face problems
-
ముఖంపై వాపు ఉంటే తస్మాత్ జాగ్రత్త
-
ఫిలిప్పీన్స్ లో తెలుగు యువతి తిప్పలు
-
సర్వర్ పరేషాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీకి సర్వర్ అనేక చిక్కులు తెచ్చిపెడుతోంది. వందల సంఖ్యలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యాన్ని తీసుకునేందుకు ఎగబడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తి సర్వర్ మొరాయిస్తోంది. దీంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా చేరడం, కొన్ని చోట్ల వాగ్వాదానికి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని దుకాణాల వద్ద శనివారం సర్వర్ పనిచేయక లబ్ధిదారులు గంటల కొద్దీ బారులు తీరారు. పోర్టబిలిటీ పెరగడంతో.. రేషన్ పంపిణీ మొదలైన ఈ నెల ఒకటవ తేదీ నుంచి శుక్రవారం వరకు 22 లక్షల కుటుంబాలు 88 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నాయి. మొత్తం 87.59 లక్షల కుటుంబాల్లో మూడ్రోజుల్లోనే 25 శాతం తీసుకున్నారు. ఇక శనివారం ఉదయం 5 గంటల నుంచే రేషన్ దుకాణాల వద్ద జనాల రద్దీ కనిపించింది. మల్కాజ్గిరి, ఖైరతాబాద్, కుషాయిగూడ, నాగారం, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి వందల సంఖ్యల్లో కూపన్లు ఉన్నవారు, లేనివారు అంతా దుకాణాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పంపిణీ గంట సేపు సజావుగా సాగినా, ఆ తర్వాత సర్వర్ పనిచేయకపోవడంతో గందరగోళంగా మారింది. ఒక పది నిమిషాలు పనిచేస్తే, మరో పదిహేను నిమిషాలు సర్వర్ పనిచేయకపోవడంతో లబ్ధి దారులు డీలర్లతో గొడవకు దిగారు. చాటాచోట్ల వెంట తెచ్చుకున్న సరుకులను వరుసల్లో పెట్టేసి ఒకే దగ్గర గుమికూడారు. చాలా చోట్ల వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చోలేక నీరసించిపోయారు. శనివారం మధ్యాహ్నానికి 4.50 లక్షల మంది బియ్యం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే ఎక్కువగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సమస్య ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్‌లో 5.80 లక్షలు, రంగారెడ్డిలో 5.24 లక్షలు, మేడ్చల్‌లో 4.95 లక్షల మంది రేషన్ కార్డుదారులుండగా, వీటికి అదనంగా వివిధ ప్రాంతాల వలసదారులు ఇక్కడే రేషన్ పోర్టబిలిటీని వినియోగించుకోవడంతో సాంకేతిక సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో సర్వర్ పనిచేయక బియ్యం పంపిణీ నెమ్మదిగా సాగింది. ఖైరతాబాద్‌లోని ఓ దుకాణంలో సర్వర్ సమస్య కారణంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 15 మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేయగలిగారు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపించడంతో అధికారులు స్టేట్ డేటా సెంటర్ వారితో మాట్లాడి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. టోకెన్ ఉన్నవారే రావాలి: మారెడ్డి సర్వర్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. టోకెన్ తీసుకున్న లబ్ధిదారులు మాత్రమే బియ్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ బియ్యం పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. -
పాప ముఖం మీద మచ్చలు.. తగ్గడం ఎలా?
మా పాపకు 14 ఏళ్లు. ఏడాది కిందటి నుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి? – డి. రమాసుందరి, విజయనగరం మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావాయొలెట్ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్ థెరపీతో వాటిని తొలగించవచ్చు. రంగులతో ఉండే ఆహారాలు తీసుకోవచ్చా? మా బాబు బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. వాటినే ఇప్పించమని అడుగుతుంటాడు. అవి మంచిదేనా? – ఎమ్. శ్రీవాణి, మేదరమెట ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణులు (హైపర్ యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం భవిష్యత్తులో లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. - డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, హైదరాబాద్ -
అప్పుల కన్నా ఆస్తులు తక్కువ..
-
ఏమిటీ పాట్లు!
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 90 ఏళ్ల ఈ బామ్మ పేరు కుప్పాల లక్ష్మి. నడవలేని స్థితిలో నేలపై ఇలా పాకుతూ పింఛను సొమ్ము కోసం నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చింది. ఆమె ఖాతాలో పింఛను సొమ్ము జమ కాలేదు. ఈ బామ్మ ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు రావాలి. ఆటోలో వెళ్లాలి. ఈ పరిస్థితుల్లో 13 రోజులుగా సహాయకురాలితో కలిసి నగర పంచాయతీ కార్యాలయానికి వస్తోంది. ఇప్పటివరకు వీరిద్దరికీ కలిపి ఆటో చార్జీల రూపంలో రూ.650 వరకు ఖర్చయ్యింది. అయినా.. పింఛను సొమ్ము రూ.1,000 ఆమె ఖాతాలో జమ కాలేదు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3 వేల మందికి పైగా పింఛనుదారులు ఉండగా, సుమారు 600 మందికి పింఛను సొమ్ము రాలేదు. దీంతో వారంతా నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నగర పం చాయతీ పరిధిలో 3వేలకు పైగా పింఛను దారులు ఉండగా, ఇంకా 600 మందికి వారి ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు. దీంతో వారంతా నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పెద్దనోట్లు రద్దు కావడానికి ముందు ప్రతినెలా 5వ తేదీలోపే వీరందరికీ పింఛన్ సొమ్ము చేతికి అందేది. ప్రస్తుతంలో బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమకాక ఇలాంటి వారెందరో అవస్థలు పడుతున్నారు. బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ, వాటిని అధికారులకు అందజేయడం తదితర ప్రక్రియ పింఛనుదారులకు శాపంగా మారింది. -
రోడ్డున పడ్డ భారత్...!
-
ఏపీ సర్కార్‌పై పెద్దనోట్ల దెబ్బ
-
రాజమండ్రి అరటి మార్కెట్‌పై చిల్లర ప్రభావం
-
ఆర్టీసీ సమ్మెతో విద్యార్థుల అగచాట్లు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఏపీ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతుండటంతో పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విభాగానికి 17, మెడికల్, అగ్రికల్చర్ పరీక్షకు 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్ ఒక్కటే సెంటర్ కేటాయించడంతో జిల్లాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో కూడా బస్సులు తిరగకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఎల్బీనగర్, హయత్ నగర్ శివారు ప్రాంతంలో పరీక్ష కేంద్రాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నారాయణగూడ, బర్కత్‌పుర తదితర సెంటర్లకు ఉదయం 7 గంటలకే విద్యార్థులు చేరుకున్నారు. -
నట్టెట ముంచిన సర్కారు
-
పరిశ్రమలపై విభజన సెగ