fake fb account
-
భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్
-
భద్రాద్రి ఆలయం పేరుతో అశ్లీల చిత్రాల పోస్టింగ్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సోషల్ మీడియాలో భద్రాద్రి ఆలయం పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడమే కాదు.. అందులో అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం టెంపుల్ సిటీ, భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం పేర్లతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఆగంతకులు. అంతటితో ఆగకుండా ఆ పేజీల్లో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయం గమనించిన కొందరు రామభక్తులు.. భద్రాచలం ఏఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే.. భద్రాచలం టెంపుల్ పేరుతో ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయబడుతున్న పోస్టులతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు జరుగుతోంది. -
నిషా జిందాల్ పేరుతో ఫేస్బుక్లో..
సాక్షి, రాయ్‌పుర్: సోషల్ మీడియాలో నకిలీ ఫేస్బుక్ ఖాతాను కొనసాగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. రాయ్‌పుర్‌కు చెందిన రవి అనే వ్యక్తి ‘నిషా జిందాల్’ అనే అమ్మాయి పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ అకౌంట్‌కు ప్రస్తుతం పదివేల మందికిపైనే ఫాలోవర్స్ ఉన్నారు. కాగా నిషా జిందాల్ అకౌంట్‌పై అనుమానం వచ్చిన పోలీసలు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న రవి ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లలో కూడా నకిలీ ఖాతాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (యుద్ధభూమిలో ఉన్నాం.. : రష్మిక) ఇక గత 11 సంవత్సరాల నుంచి నిందితుడు ఇంజనీరింగ్ కూడా పాస్ అవ్వలేదని ఐఎస్ అధికారి ప్రియాంక శుక్లా వెల్లడించారు. కాగా నకిలీ ఫేస్బుక్ ఖాతాను కొనసాగిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులను ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ప్రశంసించారు. ‘ఎటువంటి మోసమైనా పోలీసుల నుంచి తప్పించుకోదు. తప్పుదారి పట్టించాలనుకునే వారందరినీ బయటపెడతాం. రాయ్‌పూర్ పోలీసులు మంచి పని చేశారు’. అంటూ ట్వీట్ చేశారు. (సందీప్ ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి) No fraud will be spared. Let us reveal all those element who wish to mislead. Good job @RaipurPoliceCG https://t.co/LYqCes5Iel — Bhupesh Baghel (@bhupeshbaghel) April 19, 2020 -
నకిలీ ఫేస్బుక్.. ప్రేమలోకి దింపి ఆరు లక్షలకు టోపీ..!
సాక్షి, హైదరాబాద్ : ఓ ప్రైవేట్ టీవీ చానల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఐడీ సృషించి ఔత్సాహిక కళాకారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఓ మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరనాథ్ తెలిపిన మేరకు.. చిత్తూరు జిల్లా చింతపత్రిలోని వాయలపాడుకు చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత బెంగళూరులోని అత్తూరు గ్రామంలో ఉంటోంది. బుల్లితెర సీరియల్స్‌ను రోజువారీగా క్రమం తప్పకుండా చూసే శ్రీలతకు తెలుగు టీవీ ఆర్టిస్టులంటే మమకారం పెరిగింది. ఈ క్రమంలోనే 2018 జూలైలో ఓ ప్రైవేట్ టీవీ చానెల్స్‌లో సీరియల్స్ ప్రారంభ, ముగింపు సమయంలో ప్రొడ్యూసర్ డైరెక్టర్‌గా శ్రీదేవి తుమ్మల అనే పేరు వచ్చేది. సులభ పద్ధతిన డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ‘శ్రీదేవి తుమ్మల’ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీతో పేజీ తెరిచింది. టీవీ, మూవీ ఆర్టిస్ట్‌లు కావాలనుకునే వారిని ఈ ఫేస్బుక్ ఐడీ ద్వారా సంప్రదించేది. వారికి సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకొని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది. అలాగే టీవీ ఆర్టిస్టులు నిషామా, శిరీష, కరుణ, ఇతరులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు పంపి నిజమైన ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మలగా రోజువారీతో చాట్ చేసేది. ఎవరైనా ఫేస్బుక్ ద్వారా సంప్రదిస్తే చాలు సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్ చేయమని కోరేది. ఈ విధంగానే 2018 సెప్టెంబర్‌లో వంశీ అనే వ్యక్తికి టీవీ సీరియల్స్‌లో అవకాశమిస్తానని రూ.50వేలు వసూలు చేసింది. మణికొండకు చెందిన క్రాంతికుమార్‌కు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఇతర మహిళ ఫొటోలను పంపి రోజువారీగా చాట్‌చేసి సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఆమె పంపిన ఫొటోలకు ఫ్లాట్ అయిన క్రాంతికుమార్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దీన్ని అవకాశంగా మలచుకున్న నిందితురాలు శ్రీలత దఫాలవారీగా తన బ్యాంక్ ఖాతాల్లో రూ.ఆరు లక్షలు డిపాజిట్ చేయించుకుంది. గతంలోనే ఇటువంటి కేసుల్లోనే శ్రీలతను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయం శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్లడంతో తన పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటాతో నిందితురాలు శ్రీలతను ఇన్స్పెక్టర్లు పి.లక్ష్మీకాంతరెడ్డి, విజయ్‌కుమార్, ప్రకాశ్‌ల బృందం శ్రీలతను బెంగళూరులో అరెస్టు చేసింది. -
టీజీఓ అధ్యక్షురాలి పేరుతోనకిలీ ఫేస్బుక్ అకౌంట్
ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కామెంట్స్ సైబర్ క్రైమ్‌కు మమత ఫిర్యాదు సీఎంకు వివరణ ఇచ్చిన బాధితురాలు కుత్బుల్లాపూర్: తన పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, అందులో రాజకీయ సంబంధ విషయాలపై కామెంట్లు పెట్టారని కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షురాలు వంకాయలపాటి మమత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు మమత ‘సాక్షి’కి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం మమత పేరుపై ఉన్న ఫేస్బుక్ అకౌంట్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ‘‘ బీసీగా పుట్టడమే నేను చేసినా నేరమా..!’’ అన్న క్యాప్షన్ పెట్టి దానికి కామెంట్‌గా టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని, కేసీఆర్ పాలన విమర్శిస్తూ కామెంట్లు మమత పెట్టినట్లుగా పోస్ట్ చేశారు. ఈ విషయం మమత చెవిన పడింది. వెంటనే అప్రమత్తమై ఆమె తన పేరుపై ఎవరో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని గుర్తించారు. అప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఈ కామెంట్ విషయం వెళ్లింది. దీనిపై ఆమెను సీఎం క్యాంప్ కార్యాలయం వివరణ కోరగా... తనకు సంబంధం లేని ఫేస్బుక్ అకౌంట్లో ఇలా కామెంట్లు వచ్చాయని తెలిపారు. అదేరోజు రాత్రి ఆమె సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి జరిగిన విషయం చెప్పగా ఆయన వెంటనే ఈ విషయంపై దర్యాప్తు జరపాలని నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. తనకు ఉన్న ఫేస్బుక్ మాదిరిగానే మరో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్‌ను తెరిచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇలా చేయడాన్ని తాను వారం రోజుల క్రితమే గుర్తు పట్టానని, అప్పట్లోనే అకౌంట్‌ను క్లోజ్ చేయమని హెచ్చరించినా.. కొనసాగిస్తూ ఇలా పోస్ట్ చేశారే తప్ప ఇందులో తన ప్రమేయం లేదని ఆమె తెలిపారు. తన స్నేహితులు, కుత్బుల్లాపూర్ ప్రాంత ప్రజలు, సహ ఉద్యోగులు, టీజీఓ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ‘సాక్షి’ ద్వారా కోరుతున్నానని మమత అన్నారు. ఈ విషయంపై ఆరాతీస్తే ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్‌ను తొలగించినట్లు గుర్తించారు.