entitlements
-
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి
మర్రిపాడు: అర్హులైన ప్రతిఒక్కరికీ సామాజిక పింఛన్లు ఇవ్వాల్సిందేనని నెల్లూరు లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. పింఛన్ల జాబితాల నుంచి అర్హులను తొలగిస్తే ఊరుకునేది లేదని, ఇప్పటికే ఎవరినైనా తొలగించి ఉంటే ఆ పేర్లను పునరుద్ధరించాలని ఆయన సూచించారు. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి, బూదవాడ గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లిలో ఆయన మాట్లాడుతూ 2015 నాటికి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామంలో పారిశుధ్యం నిర్మూలనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పాఠశాలలో బాలబాలిలకలకు మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలని సూచించారు. బడిఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను, ఎరువులను సక్రమంగా అందించాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య నిర్మూలనకు కృషి చేస్తామని, విద్యకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు గుర్తించి పరిష్కరిస్తామన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. స్టాల్స్ ప్రారంభించిన ఎంపీ : అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారంభించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సౌలభ్యంగా మందులు పంపిణీ చేయాలని కోరారు. ఎంపీపీ కటారి రమణయ్య, సర్పంచ్ కన్నపురెడ్డి అమర్నాథ్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నారపరెడ్డి ఈశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ నిర్మలాదేవి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ లీలాప్రకాష్, వ్యవసాయ అధికారి జహీర్, వైద్యాధికారి శ్రీనివాసులురెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి, ట్రాన్స్‌కో ఏఈ , పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం బూదవాడలో అర్హులైన పేదలకు పింఛన్లు అందజేశారు. ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి వర్షంలోనే వృద్ధులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పేదలు అందరికి పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముటుకుందు వసంత, ఎంపీటీసీ సభ్యులు ఆళ్ల రమణయ్య, స్థానిక వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు ముటుకుందు లక్ష్మీరెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విలపింఛెన్
‘5 రెట్లు ఎక్కువ అంటూ ఆర్భాటపు ప్రకటనలిస్తున్నారు.. అర్హులైన పింఛన్ లబ్ధిదారులను నిలువునా ముంచుతున్నారు.. కొన్ని చోట్ల గ్రామ కమిటీలు ఓకే చేసినా.. మండల, జిల్లా కమిటీలు పింఛన్లలో కోత విధించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు తీరని వేదన కలిగిస్తున్నాయి.. అతి చిన్న కారణాలతో కొన్ని చోట్ల, ఎలాంటి కారణాలు లేకుండానే మరికొన్ని చోట్ల నిర్ధాక్షిణ్యంగా పింఛన్లను తప్పించార’ంటూ వివిధ పార్టీల నేతలు నిప్పులు చెరిగారు. అనంతపురం రూర ల్ : అర్హులైన వారికి పింఛన్ రద్దు చేయడంపై వృద్ధులు, వితంతువులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం రూరల్ మండలం కందుకూరు, అక్కంపల్లి గ్రామాలకు చెందిన 200 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆపసోపాలు పడుతూ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అర్హులైన తమకు పింఛన్లు రద్దు చేసి పొట్టకొట్టవద్దని అధికారులను వేడుకున్నారు. ఐదెకరాల పొలం ఉందని, ఆధార్ నంబర్ లేదని, వయసు తక్కువగా నమోదైందని తదితర కారణాలతో చాలా మందికి పింఛన్‌ను రద్దు చేశారు. పింఛన్‌పై ఆధారపడి ఇంతకాలం జీవితాన్ని నెట్టుకొచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు జాబితాలో తమ పేర్లు లేకపోయే సరికి గుండె ఆగినంత పనైంది. రూ.200 పింఛన్ రూ.1000, రూ.1500కు పెరుగుతోందని సంతోషడిన వారు పింఛన్లు రద్దయ్యాయని తెలిసి ఆందోళనకు గురయ్యారు. శరీరం సహకరించకపోయినా ఆయాస పడుతూనే అతికష్టం మీద మెట్లు ఎక్కుతూ అధికారుల కోసం వెదికారు. వారికి తమ గోడు చెప్పుకుని పింఛన్‌ను పునరుద్ధరించేలా చూడాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లల ఆదరణకు నోచుకోని తమకు పింఛన్ రద్దు చేస్తే ఎలా బతకాలయ్యా అంటూ విలపించారు. వీరి ఆందోళనకు సీపీఐ, సీపీఐ, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు శివారెడ్డి, సూర్యనారాయణ, వెంకట్రాముడు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐకి చెందిన సర్పంచ్ నాగలక్ష్మి, నేతలు రామకృష్ణ, గోవింద్‌రెడ్డి, టీడీపీ నేతలు శంకర్‌రెడ్డి, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు. కణితి తొలగింపు గుత్తి : తొలిసారిగా గుత్తిలో శస్త్రచికిత్స ద్వారా 70 ఏళ్ల వృద్ధురాలికి బ్రెస్ట్ క్యాన్సర్ కణితిని తొలగించారు. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన అనంతపురం మెడికల్ కళాశాల ప్రొఫెసర్ ఆఫ్ సర్జర్ ఆర్.నారాయణ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గుత్తి మండలం పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన సుంకమ్మ ఐదేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుండేది. హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, బళ్లారి ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంది. ఆపరేషన్‌కు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. నిరుపేదరాలైన ఈమెకు నలుగురు కొడుకులున్నప్పటికీ వారి వద్ద మందులు కొనడానికి కూడా డ బ్బు లేదు. మందులు వాడకపోవడంతో వ్యాధి తీవ్రమైంది. ఈ క్రమంలో ఆమె 15 రోజుల క్రితం గుత్తిలోని ఉజ్వల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చింది. అత్యవసరంగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణహాని ఉందని చెప్పారు. అష్టకష్టాలుపడి పాతిక వేలు సమకూర్చుకుని రెండు రోజుల తర్వాత ఆస్పత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకుంది. డాక్టర్ ఆర్.నారాయణను ఆస్పత్రి యాజమాన్యం బాలరాజు, కుష్బూలు అభినందించారు.