Engineering student commits suicide
-
రాఖీ పండగ రోజు అన్నకు తీవ్ర విషాదం..!
తల్లి చిన్నతనంలోనే మరణించింది. తండ్రి ఆటోనడుపుకుంటూ జీవనం సాగిస్తూ కూతురిని చదివిస్తూ వచ్చాడు. విధిరాతలో తండ్రికూడా ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లీతండ్రిని కోల్పోయిన ఆ విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రోజున ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉన్న ఒక్కగానొక్క సోదరుడికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పులివెందుల వైఎస్సార్ కడప: అనంతపురం పట్టణంలోని రాణినగర్‌కు చెందిన నాగన్న, నారాయణమ్మలకు కుమార్తె రాజేశ్వరి(20), కుమారుడు రవి ఉన్నారు. వీరిలో రాజేశ్వరి పులివెందులలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ 3వ సంవత్సరం చదువుతోంది. రాజేశ్వరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివించేవాడు. అయితే ఈఏడాది మే నెలలో అనారోగ్యంతో ఆయన కూడా మృతిచెందడంతో రాజేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం తన స్నేహితురాలితో కలిసి పట్టణంలోని శివాలయం వెళ్లి అక్కడ దేవుని దర్శనం చేసుకొంది. అనంతరం షాపింగ్‌కు వెళ్లి స్థానికంగా ఒక హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో జేఎన్టీయూ లోని బాలికల హాస్టల్ గల తన గదికి చేరుకుంది. ఆ తర్వాత 4గంటల ప్రాంతంలో టీ బ్రేక్ కావడంతో తోటి స్నేహితురాలు వెళ్లి పిలవగా ఎంతకు తలుపు తెరవకపోవడంతో సిబ్బందికి తెలియజేసింది. వారు వెళ్లి తలుపులు బద్దలుకొట్టి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయగా అర్బన్ సీఐ పుల్లయ్య, ఎస్ఐ శివప్రసాద్‌లు ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అటు తల్లిదండ్రులను కోల్పోయిన బాధకు తోడు.. ఉన్న ఏకైక సోదరి కూడా కన్ను మూయడంతో సోదరుడు అనాథగా మారిన సంఘటన అందరినీ కలచి వేస్తోంది. సీఐ పుల్లయ్య మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని వివరించారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
వేలేరుపాడు :వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మిసాయి(23) అనే బీటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం చోటు చేసుకుంది. సత్తుపల్లి పట్టణ సీఐ యు.వెంకన్నబాబు కథనం ప్రకారం.. గురువారం కొత్తపల్లి లక్ష్మిసాయి కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో గడిపెట్టుకొని ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకొని వేలాడుతుండటంతో స్నేహితులు గుర్తించి తలుపు పగులగొట్టి లక్ష్మిసాయిని కిందకు దింపారు. కొన ఊపిరితో ఉన్నాడనే ఆశతో హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖ కూడా లభించింది. నా కొడుకును చంపేశారు : తండ్రి ఆరోపణ నా ఒక్కగాను ఒక్క కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్నాం..ఈవ్‌టీజింగ్ చేసి, నా కొడుకును చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తండ్రి కొత్తపల్లి నర్సింహారావు(బాబు) విలపిస్తూ చెప్పారు. బుధవారం రాత్రి హాస్టల్లో ఘర్షణ జరిగిందని.. ఎవరో కావాలని నా కొడుకును చంపేసి ఉరి వేసుకున్నట్టు నమ్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో మృతిచెందితే ఒంటిగంటకు కూడా సమాచారం ఇవ్వలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని సత్తుపల్లి సీఐ వెంకన్నబాబుతో వాగ్వాదానికి దిగారు. ఉరి వేసుకుంటే నాలుక బయటకు వస్తుందని.. అలా ఏమీ కన్పించటం లేదంటూ ఆరోపించారు. ఉరి వేసుకుంటే పోలీసులు వచ్చేవరకు మృతదేహాన్ని ఉంచకుండా హడావుడిగా ఆస్పత్రికి తరలించటంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ఉద్రిక్తత.. రాస్తారోకో.. లక్ష్మిసాయి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఆస్పత్రికి వచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ విజయ్‌కుమార్‌తో ఘర్షణకు దిగారు. ఆస్పత్రి ఆవరణలో ఉదిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రికి తరలించిన మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అక్కడకు చేరుకున్న సీఐ వెంకన్నబాబు ఆందోళనకారులకు నచ్చచెప్పటంతో రాస్తారోకో విరమించారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఏలూరు(సెంట్రల్) : తమ్ముడు ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని బర్ల శివకృష్ణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం మండలం రామయ్యపేటకు చెందిన బర్ల శివకృష్ణ, మహేష్ అన్నదమ్ములు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పెద్దనాన్న నాగేశ్వరరావు వద్ద ఉండి చదువుకుంటున్నారు. శివకృష్ణ ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ట్రిపుల్ ఈ బ్రాంచి మూడో సంవత్సరం చదువుతున్నాడు. మహేష్ సీఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ఆ కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. శివకృష్ణ రెండేళ్ల క్రితం వరకు స్థానిక శాంతినగర్‌లోని ఓ రూమ్‌లో ఉండి చదువుకునే వాడు. వేసవి సెలవులు ఇచ్చినపుడు రూమ్ ఖాళీ చేసిన అతను తరువాత ప్రతిరోజు రామయ్యపేట నుండి డైలీ సర్వీస్ చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 3గంటలకు శివకృష్ణ తన తమ్ముడి వద్దకు వెళ్లాడు. మహేష్ క్రికెట్ ఆడుకోవటానికి వెళుతున్నానని చెప్పడంతో శివకృష్ణ రూమ్‌లోకి(రూమ్ నెంబరు 62) వెళ్ళి తలుపుకు వేసుకున్నాడు. మహేష్ సాయంత్రం 4 గంటలకు హస్టల్‌కు వచ్చాడు. శివకృష్ణ ఎంత పిలిచిన, ఫోను చేసినా గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ తలుపు సందు నుంచి చూశాడు. శివకృష్ణ ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. కింద ఉన్న తోటి విద్యార్థులకు, హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తలుపును పగలగొట్టి లోపలకు వెళ్లారు. అప్పటికే శివకృష్ణ మరణించటంలో వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై డి.ప్రసాద్ కుమార్ హాస్టల్ వద్దకు చేరుకుని మృత దేహాన్ని కిందకు దింపి, పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమ వైఫల్యమే కారణమా! శివకృష్ణ ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. శివకృష్ణ కాలేజీ బ్యాగ్‌లోని పుస్తకంలో ఉన్న కవితను, కీచెరుున్ను చూసిన పోలీసులు ప్రేమ విఫలం అవడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. నన్ను ఒంటరిని చేశాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందారని, తనకంటూ ఉన్న అన్న శివకృష్ణ తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాడనుకోలేదని మహేష్ పోలీసుల ముందు భోరుమన్నాడు. అమ్మ నాన్న లేని లోటు రాకుండా పెదనాన్న, పెద్దమ్మ చూసుకుంటున్నారని, తన అన్న ఇలా చేస్తాదనుకోలేదన్నాడు. తరచూ వస్తుండేవాడు శివకృష్ణ తరచూ తన స్నేహితులతో కలసి మహేష్ హాస్టల్ గదికి వస్తుంటాడని హాస్టల్ సెక్యూరుటీ గోపాలరావు తెలిపాడు. అతను తన తమ్ముడుని కలసి వెళ్లిపోయేవాడని చెప్పారు.