Etcherla
-
జనసంద్రమైన ఎచ్చెర్ల..!
-
TDP: రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరిక.. ఉలిక్కిపడ్డ కళా..
తెలుగుదేశం జమానాలో జన్మభూమి కమిటీల పెత్తనాలు.. ఆ ముసుగులో వారి ఆగడాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు సైతం జన్మభూమి కమిటీ నేతలమంటూ జనంపై స్వారీ చేసేవారు. పథకాలు కావాలంటే ముడుపులు కట్టాల్సిందేనంటూ విచ్చలవిడిగా వసూళ్లకు తెగబడేవారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాజీమంత్రి కళా వెంకటరావు బంధువు ఒకాయన కూడా రాబంధువులా మారి జనాలను పీక్కు తిన్నాడు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆవులు, గేదెలు, ఇళ్లు ఇప్పిస్తామంటూ వేలకు వేలు వసూలు చేశాడు. అలాగని పథకాలు మంజూరు చేయించలేదు.. దండుకున్న డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. దీనిపై అప్పట్లోనే బాధితులు నిలదీసినా అధికార మదంతో అణచి వేశారు. మూడేళ్ల తర్వాత కూడా తమ డబ్బులు రాకపోవడంతో బాధితులంతా మూకుమ్మడిగా కళా వారి నివాసానికి వెళ్లి నిలదీశారు. రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరించారు. దాంతో ఉలిక్కిపడిన కళా కుటుంబీకులు కొందరికి చెల్లింపులు జరిపారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల వ్యవహారాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బంధువు పంచాయితీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అధికారంలో ఉన్నప్పుడు అందరి వద్ద డబ్బులు తీసుకుని, ఆ తర్వాత ముఖం చాటేయడం పంచాయితీ కళా వద్దకు చేరడంతో కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఇదే చర్చ నడుస్తోంది. తెలిసిన బాగోతమే టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పెత్తనం అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యుల ముసుగులో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. ప్రజలకు ఏం కావాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి. సంక్షేమ పథకాలు అందాలంటే చేతులు తడపాల్సి వచ్చేది. ప్రతి పథకానికి ఒక రేటు పెట్టి వసూళ్ల దందా చేశారు. ఇక, నాడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టిన నాయకుల బంధువులు, అనుచరులైతే మరింత రెచ్చిపోయారు. అయిన దానికి కాని దానికి ప్రజలను పీడించేశారు. కొన్ని పథకాలు మంజూరు చేస్తామంటూ డబ్బులు తీసుకుని చేతులేత్తేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఘటనలు ఇప్పుడు టీడీపీలో రచ్చ చేస్తున్నాయి. ఆ పార్టీలో గొడవకు దారితీస్తున్నాయి. పథకాల కోసం వసూళ్లు జి.సిగడాం మండలం నిద్దాం, అద్వానంపేట గ్రామాల్లో తెలుగు దేశం ప్రభుత్వం హయంలో ఆవులు, గేదెలు రాయితీపై మంజూరు చేస్తామని 40 మంది లబ్ధిదారుల నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బంధువు అధిక మొత్తంలో వసూళ్లు చేశారు. ఆ గ్రామంలో జన్మభూమి కమిటీ నాయకుడిగా పెత్తనం చెలాయిస్తూ పథకాల పేరుతో భారీ మొత్తంలో లబ్ధిదారుల నుంచి తీసుకున్నారు. ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి వసూళ్లకు తెగబడ్డారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.20వేలు వరకు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, వారికి న్యాయం చేయలేదు. చెప్పినట్టుగా ఆవులు, గేదెలు, ఇళ్లు మంజూరు చేయించలేదు. అలాగని తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. ఇదే విషయమై టీడీపీ హయాంలో జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామసభలో కూడా అప్పట్లో కొందరు నిలదీశారు. ఇదిగో అదిగో అంటూ తాత్సారం చేస్తూ వచ్చారే తప్ప టీడీపీ ప్రభుత్వం దిగిపోయేవరకు వాపసు చేయలేదు. కళా వద్దకు చేరిన పంచాయితీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినా కూడా వారిలో స్పందన లేదు. దీంతో బాధితులంతా ఏకమై మాజీ మంత్రి కళా వెంకటరావు నివాసం ఉంటున్న రాజాం వెళ్లి గట్టిగా నిలదీశారు. పథకాల కోసం తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోతే రోడ్డెక్కుతామని, అవసరమైతే మీడియాకు తెలియపరుస్తామని కళా ముందే హెచ్చరించారు. దీంతో కళాతో పాటు ఆయన బంధువు ఉలిక్కి పడ్డారు. ఇది కాస్త వివాదంగా మారింది. మీడియా ప్రతినిధులకు, నియోజకవర్గ టీడీపీ కేడర్‌కు ఇదంతా తెలిసింది. చెప్పాలంటే దావానంలా వ్యాపించింది. దీంతో గుట్టుగా యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు తగ్గేంచేసి కొంతమందికి చెల్లింపులు చేశారు. మరికొంతమందికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ తంతు ఇప్పుడు జి.సిగడాం మండలంలోనే కాకుండా ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే హాట్ టాపిక్ అయింది. -
విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ పాటికి ఆ అమ్మాయి నవ్వుతూ ఇంటిలో ఉండేది. ఒక్క రోజు గడిస్తే చక్కగా కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని ఉండేది. కానీ ఆ విద్యార్థిని సంయమనం చూపలేకపోయింది. తెలివితేటలతో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థిని తన మనసుకు మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పుకోలేకపోయింది. ఒక్క పరీక్షతో జీవితం ఆగిపోదన్న నిజాన్ని అర్థం చేసుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆశలు పెట్టుకున్న అమ్మానాన్నలకు క్షమాపణలు చెబుతూ బలవంతంగా ఊపిరి ఆపుకుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో ఏడాది చదువుతున్న భవిరి విశిష్ట రోషిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): ‘అమ్మా..నాన్నా.. క్షమించండి. మీ అంచనాలు, ఆశలు అందుకోలేకపోతున్నాను. పరీక్ష మెరుగ్గా రాయలేకపోతున్నాను. తమ్ముడిని బాగా చదివించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ) ఎస్ఎం పురం క్యాంపస్ విద్యార్థిని భవిరి విశిష్ట రోషిణి (17) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని క్యాంపస్‌లో ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం రెండో ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం చివరి పరీక్ష ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగ్జామ్ జరిగింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అయితే ఈ విద్యార్థిని 11 గంటలకే పరీక్ష ముగించేసి వసతి గృహంలోని తన గదికి వచ్చేసింది. పరీక్ష సరిగా రాయలేకపోయాననే భావనతో సూసైడ్ నోట్ రాసి బ్లాక్ 1లో ఉన్న తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. మిగతా విద్యార్థులు పరీక్ష పూర్తి చేసుకు ని వచ్చే సరికి రోషిణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వారు భయపడి కేర్ టేకర్ జి.జయలక్ష్మికి చెప్పగా.. ఆమె అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనకు చేరుకున్న పరిపాలన అధికారి రమేష్‌నాయుడు, అధ్యాపకులు విద్యార్థినిని కిందకు దించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అయితే విద్యార్థిని మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ టి.సత్యనారాయణ విద్యార్థిని ఫోన్‌తో పా టు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ వచ్చి సాక్ష్యాలు సేకరించింది. చదువు ఒత్తిడి కారణంగానే విద్యార్థిని క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలివైన విద్యార్థిని.. రోషిణి చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిని. పీయూసీ మొదటి ఏడాది, రెండో ఏడాది మొదటి సెమిస్టర్‌లోనూ 9.3 క్రెడిట్స్ సాధించి మంచి స్థానంలో ఉంది. చివరి పరీక్షకు సైతం శ్రమించి చదివి సన్నద్ధమైంది. అనుకున్న రీతిలో పరీక్ష రాయలేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యింది. కోవిడ్ నేపథ్యంలో 10వ తరగతి పాస్ అయినా ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ప్రారంభంలో మొదటి కౌన్సెలింగ్‌లో న్యూజివీడు క్యాంపస్ ఎంచుకుంది. సాలూరు శ్రీకాకుళానికి దగ్గర కావటంతో రెండో కౌన్సెలింగ్‌లో శ్రీకాకుళం క్యాంపస్ ఎంచుకుంది. తల్లిదండ్రులు సైతం తరచూ వచ్చి కలుస్తుండేవారు. నేడు బర్త్‌డే.. గురువారం రోషిణి పుట్టిన రోజు. సెమిస్టర్ పరీక్షలు బుధవారం ముగియటంతో విశ్రాంతి కోసం మూడు రోజులు ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి గురువారం జన్మదినం జరుపుకోవాలనుకుంది. 18వ ఏటలోకి అడుగు పెట్టాల్సిన విద్యార్థిని ఏకంగా లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. ఇది రెండో ఘటన.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఏడు నెలల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. విజయనగరం జిల్లా నెల్లిమెర్లకు చెందిన పీయూసీ మొదటి సంవత్స రం విద్యార్థిని కొండపల్లి మనీషా అంజు ఫిబ్రవరి 16న ఆత్మహత్యకు పాల్పడింది. విద్యాసంస్థలో చేరిన కొన్ని రోజులకే ఇంటిపై బెంగ (హోం సిక్‌తో) విద్యార్థిని మృతి చెందగా, ప్రస్తుతం విశిష్ట రోషిణి చదువు ఒత్తిడి కారణంగా చనిపోయింది. కన్నీరుమున్నీరు.. విశిష్ట రోషిణిది మన్యం జిల్లా సాలూరు పట్టణం తట్టికోట వీధి. తండ్రి బ్యాంకులో బంగారు నగల నిర్ధారణ పనిచేస్తుంటారు. తల్లి సౌజన్య గృహిణి. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కుమార్తె మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు శ్రీకాకుళం రిమ్స్‌కు చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇక క్యాంపస్‌లో విద్యార్థులు ఈ ఘటనతో హడలిపోతున్నారు. పరీక్షలు ముగియటం, మూడు రోజులు ఇళ్లకు వెళ్లే అవకాశం ఇవ్వటంతో తల్లిదండ్రులకు స మాచారం ఇచ్చి దగ్గరలో ఉన్నవారు ఇళ్లకు వెళుతున్నారు. మరోపక్క క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
తాళికట్టి రోజు గడవక ముందే.. నవ్వును దూరం చేసి దుఃఖాన్ని మిగిల్చి
ఆ పెళ్లిని మృత్యువు వెక్కిరించింది. కలకాలం కలిసి ఉంటామని బాసలు చేసుకున్న కొత్త జంటను కర్కశంగా విడదీసింది. పసుపు కుంకుమలను రక్తంతో తుడిచేసింది. తాళి కట్టి ఒక్కరోజైనా గడవక ముందే వరుడి ప్రాణాలను మింగేసింది. పెళ్లి ఆనందంలో ఉన్న రెండు కుటుంబాలకు నవ్వును దూరం చేసి దుఖాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి సింహాచలంలో వివాహం చేసుకున్న జమ్మాన పవన్‌కుమార్ (20) శనివారం మధ్యాహ్నానికి అరిణాం అక్కివలస వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎచ్చెర్ల క్యాంపస్/ఎల్ఎన్ పేట: అరిణాం అక్కి వలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్ఎన్ పేట మండలం పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన జమ్మా న పవన్‌కుమార్ మృతి చెందాడు. అతడి మేన మామ బలగ సోమేశ్వరరావు గాయపడ్డారు. పవన్ కుమార్ విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి శుక్రవారం రాత్రి సింహాచలంలో ఇదే మండలం శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీకి చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం చేసుకున్న వీరు స్వగ్రామంలో వారం రోజులు ఉందామని సింహాచలం నుంచి శనివారం బయల్దేరారు. చదవండి: (పెళ్లయిన ఐదు రోజులకే.. మామ చేతిలో అల్లుడి దారుణ హత్య) పెళ్లి జనమంతా బస్సులో రాగా.. పవన్ మాత్రం తన మేనమామతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. ఎచ్చెర్ల మండలం అరిణాం–అక్కివలస ప్రాంతానికి వచ్చే సరికి వీరి బండిని వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సోమేశ్వరరావుకు గా యాలయ్యాయి. వెనుక వస్తున్న మరో లారీ డ్రై వర్ 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరించారు. ఎ చ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. రెండు గ్రామాల్లో విషాదం పవన్ మృతి చెందాడన్న వార్త తెలిసి అతడి స్వ గ్రామం పెద్దకొల్లివలస పునరావస కాలనీలో ను, వధువు ఊరు శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీలోను విషాదం అలముకుంది. ఒక్క రోజులో నే ఎంత ఘోరం జరిగిందని చర్చించుకున్నారు. -
ఆ బెంగతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ప్రతిభావంతురాలైన ఓ విద్యార్థిని ప్రయాణం అర్ధంతరంగా ఆగిపోయింది. పోటీ పరీక్షల్లో సత్తా చాటిన అమ్మాయి జీవితంలో మాత్రం ఆ తెగువ,తెలివి చూపలేకపోయింది. ఇంటిపై బెంగ పెట్టుకుని ఏకంగా ప్రాణాలే తీసుకుంది. ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేక, వెంటాడుతున్న మనోవ్యధను భరించలేక, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో పాలుపోక బంగారు భవిష్యత్తు ఉన్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) ఎస్ఎం పురం క్యాంపస్‌లో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న కొండపల్లి మనీష అంజు(16) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల. అనారోగ్యం అని చెప్పి.. ఈ ఏడాది టెన్త్ క్లాస్‌లో కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేసేశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు పోటీ పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన మనీష అంజు శ్రీకాకుళం క్యాంపస్‌లో సీటు సంపాదించింది. ఈమెకు కాలేజీ హాస్టల్లోని ఎస్–4 గదిని మరో ఇద్దరు విద్యార్థినులు అక్షిత, యమునలతో కలిపి కేటాయించారు. యమున ఇంకా రిపోర్ట్ చేయలేదు. అక్షిత మాత్రం ఇదే గదిలో ఉంటూ బుధవారం క్లాసుకు వెళ్లిపోయింది. మనీష తనకు ఆరోగ్యం బాగోలేదని, విశ్రాంతి తీసుకుంటానని కేర్‌టేకర్‌కు చెప్పి ఆమె గదిలోకి వెళ్లిపోయింది. ఉదయం అంతా క్లాసులకు వెళ్లిపోయాక 10.30 గంటల ప్రాంతంలో గదిలోని ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (13 మంది విద్యార్థినులపై అత్యాచారం.. టీచర్‌కు..) మధ్యాహ్నం తోటి విద్యార్థినులు ఆమెను భోజనానికి పిలవడానికి గది వద్దకు వచ్చారు. తలుపులు కొట్టగా ఎవరూ తీయలేదు. దీంతో వారు కేర్ టేకర్‌కు సమాచారం అందించారు. అనంతరం తలుపులు బద్దలుగొట్టి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ మనీష కనిపించింది. దీంతో కేర్ టేకర్ కంగారు పడి డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు, పరిపాలన అధికారి కె.మోహన్‌కృష్ణ చౌదరిలకు సమాచారం చేరవేశారు. తర్వాత మనీషను కిందకు దించి అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు ఎచ్చెర్ల పోలీసులకు, విద్యార్థిని తల్లిదండ్రులు సూరిబాబు, కరుణకుమారిలకు సమాచారం చేరవేశారు. ఎచ్చెర్ల ఎస్ఐ కె.రాము ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు విచారణ నిర్వహించి, ఆధారాలు సేకరించారు. తోటి విద్యార్థినులను విచారించారు. ఇంటిపై బెంగ పెట్టుకుందా..? మనీష అంజు చురుకైన విద్యార్థిని. ప్రాథమిక విద్యలో మంచి ప్రతిభ కనబరిచి ట్రిపుల్ ఐటీకి ఎంపికైంది. ఇక్కడ పీయూసీ మొదటి ఏడాది, మొదటి సెమిస్టర్ క్లాస్ వర్క్ సంక్రాంతి పండగ ముందు 15 రోజులు నిర్వహించారు. అనంతరం కరోనా నేపథ్యంలో విద్యాసంస్థకు సెలవులు ప్రకటించారు. మొదటి ఏడాది విద్యార్థులకు క్యాంపస్ అలవాటు చేసేందు ఆఫ్‌లైన్ క్లాస్‌వర్క్‌ను ఈ నెల 14న ప్రారంభించారు. ఈమె రెండు రోజుల పాటు క్లాస్‌కు హాజరైంది. కానీ ఇక్కడ తనకు నచ్చడం లేదని, ఇల్లు గుర్తుకు వస్తోందని తోటి వారితో తరచూ చెప్పేది. తల్లిదండ్రులతో రోజూ మాట్లాడేది. రెండు రోజుల కింద తల్లి స్వయంగా వచ్చి ఆమెను క్యాంపస్‌లో దించి వెళ్లారు. సంక్రాంతి ముందు కూడా ఆమె తండ్రి 15 రోజుల్లో రెండుసార్లు వచ్చి చూశారు. విద్యార్థిని ఇంటికి వెళ్లినప్పుడు కూడా తాను కాలేజీకి వెళ్లనని చెప్పినట్లు సమాచారం. తల్లిదండ్రులను విడిచి ఇక్కడ ఉండలేకే విద్యార్థి ఇలా చేసుకుందని తోటివారు భావిస్తున్నారు. ఈ క్యాంపస్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. కూతురు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే..
పరీక్ష బాగా రాయలేకపోయానన్న బాధ, తప్పు చేశానేమో అన్న అపరాధ భావం, టీచర్ మందలించారనే ఆవేదన.. కలగలిపి ఆ విద్యార్థి ఆలోచనలకు అడ్డుకట్ట వేసేశాయి. ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించలేని స్థితికి నెట్టేశాయి. బంగారు భవిష్యత్ ఉన్న ఆ యువకుడిని బలవన్మరణానికి ఉసిగొల్పాయి. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి మంగళవారం పాఠశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశానికి గురై తల్లిదండ్రులకు విషాదం మిగిల్చాడు. ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ఎస్ఎంపురం ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొంచాడ వంశీ మంగళవారం పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. బడిలోని 9వ తరగతి గదిలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో విద్యార్థి ఫ్యాన్‌కు తాడు కట్టి ఉరి వేసుకోగా.. నైట్ వాచ్మెన్ అప్పారావు ఉద యం 5 గంటలకు చూసి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించారు. ప్రిన్సిపాల్ కిమిడి జగన్మోహన్రావు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జేఆర్ పురం సీఐ సీహెచ్ స్వామినాయుడు, ఎచ్చెర్ల ఇన్చార్జి ఎస్ఐ బాలరాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిది సంతకవిటి మండటం మిర్తివలస గ్రామం. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కొంచాడ సింహాద్రి, రమణమ్మ, బంధువులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు పాఠశాలను రక్షణలోకి తీసుకున్నారు. టీచర్ మందలించారని.. తోటి విద్యార్థుల కథనం మేరకు.. విద్యార్థులకు మరికొద్ది రోజుల్లో సమ్మెటివ్–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అందుకు సన్నాహకంగా పాఠశాలలో సోమవారం 25 మార్కులకు హిందీ పరీక్ష నిర్వహించగా.. వంశీ బాగా రాయలేకపోయాడు. మార్కులు తక్కువ వస్తాయేమో అన్న భయంతో అదే ప్రశ్న పత్రం ఆధారంగా మరో జవాబు పత్రం రాసి అసలు ఆన్సర్ షీట్ స్థానంలో దీన్ని పెట్టేందుకు ప్రయత్నించాడు. ఇది హిందీ టీచర్‌కు తెలియడంతో విద్యార్థిని మందలించారు. ప్రిన్సిపాల్ వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పారు. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) అయితే ప్రిన్సిపాల్ దీనిపై స్పందిస్తూ.. ఇది సాధారణ పరీక్షేనని, మార్కులు తక్కువ వస్తే ఏమీ కాదని, ఇలా చేయడం తప్పని హితవు పలికారు. కానీ టీచర్ల మందలింపుతో విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సో మవారం రాత్రి రెండుమూడు సార్లు బాత్రూమ్కు వెళ్లే ప్రయత్నంగా చేయగా నైట్‌వాచ్‌మెన్ ప్రశ్నించడంతో మళ్లీ డార్మిటరీకి వెళ్లిపోయాడు. వేకువజామున 4 గంటలకు ఎవ్వరూ లేని సమయంలో 9వ తరగతి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ కొట్టాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. మందలించారని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఇద్దరు కుమారులు ఈ పాఠశాలలోనే... సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన కొంచాడ సింహాద్రి, రమణమ్మలకు ఇ ద్దరు కుమారులు. వంశీ 10వ తరగతి చదువుతుండగా, అతని తమ్ముడు కిరణ్ ఇక్కడే 9వ త రగతి చదువుతున్నాడు. వంశీ మంచి విద్యార్థి కూడా. ఉపాధ్యాయులతోనూ మంచి సత్సంబంధాలూ ఉన్నాయి. వీరిద్దరూ 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందారు. చక్కగా చదువుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా ఇలా దూరమైపోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. గ్రామస్తులు కూడా వంశీ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: (మొదటి భార్య నాలుగో కూతురు.. రెండో భార్య కొడుకు మధ్య ప్రేమ..) పోలీసుల విచారణ.. పోలీసులు ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయుల ను విచారిస్తున్నారు. ప్రాథమికంగా కావాల్సిన ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. -
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’ విహీనమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు డు కళా వెంకటరావు నాయకత్వాన్ని అక్కడి టీడీ పీ శ్రేణులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. తన మాట మాత్రమే వినాలనే కళా వైఖరిని ఎండగడుతున్నాయి. తనతో కలిసి పనిచేయకపోతే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తానని కళా బెదిరిస్తుంటే.. మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇక్కడేం చేయగలరని బాహాటంగానే బదులిస్తున్నాయి. దీంతో కళా వెంకటరావు పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ఇప్పటికే ఆయనను కాదని బయటకు వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు స్వతంత్రంగా పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ నియోజకవర్గంలో కళాకు ప్రత్యామ్నాయంగా మారుతున్నారు. అసంతృప్త నేతలు, కార్యకర్తలంతా ఇప్పుడు కలిశెట్టితో కలుస్తున్నారు. కలిశెట్టి నాయకత్వ పటిమను పక్కన పెడితే.. కళా కంటే మేలేనని కా ర్యకర్తలు భావిస్తున్నారు. కలిశెట్టిని పార్టీ నుంచి రెండుసార్లు సస్పెండ్ చేయిస్తే డోంట్‌కేర్ అంటూ పార్టీ జెండాతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. బుజ్జగింపు.. బెదిరింపు పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతుండడంతో కళా అండ్‌కో పార్టీ శ్రేణులను దారికి తెచ్చుకు నే ప్రయత్నం చేస్తోంది. కలిశెట్టి వెనుక తిరుగుతున్న వారిని బుజ్జగించే పనిలో ఉంది. కలిశెట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాదని తమతోనే పనిచేయాలని కళా కోరుతున్నారు. అయితే ఈ రా య‘బేరాలకు’ ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణు లు తలొగ్గడం లేదు. కళా నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఫోన్ లోనే నేరుగా చెప్పేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందనతో అవాక్కవుతు న్న కళా అండ్‌కో చివరికి బెదిరింపులకు దిగుతున్నారు. కళా పోటీలో లేకుంటే ఆయన కుమారు డు పోటీ చేస్తాడని, కాదూ కూడదంటే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తారని కేడర్‌కు బెదిరింపుల సంకేతాలు పంపిస్తున్నారు. కానీ ఆ బెదిరింపులకు కూడా ఎవరూ లొంగడం లేదు. లోకేష్ ఇ క్కడికొస్తే అవమానం తప్ప ఏమీ ఉండదని, స్థా నికుడే నాయకుడిగా ఉండాలని «ధీటుగా జవాబు ఇచ్చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఎచ్చెర్లలో బయట నుంచి ఏ నాయకుడొచ్చి నాయకత్వం వహించినా టీడీపీ శ్రేణులు తరిమికొట్టేలా ఉన్నాయి. ఇవీ చదవండి: ‘రోడ్డు’ మ్యాప్ రెడీ కోటి రూపాయలను తలదన్నే కథ -
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రాజుకుంటున్నాయి. భవిష్యత్‌లో తనకు ప్రతిబంధకంగా త యారవుతున్న నాయకులను సాగనంపే పనిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. తనకు పోటీగా తయారవుతున్న నాయకులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్ టీడీపీ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయగా, నేడు టీడీపీ ఉత్తరాంధ్ర కార్యకర్తల శిక్షణ శిబిరం డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడును సస్పెండ్ చేస్తున్న ట్టు కళా వెంకటరావు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి కళా వెంకటరావుకు నియోజకవర్గంలో అసమ్మతి పోరు ఎక్కువైంది. ముఖ్యంగా కళా కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును నియోజకవర్గంపై వదలడం, రాష్ట్ర స్థాయి పదవి అప్పగించడంతో కళాపై కినుకు ఎక్కువైంది. అసలే వలస నేత, ఆపై ఆయన కుటుంబ సభ్యులు తమపై పెత్తనం చేయడమేంటని ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది. దీంతో కళా అలెర్ట్ అయ్యారు. వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలు, పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులపై దృష్టి సారించారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును ఏకపక్షంగా సస్పెండ్ చేయగా, నేడు నియోజకవర్గంలో కీలకమైన కలిశెట్టి అప్పలనాయుడుపైనా అదే వేటు పడింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు కళాకు ఆ అధికారం ఎక్కడిదని, ఏ ఆదేశాలైనా పార్టీ నుంచి రావాలని ఆయన్ని వ్యతిరేకిస్తున్న నాయకులంతా ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో దోస్తీ.. ఒక వైపు కళా వెంకటరావు సోదరుడు కుటుంబీకులంతా ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారు. సోము వీర్రాజు తదితర నేతలతో మంతనాలు జరిపారు. మే నెలలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదంతా ఎప్పటికప్పుడు కళా వ్యతిరేక వర్గీయులు బయటపెడుతున్నారు. ఏ రోజుకైనా కళా వెంకటరావు బీజేపీలో చేరడం ఖాయమని కూడా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో తనకు వ్యతిరేకంగా నడుస్తున్న నాయకులపై వరుసగా సస్పెన్షన్ వేటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ఉండాలంటే అసమ్మతి నేతలందరినీ బయటికి పంపించాలనే షరతుతో అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తమపై వేటు వేస్తున్నారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం అక్రమాలకు పాల్పడి, పార్టీని అప్రతిష్ట పాలుజేసి, ఇప్పుడు కష్టపడ్డ సీనియర్లను పార్టీ నుంచి దూరం చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆ పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆ ఇద్దరికీ పదవీ గండం? ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను -
దయ లేని విధి
ఆ చిట్టితండ్రి కన్ను తెరిచి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే ఆ కళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. పలుకు నేర్చుకుని ఏడాదైనా నిండలేదు. అప్పుడే ఆ గొంతు మూగబోయింది. తప్పటడుగులు వేయడం ఇంకా ఆపనేలేదు. బతుకే ముగిసిపోయింది. ఒక్క నిమిషం.. ఒకే ఒక్క నిమిషం వేచి ఉంటే ఆ పిల్లాడు అమ్మ దగ్గర ఆడుకునేవాడేమో. ఆ ఒక్క నిమిషం గాభరా పడకుండా ఉంటే ఈ పాటికి నాన్న మెడపై చేతులు వేస్తూ అల్లరి చేస్తుండేవాడేమో. దయ లేని విధి ఆ కనికరం చూపలేకపోయింది. అమ్మానాన్నలతో సరదాగా బైక్‌పై వెళ్తున్న బాలుడిని కాటికి పంపి తన వికృత రూపం చూపింది. సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు హిమశంకర్ కన్నుమూశాడు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు గాయాలతో బయటపడగా.. వారికి శోకాన్ని మిగుల్చు తూ ఈ బుజ్జాయి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాదకర దృశ్యాన్ని చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. పొందూరు మండలం మజ్జిలపేట గ్రామానికి చెందిన తమిరి శ్రీను, భువనేశ్వరి దంపతులు తమ కుమారుడు హిమశంకర్‌ను తీసుకుని శ్రీకాకుళం పట్టణంలోని బలగకు వచ్చారు. బలగలోని భువనేశ్వరి కన్నవారింటి వద్ద హిమశంకర్ చక్కగా ఆడుకున్నాడు. వీరు పొందూరు నుంచి వచ్చేటప్పుడు కింతలి, కనిమెట్ట మార్గం గుండా వచ్చారు. తిరుగు ప్రయాణంలోనూ ఇదే దారిలో వెళ్లాలి. అయితే పొందూరు మండలం లోలుగులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ నుంచి రాపాకపై నుంచి మజ్జిలపేట వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ మార్పే బాలుడి మరణానికి కారణమైందేమో. బంధువుల ఇంటికి వెళ్లేందుకు శ్రీకాకుళం నుంచి జాతీయ రహదారిపై చిలకపాలెం వరకు వచ్చిన వీరు.. ఆ కూడలి వద్ద ఆర్అండ్బీ రోడ్డుకు యూటర్న్ చేస్తుండగా.. అటుగా వస్తున్న లారీ అకశ్మాత్తుగా బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. తల్లి ఒడిలో కూర్చుని ఉన్న బాలుడు తుళ్లిపడిపోవడంతో తలకు బలంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. భువనేశ్వరి కాళ్లకు గాయాలు కాగా, శ్రీను చిన్న గాయాలతో బయటపడ్డాడు. హెల్మెట్ పెట్టుకోవడంతో ఈ యనకు ఏమీ కాలేదు. ఆ ఒక్క నిమిషం పాటు లారీడ్రైవర్ గానీ, శ్రీను గానీ ఎవరు వేచి ఉన్నా ఈ ప్రమాదం జరగకుండా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదటి సంతానం.. శ్రీను, భువనేశ్వరి దంపతులకు హిమశంకర్ మొదటి సంతానం. దీంతో గారాబంగా పెంచారు. వృత్తి రీత్యా వీరు బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. కళ్లెదుటే కన్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ దృశ్యాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. 108లో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిం చారు. ఎచ్చెర్ల ఎస్ఐ రాజేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కూడలిలో నిలిచిపోయిన ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. గ్రామానికి చెందిన బాలుడు చనిపోవడంతో మజ్జిలిపేట అంతా విషాదంలో మునిగిపోయింది. -
ఏటీఎంనే ఎత్తుకెళ్లిన దుండగులు
సాక్షి, శ్రీకాకుళం : నగరాలు, పట్టణాల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు గ్రామీణ ప్రాంతాల వైపు కన్నేశారు. ఇది వరకూ ఏటీఎం సెంటర్లో అమాయకులను ఏమార్చి నగదు దోచుకున్న వీరు ఇప్పుడు ఏకంగా ఏటీఎంలను ఎత్తుకుపోతున్నారు. ఇటీవల కొత్తూరులో ఘటన మరవకముందే తాజాగా ఎచ్చెర్ల ఆర్ముడు రిజర్వు పోలీస్ కార్యాలయానికి ఆనుకున్న ఏటీఎం సెంటర్లో నగదు యంత్రాన్ని పట్టుకుపోయారు. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ సంఘటన జరగడం గమనార్హం. విశేషమేమంటే ఇదే ఏటీఎం సెంటర్లో మూణ్నెల్ల క్రితం బ్యాటరీలు చోరీ చేయగా, తాజా ఘటనతో అధికారుల భద్రతాపరమైన చర్యల్లో డొల్లతనం మరోమారు బహిర్గతమైంది. ఈ విషయం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈ నెల 4న ఏటీఎంలో రూ. 20 లక్షలు లోడ్ చేశారు. బ్యాంకు అధికారుల లెక్క మేరకు రూ. 8.23 లక్షలు ఏటీఎంలో ఉన్నాయి. 700 కిలోలు కలిగిన ఏటీఎం యంత్రం అమర్చిన కింద భాగం హుక్కులు తొలగించారు. యంత్రం విలు వ రూ.4 లక్షలు ఉంటుంది. తమను గుర్తించకుం డా ముందుగానే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం వాహనంలో తరలించారు. దీన్ని తొలగించడానికి గంటా యాభై నిమిషాలు పడుతుంది. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఈ ఏటీఎం సర్వీస్ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. పక్కా వ్యూహంతోనే... ఆర్ముడు రిజర్వు పోలీసుల విజ్ఞప్తి మేరకు 2017 జనవరి 10న ఈ ఏటీఎంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అప్పటి ఎస్సీ త్రివిక్రమ్‌వర్మ దీన్ని ప్రారంభించారు. ఇదే ఏటీఎంలో ఈ ఏడాది ఏప్రిల్ 25న బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. మూడు నెలల వ్యవధిలో ప్రస్తుతం ఏటీఎం చోరీకి గురయ్యింది. ఈ రెండు ఘటనలు పరిశీలిస్తే... అప్పట్లో చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులే ప్రస్తుతం చోరీ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ హైవే పెట్రోలింగ్ పోలీసుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నిత్యం రాత్రిళ్లు తనిఖీలు చేస్తున్న వీరు జాతీయ రహదారి పక్కనే ఏటీఎంలో చోరీ తీరును గుర్తించకపోవడం గమనార్హం. పక్కా వ్యూహంతో చేసిన ఈ చోరీలో అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉందా? స్థానిక చోరులు పాత్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనంలో కనీసం నలుగురు వరకు ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఎస్పీ పరిశీలన... ఎచ్చెర్ల ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ముప్పిడి నరేష్ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ చక్రవర్తి, సీఐ మల్లేశ్వరావు, ఎస్సై రాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ పోలీస్ అధికారులతో సమీక్షించారు. క్లూస్, ఫ్లోరోనిక్స్ బృందాలు చోరీ తీరు పరిశీలించాయి. ధ్వంసం చేసిన సీసీ కెమెరాలు, గోడలు, గ్లాస్‌లుపై ఉన్న వేలిముద్రలు సేకరించాయి. బ్యాంకు అధికారులు, ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారి రామ్‌జీ, ఏటీఎం జనరల్ మేనేజర్ గణేష్ పరిశీలించారు. -
అమాయకులే ఈమె టార్గెట్
సాక్షి, శ్రీకాకుళం : ‘మీకు కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం కావాలా... తహసీల్దారు కార్యాలయంలో అటెండర్‌గా చేరుతారా... ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది... డబ్బులు కట్టండి.. ఆర్డర్ కాపీలు తీసుకోండి’ అంటూ నిరుద్యోగులకు టోకరా వేసింది. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందల సంఖ్యల్లోనే నిరుద్యోగులను నిలువున ముంచి రూ.10 కోట్ల వరకూ నొక్కేసి ఎంచక్కా పరారైంది.ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరుకు చెందిన పద్మజ శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఈమెకు భర్త ఉమామహేశ్వరరావు, ఓ కూతురు ఉన్నారు. 2018లో నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో అరుణప్లాజాలో ఓ ప్లాట్ కొనుగోలు చేసి అప్పట్లో అట్టహాసంగా గృహప్రవేశం చేసింది. అప్పటికే ఈమె చాలామంది నిరుద్యోగుల వద్ద రూ.లక్షల్లో టోకరా వేసి వారికి పంగనామం పెట్టేసింది. దీంతో విసిగిపోయిన బాధితులు ఈమె ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. కొద్దిరోజులు పోయాక ఈమె అక్కడ్నుంచి ఏడాది కాలంగా మకాం మార్చేసింది. దీంతో అప్పట్లో వన్‌టౌన్‌లో కేసు నమోదైంది. గడిచిన నెల రోజులుగా అరసవల్లి పరిసర ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలియడంతో బాధితులంతా ఈమె ఇంటిని చుట్టిముట్టి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఈమెను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈమెపై 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసులు తెలిపారు. అమాయకులే ఈమె టార్గెట్.. వాస్తవంగా ఈమె అమాయకపు నిరుద్యోగులనే లక్ష్యం చేసుకుంది. ఫలానా ఊర్లో ఎవరైనా నిరుద్యోగులు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారని తెలిసిన వెంటనే తక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యేది. అక్కడ వారితో నేను ఫలానా దగ్గరి నుంచి వచ్చానంటూ పరిచయం చేసుకోవడం, ఆపై ఆర్డీవో... ఎమ్మార్వో...కలెక్టర్ వారి పిల్లలకు చదువు చెబుతున్నానంటూ మోసపూరిత మాటలతో నమ్మించి బుట్టలో వేసుకునేది. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ.. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టులు ఉన్నాయంటూ అధికారుల సంతకాలు చేసిన ఫోర్జరీ పోస్టింగ్ ఆర్డర్ కాపీలు ఒక్కొక్కరికి చూపించి రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిరుద్యోగ బాధితులను కలిసినప్పుడల్లా డబ్బులు ఇస్తేనే పోస్టింగ్ ఆర్డర్ ఇస్తానంటూ సెల్ఫోన్లో చూపిస్తూ వారిని నమ్మించేది. ఇలా వందకు పైగా బాధితులు ఈమె మోసానికి బలైన సంఘటన ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. డబ్బులు అడిగే బాధితులకు సుమారు రూ.80 లక్షలకుపైగా ఐపీ (ఇన్‌సాల్వేషన్ పిటిషన్) చూపించేది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనేగాక రాయఘడ, బరంపురం, ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ ఈమెకు డబ్బులు ముట్టచెప్పిన బాధితులంతా ప్రస్తుతం స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
గెస్ట్ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలు రద్దు
సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : జిల్లా యూనిట్‌గా బాలయోగి గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం బుధవారం జరగాల్సిన ఇంటర్వ్యూలు రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ఈ రద్దు ప్రకటన మంగళవారం విడుదల చేసినప్పటికీ అనేక మంది అభ్యర్థులు ఎచ్చెర్లలోని ఇంటర్వ్యూ కేంద్రానికి హాజరయ్యారు. ఒక్కరోజు ముందు ఇంటర్వ్యూలు ఎలా రద్దు చేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఏటా వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో బాలయోగి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 12 ఉన్నాయి. ఇందులో బాలికలు పాఠశాలలు 8, బాలుర పాఠశాలలు 4 ఉన్నాయి. మొత్తం 107 గెస్ట్ ఫ్యాకల్టీ(అతిథి బోధకులు) అవసరం. పాఠశాల స్థాయి బోధకులకు రూ.14 వేలు, జూనియర్ కళాశాల పరిధిలో పనిచేసే వారికి రూ.18 వేలు వేతనం ఇస్తారు.వాక్ ఇన్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఖరారు చేస్తారు. వీరిని 10 నెలలు కొనసాగిస్తారు.ఈ ఏడాదికి సంబంధించి జిల్లా బాలయోగి గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్టినేటర్ వై.యశోదలక్ష్మి ఇటీవల ప్రకటన విడుదల చేశారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎచ్చెర్ల బాలయోగి గురుకుల పాఠశాలలో బుధవారం ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత వారినే కొనసాగించాలంటూ బాలయోగి గురుకుల రాష్ట్ర కార్యదర్శి రాములు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్వ్యూల రద్దు ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలితో పాటు విజయంనగరం జిల్లా నుంచి వందలాది మంది అభ్యర్థులు వచ్చారు. ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ముందు రోజు ఎలా ప్రకటిస్తారని స్థానిక ప్రిన్సిపాల్ ఉషారాణిని నిలదీశారు. కార్యదర్శి ఉత్తర్వుల మేరకు రద్దు చేసినట్లు ఆమె స్పష్టం చేయడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. -
మనస్తాపంతోనే యువకుడి అఘాయిత్యం
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : మండలంలోని పొన్నాడ వంతెన సమీపంలో కాలిన శరీరంతో ఉన్న యువకుని మృతదేహం కలకలం రేపింది. పక్కన పెట్రోల్ (ఖాళీ) సీసాలు, మద్యం బాటిళ్లున్నాయి. గుర్తు పట్టేందుకు వీలులేని విధంగా శరీరం కాలిపోయింది. ఎవరో హత్య ఎవరు చేసి ఉంటారని తొలుత అందరూ భావించారు. పోలీసుల దర్యాప్తులో ఆత్మ హత్యగా తేలింది. శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి కిలో మీటరు దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. పొన్నాడ వంతెన అనుకుని పోతన్న చెరువు ఉంది. ఆ చెరువు గట్టుపై గుర్తుతెలియని మృత దేహం స్థానికులకు మంగళవారం ఉదయం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎచ్చెర్ల ఎస్ఐ వై.కృష్ణ ఆధ్వర్యంలోని పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాలిన గాయాలతో మృతి చెంది ఉండటం, పక్కన పెట్రోల్ సీసాలు ఉండటం, మృతుని చెప్పులు, మద్యం బాటిళ్లు, అగ్గి పెట్టి సంఘటన స్థలంలో ఉన్నాయి. ఎవరో సజీవ దహనం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. మృతుడు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగింది. శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి మృతదేహం తరలించి ఆచూకీ కోసం ప్రయత్నం ప్రారంభించారు. మృతదేహం గుర్తించటం కష్టంగా మారింది. మృతదేహం వాట్సప్‌లో హల్చల్ చేసింది. శ్రీకాకుళం పట్టణంలోని హయత్‌నగర్‌కు చెందిన సెగళ్ల షణ్ముఖరావుకు మృతదేహం ఫొటో చేరింది. మృతదేహం చూసిన ఆయన సోమవారం రాత్రి నుంచి తన అన్న కనిపించక పోవటంతో ఎచ్చెర్ల పోలీసులను సంప్రందించాడు. అనంతరం మార్చురీలో మృతదేహం చూసి తన అన్న సెగళ్ల మోహన్‌రావు (25)గా గుర్తించాడు. మృతుని తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మనస్తాపంతో అఘాయిత్యం! మృతుడు మోహన్‌రావు ఆటో డ్రైవర్. మద్యానికి బానిసగా మారాడు. ఇటీవల వివాహం కుదిరింది. యువకుని ప్రవర్తన తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు వివాహ నిశ్చయం రద్దు చేసుకున్నారు. దీంతో మానసిక పరిస్థితి సైతం సక్రమంగా లేకుండా పోయింది. వృద్ధులైన తల్లిదండ్రులు ఆదినారాయణ, నర్సమ్మ, అన్నయ్య రాజారావు, తమ్ముడు షణ్ముఖరావు ఉన్నారు. తాను చనిపోతానని తరచూ కుటుంబ సభ్యులు వద్ద అంటుండే వాడు. కొద్ది రోజుల నుంచి అపస్మారక స్థితికి చేరేలా మద్యం తాగుతున్నాడు. ఇంటి వద్ద సోమవారం సాయంత్రం ఆటో విడిచి పెట్టాడు. శ్రీకాకుళం బైక్‌పై వెళ్లి రాత్రి 8.30 సమీపంలో తమ్ముడికి బైక్ తాళాలు ఇచ్చేశాడు. మద్యం తాగివస్తానని, ఎదురు చూడద్దని తమ్ముడికి చెప్పి వెళ్లిపోయాడు. ఏకాంత ప్రదేశమైన పొన్నాడ వైపు మద్యం బాటిళ్లు, రెండు బాటిళ్లలో పెట్రోల్, అగ్గి పెట్టి తీసుకువెళ్లాడు. మద్యం మత్తులో పెట్రోల్ పోసుకుని నిప్పం టించుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో హత్యకు అవకాశం ఉన్న ఒక్క అంశం సైతం చిక్కలేదని ఎస్ఐ చెప్పారు. కుటుంబ సభ్యులకు ఎవరిపై అనుమానం సైతం లేదన్నారు. ఆత్మహత్యగా కేసుగా నమోదు చేశామన్నారు. కుటుంబ సభ్యులకు ఎటువంటి సందేహం ఉన్నా ఆ కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. ఉదయం పెద్ద ఎత్తున స్థానికులు, ప్రయాణికులు సంఘటన స్థలం వద్ద గుమిగూడారు. ఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా విజయ 'కిరణం'
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్ట నష్టాలు చూసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఉన్న ఆధరాభిమానాలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్‌కు ఎమ్మెల్యేగా ప్రజలు భారీ మెజార్టీతో పట్టంకట్టారు.గురువారం విడుదలైన 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో భారీ గెలుపుతో ఫ్యాన్ స్పీడ్ విజయకేతం ఎగురవేసింది. టీడీపీ అరాచక, అవినీతి పాలనను అనుభవిస్తూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందక, మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించే జననేత వచ్చారని, ఐదేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు ఉండవని, జగన్మోహన్రెడ్డి సుపరిపాలనతో పాటు నవరత్నాల పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురుచూశారు. టీడీపీ అరాచక పాలనతో విసుగెత్తిన ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గొర్లె కిరణ్‌కుమార్, టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ప్రజలతో మమైకమై ప్రజా కష్టాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరి ఓటేశారు. వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. వైఎస్సార్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అనుహ్య మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ను గెలిపించారు. మండలంలోని 115 పంచాయతీల్లో అన్ని గ్రామాలు వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చి ప్రజలు వైఎస్సార్సీపీపై ఉన్న ఆదరాభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్సీపీదే ఆధిక్యత ఎచ్చెర్ల నియోజకవర్గంలో జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో అన్ని రౌండ్‌ల్లోనూ వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఏ దశలోనూ కనీసం టీడీపీ పోటీ ఇవ్వలేకపోయింది.కళా వెంకట్రావుపై గొర్లె కిరణ్‌కుమార్ అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. గొర్లె కిరణ్‌కుమార్ 18,813 ఓట్ల ఆధిక్యతతో టీడీపీకి చెందిన కళా వెంకట్రావుపై గెలిచారు. పనిచేయని ఈవీఎంలు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఓట్ల కౌంటింగ్‌లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. 45వ పోలింగ్ కేంద్రం నిద్దాం ప్రాంతానికి చెందిన ఈవీఎం, 172 కొవ్వాడకు చెందిన ఈవీఎంలు పనిచేయలేదు. ఓట్లు డిస్ప్లే కాకపోవడంతో ఆయా ఈవీఎంలను కౌంటింగ్ సూపర్వైజర్లు సరెండర్ చేశారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్లను లెక్కించి పరిగణనలోకి తీసుకున్నారు. స్పష్టమైన మెజార్టీ ఉండడంతో రాజకీయ పార్టీ ఏజెంట్లు సైతం ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు. మొరాయించిన 168వ నంబర్ పోలింగ్ ఈవీఎం విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఓటింగ్ కౌంటింగ్‌కు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో మెంటాడకు చెందిన 168వ పోలింగ్ కేంద్రం పనిచేయలేదు. ఈవీఎం స్థానంలో వీవీప్యాట్‌ను అధికారులు లెక్కించారు. ఈ కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీకి– 335. టీడీపీకి–229 ఓట్లు, జనసేన–4 నమోదయ్యాయి. మిగిలిన ఓట్లు ఇతరకు నమోదయ్యాయి. ఎంపీకి స్పష్టమైన ఆధిక్యత వైఎస్సార్సీపీకి ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. 14,476 ఓట్లు ఆధిక్యత వచ్చింది. సుమారు 23 రౌండ్లో 22 ఆధిక్యం కొనసాగింది. బెల్లాన చంద్రశేఖర్ 96112 ఓట్లు, ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఎంపీ అశోక్‌కు 81636 ఓట్లు, జనసేన అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావుకు 4530, కాంగ్రెస్ అభ్యర్థి ఆదిరాజుకు 2134 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. కౌంటింగ్‌ను పరిశీలించిన కిరణ్‌కుమార్ శివానీ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన కౌంటింగ ప్రక్రియను గొర్లె కిరణ్‌కుమార్ పరిశీలించారు. తనకు మెజార్టీ వచ్చిన రౌండ్లు, గ్రామాలు పరిశీలించారు. జనరల్ ఏజెంట్లు పిన్నింటి సాయికుమార్, ఎం.మురళీధర్ బాబా పోలింగ్ సరళిని ఆయనకు వివరించారు. మెజార్టీ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల వివరాలు ఎచ్చెర్ల క్యాంపస్: విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించిన పోస్టల్ బ్యాలెట్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సగానికి పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో 1394 ఓట్లు వినియోగించుకోగా 726 ఓట్లు చెల్లలేదు. 668 ఓట్లు నమోదయ్యాయి. మూడు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 326 ఓట్లు వైఎస్సార్సీపీకి మెజార్టీ లభించింది. పోస్టల్ బ్యాలెట్లో నమోదైన ఓట్ల వివరాలు వైఎస్సార్సీపీ– 479, టీడీపీ– 153, జనసేన–42, కాంగ్రెస్–3, నోటా–5 తిరస్కరణ–3 మొత్తం– 685 422 సర్వీసులు ఓట్ల వినియోగం ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల జోన్లో 422 సర్వీసు ఓటర్ల నమోదయ్యాయి. ఇందులో 333 ఓట్లు చెల్లిన ఓట్లు 123,. టీడీపీకి–118, బీజీపే–34, జనసేన–51, కాంగ్రెస్–6, ఒక ఓటు తిరస్కరణకు గురైంది. -
కళ తప్పిన మంత్రి!
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట రావు ఘోర ఓటమి చవిచూశారు. వైఎస్సా ర్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ చేతిలో 18813 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీయేతర పార్టీలు మూడుసార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించా యి. 2004, 2009ల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో గొర్లె కిరణ్‌కుమార్ విజయం సాధించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కళా వెంకటరావు పోటీ చేయగా రెండు సార్లు ఓటమి చెందారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన ఆయన మూడో స్థానంలో నిలిచారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై 4741 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటి నుంచి కిరణ్‌కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నిరంతరం ప్రజల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్‌ను టీడీపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నా కొత్త క్యాడర్ తయారు చేస్తూ ముందుకుసాగారు. నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, జన్మభూమి కమిటీల వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లటం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం విజయానికి దోహదపడ్డాయి. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించటం, పార్టీ నవరత్నాలు పథకాల సాయంతో కళావెంకటరావును ఓడించగలిగారు. -
ఎచ్చెర్లలో పచ్చతమ్ముళ్ల రచ్చ!
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి కళా ఇలాకాలో గ్రూపు తగాదాలు ప్రత్యర్థి వర్గానికి మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ వత్తాసు? పథకాల పంపిణీ నుంచి బదిలీల వరకూ ఒత్తిళ్లు తారస్థాయికి వర్గపోరు... నలిగిపోతున్న ప్రజలు కిమిడి కళావెంకటరావు... అధికార టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు! దసరాకు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆయనకు కచ్చితంగా ప్రాధాన్యం ఉన్న బెర్త్ దొరుకుతుందనే ప్రచారం జరుగుతోంది! కానీ సొంత నియోజకవర్గమైన ఎచ్చెర్లలో తెలుగు తమ్ముళ్ల మధ్య గ్రూపు తగాదాలను చక్కదిద్దట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ తమ్ముళ్ల వీరంగం తారస్థాయికి చేరడం ఆ వాదనకు ఊతమిస్తోంది. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక నుంచి అధికారుల బదిలీల వరకూ తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేసుకోవడం కళ్లకు కడుతోంది. చివరకు ఇటీవల రణస్థలంలో ప్రభుత్వ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలనూ వివాదాస్పదం చేసేశారు. కళా ప్రత్యర్థి వర్గానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి బాబ్జీ దంపతులు వత్తాసు పలుకుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయకుల ఆధిపత్య గొడవల్లో తాము నలిగిపోతున్నామని అధికారులు, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం: నియోజకవర్గంలోని ప్రధానమైన ఎచ్చెర్ల మండలంలో కళా వర్గంతో పాటు కళా వర్గీయుల విధానం నచ్చని కొంతమంది టీడీపీ నాయకులు వేరే వర్గంగా కొనసాగుతున్నారు. వారికి జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి దంపతులు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వత్తాసు పలుకుతున్నారని ఆ పార్టీ కార్యకర్తల్లోనే చర్చ నడుస్తోంది. నీరు-చెట్టు పథకం ఇతరత్రా పనుల కోసం కళాను ఆశ్రయించడానికి ఆయన వర్గం నాయకులే అడ్డుపడితే చేసిది లేక కొంతమంది తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ను ఆశ్రయిస్తున్నారు. అటు కళాను, ఇటు కూన రవిని కలవడానికి ఇష్టంలేని వర్గమంతా చౌదరి బాబ్జీ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి పనులు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పనుల పంపకంలో వివాదాలు తలెత్తుతున్నా రెండు వర్గాలు చివరకు అలా పరిష్కరించుకుంటున్నాయి. అయితే పార్టీలోకి చేర్పుల విషయంలో మాత్రం రచ్చవుతోంది. ఈ విషయంలో కళా వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తుండంతో మండల, గ్రామాల స్థాయిల్లోని వారి వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అజ్జరాం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం వర్గ విభేదాలకు ఆజ్యం పోసింది. అలాగే కొయ్యాం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని పార్టీలో చేర్పించేందుకు చౌదరి వర్గం చేస్తున్న ప్రయత్నాలకు కళా వర్గం మోకాలొడ్డుతోంది. ఇదిలాఉంటే రోడ్డు మంజూరు చేయకపోతే తమ గ్రామంలో అడుగుపెట్టనివ్వబోమని కళా వర్గానికి చెందిన కొత్తపేట గ్రామ నాయకులు ఏకంగా జెడ్పీ చైర్‌పర్సన్‌కే హెచ్చరికలు జారీ చేశారు. రణస్థలంలో రణరంగమే తెలుగు తమ్ముళ్లు రణస్థలం మండలంలో ఏకంగా నాలుగు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎంపీపీ గొర్లె విజయకుమార్, బంటుపల్లి పంచాయతీకి చెందిన ఎన్.ఈశ్వరరావు (ఎన్ఈఆర్), పార్టీ మండల అధ్యక్షుడు సత్యేంద్రవర్మరాజు, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు ఆయా వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారు. నీరు-చెట్టు పథకం పనులు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు, పాఠశాల యాజమాన్య సంఘాల ఎన్నికలు... ఇలా ప్రతి పనిలోనూ తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు యథాశక్తి పోటీపడుతున్నారు. ఈ పోటీ చివరకు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకునే వరకూ వెళ్తోంది. అంతేకాదు పథకాల అమల్లో జాప్యం ఒక్కటే కాదు ప్రజలను చాలా ఇబ్బందులకూ గుర్తిచేస్తోంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతోందోనని అధికారులూ తలపట్టుకుంటున్నారు. లావేరులో ఆధిపత్య పోరు లావేరు మండలం టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ హవాకు అడ్డుకట్ట వేయడానికి పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏ పని చేయాలన్నా తన అనుమతి లేకుండా చేయవద్దని సురేష్ అధికారులకు చెబుతుండటమే దీనికి కారణం. లింగాలవలస, వెంకటాపురం, బెజ్జిపురం, పెదరావుపల్లి, బుడతవలస పంచాయతీలకు చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కొంతమంది ఒక గ్రూపుగా ఏర్పడి సురేష్‌కు చెక్ పెట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రణస్థలం మండలానికి చెందిన ఎన్.ఈశ్వరరావు (ఎన్ఈఆర్) మద్దతు కూడా లభించడంతో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. గతంలో ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన పి.వేణుగోపాలరావును సురేష్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే బదిలీ చేయించారనే చర్చలూ జరిగాయి. జి.సిగడాంలోనూ బాహాబాహీ త్వరలో ఎంపీపీ ఎన్నికలు జరగాల్సి ఉన్న జి.సిగడాం మండలంలోనూ టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగుతున్నారు. కాంట్రాక్టు పనుల విషయంలో వాటాలు కుదరక ఇటీవల జాడ గ్రామంలో చోటుచేసుకున్న తగాదాలే దీనికి నిదర్శనం. ఈ మండలంలో ప్రధానంగా టీడీ వలస, మెట్టవలస, పెంట, డీఆర్ వలస గ్రామాల్లో వర్గపోరు ఎక్కువగా ఉంది. కళా వర్గీయుల వ్యతిరేక వర్గమంతా తమ పనుల కోసం ప్రభుత్వ విప్ రవికుమార్, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, బాబ్జీలను ఆశ్రయించడం బహిరంగ రహస్యమే! -
భూప్రకంపనలతో అలజడి
ఎచ్చెర్ల/లావేరు/సంతకవిటి: వరుస భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎచ్చెర్ల, పొందూరు, లావేరు, రణస్థలం తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 8.10 గంటల సమయంలో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేశవరావుపేట, ఎస్ఎం.పురం తదితర చోట్ల గ్రామస్తులు రోడ్లపైకి చేరుకున్నారు. అయితే ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో 24, 27, 28, 29, 31, ఈ ఏడాది జనవరిలో 3, 4, 8వ తేదీల్లో, ఫిబ్రవరి 14న, మార్చి 7న, ఇదే నెల 5న స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. లావేరు మండలంలోని బుడుమూరులో బుధవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సంతకవిటి మండలంలోని మండాకురిటి గ్రామంలోనూ భూప్రకంపనలతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోని వస్తు సామగ్రి కింద పడిందని గ్రామస్తులు తెలిపారు. -
పొదల్లో గుర్తుతెలియని మృతదేహం
ఎచ్చర్ల (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలకేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జాతీయరహదారిపై తమ్మినీడుపేట సమీపంలోని టోల్గేట్ వద్ద పొదల్లో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ భార్గవప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించి, మృతుని ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. -
ఘనంగా 53వ హోంగార్డు దినోత్సవం
ఎచ్చర్ల (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో ఆదివారం 53వ హోంగార్డు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏ.ఎస్. ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులతో సమానంగా కష్టపడుతున్న హోంగార్డులను ఎస్పీ ప్రశంసించారు.