fake DSP
-
కర్నూల్లో నకిలీ డీఎస్పీ కలకలం
-
నిజామాబాద్ జిల్లాలో నకిలీ డిఎస్పీ గుట్టురట్టు
-
గ్రేహౌండ్స్ డీఎస్పీనంటూ బెదిరింపులు
మధురానగర్( విజయవాడ సెంట్రల్ ) : గ్రేహౌండ్స్ డీఎస్పీ నంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరిస్తున్న ఇద్దరిని సత్యనారాయణపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంకు చెందిన టి.ఆనంద సతీష్‌కుమార్ గాంధీనగర్ గరికపాటి వారి వీధిలోని రియల్ఎస్టేట్ వ్యాపారి రాఘవస్వామి ద్వారా 2007లో గన్నవరంలో మూడు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇటీవల ఆనంద సతీష్‌కుమార్ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతో తాను కొనుగోలు చేసిన ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. రాఘవస్వామి ప్లాట్లు అమ్మలేకపోవటంతో తన స్నేహితుడు శ్రీహర్షతో గ్రేహౌండ్స్ డీఎస్పీ నంటూ రాఘవస్వామికి ఫోన్లు చేసి బెదిరించారు. దీంతో భయపడిన ఆయన రూ. లక్షా 40వేలు ఇచ్చారు. ఇప్పుడు మరోమారు పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనం, బొమ్మ తుపాకీతో రాఘవస్వామి వద్దకు వచ్చి అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలని లేనిపక్షంలో చంపేస్తామంటూ బెదిరించారు. అనుమానం వచ్చిన రాఘవస్వామి సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులకు శ్రీహర్ష గ్రేహౌండ్స్ డీఎస్పీ కాదని తెలిసింది. నకిలీ పోలీసులని గుర్తించి శ్రీహర్షను, ఆనంద సతీష్కమార్ను సీఐ పి.కనకారావు అరెస్టు చేశారు. పోలీస్స్టిక్కర్ల వాహనాలు, బొమ్మతుపాకీలతో పోలీసులమంటూ హడావుడి చేయటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం నుంచి వచ్చి స్థానిక వ్యాపారులను పోలీసులమంటూ బెదిరించడంపై విస్మయం చెందుతున్నారు. -
నకిలీ డీఎస్పీ అరెస్ట్
ఆదోని టౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ డీఎస్పీ శాంతరాజు, కార్ డ్రైవర్ సోమశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణం టీచర్స్ కాలనీలో నివాసముంటున్న శాంతరాజు, పంపన్నగౌడు కాలనీకి చెందిన కార్డ్రైవర్ సోమశేఖర్ రెడ్డి కొంతకాలంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ పేరుతో వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు. సోమవారం ఆస్పరి సబ్ రిజిస్ట్రార్ ఆదినారాయణను రూ. లక్ష డిమాండ్ చేయగా అంత సొమ్ము లేదని సిబ్బంది నుంచి సేకరించి రూ.50వేలు వసూలు అందజేశారు. కొంతసేపటికి నకిలీ డీఎస్పీ అని తేలడంతో మోసపోయానని తెలుసుకున్న ఆదినారాయణ ఆస్పరి ఎస్ఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఆలూరు వైపు వెళ్లారని తెలసుకొని సీఐ దస్తగిరి బాబుకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ, ఎస్ఐ నరసింహులతో కలిసి తనిఖీలు నిర్వహించగా ఆస్పరి నుంచి కారు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.75 వేల నగదు, టాటా జెస్ట్ కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారని డీఎస్పీ వివరించారు. గంట వ్యవధిలోనే నకిలీ డీఎస్పీని అరెస్ట్ చేసినందుకు సీఐ, ఎస్ఐలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. -
నకిలీ డీఎస్పీ హల్చల్
ఆస్పరి/ ఆలూరు: తాను విజిలెన్స్ డీఎస్పీ నంటూ ఓ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్‌ను బురిడీ కొట్టించి కటకటలా పాలయ్యాడు. మండల కేంద్రమైన ఆస్పరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారితో సోమవారం ఆస్పరి సబ్ రిజిస్టర్ కార్యాలయం కిటకిటలాడుతుంది. మధ్యాహ్నం ఏపీ 21, బీఎన్ 1899 నంబరు గల కారు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా వచ్చి ఆగింది. కారు డ్రైవర్ కార్యాలయంలోకి నేరుగా వెళ్లి సబ్ రిజిస్టార్ ఆదినారాయణతో విజిలెన్స్ డీఎస్పీ మహబూబ్ బాషా వచ్చారని చెప్పాడు. ఆయన వెంటనే కారుదగ్గరికెళ్లి విజిలెన్స్ డీఎస్పీకి నమస్కారం చేసి కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. మీ మీద చాలా కంప్లెంట్స్ ఉన్నాయి.. ప్రభుత్వ భూములను కూడా రిజిస్టర్ చేస్తున్నారంట కదా అని అదినారాయణను దాబాయించారు. డాక్యూమెంట్ రైటర్స్ ఎంత మంది ఉన్నారని ప్రశ్నిస్తూ ఫీజులు ఇష్టాను సారంగా వసూలు చేస్తున్నారని బెదిరించారు. చివరకు వారివురు కారులోకి వెళ్లి మాట్లాడుకునేందుకు వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఎవరో అధికారి వచ్చారని స్థానిక విలేకరులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని డీఎస్పీతో మాట్లాడతామని సబ్‌రిజిస్ట్రార్‌ను కోరగా భోజనం చేసిన తరువాత సార్ ప్రెస్ మీట్ పెడతారని సమాధానం చెప్పారు. అయినా, కొందరు విలేకరులు వారిద్దరు కారులో మంతనాలు జరుపుతున్న ఫొటోలు తీశారు. గమనించిన నకిలీ విజిలెన్స్ డీఎస్పీ విషయం ఎక్కడ బయటపడుతుందోనని తన సెల్ ఫోన్ అడ్డుపెట్టుకుని కొద్దిసేపు ఫోజులు కొట్టారు. తర్వాత సబ్ రిజిస్టర్‌ను ఆయన కారులోనే ఆస్పరి నుంచి ఆలూరు వెళ్లే రోడ్డు వైపు తీసుకెళ్లారు. అక్కడ సబ్రిజిస్టార్ను బెదిరించి రూ. 50 వేలు తీసుకుని ఆలూరు వైపు ఉడాయించాడు. తర్వాత ఆఫీసుకు వచ్చిన ఆదినారాయణ సహచర సబ్ రిజిస్ట్రార్లతో ఫోన్లో మాట్లాడగా మహబూబ్ బాషా పేరుతో విజిలెన్స్ డీఎస్పీ ఎవరూ లేరని తెలియడంతో తెల్లమొహం వేశాడు. మోసం పోయానని తెలుసుకొని వెంటనే సీఐ దస్తగిరిబాబుకు సమాచారమిచ్చాడు. నకిలీ విజిలెన్స్ డీఎస్పీతో కారులో కూర్చున్న సమయంలో విలేకరులు తీసిన కొన్ని ఫోటోలను తీసుకొని సీఐకు వాట్సాప్‌లో పంపారు. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు సబ్‌రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఆలూరు ఎస్ఐ సీవీ నరసింహులు, పోలీసులు ఆలూరు సమీపంలో తిష్టవేశారు. నకిలీ డీఎస్పీ కారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ నకిలీ డీఎస్పీ ఎమ్మిగనూరు పట్టణ కేంద్రానికి చెందిన శాంతరాజు కాగా కారు డ్రైవర్ పేరు సోమశేఖరరెడ్డి అని తేలింది. శాంతరాజు బస్విని పునరావాస, జోగిని సంఘం రాష్ట్రం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి çఈ ఏడాది ఫిబ్రవరి 20న సంఘం అధ్యక్షుడిగా నియామక పత్రం సైతం తీసుకున్నారు. రూ. 2 లక్షల డిమాండ్ నిందితుడు శాంతరాజు ఆస్పరి సబ్‌రిజిస్ట్రార్‌ను రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా రూ. 50 వేలు ఇచ్చారు. ఆలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రార్‌ను బెదిరించాడు. తర్వాత అసలు విషయం తెలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులకు చిక్కాడు. ఆస్పరి, ఆలూరు సబ్ రిజిస్ట్రార్లు ఆదినారాయణ, సునందను నిందితుడు శాంతరాజు ఎలా బెదిరించారనే దానిపై విచారణ చేస్తున్నట్లు సీఐ విలేకరులకువెల్లడించారు. -
పోలీసుల అదుపులో నకిలీ డీఎస్పీ
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ లో ఓ నకిలీ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎసీబీ డీఎస్పీ అని చెప్పుకుంటూ డబ్బులు దోచుకుంటున్నాడు. అరవింద్ కుమార్ అనే డ్రగ్ ఇన్ స్పెక్టర్ కు బెదిరించిన అనిల్ దాదాపు రూ. 4 లక్షల వరకు దండుకున్నాడు. దాంతో ఆగకుండా మళ్లీ ఐపోన్ కావాలంటూ బెదిరింపులకు దిగాడు. అరవింద్ అతని ఆగడాలను భరించలేక పోలీసులకు ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు పక్కా ప్లాన్ తో నకిలీ డీఎస్పీని అరెస్టు చేశారు. -
పోలీసుల అదుపులో నకిలీ డీఎస్పీ
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ లో ఓ నకిలీ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎసీబీ డీఎస్పీ అని చెప్పుకుంటూ డబ్బులు దోచుకుంటున్నాడు. అరవింద్ కుమార్ అనే డ్రగ్ ఇన్ స్పెక్టర్ కు బెదిరించిన అనిల్ దాదాపు రూ. 4 లక్షల వరకు దండుకున్నాడు. దాంతో ఆగకుండా మళ్లీ ఐపోన్ కావాలంటూ బెదిరింపులకు దిగాడు. అరవింద్ అతని ఆగడాలను భరించలేక పోలీసులకు ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు పక్కా ప్లాన్ తో నకిలీ డీఎస్పీని అరెస్టు చేశారు.