engineers JAC
-
‘ఇరిగేషన్ డే’గా విద్యాసాగర్‌రావు జన్మదినం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్‌రావు పుట్టినరోజు నవంబర్ 14ను తెలంగాణ ‘ఇరిగేషన్ డే’గా ప్రకటించాలని రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యాసాగర్‌రావు కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశాయి. ఆదివారం విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జలసౌధ ప్రాంగణంలో ఇంజనీర్లు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో పాటు సీఈలు సునీల్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు ఇంజనీర్ల జేఏసీ నాయకులు వెంకటేశం, మోహన్‌సింగ్, వెంకటరమణారెడ్డి, సల్లా విజయ్‌కుమార్, చక్రధర్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకోసం విద్యాసాగర్‌రావు తీవ్రంగా తపించేవారని, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంలో తాను ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. ఆయనిచ్చిన విలువైన సూచనల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ విద్యాసాగర్‌రావును వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఈ సునీల్ మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తిచేసి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, విద్యాసాగర్‌రావు ఆశయ సాధనకు పునరంకిత మవుతామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో పాలుపంచుకుంటామన్నారు. -
తప్పుదోవ పట్టించొద్దు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్స్ కు ఇంజనీర్ల జేఏసీ హితవు సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో డిజైన్ల మార్పు కారణంగా రూ. వేల కోట్లు ప్రజాధనం వృథా అయిందని దీనికి ఇంజనీర్లను బాధ్యులను చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స ప్రకటనను రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ తప్పుపట్టింది. నిజాల్ని తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించరాదని ఇంజ నీర్ల జేఏసీ సూచించింది. విభజన అనం తర పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా ప్రకటనలు చేశారని ఆరోపించింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పి.వెంకటేశం, కో చైర్మన్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్‌లు బుధవారం ప్రక టన విడుదల చేశారు. ప్రాణహిత చేవెళ్ల లోని తమ్మిడిహెట్టి వద్ద నిర్ణీత నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం తేల్చిచెప్పడం, బ్యారేజీ ఎత్తును తగ్గించిన కారణంగానే మేడిగడ్డ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఆయ కట్టుకు నీరు అందించనుండగా కాళేశ్వరం ద్వారా గతంలో నిర్ణరుుంచిన ఆయకట్టు కంటే ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించవచ్చునన్నారు. -
రాష్ట్రం విడిపోతే సీమ ఏడారే
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను పాలకులు, అధికారులు, ప్రజలు సమైక్య గళం విప్పి అడ్డుకోకపోతే భావి తరాలు క్షమించవని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు అన్నారు. రాయలసీమ నీటి వనరులు-లభ్యత-అభివృద్ధి-విభజన నష్టాలు-తదుపరి చర్యలు-ప్రణాళిక అనే అంశంపై గురువారం కర్నూలులో రాయలసీమ నీటి పారుదల శాఖ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఇరిగేషన్ ఇంజినీర్ల జేఏసి జిల్లా కన్వీనర్ పాండు రంగయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో చీఫ్ ఇంజినీర్సుబ్బారావు, సూపరింటెండెంట్ ఇంజి నీర్ నాగేశ్వరరావు, రాయలసీమ ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ సుధాకర్‌బాబు హాజరయ్యారు. ఇందు లో అనంతపురం, కడప, చిత్తూరు జేఏసీ కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, క్రిష్ణయ్య, మురళి, నంద్యాల సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు చెన్నప్పరెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ మనోహర్, రిటైర్డ్ డీఈ సుబ్బరాయుడు ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమ ఎడారిగా మారుతుందని, వరద జలాల ఆధారితమై నిర్మించిన గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. టీబీ డ్యాం నుంచి దిగువ కాల్వకు సమాంతర కాలువ తవ్వేందుకు కేంద్రం అనుమతివ్వాలన్నారు. పోలవరం, దుమ్ముగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి 242 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణ బేసిన్‌కు తరలించి ఆ నీటిని వరద ఆధారిత ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు, తెలుగు గంగ, ఎస్సార్బీసీ, వెలుగొండ ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలన్నారు. అనంతరం సదస్సులో 10 తీర్మానాలు చేశారు.