సమష్టి కృషితో ఏపీజీబీ అభివృద్ధి
సమష్టి కృషితో ఏపీజీబీ అభివృద్ధి
Published Sun, Feb 19 2017 9:30 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
- వ్యాపారం రూ.21వేల కోట్లకు చేరింది
–ఏపీజీబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో బ్యాంకు చైర్మన్ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది సమష్టికృషితో బాగా అభివృద్ది చెందుతుందని ఆ బ్యాంకు చైర్మన్ సంపత్‌కుమార్‌చారీ తెలిపారు. ఆదివారం కర్నూలు బిర్లాగేట్ సమీపంలోని పంక్షన్ హాల్‌లో జరిగిన ఏపీజీబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి అతిథిగా చైర్మన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటికి రూ.10వేల కోట్ల వ్యాపారం ఉండేదని, అందరి కృషి తో ఇప్పుడు రూ.21వేల కోట్లకు చేరిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులు, ఇతర త్రా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకిష్టప్ప మాట్లాడుతూ... పదోన్నతుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన చైర్మన్, జనరల్ మేనేజర్ దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంటు కేడీ రమేష్, కర్నూలు ఏపీజీబీ రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్, రాజంపేట రీజినల్ పి.ఓబయ్య, జిల్లా నాయకుడు సురేష్ కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లా, నెల్లూరు జిల్లాలకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement