entertainment industry
-
యువ సృష్టికర్తలకు ప్రోత్సాహం
వాణిజ్య సుంకాలు, స్టాక్ మార్కెట్ అస్థిరతలు ప్రపంచాన్ని వేధిస్తున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తూనే ఉంది. విస్తృత జనాభా, సాంకేతిక సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ప్రపంచ ‘క్రియేటివ్ పవర్ హౌస్’గా తనను తాను నిరూపించుకునే సత్తా భారత్‌కుంది. కథలు చెప్పడంలో మనకున్న సామర్థ్యాన్ని ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ విజన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలను (క్రియేటర్స్) లక్ష్యంగా చేసుకుని భారత మీడియా–వినోద (ఎం అండ్ ఇ) రంగం ముందుకు సాగుతోంది.చలనచిత్రం, సంగీతం, కళ, సాంకేతికత వంటి వివిధ రంగాలలో యువ సృష్టికర్తలకు భారత్ నిలయంగా ఉంది. ముఖ్యంగా ‘డ్యూన్–2’ సినిమా ఆస్కార్ గెలుపునకు కారణమైన అద్భుత వీఎఫ్ఎక్స్ను అందించిన విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ స్టూడియోగా నమిత్ మల్హోత్రాకు చెందిన ‘డీఎన్ఈజీ’ని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ వినోద పరిశ్రమలో భారత్ ప్రాబల్యాన్ని తెలియచెబుతూ భారత్‌కు 7వ ఆస్కార్‌ను తెచ్చిపెట్టింది. సంప్రదాయ ఫిల్మ్ మేకింగ్ నుంచి డిజిటల్ నిర్మాణానికి మళ్ళుతూ ప్రపంచ స్థాయి కంటెంట్‌ను రూపొందించడంలో భారత్ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.ముంబయి వేదికగా మే నెలలో భారత ప్రభుత్వం ‘ప్రపంచ ఆడియో–విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ను నిర్వహిస్తోంది. యువ సృష్టికర్తలను పరిశ్రమ దిగ్గజాల చెంతకు చేర్చడం, అంకుర సంస్థలను ప్రోత్సహించడం వేవ్స్‌లో భాగమైన వేవ్స్ ఎక్స్లెరేటర్ (వేవెక్స్) లక్ష్యం. యువ సృష్టికర్తలు అనుభవజ్ఞుల సలహాలు పొందేలా చూడటం, నిధుల లభ్యత, అంతర్జాతీయ అవకాశాలను అందించడం ద్వారా మీడియా, వినోద రంగాల్లో భారత అంకుర సంస్థల స్థాయిని పెంచడానికి వేవ్స్ కృషి చేస్తుంది. గేమింగ్, కృత్రిమ మేధ, మెటావర్స్ వంటి వినూత్న రంగాలపై దృష్టి సారిస్తూ... ఈ రంగం 2023లో రూ. 2,422 బిలియన్ల నుంచి 2027 నాటికి రూ.3,067 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, బ్రాహ్మణ్ గేమ్ స్టూడియోస్, కీబౌండ్, వాయన్ క్లౌడ్ వంటి అంకుర సంస్థలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేవ్స్ ఒక వేదికగా ఉపకరిస్తుంది. వీటిలో మీడియా – వినోద రంగ సామర్థ్యాన్ని చాటే ల్యాప్వింగ్ స్టూడియోస్, వైగర్ మీడియా వంటి మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అడుగు పెట్టడానికి ఒక పోటీతత్వ అంకుర సంస్థల వాతావరణాన్ని వేవ్స్ అందిస్తుంది. పెట్టుబడులు పొందడానికి, అంతర్జాతీయ అరంగేట్రంలో ఇబ్బందులను తప్పించడానికి, మెంటార్షిప్ అడ్డంకులకు ఒక పరిష్కార వేదికగా నిలుస్తుంది. కేవలం రూ.10,000 పెట్టుబడితో ఒక విజన్‌తో ‘బయోకాన్’ను ప్రారంభించిన నాకు ఇటువంటి ప్రోత్సాహక వేదికల ప్రాముఖ్యం ఏమిటో బాగా తెలుసు.క్రియేటివ్ హబ్ కళలంటే ఇష్టపడే నేను మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫొటోగ్రఫీ (మ్యాప్), సై¯Œ ్స గ్యాలరీ బెంగళూరు కార్యక్రమాలకు నా సహకారాన్ని అందిస్తూ ఉంటాను. ఒక దేశ సంస్కృతి దాని కళలు, శాస్త్రాలతో ముడిపడి ఉందని బలంగా నమ్ముతాను. కళలు, విజ్ఞాన శాస్త్రం రెండూ సృజనాత్మకతలో భాగమే. కళాకారులు వేదికపై ప్రదర్శించే విధంగానే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తారు.కథలు చెప్పడంలో శతాబ్దాలుగా నైపుణ్యం కలిగిన భారత్... ప్రపంచ సృజనాత్మక శక్తిగా ఎదగడానికి గొప్ప అవకాశం ఉంది. శాస్త్రీయ నృత్యం నుంచి సినిమా వరకు; కామిక్స్ నుంచి ఇమ్మర్సివ్ టెక్నాలజీ వరకు, అధునాతన సృజనాత్మకత ఆవిష్కరణలతో ముడిపడి ఉన్న ఉత్తేజకరమైన యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ అనే ఆలోచన ఈ ఆశయాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తుంది.సృజనాత్మక అంకుర సంస్థలకు ఉత్ప్రేరకంసాంకేతికత, కథ చెప్పడంలోని నైపుణ్యానికి వేవ్స్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. యానిమేషన్, ఏఐ, ఏఆర్/వీఆర్, గేమింగ్, మెటావర్స్ వంటి వినూత్న రంగాల్లో అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా వేవెక్స్ తన ప్రాబల్యాన్ని చాటడానికి సిద్ధంగా ఉంది.వేవ్స్ బజార్లో 4,500కు పైగా అమ్మకందారులు, 5,900కి పైగా కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు. ఇది భారతీయ అంకుర సంస్థలను అంతర్జాతీయ సంస్థల చెంతకు చేర్చడం ద్వారా ప్రపంచ మీడియా, వినోద రంగాల్లో భారత్ పురోగమనాన్ని మరింత వేగవంతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సంప్రదాయ మీడియాకు మించిన ఆవిష్కరణలకు కూడా వేవ్స్ పెద్దపీట వేస్తుంది. కృత్రిమ మేధ ఆధారంగా తయారుచేసిన ప్రకటనల్లో ఎరుకానావిస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. అదే సమయంలో యానిమేషన్, వీఆర్ ద్వారా అమేజ్ స్టూడియోస్, ఆఫ్‌లైన్ హ్యూమన్ స్టూడియోలు కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచిస్తున్నాయి. ఇన్స్కేప్ ఎక్స్ఆర్, విజన్ ఇంపాక్ట్ వంటి ఎడ్–టెక్ వెంచర్లు ఇమ్మర్సివ్ మీడియాతో నేర్చుకునే విధానంలో మార్పులు తెస్తున్నాయి.భవిష్యత్ దృక్కోణంమీడియా, వినోద రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి రూపొందించిన వేవ్స్ వంటి కార్యక్రమాలకు మద్దతునిచ్చే విషయంలో భారత ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం వేవ్స్ ద్వారా కేవలం అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టడమే కాదు, కథను చెప్పే, స్వీయ–వ్యక్తీకరణ, భవిష్యత్తును నిర్వచించే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలోనూ పెట్టుబడి పెడుతున్నాం. అది బయోటెక్ ల్యాబ్ కావొచ్చు, డిజిటల్ స్టూడియో కావొచ్చు... సృజనాత్మకత అనేది రేపటి పరిశ్రమలు, గుర్తింపులను రూపొందించే ఒక సాధనం.వేవ్స్–2025 భారతదేశపు మీడియా, వినోద పరిశ్రమలకు సంబంధించిన వేడుకే కాదు... ఇప్పటి వినోదం, విద్య, సంస్కృతుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రపంచంలో తదుపరితరం సృష్టికర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిచయ వేదిక.ఈ ప్రయాణంలో వేవ్స్ సలహా సంఘంలో నేనూ ఒక సభ్యురాలైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. ప్రపంచ సృజనాత్మక విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధమవుతున్న క్షణమిది. ‘భారత్‌లో సృష్టిద్దాం– ప్రపంచం కోసం సృష్టిద్దాం’ అంటూ అనంత కాల్పనిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేద్దాం.-వ్యాసకర్త బయోకాన్ గ్రూప్ చైర్ పర్సన్-కిరణ్ మజుందార్ షా -
మీడియా, ఎంటర్టైన్మెంట్ ఆదాయం... రూ. 6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం భారీ వృద్ధిని చూడనుంది. 2027 నాటికి పరిశ్రమ ఆదాయం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ 73.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని (రూ.6.03 లక్షల కోట్లు) పీడబ్ల్యూసీ సంస్థ అంచనా వేసింది. వినియోగదారుల ప్రాధాన్యతలు పెరుగుతూ ఉండడం, ఇంటర్నెట్ విస్తరణ, కొత్త టెక్నాలజీల అవతరణ ఇవన్నీ కూడా మీడియా, వినోద పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమపై ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమకు 2022ను కీలక మలుపుగా చెప్పుకోవాలి. 5.4 శాతం వృద్ధితో ఆదాయం 2.32 లక్షల డాలర్లకు (రూ.190 లక్షల కోట్లు) చేరింది. 2021లో వృద్ధి 10.6 శాతంతో పోలిస్తే సగం తగ్గింది. వినియోగదారులు చేసే ఖర్చు తగ్గడమే ఇందుకు కారణం’’అని నివేదిక తెలిపింది. మొత్తం ప్రకటనల ఆదాయంలో అతిపెద్ద విభాగంగా ఉన్న ఇంటర్నెట్ ప్రకటనల విభాగంలో వృద్ధి గతేడాది స్తబ్దుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో ఆశావహం భారత్‌లో మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి ఆశావహ పరిస్థితులు నెలకొన్నట్టు పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. 2022లో పరిశ్రమ ఆదాయం 15.9 శాతం వృద్ధి చెంది 46,207 మిలియన్ డాలర్లుగా (రూ.3.78 లక్షల కోట్లు) ఉన్నట్టు వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్, సంప్రదాయ టీవీ, ఇంటర్నెట్, అవుట్ ఆఫ్ హోమ్ ప్రకటనల దన్నుతో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు వివరించింది. ఇదీ చదవండి ➤ Economic Loss due to floods: కన్నీటి వరదలు.. ఎన్ని వేల కోట్ల నష్టాన్ని మిగిల్చాయో తెలుసా? ఎస్బీఐ రిపోర్ట్ ముఖ్యంగా 2022లో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభించడం మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. నూతన ఆవిష్కరణలతో ఓటీటీ ఆదాయం 2022లో 1.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని, 2021లో 1.4 బిలియన్ డాలర్ల ఆదాయంతో పోలిస్తే 25 శాతం అధికమని, 2018లో ఉన్న ఆదాయంతో పోలిస్తే ఆరు రెట్లు వృద్ధి చెందినట్టు వివరించింది. భారత్‌లో ఓటీటీ ఆదాయం ఏటా 14.3 శాతం చొప్పున వృద్ధి చెందుతూ, 2027 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. వినియోగం విస్తృతం ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), మెటావర్స్ విస్తరణతో వినియోగం విస్తృతమైంది. ప్రేక్షకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగేందుకు రూపాంతర ఆవిష్కరణలపై కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా చీఫ్ డిజిటల్ ఆఫీసర్ మన్‌ప్రీత్ సింగ్ అహుజా తెలిపారు. మొబైల్ వినియోగం పెరగడం ప్రస్తుత చానళ్లపై ప్రభావం చూపిస్తుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ చానళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందున, సంప్రదాయ మీడియా, వినోద వ్యాపార సంస్థలు సరైన విధానాలను అవలంబించడం కీలకమని పేర్కొంది. భారత్ ఈ ఏడాది వేగంగా వృద్ధి సాధిస్తున్న వార్తా పత్రికల మార్కెట్‌గా ఉన్నట్టు తెలిపింది. ఓటీటీ, కనెక్టెడ్ టీవీ మార్కెట్‌కు భారత్‌లో భారీ వృద్ధి అవకాశాలున్నట్టు అంచనా వేసింది. -
ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచుగా ట్రోలింగ్‌కు గురవతున్నారు. కొందరు విచిత్రమైన చేష్టలతో అభాసుపాలైతే మరికొందరు ఏం చేయకుండానే ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ట్రోలింగ్ బారిన పడింది. అయితే ఆమె ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి నోరు మూయించింది. మసాబా గుప్తా ఇటీవల తన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్ 'నువ్ అంత అందంగా లేవు. ఘోరంగా ఉన్నావ్. ఈ ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ (సినిమా) రంగంలో నువ్ ఎలా ఉన్నావ్' అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ ''ఇది అందమైనది. కేవలం ప్రతిభ వల్లే ఏ పరిశ్రమలోనైనా నిలదొక్కుకోగలరనే విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అమితమైన హార్డ్ వర్క్, భయంకరమైన క్రమశిక్షణ వల్లే అది సాధ్యం. ఇక నా ముఖం విషయానికొస్తే అది నాకొక బోనస్. (నా మైండ్, మనస్సు ఒక పదునైనా కత్తిలాంటింది. నువ్ ఎంత ప్రయత్నించినా నీ చెత్త మాటలు అందులోకి వెళ్లలేవు)'' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మసాబా గుప్తా. చదవండి: 'అవును, ఆ రూమర్ నిజమే' అంటున్న రష్మిక.. అతడితో.. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! మసాబా గుప్తా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'మోడ్రన్ లవ్ ముంబై'లో నటించింది. అలాగే ఆమె తల్లి నీనా గుప్తాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'లో కూడా యాక్ట్ చేసింది. ఈ సిరీస్‌ను మసాబా గుప్తా, ఆమె తల్లి, నటి నీనా గుప్తా జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని సెమీ ఫిక్షన్‌గా తెరకెక్కించారు. త్వరలో ఈ సిరీస్‌కు రెండో సీజన్ కూడా రానుంది. 'ఎమ్‌టీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్' రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది మసాబా గుప్తా. కాగా మసాబా గుప్తా.. నీనా గుప్తా, క్రికెటర్ వివ్ రిచర్డ్‌ల సంతానం. తర్వాత నీనా గుప్తా చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ -
రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద పరిశ్రమ 2026 నాటికి 8.8 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందనుంది. రూ. 4.30 లక్షల కోట్లకు చేరనుంది. దేశీ మార్కెట్లో ఇంటర్నెట్, మొబైల్స్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మీడియా, ప్రకటనలు ఇందుకు ఊతమివ్వనున్నాయి. సంప్రదాయ మీడియా నిలకడగా వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2026 నాటికి టీవీ అడ్వర్టైజింగ్ రూ.43,000 కోట్లకు చేరనుంది. తద్వారా అంతర్జాతీయంగా ఈ విషయంలో అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్ తర్వాత అతి పెద్ద టీవీ అడ్వర్టైజింగ్ మార్కెట్‌గా భారత్ అయిదో స్థానం దక్కించుకోనుంది. 2022లో భారతీయ మీడియా, వినోద పరిశ్రమ 11.4 శాతం వృద్ధితో రూ. 3.14 లక్షల కోట్లకు చేరనుంది. ఓటీటీలకు సబ్స్క్రిప్షన్ ఊతం .. దేశీయంగా ఓటీటీ వీడియో సర్వీసులు వచ్చే నాలుగేళ్లలో రూ. 21,031 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇందులో రూ. 19,973 కోట్లు సబ్స్క్రిప్షన్ ఆధారిత సర్వీసుల నుండి, రూ. 1,058 కోట్లు వీడియో ఆన్ డిమాండ్ (వీవోడీ) విభాగం నుండి రానున్నాయి. ఓటీటీల వృద్ధికి సబ్స్క్రిప్షన్ సర్వీసులు ఊతమిస్తున్నాయని, 2021లో ఓటీటీల మొత్తం ఆదాయంలో వీటి వాటా 90.5 శాతంగా ఉండగా .. 2026 నాటికి 95 శాతానికి చేరుతుందని నివేదిక తెలిపింది. జనాభా పరిమాణం, మొబైల్ ఆధారిత ఇంటర్నెట్ వీడియోల వినియోగం.. ఓటీటీ మార్కెట్ వేగవంతంగా వృద్ధి చెందడానికి దోహదపడనున్నాయి. వార్తాపత్రికలు అప్..: 2021లో మొత్తం వార్తాపత్రికల ఆదాయం రూ. 26,378 కోట్లుగా ఉండగా, 2026 నాటికి 2.7 శాతం వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్) రూ. 29,945 కోట్లకు చేరనుంది. అప్పటికల్లా భారత న్యూస్‌పేపర్ మార్కెట్ .. ఫ్రాన్స్, బ్రిటన్ను కూడా దాటేసి అయిదో స్థానానికి ఎదుగుతుంది. ఈ వ్యవధిలో దినపత్రికల కాపీల విక్రయాల్లో (పరిమాణంపరంగా) వృద్ధి నమోదు చేసే ఏకైక దేశంగా భారత్ నిలవనుంది. ప్రింట్ ఎడిషన్ రీడర్‌షిప్‌లో 2025 నాటికి చైనాను దాటేసి అతి పెద్ద మార్కెట్‌గా నిలవనుంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► 2022లో రూ.35,270 కోట్లుగా ఉండనున్న టీవీ ప్రకటనల విభాగం 2026 నాటికి 23.52% వృద్ధితో రూ. 43,568 కోట్లకు చేరనుంది. ► అనేక సంవత్సరాల పాటు వేగంగా వృద్ధి చెందిన భారతీయ టీవీ అడ్వర్టైజింగ్ మార్కెట్.. 2020లో కోవిడ్–19 కారణంగా మందగమనం బారిన పడింది. దీంతో 2019తో పోలిస్తే 2020లో 10.8% క్షీణించింది. ఇది తాత్కాలిక అవరోధమే. 2021లో ఈ విభాగం 16.9% వృద్ధి చెంది రూ. 32,374 కోట్లకు చేరింది. ► దేశీ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ మార్కెట్ 2026 నాటికి 12.1% వార్షిక వృద్ధితో రూ. 28,234 కోట్లకు చేరనుంది. మొబైల్స్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఇంటర్నెట్ ప్రకటనల మార్కెట్ ఆదాయంలో గతేడాది ఈ విభాగం వాటా 60.1%గా ఉండగా.. 2026 నాటికి 69.3 శాతానికి చేరనుంది. ► వచ్చే నాలుగేళ్లలో వీడియో గేమ్స్, ఈ–స్పోర్ట్స్ విభాగం ఆదాయం 18.3 శాతం సీఏజీఆర్‌తో రూ. 37,535 కోట్లకు చేరవచ్చని అంచనా. ► దేశీ సినిమా పరిశ్రమ 2026 నాటికి రూ. 16,198 కోట్లకు చేరనుంది. -
చేతన రాజ్ మరణం.. అందం కోసం ఎంత మూల్యం చెల్లించాలి?
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది. ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి. కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం. ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క. మలయాళం పరిశ్రమ ఆదర్శం వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు. అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?.. - దివ్య స్పందన (రమ్య) కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
రూ.4 లక్షల కోట్లు: భవిష్యత్ అంతా ఎంటర్టైన్మెంటే!
న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే దేశీ మీడియా, వినోద (ఎంఈ) రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు చేరనుంది. అటు ప్రకటనకర్తలు, ఇటు వినియోగదారులు మీడియాపై చేసే వ్యయాలు ఇందుకు తోడ్పడనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఎంఈ రంగం వార్షిక ప్రాతిపదికన 10.75 శాతం మేర వృద్ధి చెందనుంది. 2025 నాటికి రూ. 4,12,656 కోట్లకు చేరనుంది. ‘కరోనా వైరస్ మహమ్మారికి కూడా భారత మీడియా, వినోద రంగం దీటుగా ఎదురునిల్చింది‘ అని కన్సల్టెన్సీ పార్ట్నర్ రాజీబ్ బసు తెలిపారు. టెక్నాలజీ పురోగతి, ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తుండటం తదితర అంశాలు.. ప్రజలు కంటెంట్‌ను వినియోగించే తీరుతెన్నులను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక భాషల్లోని కంటెంట్‌కు మరింతగా డిమాండ్ ఉంటుందని, వ్యాపార విధానాలు సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందని వివరించారు. విభాగాలవారీగా చూస్తే.. మహమ్మారిపరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ 2020లో టీవీ అడ్వర్టైజింగ్ రూ.35,015 కోట్లకు చేరింది. ఇది 7.6 శాతం మేర వృద్ధి చెందనుంది. 2025 నాటికి మొత్తం ఎంఈ రంగంలో సుమారు రూ.50,000 కోట్ల మేర దీని వాటా ఉండనుంది. ఇంటర్నెట్ మాధ్యమంలో ప్రకటనలు 2020-25 మధ్య 18.8 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రూ.30,000 కోట్లకు చేరనున్నాయి. 2020లో రూ.7,331 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ విభాగం 25.4 శాతం వృద్ధి రేటుతో 2025 నాటికి రూ. 22,350 కోట్లకు చేరుతుంది. న్యూస్‌పేపర్, కన్జ్యూమర్ మ్యాగజైన్ విభాగం మాత్రం స్వల్పంగా 1.82 శాతం స్థాయిలో మాత్రమే వృద్ధి చెందనుంది. 2025 నాటికి రూ. 26,299 కోట్లకు చేరనుంది. మహమ్మారి నేపథ్యంలో 2020లో ప్రింట్ అడ్వర్టైజింగ్ ఆదాయాలు 12 శాతం, ప్రింట్ సర్క్యులేషన్ ఆదాయం 4 శాతం మేర తగ్గాయి. మహమ్మారి ధాటికి కుదేలైన బాక్సాఫీస్ ఆదాయాలు మళ్లీ కోలుకుని 2025 నాటికి 39.3 శాతం వార్షిక వృద్ధితో రూ.13,857 కోట్లకు చేరవచ్చు. తీవ్రంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ 2023 మధ్య నాటికి.. తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకోవచ్చు. 2020లో మ్యూజిక్, రేడియో, పాడ్కాస్ట్ల మార్కెట్ ఆదాయాలు రూ.4,626 కోట్లకు పడిపోయాయి. లైవ్ మ్యూజిక్ విభాగం ఆదాయం సుమా రు రూ. 522 కోట్ల మేర క్షీణించింది. ఇది తిరిగి కోలుకుని 19.1 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2025 నాటికి రూ.11,026 కోట్లకు చేరనుంది. వీడియో గేమ్స్, ఈ-స్పోర్ట్స్ విభాగం ఆదాయాలు 2020లో రూ.11,250 కోట్లకు చేరగా .. 2025 నాటికి వార్షికంగా 16.5 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.24,213 కోట్లకు చేరవచ్చు. వివిధ ఇన్నోవేషషన్లు ఇందుకు దోహదపడతాయి. -
బాబోయ్ పైరసీ.. వేల కోట్లు ఉఫ్!
సాక్షి, న్యూఢిల్లీ: పైరసీ కారణంగా మీడియా, వినోద పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, ఏటా సగటున రూ.2,100 కోట్ల మేర పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పైరసీని కట్టడి చేయడం కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిందని, సినిమా హాళ్లలో పైరసీకి పాల్పడేవారికి భారీ జరిమానాలు విధించేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని ఎంపీలు సుకాంత మజుందార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం పైరసీ కట్టడికి కొన్ని సిఫార్సులు చేసిందని, వాటిని పరిశీలించి సినిమాటోగ్రఫీ బిల్లు –2021లో చేర్చుతామన్నారు. వీటితో పాటు కాపీరైట్ చట్టం–1957 ప్రకారం పైరసీపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా పైరసీకి పాల్పడితే ఐటీ యాక్ట్ –2000లోని సెక్షన్ 79 ద్వారా చర్యలు తీసుకోవచ్చని జవడేకర్ పేర్కొన్నారు. చదవండి: ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరో.. వీడియో వైరల్ హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు -
జియో ఫైబర్ సంచలనం : వారానికో కొత్త సినిమా
సాక్షి,ముంబై: బడా పారిశ్రామిక వేత్త, బిలియనీర్ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చలనచిత్ర, వినోద రంగానికి భారీ షాక్ ఇవ్వనున్నారు. తన రిలయన్స్ జియో ఫైబర్ నెట్వర్క్ సేవల్లో భాగమైన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఆఫర్లో 'వారానికి ఒక సినిమా' విడుదల చేయాలనే భారీ ప్రణాళికలో ఉన్నారు. జియో స్టూడియోస్ ఆధ్వర్యంలో సంవత్సరానికి 52 సినిమాలను నిర్మించి విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాన్‌ను రెండు, మూడేళ్లలో అమలు చేయాలని యోచిస్తోంది. ఒక్కో సినిమాకు సుమారు రూ .15-20 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఏడాది కనీసం 52 సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాం. ఇందుకు సొంత స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేసి, సినిమాను నిర్మించటం, ఇతర ప్రొడక్షన్ హౌస్‌లతో ఒప్పందాలు, మూడవ పార్టీల ద్వారా సినిమాలను కొనాలనుకుంటున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ కార్యాలయం ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే మీడియాకు తెలిపారు. ఎరోస్ ఇంటర్నేషనల్ మాజీ సీఈవోగా ఉన్న ఈమె గత ఏడాదే రిలయన్స్‌లో చేరారు. 6 నుంచి 11 భాషల్లో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాని ఆమె చెప్పారు. అంతేకాదు జియో స్టూడియోస్ ద్వారా మొత్తం 11 భాషలలో వెబ్ సిరీస్, మ్యూజిక్ లాంటి చిన్నపెద్దా కంటెంట్ ఉత్పత్తి చేస్తామన్నారు. దేశంలో మూవీ స్క్రీన్ల కొరత చాలా ఉందనీ జ్యోతి దేశ్పాండ్ వ్యాఖ్యానించారు. చైనాలో 35వేల స్క్రీన్లుంటే, ఇండియాలో కేవలం 2వేల మల్టీప్లెక్స్ లున్నాయని ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఆదాయం ఎలా పెరుగుతుందని ఆమె ప్రశ్నించారు. అందుకే తమ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ ద్వారా అత్యంత ఎక్కువమంది వినియోగదారులకు చేరువ కావాలని యోచిస్తున్నామని ఆమె చెప్పారు. తమ ప్రత్యేక వ్యూహాంతో నిర్మించిన చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. కాగా జియో స్టూడియోస్ నిర్మించిన స్త్రీ, లుకా చుప్పి చిత్రాలు విజయవంతమయ్యాయి. వీటిపై 15 కోట్ల రూపాయల పెట్టుబడికిగాను, 150 కోట్ల రూపాయలను వసూలు చేశాయి. చదవండి : జియో ఫైబర్ : జుట్టు పీక్కుంటున్న దిగ్గజాలు చదవండి : జియో ఫైబర్ : సంచలన ఆఫర్లు -
వినోద రంగంలో అంబానీ బ్రదర్స్ హవా
న్యూయార్క్: అంతర్జాతీయంగా వినోద రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న ప్రముఖుల్లో భారత్ నుంచి 12 మంది చోటు దక్కించుకున్నారు. ఇందులో అంబానీ సోదరులతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితరులు ఉన్నారు. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల వినోద రంగాన్ని ప్రభావితం చేస్తున్న 500 మంది ప్రముఖులతో వెరైటీ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించింది. దర్శకుడు కరణ్ జోహార్, స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, యశ్‌రాజ్ ఫిలిమ్స్ చైర్మన్ ఆదిత్య చోప్రా, బాలాజీ టెలీఫిలిమ్స్ జేఎండీ ఏక్తా కపూర్, జీ ఎంటర్టైన్మెంట్ సీఈవో పునీత్ గోయెంకా, ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ ఈ లిస్టులో ఉన్నారు. వాల్ట్‌డిస్నీ కంపెనీ చైర్మన్ రాబర్ట్ ఐగర్ ఇందులో అగ్రస్థానం దక్కించుకున్నారు. రిలయన్స్ జియో ద్వారా డిజిటల్ విభాగంలో ముకేశ్ అంబానీ 30 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నా రని వెరైటీ పేర్కొంది. అనిల్ అంబానీకి చెందిన అడాగ్ గ్రూప్ క్రమంగా మీడియా నుంచి తప్పుకుంటుండగా.. ముకేశ్ మాత్రం మరింత భారీగా కార్యకలాపాలు విస్తరిస్తున్నారని వివరించింది. -
వినోద పరిశ్రమ 12% వృద్ధి
న్యూఢిల్లీ: భారత మీడియా, వినోద పరిశ్రమ గతేడాది 12 శాతం వృద్ధితో రూ.92,800 కోట్లకు చేరిందని ఫిక్కి-కేపీఎంజీ నివేదిక పేర్కొంది. వివరాలు..., రకరకాల సవాళ్లు, చెప్పుకోదగ్గ మార్పులతో గత ఏడాది మీడియాకు అసాధారణ సంవత్సరంగా మిగిలింది. టీవీ, వార్తా పత్రికల ప్రకటనల ఆదాయంపై రూపాయి క్షీణత, ఆర్థిక వృద్ధి మందగమన తదితర అంశాలు తీవ్రంగానే ప్రభావం చూపాయి. 2013లో ప్రింట్ రంగం 8.5 శాతం చక్రీయ వృద్ధితో రూ. 24,300 కోట్లకు పెరిగింది. ఇక బ్రాడ్‌కాస్టింగ్, మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల చందా ఆదాయం, ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు ఆదాయం పెరిగి సమంజసమైన స్థాయిలకు రావడానికి 2-3 ఏళ్లు పడుతుంది. సమీప భవిష్యత్తులో మల్టీప్లెక్స్‌ల వృద్ధి మందగించవచ్చు. రిటైల్ రంగంలో మందగమనం, వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కుంటుపడడం వంటి కారణాల వల్ల బాక్స్ ఆఫీస్ వృద్ధిపై ప్రభావం చూపుతాయి.