encounter cases
-
మాంద్యం మింగేసింది
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత.. ఇంటర్ ఫలితాల్లో లోపాలపై తీవ్ర వివాదం... న్యాయ చిక్కులతో బెడిసికొట్టిన కొత్త సచివాలయం, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె... దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్కౌంటర్.. వెరసి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం కొన్ని ఒడిదుడుకులకు, సంచలనాలకు వేదికైంది. అదే సమయంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ప్రభుత్వ అతిపెద్ద విజయంగా, తీపిగుర్తుగా మిగిలింది. 2019 సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, రాష్ట్రానికి ఎదురైన క్లిష్ట పరిస్థితులపై కథనం. ఆర్థిక మాంద్యం దెబ్బ ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడింది. ఫిబ్రవరిలో రూ. 1,82,087 కోట్ల భారీ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆర్థిక మాంద్యం దెబ్బకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో రూ. 1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. అయినా ఇప్పటికే అమల్లో ఉన్న రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల బిల్లులు పేరుకుపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీల అమలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల ప్రశ్నార్థకమైంది. రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఏడాదంతా నిరీక్షించాల్సి వచ్చింది. రైతుబంధు ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను అమల్లోకి తెచ్చినా సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. గత ఖరీఫ్‌లో 45 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ. 5,460 కోట్లు చెల్లించగా 8 లక్షల మందికి రూ. 1,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక రబీకి సంబంధించి చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. నిధుల కొరత వల్ల కొత్తగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సవరించిన అంచనాల్లో రూ. 10 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించినా కోకాపేట భూముల అమ్మకంపై హైకోర్టు స్టే విధించడంతో అది నెరవేరట్లేదు. ఇంటర్ ఫలితాల్లో ‘ఫెయిల్’ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటనలో దొర్లిన తప్పులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదాల కారణంగా పాసైన విద్యార్థులు సైతం ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు స్పందించడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది. ‘కాళేశ్వరం’ జాతికి అంకితం.. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయకట్టుకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. 52 రోజుల పాటు.. అక్టోబర్ 5 నుంచి 52 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మె యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. సమ్మె విరమణకు కార్మిక సంఘాల జేఏసీ, డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం నిరాకరించడంతో 50 వేల మంది కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఐదుగురు కార్మికుల బలవన్మరణాలతో కలిసి మొత్తం 38 మంది కార్మికులు సమ్మె కాలంలో మరణించారు. చివరకు కార్మిక జేఏసీ సమ్మె విరమించడం, కార్మికులను ప్రభుత్వం బేషరతుగా విధుల్లో చేర్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సమ్మె విరమించిన కార్మికులపై సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించడం ఊరట కలిగించింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీల పెంపును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సచివాలయం లేని రాష్ట్రం కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ. 400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలనితీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ. 100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. ప్రభుత్వం హుటాహుటిన సచివాలయ భవనాలను ఖాళీ చేయించడంతో పాలనపరంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. సచివాలయ శాఖల్లో కొన్నింటిని సమీపంలోని బీఆర్కేఆర్ భవన్‌కు తరలించగా మిగిలిన శాఖలను వేర్వేరు చోట్లలో ఉన్న ప్రభుత్వ భవనాలకు చేర్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా సచివాలయ శాఖల పరిస్థితి తయారైంది. -
ఇక అంతా ‘3డీ స్కానింగ్’
సాక్షి, హైదరాబాద్ : నేర, ఘటన స్థలాలను అన్ని కోణాల్లో సమగ్రంగా రికార్డు చేసే ‘3డీ స్కానర్లు’ ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ క్లూస్ టీమ్ వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఔట్ డోర్ 3డీ స్కానర్‌ను సోమవారం చటాన్‌పల్లి వద్ద వినియోగించారు. వంతెన పై నుంచి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని దాదాపు రెండు గంటల పాటు చిత్రీకరించారు. భవిష్యత్తులో ఈ రికార్డులు అనేక విధాలుగా ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దేశంలోని మరే ఇతర పోలీసు విభాగం వద్ద అందుబాటులో లేని ఈ స్కానర్లను సిటీ పోలీసులు కీలక నేరాల సందర్భంలో వినియోగిస్తున్నారు. ఎలాంటి నేరం, ప్రమాదం, ఇతర ఉదంతం జరిగినా ఘటనాస్థలికి చేరుకునే పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేరగాళ్లు ఏవైనా సాక్ష్యాధారాలను విడిచిపెట్టారా? నేరం ఎలా చేశారు? తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్రైమ్ సీన్స్‌కు వెళ్లే అధికారులు తమ దృష్టిని మృతదేహాలు, బాధితుల తరలింపు పైనే పెట్టడం అనివార్యంగా మారింది. దీంతో అనేక ఆధారాలను గుర్తించడంలో విఫలమై కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపు ఎక్కువ కాలం పడుతోంది. ఇది అనేక సందర్భాల్లో నేరగాళ్లకు కలిసి వస్తోంది. క్రైమ్ సీన్ పరిశీలనకు తోడు ప్రతి నేర స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించడం దర్యాప్తులో అనివార్యం. దీన్ని ఎఫ్ఐఆర్ తదితర పత్రాలతో పాటు న్యాయస్థానంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్కౌంటర్లు జరిగినా మ్యాప్‌ను రూపొందించి ఇతర పత్రాలతో పాటు కోర్టుకు అందిస్తారు. పోలీసు విభాగం గతంలో ఈ మ్యాప్‌లను తెల్లకాగితాలపై చేతులతో గీసేది. దీనికి తోడుగా ఘటనాస్థలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జత చేసి న్యాయస్థానానికి అందించేది. అనేక సందర్భాల్లో వీటిలో పూర్తి వివరాలు పొందుపరచలేని పరిస్థితులు ఉండేవి. నేర స్థలాలు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇల్లు, కార్యాలయం తదితర ఇండోర్... రోడ్డు, బహిరంగ ప్రదేశం వంటి ఔట్ డోర్ క్రైమ్ సీన్స్‌ను పోలీసులు సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రెండు రకాలైన క్రైమ్సీన్స్కు వినియోగించేలా ఇండోర్, ఔట్‌డోర్ మోడ్స్‌తో కూడిన 3 డీ స్కానర్లు ఖరీదు చేశారు. 3 డీ పరిజ్ఞానంతో పని చేసే ఈ స్కానర్‌ను నేరం/ఉదంతం జరిగిన ప్రాంతంలో ఓ నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ఆ పాయింట్ కేంద్రంగా ఈ కెమెరాతో కూడిన స్కానర్ అన్ని దిక్కుల్నీ, అక్కడ ఉన్న వస్తువులు తదితరాలను చిత్రీకరిస్తుంది. కేవలం వాటి 3 డీ చిత్రాలు మాత్రమే కాకుండా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోని ప్రాంతాలు, వస్తువులు, మృతదేహాలు పడిన ప్రాంతాల మధ్య ఎంత దూరం ఉందనేదీ ఈ స్కానర్ స్పష్టంగా నమోదు చేస్తుంది. మెమోరీ కార్డులు, సీడీలు, కంప్యూటర్లతో పాటు హార్డ్కాపీలుగానూ ఈ రికార్డుల్ని భద్రపరిచి, దర్యాప్తు అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది. అవసరమైన సందర్బాల్లో వీటినే న్యాయస్థానాల్లోనూ దాఖలు చేయవచ్చు. చటాన్‌పల్లి ఎన్కౌంటర్ సైట్‌ను ఈ స్కానర్‌లో రికార్డు చేసిన అధికారులు దీన్ని అవసరమైన సందర్భాల్లో వినియోగిస్తామని చెబుతున్నారు. వివిధ రకాలుగా వినియోగం... రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీరుతెన్నుల రికార్డు బాడీలీ అఫెన్సులకు సంబంధించిన నేర స్థలాల చిత్రీకరణ పారిశ్రామికవాడల్లో చోటు చేసుకునే దుర్ఘటనల నమోదు బందోబస్తు ప్లానింగ్ కోసం సభలు, సమావేశ ప్రాంతాల చిత్రీకరణ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి తీవ్రత అంచనా బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు రికార్డింగ్ బహిరంగ ప్రదేశాల్లో ఎన్కౌంటర్లు జరిగితే పక్కాగా రికార్డు చేయడానికి.. -
బహిరంగ విచారణలే మేలు
విశ్లేషణ న్యాయానికి అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఏదైనా కేసుని గోప్యంగా విచారించమని హైకోర్టు ఆదేశించవచ్చు. బహిరంగంగా విచారణలు జరపడం వల్ల ఉచితమైన, నిష్పాక్షిక న్యాయం అందుతుంది. ఈ భావనకి నష్టం కలిగినప్పుడు మాత్రమే హైకోర్టు గోప్యతను పాటించవచ్చు. మన దేశంలో ఎన్కౌంటర్ మరణాలు సహజమైపోయాయి. నిందితులే దాడి చేసినట్టుగా ప్రథమ సమాచార నివేదికలు విడుదల అవుతాయి. ఈ కేసుల్లో భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధన 302 ప్రకారం కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పుని ప్రకటించి చాలా కాలమైంది. దానిపై అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏదైనా ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు జరిగి, కోర్టులో విచారణ జరు గుతూ ఉంటే సహజంగానే దేశ ప్రజలకి ఆ కేసు గురించి ఆసక్తి ఏర్పడు తుంది. మీడియా కూడా ఈ కేసులని రిపోర్టు చేయడంలో ఉత్సాహాన్ని ప్రకటిస్తుంది. ఇలాంటి కేసుల విచారణ విషయాలను మీడియాలో ప్రక టించకూడదన్న నిషేధపు ఉత్తర్వులు ఆందోళన కలుగజేస్తాయి. సొహ్రా బుద్దీన్ షేక్, ప్రజాపతి మాసిరామ్, కవుసర్బీ ఎన్కౌంటర్ కేసులని విచా రిస్తున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి అలాంటి ఉత్తర్వులనే ఆ కేసుల విష యంలో జారీ చేశారు. ఆ ఉత్తర్వులని బొంబాయి హైకోర్టు రద్దు చేసింది. అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం కోర్టుకి లేదని, ఆ పరిస్థితులూ లేవని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ న్యాయమూర్తి జారీ చేసిన మీడియా నిషేధపు ఉత్తర్వులకి వ్యతిరేకంగా టీవీ, ప్రింట్ మీడియా జర్న లిస్టులు హైకోర్టులో రిట్ పిటిషన్‌ని దాఖలు చేశారు. ఆ కేసులో జరుగుతున్న రోజువారీ వ్యవహారాలని మీడియా ప్రచు రించవచ్చని, ప్రసారం చేసుకోవచ్చని బొంబాయి హైకోర్టు తమ ఉత్త ర్వులో స్పష్టం చేసింది. మీడియా గొంతు నొక్కడం లాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం కోర్టుకి లేదని హైకోర్టు న్యాయమూర్తి మోహన్ డిరే స్పష్టం చేశారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ మీడి యాకూ వర్తిస్తుంది. బహిరంగ విచారణ జరుగుతున్నప్పుడు ఆ విష యాలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. అది ప్రజాహితం కోసమేనని కూడా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సొహ్రాబుద్దీన్ కేసు ఈ చరిత్రను సృష్టించింది. 2003 నుంచి 2006 వరకు జరిగిన ఎన్కౌంటర్ మరణాల గురించి దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో దర్యాప్తు జరిగి విచారణ దాకా వచ్చిన కేసు అది. ఈ కేసు ఫలితంగా గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ కేసుని విచారించిన రెండవ న్యాయమూర్తి బీహెచ్ లోయా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని మరణం ఇప్పుడు ప్రశ్నా ర్థకమైంది. 2014లో ఆ కోర్టుని నిర్వహించిన మూడవ న్యాయమూర్తి అప్పటి హోంమంత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని డిశ్చార్జ్ చేశారు. న్యాయమూర్తి లోయా మరణం గురించిన కేసు విచారణ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశం దాకా చేరింది. ఈ దశలో సీబీఐ న్యాయమూర్తి మీడియా గొంతు నొక్కడం వివాదాస్పదమైంది. న్యాయస్థానాల్లో విచారణలు బహిరంగంగా జరుగుతాయి. ఈ విచారణలను ప్రజలు హాజరై గమనించవచ్చు. ఈ బహిరంగ విచారణల వల్ల వ్యక్తులకి, సమాజానికి మేలు జరుగుతుంది. బహిరంగ విచారణ హక్కు అనేది రాజ్యాంగంలోని అధికరణ 21లో మిళితమై ఉంది. ఈ బహిరంగ విచారణలవల్ల కోర్టుల విశ్వసనీయత పెరుగుతుంది. బహిరంగ విచారణ నియమం లాంటిది. గోప్యంగా జరపడం ఈ నియమానికి మినహాయింపు. న్యాయానికి అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఏదైనా కేసుని గోప్యంగా విచారించ మని హైకోర్టు ఆదేశించవచ్చు. బహిరంగంగా విచారణలని జరపడం వల్ల ఉచితమైన, నిష్పాక్షికంగా న్యాయం అందుతుంది. ఈ భావనకి నష్టం కలిగినప్పుడు మాత్రమే హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులని జారీ చేసే అవకాశం ఉంది. క్రింది కోర్టుల్లో కూడా విచారణలు బహిరంగంగా జరగాలి. క్రిమి నల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె. 327 ఇదే విషయాన్ని చెబుతుంది. అయితే లైంగిక దాడులకి సంబంధించిన నేరాల విచారణని గోప్యంగా జరపాల్సి ఉంటుంది. అదే విధంగా అందరినీ కానీ, కొంతమందినిగానీ కోర్టు నుంచి బయటకు పంపే అధికారం కోర్టుకి ఉంటుంది. ఈ విషయాలను బొంబాయి హైకోర్టు పరిశీలించి ఈ విధంగా అభిప్రాయపడింది. ‘‘ఈ కేసులో బహిరంగ విచారణ జరపడంవల్ల ప్రాణానికి హాని ఉందని, అలాంటి పరిస్థితి ఉందనిగానీ సీబీఐ న్యాయమూర్తి తమ ఉత్త ర్వులలో పేర్కొనలేదు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని కోర్టు డిశ్చార్జి చేసింది. అందుకని అలాంటి భయాందోళనలకి అవకాశం లేదు’’. దేశంలోని కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నాయని అనడానికి పార దర్శకత అవసరం. న్యాయ ప్రక్రియలో ఇదే మౌలికమైన అంశం. ఆ విశ్వ సనీయతవల్లే ప్రజలు కోర్టు తీర్పులకి బద్ధులై ఉంటున్నారు. బొంబాయి హైకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది. ‘‘భారత ప్రజాస్వామ్యాన్ని అనుక్షణం కాపాడే వ్యవస్థ మీడియా. ప్రజలకి కళ్లూ చెవులూ మీడియానే. అందుకని సమాజహితం కోసం మీడియాకు స్వేచ్ఛ ఉండాలి’’. అవును– ఖచ్చితంగా మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. - మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత మొబైల్ : 94404 83001 -
ఈ దశలో సీబీఐ విచారణకు ఆదేశించలేం
ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై తేల్చి చెప్పిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుత దశలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ విచారణ విషయంలో ప్రభుత్వ వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వడం సరైన చర్య అనిపించుకోదని హైకోర్టు తెలిపింది. సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ నిమిత్తం వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారికి రీ పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ పౌరహక్కుల సంఘం నేత సీహెచ్ చంద్రశేఖర్, మృతుల భార్యలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ డి. శ్రీనివాస్ స్పందిస్తూ కేసు దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు అప్పగించామని తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదుల్లో ఒకరైన వి. రఘునాథ్ స్పందిస్తూ సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీపై తమకు అభ్యంతరాలున్నాయని, అందువల్ల కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ సీబీఐ ఎందుకని, అవసరమైతే ఆ అధికారిని మార్చి వేరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తామని తెలిపింది. ప్రభుత్వ వాదన వినకుండా తాము సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పరిహారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించేందుకు నిరాకరించింది. ఈ విషయంలో తగిన వేదికలను ఆశ్రయించాలని తెలిపింది. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై.. నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద గత నెల 7న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వికారుద్దీన్, తదితరులకు రీ పోస్టుమార ్టం నిర్వహణకు ఆదేశాలు ఇచ్చేందుకు సింగిల్ జడ్జి నిరాకరించడంపై రిట్ అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన ధర్మాసనం విచారణను వేసవి సెలవుల రెండో వెకేషన్ బెంచ్‌కు బదలాయించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
సీబీఐ ప్రత్యేక కోర్టులో అమిత్ షా కు ఊరట!
ముంబై: సీబీఐ ప్రత్యేక కోర్టులో బీజేపీ నేత అమిత్ షాకు ఊరట లభించింది. సోహ్రాబుద్దీన్ షేక్, తులసిరాం ప్రజాపతి ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ షాకు కోర్టుకు వ్యకిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వ్యవహారాల్లో అమిత్ షా బిజీగా ఉంటున్నారని.. సీబీఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడానికి ఇబ్బందులున్నందున మినహాయింపు ఇవ్వాలని అమిత్ షా తరపు లాయర్ సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్ధించారు. అమిత్ షా డిశ్చార్జ్ దరఖాస్తును కోర్టు జూలై 14 తేదిన విచారణ చేపట్టనుంది. Follow @sakshinews