గురవాంలో పేలుడు..ఇద్దరి మృతి
- ఆరుగురికి తీవ్రగాయాలు
రాజాం(శ్రీకాకుళం జిల్లా)
రాజాం మండలం గురవాం గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం పేలుడు సంభవించింది. అక్రమంగా బాణసంచా తయారీ చేస్తున్న పాలవలస శ్రీను అనే వ్యక్తి ఇంటిలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరి శవం మాత్రమే కనపడుతోంది. మరొకరి శవం శిథిలాల కింద ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడిన పాలవలస శ్రీను, పాలవ లస లావణ్య, గేదెల ఈశ్వరరావు, గేదెల దుర్గమ్మ, గేదెల గోవిందమ్మ , ఈగల ప్రసన్న కుమార్లను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.