల విభాగంలో రజతంతో ఒక్కసారిగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఈవెంట్ 4ఁ100రిలేలో స్వర్ణం నెగ్గిన జట్టులో కూడా ఎలైన్ సభ్యురాలు. 10.70 సెకన్లలో 100 మీ. పరుగు పూర్తి చేసి రియో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించింది. పట్టలేని ఆనందం... రియోలో సహచరి ఫ్రేజర్‌పై అంచనాలు ఉన్న నేపథ్యంలో ఎలైన్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక్కసారి ఆమె ఫినిషింగ్ లైన్‌ను చేరాక స్వస్థలంలో సంబరాలు మిన్నంటాయి. ‘ఆమె నా బిడ్డ’ అంటూ అమ్మమ్మ గ్లోరియా మురిసిపోయింది. ఆ పతకాలు చూస్తే చాలు... ఎలైన్ థాంప్సన్ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. కానీ అన్నింటా ఆమెకు అమ్మమ్మే అండగా నిలిచింది. గ్లోరియా మాటల్లోనే చెప్పాలంటే... ‘ఎలైన్ నాకు దేవుడిచ్చిన బిడ్డ. ఆమె తల్లిదండ్రులనుంచి నేను తెచ్చుకున్నా మరీ గొప్ప జీవితాన్ని కూడా ఇవ్వలేదు. అయితే ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నా. నేను అప్పు చేసైనా సరే... ఆమె స్కూల్నుంచి, ప్రాక్టీస్‌నుంచి వచ్చాక తనకిష్టమైన మంచి భోజనం పెట్టడమే నాకు అమిత సంతృప్తినిచ్చేది. మమ్మల్ని పేదరికంనుంచి నువ్వే దూరం చేయగలవు అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఎలైన్ దానిని నిజం చేసింది. ఆమె ప్రతీ సారి పోటీలో గెలిచినప్పుడల్లా తీసుకొచ్చి మెడల్‌ను ఇంట్లో పెట్టినప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు’ అని అమ్మమ్మ నాటి రోజులు గుర్తు చేసుకుంది. థాంప్సన్‌కు అందంగా అలంకరించుకోవడం అంటే బాగా ఇష్టమట! ట్రాక్‌పై ఎంత పెద్ద పోటీ అయినా తన డ్రెస్సింగ్‌పై కూడా అమిత శ్రద్ధ పెడుతుంది. చిన్నప్పటినుంచే జీవితంపై పోరాడి నెగ్గిన ఎలైన్ ఇప్పుడు జమైకానుంచి వచ్చిన అనేక మంది అథ్లెట్లలో ఒకామె మాత్రమే కాదు... ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మహిళ. 3 ఒలింపిక్స్‌లో మహిళల 100మీ. పరుగులో వరుసగా మూడుసార్లు జమైకా అథ్లెట్లు గెలిచారు.