employees welfare
-
మా ఊరెళ్లిపోతాం..!
రామకృష్ణది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సీతానగరం మండలం బుక్కుపేట. 2008 డీఎస్సీలో ఓపెన్ కేటగిరీలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. రాష్ట్ర విభజన జరగడంతో సరికొత్త సమస్య వచ్చిపడింది. వారికున్న ఇద్దరు పిల్లల్ని ఇక్కడ చదివిస్తే సొంత రాష్ట్రంలో స్థానికేతరులు అయ్యే అవకాశం ఉండటంతో విజయనగరంలో ప్రత్యేకంగా హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. తెలంగాణలో చదివితే స్థానికత వచ్చినప్పటికీ.. అక్కడ బీసీగా పరిగణించే కులం ఇక్కడ ఓసీలోకి రానుంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన రవిరాజ్ 2006 డీఎస్సీలో మెదక్ జిల్లాలో ఓపెన్ కోటాలో ఉద్యోగం సాధించారు. అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం ఉంటుందని ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర విభజనతో అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం లేదు. ఇటీవల రవిరాజ్ తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తక్షణ చికిత్స అవసరం కావడంతో ఆయన్ని జిల్లా కేంద్రంలోని ఒక ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స అనంతరం రూ.2.40 లక్షలు బిల్లు అవడంతో బంధువుల వద్ద అప్పు తెచ్చి చెల్లించారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో చికిత్స చేయించుకుంటే మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం వర్తించకపోవడంతో తలపట్టుకున్నారు. సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఓపెన్ కేటగిరీలో కొలువులు సాధించిన స్థానికేతర ఉద్యోగులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో పలువురు అభ్యర్థులు తెలంగాణ జిల్లాల్లో టీచర్ కొలువులు దక్కించుకున్నారు. అంతర్ జిల్లా బదిలీలో లేక ప్రత్యేక కేటగిరీ కింద ఏనాటికైనా సొంత జిల్లాకు బదిలీ కావచ్చనే ధీమాతో ఉద్యోగాల్లో చేరారు. రాష్ట్ర విభజన ప్రక్రియతో పరిస్థితి తారుమారైంది. అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం లేకపోవడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. దీంతో ఇక్కడే ఉంటే స్థానికత ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని, ఉద్యోగుల సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత రాష్ట్రానికి పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. రిజర్వేషన్లలో తేడా.. విద్యాశాఖలో ఉపాధ్యాయ కేటగిరీలో దాదాపు వెయ్యి మంది టీచర్లు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. వీరు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ.. మెజారిటీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సొంత రాష్ట్రంలో నివసిస్తున్నారు. పిల్లలతో సహా ఇక్కడే నివసించే అవకాశం ఉన్నప్పటికీ.. రిజర్వేషన్లలో వ్యత్యాసం వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కేటగిరీలో ఉన్న కొన్ని కులాలు.. తెలంగాణలో ఓసీ కేటగిరీ కింద ఉన్నాయి. దీంతో రిజర్వేషన్ల కోసం సొంత రాష్ట్రంలో ప్రత్యేకంగా చదివించాల్సి వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల విద్యను కనీసం ఏడేళ్ల పాటు ఒకేచోట చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తారు. అందువల్ల ఇప్పటికే నాలుగైదేళ్లు పొరుగు రాష్ట్రంలో చదివిన వా రిని మిగతా తరగతులు కూడా అక్కడ చదివించాల్సి వస్తోంది. అనంతరం అక్కడే కాలేజీ విద్య చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్నత విద్యనైనా ఇక్క డ చదవాలని వస్తే అప్పుడు స్థానికేతరులగా పరిగణి స్తూ సీట్ల కేటాయింపులో ఇబ్బందులు వస్తున్నాయి. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లో సమస్యలు మరోవైపు ఉద్యోగులకు కీలకమైన మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం అమలులో ఇబ్బందులు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగుల తల్లిదండ్రులు వారి వృత్తిని నమ్ముకుని సొంత రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తెలంగాణ పరిధిలోని ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఏపీలోని ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తే అందుకు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం కింద బిల్లుల చెల్లింపులకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తోంది. నాలుగేళ్లుగా పోరాటం తెలంగాణలో పనిచేస్తున్న స్థానికేతర టీచర్లు సొంత రాష్ట్రానికి పంపించాలంటూ దాదాపు నాలుగేళ్లుగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని పలుమార్లు సంప్రదించారు. వాస్తవానికి ఇరు ప్రభుత్వాలు అంగీకరిస్తేనే వారి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారిని రిలీవ్ చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదు. ఇక్కడి నుంచి ప్రతిపాదనలు వెళితే తప్ప ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టదు. దీంతో నాలుగేళ్లుగా తమ వినతికి మోక్షం కలగలేదంటూ నాన్‌లోకల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆనంద్ కుమార్, మోహనరావు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. -
సమష్టి కృషితో ఏపీజీబీ అభివృద్ధి
- వ్యాపారం రూ.21వేల కోట్లకు చేరింది –ఏపీజీబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో బ్యాంకు చైర్మన్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది సమష్టికృషితో బాగా అభివృద్ది చెందుతుందని ఆ బ్యాంకు చైర్మన్ సంపత్కుమార్చారీ తెలిపారు. ఆదివారం కర్నూలు బిర్లాగేట్ సమీపంలోని పంక్షన్ హాల్లో జరిగిన ఏపీజీబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి అతిథిగా చైర్మన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటికి రూ.10వేల కోట్ల వ్యాపారం ఉండేదని, అందరి కృషి తో ఇప్పుడు రూ.21వేల కోట్లకు చేరిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులు, ఇతర త్రా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకిష్టప్ప మాట్లాడుతూ... పదోన్నతుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన చైర్మన్, జనరల్ మేనేజర్ దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంటు కేడీ రమేష్, కర్నూలు ఏపీజీబీ రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్, రాజంపేట రీజినల్ పి.ఓబయ్య, జిల్లా నాయకుడు సురేష్ కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు జిల్లాలకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
నరకం చూపిన నారా బాబు
* ప్రభుత్వోద్యోగులను చెండుకు తిన్న చంద్రబాబు * చీటికీమాటికీ ఛీత్కారాలు, అకారణంగా సస్పెన్షన్లు * ప్రజల్లో ఇమేజీ పెంచుకోవడమే లక్ష్యంగా వేధింపులు * పెన్షనర్లకు డీఆర్ ఇవ్వకుండా వేధించిన ఘనుడు * బాబు పేరు వింటే ఉద్యోగులకు నేటికీ ఉలికిపాటే ‘‘ఏం? పిచ్చ పిచ్చగా ఉందా?’’ ‘‘ఏం మాట్లాడుతున్నావ్? నాతోనే వాదిస్తావా? తమాషాలు పడుతున్నావా?’’ ...ఇవి ఏ తాపీ మేస్త్రీయో తన దగ్గర పని చేసే కూలీలపై అరిచిన అరుపులు కావు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి నోటి వెంట జాలువారిన తిట్ల దండకాలు. ‘పిచ్చ పిచ్చగా ఉందా’ అంటూ దుయ్యబట్టిందెవరినో తెలుసా? అంబేద్కర్ వర్సిటీ వైఎస్ చాన్సలర్‌ను! ఇక ‘తమాషాలు పడుతున్నావా’ అంటూ నోరు పారేసుకున్నదేమో ఏకంగా న్యాయ శాఖ అదనపు కార్యదర్శిపై! అక్కడితో ఆగకుండా, ‘నీ పరిధిలో నువ్వుండు! యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్త. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. సదరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని చెబితే అది ముంజేతి కంకణాన్ని అద్దంలో చూపించడమే అవుతుంది. చివరికి రాష్ట్రంలో అత్యున్నతాధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా, ‘మీరు నేననుకున్నంతగా పని చేయడం లేదు’ అనేసి ఆయన మనసు విరవగలిగిన ఘనుడు చంద్రబాబు. అత్యున్నత ప్రభుత్వాధికారులకే ఇలా చుక్కలు చూపిన చంద్రబాబు... సాధారణ ప్రభుత్వోద్యోగుల విషయంలోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు! ‘మీ గుండెల్లో నిద్రపోతాను’ అంటూ నిత్యం బెదిరించారు. బెదిరించడమే కాదు... తన పాలన పొడవునా వేతన జీవులు ఏనాడూ కంటి నిండా నిద్ర కూడా పోకుండా చేశారు. జనం ముందు, సాటి ఉద్యోగుల ముందు వారిని దోషుల్లా నిలబెట్టి, నిలువునా పరువు తీయడాన్ని, కసురుకోవడాన్ని, సస్పెండ్ చేసిపారేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు... ప్రజల ముందు దోషుల్లా నిలదీశాడు ‘‘చంద్రబాబు పాలనలో ఉద్యోగులు నిత్య నరకం అనుభవించారు. ఒకవైపు ఉద్యోగ నియామకాల్లేవు. మరోవైపు ప్రచారం కోసం కొత్త కొత్త పథకాలు పెడుతూ ఉద్యోగులపై పని భారం పెంచేవారు. రాత్రింబవళ్లూ కష్టపడ్డా ఉద్యోగులకు సమాజంలో కనీస గౌరవం లేకుండా చేశారు. ‘గ్రామ సభలు’, ‘ప్రజల వద్దకు పాలన’ పేరుతో ఉద్యోగులను ప్రజల ముందు దోషుల్లా నిలదీశారు.చిన్న పొరపాట్లకు కూడా ఉద్యోగులను ‘చెట్లకు కట్టేయండి... చిత క్కొట్టండి...’ అంటూ ముఖ్యమంత్రే అనడంతో ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురైన సందర్భాలు కోకొల్లలు. గ్రామస్థాయిలో ఉండే ఏఎన్ఎంలు, వీఆర్వోలు ఏకంగా సీఎం కార్యక్రమంలో పాల్గొని, ఆయనకు సమాధానాలు చెప్పాలంటే ఎంత ఒత్తిడిలో ఉం టారో తెలిసి కూడా ఇష్టానుసారం మాట్లాడి అవమానించాచారు. ఉద్యోగులను వేధించిన పాపం ఊరికే పోతుందా. వారి ఉసురు తగిలింది. అందుకే బాబు ఇన్నేళ్లుగా సీఎం కుర్చీ దగ్గరికి రాకుండా ఉద్యోగులు చేశారు. పనికి తగ్గ వేతనమిస్తూ, ఖాళీలు భర్తీ చేస్తూ, ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వాలుంటే ఎంతటి పని భారాన్నయినా మోస్తాం. కష్టపడుతూ పని చేయమంటే ఉద్యోగులు ఆనందంగా చేస్తారు గానీ బాధ పడుతూ చేయమంటే చేయలేరని పాలకులు గుర్తుంచుకుంటే మంచిది’’ - భవానీ ప్రసాద్, తెలంగాణ వార్డెన్ల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు