నేడే ఎంసెట్ ఆల్ ద బెస్ట్
దోమ, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎంసెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహించనున్నారు. వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాల, ధన్నారం సమీపంలోని అన్వర్‌ఉలూమ్ కళాశాల సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఇవీ సూచనలు..
నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రంలోకి అనుమతించరు.
ఆన్లైన్ దరఖాస్తు పత్రం తప్పనిసరి.
హాల్‌టికెట్, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఆన్లైన్ దరఖాస్తు పత్రం తప్పకుండా తీసుకెళ్లాలి.
ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు వెంట తీసుకెళ్లవద్దు.
పరీక్ష రాసేందుకు వాడే అట్టలకు కూడా అనుమతి లేదు.
దరఖాస్తు ఫారంలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా పరీక్షా కేంద్రంలో ఉండే నామినల్ రోల్స్‌లో సరి చేసుకునే వీలుంది.
విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
ఇంజినీరింగ్ పరీక్ష రాసే విద్యార్థులను ఉదయం 9గంటల నుంచి, మెడిసిన్ పరీక్ష రాసే విద్యార్థులను మధ్యాహ్నం 1.30 నుంచి అనుమతిస్తారు.
పరీక్షకు 30 నిమిషాల ముందు ఓఎంఆర్ షీట్‌ను అంది స్తారు. విద్యార్థులు తప్పులు లేకుండా వాటిని నింపాలి.
సమాధానాలు గుర్తించేందుకు పెన్సిల్‌కు బదులు బ్లూలేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను ఉపయోగించాలి.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మంచి ర్యాంకు సాధించగలమన్న నమ్మకంతో పరీక్షకు వెళ్లాలి.
పరీక్షకు ముందు సబ్జెక్టు గురించి ఇతరులతో చర్చించి ఆందోళనకు గురికావొద్దు.