Eye donor
-
వివాహం కావడంలేదని ఆత్మహత్యాయత్నం
జైపూర్(చెన్నూర్): వివాహం కావడంలేదని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రౌతు మొండక్క–పాపయ్య దంపతుల కుమారుడు రౌతు సంతోష్ (27) సింగాపూర్ ఓపెన్‌కాస్టులో డైవర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం కావడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం నర్సింగాపూర్ సమీపంలోని కుందారం వైపు వెళ్లే దారిలో పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ముందుగా మంచిర్యాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు. సంతోష్ నేత్రాలతో ఇద్దరికి చూపు.. కాగా సంతోష్ నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేసి మృతుని కుటుంబ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. అతని మృతి చెందినా మరో ఇద్దరికి చూపునిచ్చాడని మృతుని కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. -
ఇక్కారెడ్డిగూడలో నేత్రదానం
చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో చనిపోయిన ఓ వ్యక్తి నేత్రాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆరు నెలల క్రితం గ్రామంలో 480 మంది నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారికి అంగీకారప్రతాలను ఇచ్చారు.చేవెళ్ల రూరల్ : నేత్రదాన అంగీకర ప్రతాలను ఇవ్వడమే కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు మండలంలోని చనువెళ్లి అనుబంధ గ్రామమైన ఇక్కారెడ్డిగూడ గ్రామస్తులు. గురువారం గ్రామానికి చెందిన అనుపురం శ్రీనివాస్ (35) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆయన క ళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. ఆరు నెలల కిత్రం 2015 సెప్టెంబర్ 6వ తేదీన మండలంలోని ఇక్కారెడ్డిగూడలోని గ్రామస్తులు 480 మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చి నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారికి నేత్రదాన అంగీకరప్రతాలను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్తులంతా నేత్రదాన అంగీకార పత్రాలను అందించిన సమయంలో మృతుడు కూడా ఇచ్చాడు. దీంతో గురువారం సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది గ్రామానికి చేరుకుని కళ్లను సేకరించారు. అంగీకార పత్రాలు ఇచ్చిన ఐదు నెలల కాలంలో.. గ్రామానికి చెందిన రుక్కమ్మ చనిపోవడంతో ఆమె నేత్రాలను అందించి ఇక్కారెడ్డిగూడలో మొదటి నేత్రదాతగా నిలిచారు. ఇది జరిగిన 15 రోజులకే గ్రామానికి చెందిన చిరుమోని హనుమంతరెడ్డి చనిపోవడంతో ఆయన నేత్రాలను దానం చేయడంతో రెండో దాతగా నిలువగా ప్రస్తుతం విద్యుదాఘాతంతో మృతిచెందిన అనుపురం శ్రీనివాస్ మూడో నేత్రదాతగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఎవరు చనిపోయినా వారి నేత్రాలను ఆస్పత్రి వారికి అందిస్తామని గ్రామ యువజన సంఘం నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి (రాజు) తెలిపారు.