end-to-end encryption
-
వాట్సాప్ యూజర్లకు భారీ అలర్ట్.. ఆ యాప్ వెంటనే డిలీట్ చేయండి!
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మనం ఇతరులకు పంపిన సందేశాలు కొన్ని సార్లు డిలీట్ అయినప్పుడు మనం కంగారూ పడుతుంటాం. అయితే, ఇలా డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం కోసం ఎక్కువ శాతం మంది ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో లభించే థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇలాంటి, వాట్సాప్ డేటా రికవరీ చేసే థర్డ్ పార్టీ యాప్స్‌లలో డబ్ల్యుఏఎమ్ఆర్ అనేది చాలా ఫేమస్. అయితే, ఇప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న యూజర్లు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ యాప్‌ని 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వల్ల మీ డేటా బయటకు వెళ్లే ప్రమాదం ఉన్నట్లు భద్రత నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ యాప్ వినియోగదారుల ఇంటర్నెట్ గోప్యతను దెబ్బతీస్తుంది అని నిపుణులు అన్నారు. వాట్సాప్ నియమ & నిబంధనల ప్రకారం సందేశాలన్నీ ఎన్ క్రిప్ట్ చేయబడతాయి. అయితే, ఈ ఎన్ క్రిప్ట్ చేసిన సందేశాలను ఇతరులు చదవడం అసాధ్యం. ఈ డబ్ల్యుఏఎమ్ఆర్ అనేది మీరు చాట్ చేసిన మెసేజ్‌లను తన కంపెనీకి చెందిన సర్వర్లలో నిలువ చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీ డేటా ఇతరుల చేతికి చిక్కే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ(ఐఐసీఎస్)కు చెందిన సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యాప్ విభిన్న సెట్టింగ్స్ అనుమతి అవసరం కనుక, ఈ యాప్ సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. వినియోగదారులు గ్యాలరీ, నెట్ వర్క్, నోటిఫికేషన్ సెట్టింగ్స్ కి అనుమతి ఇవ్వడం వల్ల డేటా లీకేజీ ప్రమాదం జరగనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో మరో అదిరిపోయే సేల్.. వాటిపై భారీగా డిస్కౌంట్!) -
17 లక్షల యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్..!
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన 17.5 లక్షల యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. దేశంలోని ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా నవంబర్ నెలలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. అదే నెలలో 602 గ్రీవియెన్స్ రిపోర్టులు వచ్చాయని వాటిలో 36 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ వినియోగించే యూజర్లకు భద్రత పరంగా మెరుగైన సేవలు అందించేందుకు సందేశాలకు ఎండ్-టు-ఎండ్ రక్షణ కలిపిస్తున్నట్లు తెలిపింది. అలాగే, కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల భద్రత కోసం కృత్రిమ మేధస్సు, ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా శాస్త్రవేత్తలు, నిపుణుల మీద నిరంతరం పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ భారతదేశంలో అక్టోబర్ నెలలో 20 లక్షల ఖాతాలకు పైగా నిషేదించింది. అలాగే, అదే నెలలో 500 గ్రీవియెన్స్ రిపోర్టులు వచ్చాయి. మనదేశంలో 40 కోట్లకు మందికి పైగా ప్రజలువాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. మేలో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలకు మేరకు.. 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న ప్రతి డిజిజల్ ప్లాట్‌ఫామ్ ప్రతి నెలా తమకు అందిన ఫిర్యాదుల వివరాలు, తీసుకున్న చర్యలను వెల్లడించాలి. ఈ క్రమంలో కొత్త ఐటీ చట్ట ప్రకారమే.. బ్యాడ్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటోంది వాట్సాప్. (చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!) -
సీక్రెట్‌గా మెసెంజర్ సంభాషణ
ఫేస్బుక్ మెసెంజర్ నుంచి సీక్రెట్‌గా మెసేజ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది ఇప్పటినుంచి సాధ్యమవుతుందట. ఫేస్బుక్ తన మెసెంజర్ యాప్‌కి ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్‌ను తెచ్చేసింది. రహస్య సంభాషణ(సీక్రెట్ కన్వర్జేషన్) పేరుతో తన యాప్ యూజర్లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ ను ఆవిష్కరించింది. యూజర్లు ఎంపిక చేసుకున్న సంభాషణలకు పూర్తిగా ఎన్ క్రిప్షన్ సౌకర్యాన్ని ఫేస్బుక్ ఇకనుంచి కల్పించనుంది. అయితే సింగిల్ డివైజ్‌లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని ఫేస్బుక్ పేర్కొంది. ఒక డివైజ్ ద్వారా సీక్రెట్ సంభాషణ చేసి, మరొక డివైజ్‌లో ఆ సంభాషణ చూడాలనుకుంటే కుదరదని ఫేస్ బుక్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ కస్టమర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తుందని... డెస్క్‌టాప్‌లో వాడే మెసెంజర్‌కు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదని ఫేస్బుక్ వెల్లడించింది. ఈ ఫీచర్‌ను ప్రతి చాట్‌కు యూజర్లు మాన్యువల్‌గానే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ లాగా అన్ని చాట్లకు ఈ ఫీచర్ వర్తించదు. మెసెంజర్ యాప్‌ను ఓపెన్ చేసుకుని, సీక్రెట్ సంభాషణ ఎవరితో చేయాలనుకున్నారో వారిని యూజర్లు ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ పేరును టాప్ చేసి పట్టుకోవడంతో, రహస్య సంభాషణ ఫీచర్ వారికి యాక్టివేట్ అవుతోంది. సీక్రెట్ కన్వర్జేషన్ ఆప్షన్‌కు తర్వాత ఐకాన్‌గా టైమర్ ఉండనుంది. ఈ ఆప్షన్‌తో యూజర్లు మెసేజ్‌లు కనిపించకుండా పోవడానికి టైమ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే జీఐఎఫ్స్, వీడియోస్ లాంటి కొన్ని ప్రముఖ ఫీచర్లకు ఈ సీక్రెట్ సంభాషణ వర్తించదని ఫేస్బుక్ తెలిపింది. -
ఫేస్ బుక్ మెసెంజర్ కొత్త ఫీచర్
ఫేస్ బుక్ తన మెసెంజర్ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం తన మెసెంజర్ యాప్ లో డిజిటల్ సంభాషణలను హ్యాకింగ్ బారి నుంచి కాపాడటానికి ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ ప్రారంభించింది. 900మిలియన్ యూజర్లున్న ఈ మెసెంజర్ యాప్ కు లిమిటెడ్ గా టెస్టింగ్ ను ప్రారంభిస్తున్నట్టు శుక్రవారం ఫేస్ బుక్ వెల్లడించింది. మెసేజింగ్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తన వాట్సాప్ యాప్ కు మూడు నెలల క్రితమే ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ప్రవేశపెట్టింది. 100 కోట్ల మంది యూజర్లున్న ఈ ఈ వాట్పాప్ యాప్ ను 2014లో ఫేస్ బుక్ సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్క్రిప్టెడ్ సంభాషణ యూజర్లు పంపించే వీడియోలకు, పేమెంట్లకు వర్తించదని ఫేస్ బుక్ తెలిపింది. వాట్సాప్ కు వాడిన ఎన్ క్రిప్షన్ టెక్నాలజీనే ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ కూడా వాడనుంది. యూజర్ల ప్రమేయం లేకుండానే వాట్సాప్ మెసేజ్ లు ఎన్క్రిప్టెడ్ అవుతాయి. అదనపు భద్రతా రక్షణతో మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజిటల్ కమ్యూనికేషన్లో జరిగే ఈ గూఢచర్య సంభాషణలు చట్టాలకు సహకరించాలని ప్రభుత్వ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫీచర్ వల్ల ఉగ్రవాద చర్యలు పెరిగే అవకాశముందంటున్నారు. కేవలం మెసేజ్ రాసేవారు, అవతల దాన్ని చూసుకునే వారికి మాత్రమే ఈ మెసేజ్‌లు కనిపిస్తాయి. దీంతో దీని ద్వారా చాట్ చేసే మెసేజ్‌లన్నీ పూర్తి భద్రంగా ఉంటాయి. యాపిల్ ఇంక్ ఐమెసేజింగ్ ప్లాట్ ఫాంలకు, లైన్, సిగ్నల్, వైబర్, టెలిగ్రాం వంటి ఇతర యాప్ లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తున్నాయి.