EY
-
వినోద రంగానికి పైరసీ దెబ్బ
న్యూఢిల్లీ: దేశీ వినోద రంగానికి పైరసీ పెను ముప్పుగా మారింది. పైరసీ దెబ్బతో పరిశ్రమ గతేడాది (2023) ఏకంగా రూ.22,400 కోట్ల మేర నష్టపోయింది. ఈవై, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన ’ది రాబ్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మీడియా వినియోగదార్లలో 51 శాతం మంది పైరసీ అయిన కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అనధికారికంగా కాపీ చేయడం, పంపిణీ చేయడం లేదా కాపీరైట్ హక్కులున్న మెటీరియల్‌ను (సంగీతం, సినిమాలు, సాఫ్ట్వేర్ మొదలైనవి) వినియోగించుకోవడాన్ని పైరసీగా వ్యవహరిస్తారు. ఒరిజినల్ క్రియేటర్ల హక్కులను హరించి, వారిని గణనీయంగా నష్టపరుస్తుంది కాబట్టి దీన్ని ఒక విధంగా దొంగతనంగా కూడా పరిగణిస్తారు. ‘భారత మీడియా–వినోద పరిశ్రమలో సెగ్మెంట్లవారీ ఆదాయపరంగా చూస్తే 2023లో పైరసీ ఎకానమీ రూ. 22,400 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో సినిమా థియేటర్ల నుంచి పైరసీ చేసిన కంటెంట్ పరిమాణం రూ. 13,700 కోట్లుగా, ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి జనరేట్ చేసినది రూ. 8,700 కోట్లుగా ఉంటుంది. పైరసీ కంటెంట్ వల్ల రూ. 4,300 కోట్ల మేర ప్రభుత్వానికి జీఎస్టీ నష్టాలు వాటిల్లి ఉంటుందని అంచనా‘ అని నివేదిక వివరించింది. సబ్ర్స్కిప్షన్ ఫీజులు భారీగా ఉండటమే కారణం పైరేటెడ్ కంటెంట్‌ను చూడటానికి నిర్దిష్ట కారణాలున్నాయని యూజర్లు చెబుతున్నారు. సబ్స్క్రిప్షన్ ఫీజులు అధికంగా ఉండటం, కోరుకునే కంటెంట్ అందుబాటులో లేకపోవడం, ఒక్కో సబ్ర్స్కిప్షన్ను నిర్వహించుకోవడమనేది సమస్యగా మారడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. పైరసీ ఎక్కువగా 19–34 ఏళ్ల ఆడియన్స్‌లో ఉంటోందని, మహిళలు ఓటీటీ షోలను ఇష్టపడుతుండగా, పురుషులు క్లాసిక్ సినిమాలను వీక్షిస్తున్నారని నివేదిక తెలిపింది. పైరేటెడ్ కంటెంట్‌ను చూసే వారు, దాన్ని ఉచితంగా అందిస్తే, ప్రకటనలపరంగా అంతరాయాలు వచి్చనా, అధికారిక చానల్స్‌కి మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. కంటెంట్ ప్రొవైడర్లు ధరల విధానాలను, కంటెంట్‌ను అందుబాటులో ఉంచే వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. పైరేటెడ్ కంటెంట్ వినియోగదారుల్లో 70 శాతం మంది తాము ఏ ఓటీటీ సబ్ర్స్కిప్షన్నూ తీసుకోదల్చుకోలేదని తెలిపారు. ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పైరసీ ఎక్కువగా ఉంటోంది. అధికారికంగా కంటెంట్‌ను వీక్షించేందుకు అవకాశాలు తక్కువగా ఉండటం, పైరేటెడ్ కంటెంట్ సులువుగా లభిస్తుండటం, పైరసీ వల్ల వచ్చే నష్టాలపై అవగాహన లేకపోవడం, ఆదాయాల్లో వ్యత్యాసాలు, థియేటర్లు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కూడా పైరసీ విస్తృతికి కారణంగా ఉంటున్నాయి. ప్రథమ శ్రేణి నగరాల్లోని యూజర్లు సాధారణంగా పాత సినిమాలను వీక్షించేందుకు పైరేటెడ్ కంటెంట్‌ను ఆశ్రయిస్తుండగా, ద్వితీయ శ్రేణి నగరాల్లోని వారు టికెట్టు కోసం ఖర్చు చేయడం ఇష్టం లేక ఈమధ్యే విడుదలైన కొత్త సినిమాలను చట్టవిరుద్ధంగా చూసేందుకు ఉపయోగిస్తున్నారు. సమిష్టిగా పోరాడాలి.. పైరసీ వల్ల వాటిల్లుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని, దాన్ని కట్టడి చేసేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఐఏఎంఏఐ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్ రోహిత్ జైన్ చెప్పారు. ‘దేశీయంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతోందనేది కాదనలేని వాస్తవం. 2026 నాటికి ఫిలిం ఎంటర్టైన్మెంట్ రూ. 14,600 కోట్లకు చేరుతుందని అంచనా. అయితే, విచ్చలవిడిగా విజృంభిస్తున్న పైరసీ నుంచి దీనికి పెను ముప్పు పొంచి ఉంది. కాబట్టి, ప్రభుత్వం, పరిశ్రమ, వినియోగదారులు అందరూ కూడా కలిసికట్టుగా దీనిపై పోరాడాల్సి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. -
‘EY ఉద్యోగి చావుకు కారణం ఆ మేనేజర్ క్రికెట్ పిచ్చి’
యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సీఏ అన్నా సెబాస్టియన్ మరణం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పని సంస్కృతిపై పెను చర్చకు దారితీసింది. ఆమె 'అధిక పని' కారణంగానే మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్నా సెబాస్టియన్ పెరాయిల్ తండ్రి సీబీ జోసెఫ్ కొత్త విషయాలు చెప్పారు. ఆమె మేనేజర్‌కు ఉన్న క్రికెట్ పిచ్చే తమ కుమార్తెపై పని ఒత్తిడి పెంచిందంటూ ఆరోపిస్తున్నారు."ఆమె (అన్నా సెబాస్టియన్) మార్చి 18న అక్కడ (EY) చేరింది. ఒక వారం తర్వాత, ఆమె సాధారణ ఆడిటింగ్‌ను ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి. ఆమెను 6వ టీమ్‌లో చేర్చారు. ఆడిట్ మేనేజర్ పనిని సమీక్షించారు. ఆమె అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. ఆమె పీజీకి చేరుకున్న తర్వాత కూడా అదనపు పనిని చేయవలసి వచ్చింది.నిద్రించడానికి, తినడానికి కూడా ఆమెకు సమయం లేదు. ఆమె పని ఒత్తిడిని కలిగి ఉంది. మేనేజర్ సమయానికి పనిని సమీక్షించలేదు. అతను క్రికెట్ అభిమాని. మ్యాచ్ షెడ్యూల్‌కు అనుగుణంగా తన షెడ్యూల్‌ను మార్చాడు. దాని కారణంగా ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి చాలా సేపు ఆలస్యంగా కూర్చోవలసి వచ్చింది.అంతటి ఒత్తడితో తాను అక్కడ పనిచేయలేనని ఏడ్చేది. రాజీనామా చేసి వచ్చేయాలని మేం కోరాం. కానీ ఆమె ఈవైలో కొనసాగాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు జూలై 21న ఆమె తన గదిలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి చేరుకునేలోపు మరణించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీబీ జోసెఫ్.#WATCH | EY employee's death allegedly due to 'overwork' | Ernakulam, Kerala: Father of EY employee Anna Sebastian Perayil, Sibi Joseph says, "... She joined there on March 18... After one week, she started the regular auditing. There are 6 audit teams in EY Pune and she was… pic.twitter.com/aMTabuAei0— ANI (@ANI) September 21, 2024 -
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్‌కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్‌లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్‌లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్‌ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది వ్యాపారవేత్తల నుంచి సుబ్బయ్యను ఎంపిక చేశారు. మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్ద కాలంలో భారత్ సాధించిన మూడో విజయం ఈవై రీజియన్లలో ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా తన హోదాను సుస్థిరం చేసుకుంది.ఒకటిన్నర దశాబ్దం క్రితం వెల్లయన్ తన కుటుంబ వ్యాపారంలో నాయకత్వాన్ని చేపట్టి, కల్లోలమైన భాగస్వామ్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ద్వారా చోళమండలానికి మార్గనిర్దేశం చేశారు. ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 60 రెట్లు పెరిగింది. 2018లో వ్యూహాత్మక పెట్టుబడుల పునర్విభజన, కొనుగోళ్ల ద్వారా 70 ఏళ్ల నాటి తయారీ సంస్థ టీఐఐకి నాయకత్వం వహించారు.నాల్గవ తరం కుటుంబ వ్యాపారంలో భాగంగా వ్యవస్థాపకత్వ స్ఫూర్తి తనలో లోతుగా ఉందని సుబ్బయ్య అన్నారు. సవాళ్లను అవకాశాలుగా స్వీకరించి, స్వీయ అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా మనం సాధించేదానికి హద్దులు ఉండవని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (డబ్ల్యూఈఓవై) అవార్డు గ్రహీతలుగా డాక్టర్ కిరణ్ మజుందార్ షా (2020), ఉదయ్ కోటక్ (2014), నారాయణమూర్తి (2003) సరసన వెల్లయన్ చేరారు. ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024ను వ్యవస్థాపక స్ఫూర్తి, ప్రయోజనం, వృద్ధి, ప్రభావం అనే నాలుగు ప్రధాన ప్రమాణాల ఆధారంగా స్వతంత్ర ప్యానెల్ ఎంపిక చేసింది. -
స్టార్టప్స్‌లోకి తగ్గిన వీసీ పెట్టుబడులు
ముంబై: గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో అంకుర సంస్థల్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థల పెట్టుబడులు సగానికి తగ్గాయి. 82 డీల్స్‌లో 1.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఏప్రిల్‌లో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు 27 శాతం క్షీణించి 5.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చితో పోలిస్తే మాత్రం 11 శాతం పెరిగాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ గ్రూప్ ఐవీసీఏ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుతో లిక్విడిటీ (నిధుల లభ్యత) తగ్గవచ్చని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. అయితే, అంతర్జాతీయ ఫండ్ల దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు. పటిష్టమైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్, ఆ నిధులను దక్కించుకోవడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో వర్ధమాన మార్కెట్లకు సారథ్యం వహించవచ్చని వివేక్ వివరించారు. పెట్టుబడులకు రిస్కులు.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు, దేశీయంగా వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు రూపాయితో పోలిస్తే డాలర్ బలపడుతుండటం మొదలైనవి .. వృద్ధి అంచనాలు, పీఈ/వీసీ పెట్టుబడులకు కొంత ప్రతిబంధకాలుగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఏప్రిల్‌లో వర్స్ ఇన్నోవేషన్స్ అత్యధికంగా 805 మిలియన్ డాలర్లు సమీకరించింది. మీడియా, వినోద రంగంలో ఇది రెండో అతి పెద్ద డీల్. ► భారీ స్థాయి డీల్స్ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించడం కూడా తగ్గి 1.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో ఇది 2.7 బిలియన్ డాలర్లు. ► ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐపీవోలు.. వేల్యుయేషన్లు తగ్గే అవకాశం ఉంది. ► ఏప్రిల్‌లో 16 ఫండ్లు 1.5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎనిమిది ఫండ్లు 569 మిలియన్ డాలర్లు సేకరించాయి. భారత్‌లో పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఎలివేషన్ క్యాపిటల్ ఫండ్ ఈసారి అత్యధికంగా 670 మిలియ్ డాలర్లు దక్కించుకుంది. -
9 నెలల్లో రెండు దశాబ్దాల రికార్డ్
న్యూఢిల్లీ: బుల్లిష్‌గా ఉన్న ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రతిబింబిస్తూ దేశీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఈ కేలండర్ ఏడాది(2021) తొలి 9 నెలల్లో 72 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా జనవరి– సెపె్టంబర్ మధ్య కాలంలో 970 కోట్ల డాలర్ల(రూ. 72,500 కోట్లు)ను సమీకరించాయి. వెరసి రెండు దశాబ్దాల తదుపరి అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రోత్సాహకర పరిస్థితులు దోహదం చేసినట్లు కన్సలి్టంగ్ కంపెనీ ఈవై తాజాగా రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ ట్రెండ్ మద్దతుతో దేశీయంగా క్యూ3(జులై–సెపె్టంబర్)లో లావాదేవీల సంఖ్య మరింత జోరందుకుంది. 72 ఐపీవోలలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల విభాగం నుంచి 15, కన్జూమర్ ప్రొడక్ట్స్ రిటైల్ విభాగం నుంచి 11 చొప్పున కంపెనీలు నిధులను సమీకరించాయి. 31 ఐపీవోలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 31 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా 5 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వీటిలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల నుంచి 8 కంపెనీలు, టెక్నాలజీ విభాగం నుంచి 5 సంస్థలు పెట్టుబడులను సమీకరించాయి. ఈ రంగాల నుంచి జొమాటో, నువోకో విస్టాస్ కార్ప్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ భారీ ఇష్యూలను చేపట్టాయి. 2017 నాలుగో త్రైమాసికం తదుపరి దేశీ మార్కెట్లో ఈ క్యూ3 అత్యధిక లావాదేవీలకు నెలవైనట్లు ఈవై నిపుణులు ప్రశాంత్ సింఘాల్ తెలియజేశారు. కాగా.. ఇంతక్రితం 2018 తొలి 9 నెలల్లో ప్రైమరీ మార్కెట్ ద్వారా 130 కంపెనీలు నిధులను అందుకున్నాయి. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లోనూ కొత్తతరం, టెక్నాలజీ ఆధారిత కంపెనీలు ఐపీవోలకు రానున్నట్లు సింఘాల్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల సెన్సెక్స్ 60,000 పాయింట్ల మార్క్‌ను సైతం అధిగమించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జులై–సెపె్టంబర్లో 2020 క్యూ3తో పోలిస్తే డీల్స్ 11 శాతం అధికమయ్యాయి. 2007లో నమోదైన గరిష్ట డీల్స్‌తో పోలిస్తే మరింత అధికంగా 18 శాతం పుంజుకున్నాయి. 2021 క్యూ3లో 547 ఐపీవోల ద్వారా కంపెనీలు 106.3 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్నాయి. తొలి 9 నెలల్లో చూస్తే 1,635 కంపెనీలు 331 బిలియన్ డాలర్ల విలువైన పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది కంపెనీలలో 87 శాతం, పెట్టుబడుల సమీకరణలో 99 శాతం వృద్ధి. తొలి 9 నెలల్లో ప్రపంచవ్యాప్త ఐపీవో సమీకరణ నిధుల్లో 3 శాతం(9.7 బిలియన్ డాలర్లు) వాటాను దేశ మార్కెట్ ఆక్రమించింది. ఐపీవోల సంఖ్యలో అయితే 4.4 శాతానికి చేరింది. ఇక గ్లోబల్ మార్కెట్లలోనూ 2020 పూర్తి ఏడాదితో పోలిస్తే క్యూ3లో డీల్స్తోపాటు, నిధుల సమీకరణ అత్యధికంగా నమోదుకావడం విశేషం! -
వ్యాపారవేత్తలకు అవకాశాల సునామీ
ముంబై: ప్రైవేట్ రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ మరింత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవకాశాలు సునామీలా వెల్లువెత్తగలవని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా టెక్నాలజీలు అందుబాటులో ఉండటం కూడా ఇందుకు దోహదపడగలదని ఈవై ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘రాబోయే దశాబ్దాల్లో ప్రపంచంలోనే టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా నిల్చేందుకు భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నాయి. పర్యావరణ అనుకూల ఇంధనాలు, విద్య, వైద్యం, బయోటెక్నాలజీ, సర్వీసులు వంటి వివిధ రంగాల్లో అసాధారణ స్థాయిలో అవకాశాలు ఉన్నాయి‘ అని అంబానీ తెలిపారు. భారత్ ఆర్థికంగా, ప్రజాస్వామ్యపరంగా, దౌత్య విధానాలపరంగా, సాంస్కృతిక కేంద్రంగా ముందుకు దూసుకెడుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
టెలికం టారిఫ్‌ల పెంపు తప్పదు: ఈవై అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత స్వరూపంలో ఆపరేటర్లకు సముచిత స్థాయిలో రాబడులు వచ్చే అవకాశాలు లేనందున టెలికం టారిఫ్‌లు తప్పకుండా మరింత పెరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. టెల్కోలు వచ్చే 12–18 నెలల వ్యవధిలో మరో రెండు విడతలు పెంచవచ్చని పేర్కొంది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లోనే ఒక విడత పెంచే అవకాశం ఉందని ఈవై లీడర్ (వర్ధమాన దేశాల టెక్నాలజీ, మీడియా, టెలికం విభాగం) ప్రశాంత్ సింఘాల్ తెలిపారు. అయితే, ఇదంతా కరోనా వైరస్‌పరమైన పరిణామాలు, యూజర్ల చెల్లింపు సామర్థ్యాలపై పడిన ప్రతికూల ప్రభావాలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. -
ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్’
ముంబై: ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డిజిటల్ మీడియా ఇతరత్రా ప్రింట్, సినిమా మాధ్యమాలను అధిగమించనుంది. 2019లో సినిమా పరిశ్రమను, 2021 నాటికి ప్రింట్ మీడియాను దాటేయనుంది. 2021 నాటికి 5.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019లో డిజిటల్ మీడియా 3.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని ఇందులో అంచనా వేశారు. ఇక 2018లో 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్న సినిమా సెగ్మెట్ ఈ ఏడాది 2.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని, గతేడాది 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రింట్ మీడియా 2021 నాటికి 4.8 బిలియన్ డాలర్లకు చేరగలదని ఫీక్కీ–ఈవై నివేదిక అంచనా వేసింది. డిజిటల్ మీడియా గతేడాది 42 శాతం వృద్ధి చెంది 2.4 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయులు ఫోన్‌పై సగటున 30 శాతం సమయాన్ని వినోదానికి వెచ్చిస్తున్నారని నివేదికలో వెల్లడైంది. 57 కోట్ల మంది నెట్ వినియోగదారులు.. చైనా తర్వాత ప్రస్తుతం భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్ యూజర్లు దాదాపు 57 కోట్ల మంది ఉన్నారు. ఏటా ఈ సంఖ్య 13 శాతం పెరుగుతోంది. ఆన్లైన్ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 32.5 కోట్లు, ఆడియో స్ట్రీమింగ్ యూజర్స్ సంఖ్య 15 కోట్ల స్థాయిలో ఉంది. 2021 నాటికి ఓవర్ ది టాప్ వీడియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 3–3.5 కోట్ల దాకా, ఆడియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 60–70 లక్షల దాకా పెరుగుతుందని ఫిక్కీ–ఈవై అంచనా వేసింది. టెలికం ఆపరేటర్లు కొత్తగా మల్టీ–సిస్టమ్ ఆపరేటర్ల అవతారమెత్తుతారని పేర్కొంది. ‘ప్రస్తుతం మొత్తం వినియోగంలో 60 శాతం వాటా టెలికం సంస్థల ద్వారా ఉంటోంది. ఇది 2021 నాటికి 75 శాతానికి .. 37.5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ స్థాయికి చేరుతుంది‘ అని ఫిక్కీ–ఈవై తెలిపింది. మరోవైపు, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ టారిఫ్ ఆర్డరుతో ఓటీటీ, టీవీ ప్రసారాల సంస్థల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గి.. ఓటీటీ సంస్థలకు లబ్ధి చేకూరవచ్చని వివరించింది. నివేదికలో మరిన్ని వివరాలు ♦ గతేడాది దేశీయంగా మొత్తం మీడియా, వినోద రంగం పరిమాణం 23.9 బిలియన్ డాలర్లకు చేరింది. 2017తో పోలిస్తే 13.4% వృద్ధి. 2021 నాటికి 33.6 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. ♦ 2018–21 మధ్య కాలంలో ఈ వృద్ధికి ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ మీడియా ఊతంగా ఉండనున్నాయి. విభాగాలవారీ ఆదాయాలపరంగా టీవీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ♦ 2017లో 18.3 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018లో 27.8 కోట్లకు ఎగబాకింది. ♦ టీవీ రంగం 2018లో 12 శాతం వృద్ధితో 10.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. 2021 నాటికి ఇది 13.7 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
నెలలో ఫోరెన్సిక్ రిపోర్ట్
♦ కో లొకేషన్ అంశంపై పరిష్కారమే తొలి ప్రాధాన్యం ♦ ఎన్ఎస్ఈ నూతన ఎండీ లిమాయే న్యూఢిల్లీ: కో లొకేషన్ అంశంపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నెలలోపు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సమర్పించనుందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నూతన ఎండీ విక్రమ్ లిమాయే తెలిపారు. దీనిపై సకాలంలో తగిన పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎన్ఎస్ఈ నూతన ఎండీగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం లిమాయే మీడియాతో మాట్లాడారు. కో లొకేషన్ అంశాన్ని పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యమన్నారు. ఈ విషయంలో సెబీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కొంత మంది బ్రోకర్లు ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై సత్వరమే లాగిన్ అయ్యేందుకు ప్రత్యామ్నాయంగా వేదిక ఏర్పాటు చేసుకుని యాక్సెస్ పొందారనే ఆరోపణలు రావడం విదితమే. ఈ విధంగా బ్రోకర్లు కరెన్సీ, డెరివేటివ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారీగా లాభపడ్డారని ఆరోపణలు రావడంతో సెబీ దర్యాప్తు మొదలు పెట్టింది. మరోవైపు ఎన్ఎస్ఈ సైతం ఆడిట్ బాధ్యతల్ని ఈవైకి అప్పగించింది. ఎక్స్ఛేంజ్ వైపు ఏవైనా లోపాలుంటే వాటిని సరిచేసి వ్యవస్థను బలోపేతం చేస్తామని లిమాయే చెప్పారు. ఆ తర్వాతే ఐపీవో: కో లొకేషన్‌పై దర్యాప్తు ముగిసి ఈ అంశం పరిష్కారమైన తర్వాతే ఎన్ఎస్ఈ ఐపీవో ఉంటుందని టీవీ చానళ్లతో మాట్లాడుతూ లిమాయే చెప్పారు. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, క్లయింట్లు, మీడియా, ఉద్యోగులతో సంబంధాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయని హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్ఎస్ఈ 3 గంటల పాటు నిలిచిపోవడంపై స్పందిస్తూ సాఫ్ట్వేర్ సమస్యలు అసాధారణమేమీ కాదన్నారు. దీనిపై నివేదిక కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. ఎన్ఎస్ఈ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ సమస్యను సమీక్షించి భవిష్యత్తులో ఈ తరహా అవాంతరాలు ఎదురవకుండా తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తుందన్నారు. సమస్యకు మూల కారణంపై ఆర్థిక శాఖకు, సెబీకి నివేదిక ఇస్తామని చెప్పారు. ఎన్ఎస్ఈని మరింత మెరుగైన స్థానంలో నిలిపేందుకు అందరం కలసి కట్టుగా పనిచేద్దామని అంతకుముందు ఉద్యోగులకు లిమాయే పిలుపునిచ్చారు. -
చిన్న వ్యాపారులకు ఈవై ‘జీఎస్టీ హెల్ప్ డెస్క్’
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారుల కోసం జీఎస్టీ హెల్ప్ డెస్క్‌ను ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ప్రారంభించింది. వ్యాపారులు తమ సందేహాలను ఆన్లైన్లోనే ఈ డెస్క్ సాయంతో తొలగించుకోవచ్చు. 14 పట్టణాలకు చెందిన 800 జీఎస్టీ పన్ను నిపుణులు ఉచిత సేవలు అందించనున్నారు. చిన్న వ్యాపారులు, ట్రేడర్లు, వ్యాపారవేత్తలు జీఎస్టీకి సాఫీగా మారేందుకు ఈ హెల్ప్‌డెస్క్ తోడ్పడుతుందని ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్మేమాని అన్నారు. తమ సందేహాలను, ప్రశ్నలను ‘ఈవై ఇండియా ట్యాక్స్ ఇన్సైట్’ యాప్, ‘డిజిజీఎస్టీ’ వెబ్సైట్, ‘ఈవై అండర్స్కోర్ ఇండియా’ ట్విట్టర్లో పోస్ట్ చేసి సమాధానాలు పొందొచ్చని ఈవై సూచించింది. -
కంపెనీలకు సైబర్ దాడుల ముప్పు
60 % సాఫ్ట్వేర్లు భద్రత లేనివే: ఈవై ముంబై: దేశంలో చాలా కంపెనీ లకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ (ఈవై) హెచ్చరించింది. కంపె నీలు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్లలో 60 శాతానికి పైగా నియంత్రణలకు అనువైనవి కావని (లైసెన్స్డ్ కానివి), వీటితో దాడులకు అవకాశం ఉందని తెలిపింది. ‘‘చాలా సంస్థలు హార్డ్‌వేర్ పరంగా భద్రతా చర్యలు తీసుకున్నాయి. కానీ, వాడే సాఫ్ట్వేర్ పట్ల అంత శ్రద్ధ చూపించలేదు. ఈ సాఫ్ట్వేర్లు నియంత్రణలకు అనువైనవి కావు’’అని ఈవై పార్ట్నర్ మాయ రామచంద్రన్ తెలిపారు. ఈవై ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో 49 శాతం మంది భద్రతా అధికారులు లైసెన్స్ లేని సాఫ్ట్వేర్ల వల్ల మాల్వేర్ల దాడి పొంచి ఉందని తెలిపారు. 26 శాతం ఉద్యోగులు తమ కార్యాలయ కంప్యూటర్లలో లైసెన్స్‌లేని బయటి సాఫ్ట్వేర్లను వినియోగించినట్టు చెప్పడం గమనార్హం. -
ఐదేళ్లలో డిజిటల్ మీడియాదే ఆధిపత్యం!
మూడేళ్లలో రూ.20,000 కోట్లకు డిజిటల్ మార్కెట్: ఈవై ఇండియా ముంబై: స్మార్ట్ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2021–22 నాటికి డిజిటల్ మీడియా.. ఇతర సంప్రదాయ మాధ్యమాలను అధిగమిస్తుందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఇండియా అంచనా వేసింది. 2019–20 నాటికి జనాభాలో 50 శాతం మంది స్మార్ట్ఫోన్లను వినియోగించనుండటం ఇందుకు తోడ్పడగలదని వివరించింది. అలాగే, 2021–22 నాటికి స్మార్ట్ఫోన్ల వాడకంలో మూడో వంతుకి బ్రాడ్‌బ్యాండ్ వినియోగం చేరుతుందని, ఈ రెండు సర్వీసుల వ్యయాల మధ్య వ్యత్యాసం ఒక మోస్తరు స్థాయికి రాగలదని తెలిపింది. వీటన్నిటి ఊతంతో డిజిటల్ మీడియా వినియోగం గణనీయంగా పెరుగుతుందని ఈవై ఇండియా అడ్వైజరీ లీడర్ (మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగం) ఆశీష్ ఫేర్వానీ తెలిపారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఈ–మార్కెటర్ అంచనా ప్రకారం భారతీయులు ప్రతి రోజు సంప్రదాయ మీడియా (టీవీ, రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు)పై సగటున రెండున్నర గంటలు, డిజిటల్ మీడియాపై ఒక గంట మేర సమయం వెచ్చిస్తున్నారు. ‘2020–21 నాటికి ఈ ధోరణి మారుతుంది. 2021–22 కల్లా డిజిటల్ వినియోగం భారీగా పెరిగి, సంప్రదాయ మీడియా వాడకం గణనీయంగా తగ్గిపోతుంది‘ అని పేర్కొన్నారు. ముందుగా ముప్పు ఇంగ్లిష్ మీడియాకే.. పై స్థాయి వర్గాలు వేగంగా డిజిటల్ వైపు మళ్లుతుండటంతో సంప్రదాయ మాధ్యమంలో ముందుగా ఇంగ్లీష్ ప్రింట్ మీడియాకే ముప్పు పొంచి ఉందని ఆశీష్ చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ప్రింట్ సర్క్యులేషన్ పెరుగుతోందని, ఇది మరింత వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం రూ. 8,490 కోట్లుగా ఉన్న దేశీ డిజిటల్ మార్కెట్ (డిజిటల్ అడ్వర్టైజింగ్, మ్యూజిక్, వీడియోలు, గేమింగ్ మొదలైనవి) వచ్చే మూడేళ్లలో రూ. 20,000 కోట్లకు చేరనుందని పరిశ్రమవర్గాల అంచనా.