Engineering Admissions Counseling
-
సీటొచ్చే ఆప్షనేంటి?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఏవైనా మార్పులు చేర్పులకు చివరి అవకాశం ఇదే. కనీ్వనర్ కోటాలో 71వేల సీట్లు ఉండగా, ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌కు దాదాపు 98,238 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 82 వేల మంది ఆప్షన్లు ఇచ్చారు. గత రెండు రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు సోమవారం ఆప్షన్లు ఇచ్చే వీలుంది.మొత్తం మీద 90వేల మందికిపైగా విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వొచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వరకూ దాదాపు 46 లక్షలకుపైగా ఆప్షన్లు అందినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఒక్కో విద్యార్థి బ్రాంచీలు, కాలేజీలతో వందకుపైగానే ఆప్షన్లు ఇస్తున్నారు. కౌన్సెలింగ్‌కు కొత్తగా సీట్లు వస్తాయని ఆశించినా ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కని్పంచడం లేదు. తాజాగా జేఎన్టీయూహెచ్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను తగ్గించడానికి తాము అంగీకరించడం లేదని చెప్పారు. దీన్నిబట్టి ఐవోటీ వంటి బ్రాంచీలను రద్దు చేసుకున్న వారికి మాత్రమే అదనపు సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పుడే కీలకం విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆఖరి నిమిషం వరకూ కసరత్తు చేయాలని సూచిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో వచ్చే సీట్లలో ఎక్కువ మంది చేరే అవకాశం ఉంటుంది. కేవలం జేఈఈ టాపర్లు మాత్రమే దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్లు కూడా ఆఖరి కౌన్సెలింగ్ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, సీటును రద్దు చేసుకోరు. కాబట్టి మొదటి కౌన్సెలింగ్‌లో కాకపోయినా రెండో విడతలో కోరుకున్న సీటు వస్తుందనే ఆశ సరికాదని చెబుతున్నారు.చాలామంది తమ ర్యాంకును బట్టి, ఏయే కాలేజీలో ఏయే బ్రాంచీలో సీటొస్తుందో ఓ అంచనాకు రావాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఉదాహరణకు ఐటీలో తమకు దగ్గర్లోని కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ప్రా«ధాన్యతల్లో చేర్చడం లేదు. దీనివల్ల ఆ సీటు వేరే వాళ్లకు వెళ్తుంది. తర్వాత కౌన్సెలింగ్‌ల్లో కోరుకున్నా సీటు వచ్చే అవకాశం ఉండదు. కసరత్తు చేయాలి: ఎంఎన్ రావు (గణిత శాస్త్ర నిపుణుడు) ఆప్షన్లు ఇచ్చేప్పుడు విద్యార్థులు ఆఖరి నిమిషం వరకూ కసరత్తు చేయాలి. అవసరం అనుకుంటే ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ర్యాంకుకు దగ్గరగా ఉండే కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. ఏ ర్యాంకు వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనేది పరిశీలించాలి. తొలి విడత ఆప్షన్లు చాలా కీలకమనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. అన్ని వివరాలు పరిశీలించాలి... గత ఏడాది ప్రతీ కాలేజీలో కటాఫ్ ఏ విధంగా ఉందనే వివరాలను సాంకేతిక విద్య విభాగం వెబ్సైట్లో ఉంచింది. 2023–24లో 86,671 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 70 శాతం భర్తీ చేయాలి. కానీ 81 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి స్లైడింగ్ సీట్లు పెరిగినా 10 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది కన్నా కొంత అటూ ఇటూగా కటాఫ్‌ను అంచనా వేయొచ్చని నిపుణులు అంటున్నారు. బ్రాంచీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, కాలేజీ విషయాన్ని రెండో ఐచి్ఛకంగా చూడటం ఉత్తమం. కాలేజీ ప్రాధాన్యత అనుకుంటే ఏ బ్రాంచీలో సీటు వస్తుందనేది అంచనా వేసి ఆప్షన్ పెట్టడం మంచిది. ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కాలేజీల ఫీజు, రీయింబర్స్మెంట్ వివరాలు, దగ్గర్లో ఉన్న కాలేజీ ఏంటి? అనే వివరాలను పరిశీలించి ఆప్షన్లు ఇవ్వడం మంచిదని నిపుణులు అంటున్నారు. -
జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్య మండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (టీఎస్ఈఏపీ సెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెట్ ఫలితాలను ఈ నెల 18న విడుదల చేశారు.సెట్లో అర్హత సాధించిన వారికి కాలేజీల్లో కన్వీనర్ కోటా పరిధిలో ఉండే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ తేదీ లపై ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలువురు ఉన్నతాధికారులు సమావేశయ్యా రు. అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేశారు. 12 నుంచి స్లైడింగ్... ఒకే కాలేజీలో వివిధ బ్రాంచ్‌లు మారాలనుకునే వారు ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్లను 13వ తేదీ ఫ్రీజ్ చేస్తారు. 16 న సీట్ల కేటాయింపు ఉంటుంది. 17వ తేదీలోగా విద్యార్థులు స్లైడింగ్‌లో కేటాయించిన బ్రాంచ్‌కు అంగీకరిస్తున్నట్టు రిపోర్టు చేయాలి. జూన్ 8 నుంచి ఈ–సెట్ కౌన్సెలింగ్ డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ–సెట్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ 8 నుంచి కౌన్సెలింగ్ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది.కౌన్సెలింగ్ తేదీలు ఇలా... -
నేడు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం విద్యార్థులకు సీట్లను కేటాయించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం లేదా మధ్యాహ్నం విద్యార్థులకు సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. ఆ సమాచారాన్ని ఠీఠీఠీ. ్టట్ఛ్చఝఛ్ఛ్టి. nజీఛి. జీn అందుబాటులో ఉంచడంతోపాటు విద్యార్థులకు ఎస్సెమ్మెస్ రూపంలో తెలియజేయనుంది. ఈసారి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారందరికీ సీట్లను కేటాయించినా కన్వీనర్ కోటాలో మరో 6,898 సీట్లు మిగిలిపోనున్నాయి. మొత్తంగా ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 96,703 మంది అర్హత సాధించినా ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు 59,033 మంది పాల్గొన్నారు. అందులో 58,048 మంది విద్యార్థులు గతనెల 28 నుంచి ఈనెల 5 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మాత్రమే సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలోని 70% సీట్లను (64,946), మిగతా 30% సీట్లను యాజమాన్య కోటాలో కాలేజీలు భర్తీ చేస్తాయని తెలిపారు. -
రేపటి వరకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా 58,732 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌కు 1,36,305 విద్యార్థులు హాజరు కాగా.. అందులో 1,06,646 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వారిలో ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులకు గత నెల 28 నుంచి వెరిఫికేషన్‌ను ప్రవేశాల క్యాంపు నిర్వహించింది. ఆ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ వెరిఫికేషన్‌కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు 55,354 మంది, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని వారు 1,807 మంది, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని వారు 1,157 మంది, ఇతర రాష్ట్రాల వారు 414 మంది హాజరైనట్లు ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. అందులో 36,163 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు ఈ నెల ఐదు లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. సీట్ల కేటాయింపును ఈ నెల 8న ప్రకటిస్తామని వెల్లడించారు. -
రేపు తేలకపోతే కష్టమే!
హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌పై సోమవారం కూడా స్పష్టత రాలేదు. అన్ని కాలేజీలకు సంబంధించిన కేసులను జేఎన్టీయూహెచ్ ఫైల్ చేయనందున ఈ కేసు విచారణను హైకోర్టు బుధవారానికి (ఈనెల 15కు) వాయిదా పడింది. మరోవైపు ప్రవేశాల ముగింపు, తరగతుల ప్రారంభ గడువు సమీపిస్తోంది. బుధవారం నాటి విచారణలో ప్రవేశాలపై స్పష్టతరాకపోతే.. ఈ నెలాఖరుకు ప్రవేశాలు పూర్తయి, వచ్చే నెల 1న తరగతులు ప్రారంభం కావడం కష్టమనే అభిప్రాయాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలేజీల అఫిలియేషన్ల కేసులో సోమవారం స్పష్టత వస్తుందని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎదురుచూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. కౌన్సెలింగ్‌కు అనుమతి వస్తేనే.. ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారంలో ఈనెల 15వ తేదీన స్పష్టత వస్తేనే నెలాఖరుకు ఒకటి, రెండు దశల ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పూర్తి చేయవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. 16న వెబ్ ఆప్షన్లు ప్రారంభించినా.. ఆ తరువాత 3 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని, తర్వాతే సీట్లను కేటాయించాల్సి ఉంటుందని, విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు గడువు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియకు పది రోజులు పడుతుందని చెప్పారు. ఇక రెండోదశ కౌన్సెలింగ్‌కు కనీసం ఐదు రోజులు పడుతుందన్నారు. 15న స్పష్టత రాకపోతే ఆగస్టు 1న తరగతుల ప్రారంభం కష్టమేనని, ఇందుకు గడువు కోసం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.