మెడ ఇరుకుపడితే.. తలగడే మంచి మందు!
మెడ పట్టేయడాన్ని సరిచేయడానికి మొదటి మందు, మంచి మందు తలగడే అంటున్నారు కెనడాకు చెందిన పరిశోదకులు. మెడపట్టేయడంతో బాధపడే రోగులపై నిర్వహిం చిన ఒక అధ్యయనంలో వారి పరిస్థితిని చక్కదిద్దడానికి, వారి సమస్యకు విరుగుడుగా అనేక ప్రక్రియలను అనుసరించి చూశారు ఆ పరిశోధకులు. అందులో భాగంగా తాము ఎంచుకున్న దాదాపు నూటాయాభైకి పైగా రోగులకు మసాజ్ వంటి అనేక ప్రక్రియలు, చిట్కాలు ప్రయోగించారట. అయితే మరీ ఎక్కువ లావు, మరీ ఎక్కువ సన్నమూ కాని మంచి తలగడను ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం చేకూరిందని గ్రహించాచు.
ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. తలగడను కేవలం తలకిందేకి మాత్రమే పరి మితం చేయకుండా, కాస్తంత భుజాల కింది వరకూ దాన్ని జరిపితే ఫలితం మరీ బాగుందట. తలగడను అలా పెట్టుకొని నిద్రించడం ద్వారా మెడపట్టేయడాన్ని సమర్థంగా నివారించ వచ్చని ఆ అధ్యయనంలో తేలింది. తలగడ తర్వాత మంచి మార్గం స్ట్రెచ్చింగ్ వ్యాయామం అని కూడా ఈ అధ్యయనంలో తేలింది.