Expelled AAP legislator
-
'ఆప్'కు బిన్నీ మద్దతు ఉపసంహరణ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ బహిష్కృత నేత వినోద్ కుమార్ బిన్నీ ప్రకటించారు. బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజిబ్ జంగ్‌ను కలసి బిన్నీ ఆ విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిన్నీ మాట్లాడుతూ... తాను డిమాండ్లు చేసి 48 గంటలు గడిచిన ఆప్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సరైన స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వానికి 'గంట' కొట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. హస్తిన వాసులకు విద్యుత్ ఛార్జీలపై 68 శాతం సర్ ఛార్జీ తగ్గించాలని, ఎటువంటి కండిషన్ లేకుండా ఒకొక్క కుటుంబానికి ప్రతిరోజు 7 గంటల నీరు అందించాలి అలాగే ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా 'ఆప్'లో అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బిన్నీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే బిన్నీ డిమాండ్ల పట్ల 'ఆప్' నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించింది. దీంతో ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. గతేడాది చివరలో న్యూఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 సీట్లలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 32 సీట్లలో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ మాత్రం 7 సీట్లు మాత్రమే గెలిచింది. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీని ఆహ్వానించారు. తాము ప్రతిపక్షానికి పరిమితం అవుతామని నజీబ్‌కు విన్నవించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని నజీబ్ జంగ్ 'ఆప్'ను కోరారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
దీక్షను విరమించిన బహిష్కృత ఎమ్మెల్యే కుమార్ బిన్నీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహారదీక్షను విరమించుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కుమార్ బిన్నీ తెలిపారు. దీక్షకు దిగిన కొద్ది గంటల్లోనే బిన్నీ దీక్షకు విరామం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ అమలు పరచడంలేదంటూ బిన్నీ విమర్శించి దీక్షకు పూనుకున్నారు. తాము చేస్తున్న డిమాండ్ ల పై 10 రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సమాధానం చెప్పలేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తానని కుమార్ బిన్నీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం నాడు బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయన్ను బహిష్కరించారు. దీంతో ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన తర్వాత, దేశ రాజధాని నడిబొడ్డునున్న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి, బాపూజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. -
జంతర్‌మంతర్ వద్ద బిన్నీ నిరాహార దీక్ష
ఢిల్లీలో కొత్తగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఢిల్లీ సర్కారు అమలు చేయట్లేదంటూ ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం నాడు బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయన్ను బహిష్కరించారు. దీంతో ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన తర్వాత, దేశ రాజధాని నడిబొడ్డునున్న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి, బాపూజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ''నన్ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మీడియా ద్వారా మాత్రమే తెలిసింది. నాకు మాత్రం ఇంతవరకు ఈ మెయిల్ ద్వారా గానీ, లేఖ ద్వారా గానీ ఎలాంటి సమాచారం అందలేదు'' అని బిన్నీ విలేకరులతో అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో షీలా దీక్షిత్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఏకే వాలియాను తూర్పు ఢిల్లీలోని లక్ష్మీనగర్ నియోజకవర్గంలో ఓడించిన వినోద్ కుమార్ బిన్నీ.. ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న ఏకైక నాయకుడు. గతంలో ఆయన ఢిల్లీలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అయితే.. ఆయనకు మంత్రి పదవిని మాత్రం కేజ్రీవాల్ ఇవ్వలేదు. అప్పుడే అలిగిన బిన్నీ, సంచలనాత్మక విషయాలు బయటపెడతానని బెదిరించడంతో పార్టీలో మంచి పదవి ఇస్తామని చెప్పి అప్పట్లో బుజ్జగించారు. దాంతో ప్రమాణ స్వీకారం నాటికి మాత్రం ఎలాగోలా నెమ్మదించారు. కానీ ఇన్ని రోజులు గడిచినా ఎలాంటి పదవి రాకపోవడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదంటూ బిన్నీ మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు తగ్గించడంలేదని, మహిళలకు భద్రత కల్పించడంలేదని, డెన్మార్క్ మహిళ అత్యాచారానికి గురైనప్పుడు సరిగా స్పందించలేదని ఆయన అన్నారు. దాంతో పాటు.. కేజ్రీవాల్ మీద కూడా ఆయన పలు ఆరోపణలు గుప్పించారు. పదేపదే ఇలాగే చేస్తుండటంతో ఆగ్రహానికి గురైన పార్టీ అగ్రనాయకత్వం, బిన్నీని నేరుగా పార్టీ నుంచి బహిష్కరించింది.