family party
-
PM Narendra Modi: కుటుంబ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులు
జమ్మూ: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాశాయని, రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశాయని నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్‌కు తీవ్ర గాయాలు చేశాయని ఆరోపించారు. జమ్మూకశీ్మర్ ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు, శాంతి కోసం అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. శనివారం జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కుటుంబ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను జనం కోరుకోవడం లేదని తేలి్చచెప్పారు. బీజేపీ ప్రభుత్వం రావాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టంచేశారు. మొదటి రెండు దశల పోలింగ్ ఓటర్ల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు క్షమిస్తారా అని మోదీ ప్రశ్నించారు. హరియాణాలో కాంగ్రెస్ వస్తే అస్థిరతే: మోదీ హిస్సార్: హరియాణాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్థిరత తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ పార్టీలో అంతర్గత పోరాటం సాగుతోందని, ముఖ్యమంత్రి పదవి కోసం నేతలంతా పోటీ పడుతున్నారని చెప్పారు. బాపు(భూపీందర్ సింగ్), బేటా(దీపేందర్ సింగ్) పోటీలో ఉన్నారని తెలిపారు. శనివారం హరియాణాలోని హిసార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. -
PM Narendra Modi: అవినీతికి మారుపేరు డీఎంకే
వెల్లూరు: తమిళనాడులో అధికార డీఎంకేపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతికి మారుపేరుగా మారిపోయిందని, రాష్ట్రాభివృద్ధిని ఏమా త్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తమిళనాడులోని వెల్లూరు, మెట్టుపాళ్యంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే ముమ్మాటికీ కుటుంబ పారీ్టలేనని అన్నారు. అవినీతిపై మొదటి పేటెంట్ హక్కు డీఎంకేకు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా లూటీ చేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కంపెనీ అయిన డీఎంకే పాతకాలపు ఆలోచనా ధోరణితో రాష్ట్రంలో యువత ఎదుగుదలను అడ్డుకుంటోందని విమర్శించారు. భాష, కులం, మతం, విశ్వాసం పేరిట ప్రజల్లో విభజనను సృష్టిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో దేశం ముందడుగు వేస్తుండగా, పెట్టుబడులను అడ్డుకొనేవారితో డీఎంకే అంటకాగుతోందని ఆరోపించారు. కచ్చతీవు అప్పగింత వల్ల లాభపడిందెవరు? తమిళనాడులో డీఎంకే తరహాలోనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష, విభజన అనే ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని బాగస్వామ్యపక్షాలకు బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అవినీతిపరులను కాపాడాలని కాంగ్రెస్, డీఎంకే ఆరాటపడుతున్నాయని విమర్శించారు. వారసత్వ పార్టీలకు సొంత కుటుంబ సభ్యులు, వారసులు తప్ప ఇతరుల సంక్షేమం పట్టదని అన్నారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును తాము రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దింపితే వారసత్వ పారీ్టలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. మన దేశంలో అందర్భాగమైన కచ్చతీవును 1974లో అన్యాయంగా శ్రీలంకకు అప్పగించారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నాయని వివరించారు. కచ్చతీవు అప్పగింతపై ఏ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు ఉన్నాయి.. నాగపూర్: ఆరి్టకల్ 370 రద్దుతో తనకు అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు లభిస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు, దూషణలతో తనకు మేలు జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు మరిన్ని పెరుగుతాయని అన్నారు. ఆయన బుధవారం మహారాష్ట్రలో నాగపూర్ జిల్లాలోని కన్హాన్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యం ఉండబోవంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. -
కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ
ద్వారక: కాంగ్రెస్ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీగా మిగిలిపోయిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. అసలు దేశంలో బీజేపీ మినహా జాతీయ పార్టీలేవీ లేవన్నారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలున్న గుజరాత్లో ద్వారక నుంచి పోరుబందర్ దాకా బీజేపీ రెండో విడత గుజరాత్ గౌరవ్‌యాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. ‘‘దేశం పేరిట కేవలం ఓ వంశాన్ని ప్రమోట్ చేయడం, ఓ కుటుంబానికి సేవ చేయడమే కాంగ్రెస్ నేతల ఏకసూత్ర కార్యక్రమంగా మారింది. ఇక టీఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, అకాలీదళ్, జేఎంఎం, పీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. నమ్మిన సిద్ధాంతానికి నిలువెల్లా కట్టుబడ్డ ఏకైక జాతీయ పార్టీ దేశంలో బీజేపీ మాత్రమే’’ అని ఈ సందర్భంగా అన్నారు. షా ఓ జూనియర్: నితీశ్ పట్నా: కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వారి విమర్శలను పట్టించుకోనని కేంద్ర హోం మంత్రి అమిత్ షానుద్దేశిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. సామాజిక ఉద్యమ నేత జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలు ఆచరిస్తానని చెప్పుకునే నితీశ్.. అధికారం కోసం కాంగ్రెస్ ఒళ్లో కూర్చున్నారంటూ అమిత్ చేసిన ఆరోపణలపై బుధవారం ఆయన ఈ మేరకు స్పందించారు. -
కుటుంబ పార్టీలకు ఓటేయొద్దు
ఖాస్గంజ్ : సమాజ్‌వాదీ వంటి కుటుంబ పార్టీలకు ఓటేయొద్దని యూపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. వారొస్తే రాష్ట్ర పేదల కోసం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆపేస్తారన్నారు. యూపీలోని ఖాస్గంజ్లో శుక్రవారం ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఓటర్లను కుటం పేరిట విడదీసేందుకు సమాజ్‌వాదీ వంటి పార్టీలు ఎంతగా ప్రయత్నించినా వాటి పాచికలు పారలేదన్నారు. ఈసారీ అలాంటి ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూపీ తొలి దశ ఓటింగ్‌లో బీజేపీ హవాయే సాగిందని ధీమా వెలిబుచ్చారు. ‘‘మహిళలు భారీగా వచ్చి మాకు ఓటేశారు. ఓటమి తప్పదని విపక్షాలకు అర్థమైంది. అందుకే ఇప్పటినుంచే ఈవీఎంలపై, ఈసీపై విమర్శలు మొదలు పెట్టాయి. చివరికి పేదలకు కరోనా వ్యాక్సిన్లు వేయడం లేదంటూ దుష్ప్రచారానికి దిగాయి’’ అని ఎద్దేవా చేశారు. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు. రేషన్ మాఫియాను రూపుమాపారని, కేంద్రం పంపుతున్న ప్రతి గింజా హక్కుదారులకే అందేలా చూస్తున్నారని అన్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే సాహసం చేయలేరన్నారు. అంబేడ్కర్వాదులంతా సమాజ్‌వాదీలో చేరాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పిలుపివ్వడం హాస్యాస్పదమన్నారు. విభజించడమే కాంగ్రెస్ పని కులం, ప్రాంతం, మతం ఆధారంగా ప్రజలను విడదీయడం, దోచుకోవడమే కాంగ్రెస్ పనంటూ మోదీ దుయ్యబట్టారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ బీజేపీకే ఓటేస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క కుమాయున్ ప్రాంతంలోనే ఏకంగా రూ.17 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు తాను శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. తాజా బడ్జెట్లో ప్రకటించిన పర్వతమాల, వైబ్రంట్ విలేజీ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్‌లో మౌలిక సదుపాయాలు మరింత విస్తరించి, టూరిజం పెరిగి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. -
కుటుంబ పార్టీలతో పెద్ద ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటి రాజకీయ పార్టీలే పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్టీపై ఒకే కుటుంబానికి చెందిన తరతరాల నేతలు పెత్తనం చెలాయించడం మంచి పరిణామం కాదన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాల్లో మోదీ ప్రసంగించారు. ‘కుటుంబం కోసం పార్టీ, కుటుంబంతో పార్టీ ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వానికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక ప్రధానికి సంబంధించినది కాదని అన్నారు. ఇది అంబేడ్కర్ గౌరవానికి, మన రాజ్యాంగ ప్రతిష్టకు సంబంధించిన వేడుక అని ఉద్ఘాటించారు. కుటుంబ పార్టీల కారణంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా దేశం ఒక రకమైన సంక్షోభం వైపు పయనిస్తోందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రజలకు ఆందోళన కలిగించే అంశమన్నారు. కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది సొంత ప్రతిభ, ప్రజల ఆశీర్వాదాలతో ఒక పార్టీలో చేరి రాణిస్తే అది వంశపారంపర్య పార్టీ కాబోదన్నారు. కానీ, పార్టీపై ఒకే కుటుంబం తరతరాలుగా స్వారీ చేయడం ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుందన్నారు. ముంబైలో 26/11 ఉగ్రదాడుల్లో మృతిచెందిన వారికి ప్రధాని నివాళులర్పించారు. అవినీతిపరులను కీర్తిస్తారా? భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు వ్యక్తులు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. వలసవాద మనస్తత్వం కలిగిన శక్తులు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీం బార్ అసోసియేషన్ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ఇవి పార్లమెంట్ వేడుకలు: ఓం బిర్లా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పార్లమెంట్‌కు చెందినవని, ప్రభుత్వానివి కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ప్రతిపక్షాలు పాల్గొంటే బాగుండేదని అన్నారు. ఉభయ సభల్లో జరిగిన చర్చల డిజిటల్ వెర్షన్, రాజ్యాంగం కాలిగ్రాఫ్డ్ కాపీ డిజిటల్ వెర్షన్, అన్ని సవరణలతో కూడిన రాజ్యాంగ ప్రతిని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్ బిర్లా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ ఎంపీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి: రాష్ట్రపతి కోవింద్ రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి మా ట్లాడారు. ఏ పార్టీకి చెందిన సభ్యులైనా పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ, విధాన సభ, పార్లమెంట్‌కు ఎంపికయ్యే ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన ప్రాధాన్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు. 15 పార్టీలు గైర్హాజరు రాజ్యాంగ దినోత్సవానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ తదితర 15 ప్రతిపక్షాలు గైర్హాజరయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు బిజూజనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీ, టీడీపీ పాల్గొన్నాయి. ఆదర్శాల ప్రకటనే రాజ్యాంగం: వెంకయ్య సంభాషణలు, చర్చల ద్వారా చట్టసభలు దేశానికి మార్గనిర్దేశం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు. రాజ్యాంగం అనేది విలువలు, ఆలోచనలు, ఆదర్శాల ప్రకటన అని అన్నారు. సోదరభావం స్ఫూర్తితో అం దరికీ న్యాయం, స్వేచ్ఛ కల్పించిందని తెలిపా రు. జాతీయ ఐక్యత కోసం ప్రయత్నించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, నిబంధనలకు ప్రజా ప్రతినిధులందరూ కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీది నిరంకుశ ధోరణి: కాంగ్రెస్ దేశ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినం కార్యక్రమాల్లో తాము పాల్గొన లేదని కాంగ్రెస్ తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అన్నారు. పార్లమెంట్ పరిశీలనతో నిమిత్తం లేకుండానే చేసే చట్టాలు వల్ల సమాజంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రేరేపిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రేరేపిత, లక్ష్యంగా చేసుకొని సాగించే దాడుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఓ పెద్ద కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని చెప్పారు. న్యాయవాదులు అబద్ధాలకు వ్యతిరేకంగా, నిజం వైపు నిలవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎన్వీ రమణ మాట్లాడారు. ‘‘న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తులకు, వ్యవస్థకు సహకరించాలి. మనమంతా ఓ పెద్ద కుటుంబంలో సభ్యులం. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైనవారిని ఎవరూ మరిచిపోరు’’ అని పేర్కొన్నారు. న్యాయవాదులకు సామాజిక బాధ్యత ఉండాలని, సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. -
డీఎంకే, కాంగ్రెస్‌లకు కుటుంబమే ముఖ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే, బీజేపీ ప్రజా సంక్షేమానికి అంకితమైన పాలనను అందిస్తుంటే, డీఎంకే, కాంగ్రెస్‌లు తమ హయాంలో కుటుంబ ప్రయోజనాలకు పాటుపడ్డాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దుయ్యబట్టారు. తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరుస్తూ గురువారం ప్రచారం చేశారు. పుదుచ్చేరీలో ఉదయం రోడ్‌షో ముగించుకుని మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రం విళుపురం జిల్లా తిరుక్కోయిలూరులో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు. మహిళలను, మాతృమూర్తులను కించపరుస్తూ అసభ్య పదజాలం ప్రయోగించే డీఎంకే–కాంగ్రెస్ కూటమికి ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ‘ఎన్డీఏకూ అవినీతితో కూడిన డీఎంకే–కాంగ్రెస్ కూటమికి మధ్య పోటీ జరుగుతోంది. తమిళనాడును పాలించిన ఎంజీఆర్ నిజమైన ప్రజా సేవకునిగా వెలుగొందారు. దేశంలో పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తులు ఎవరని సగర్వంగా గుర్తించాల్సి వస్తే ముందు ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత పేర్లను ప్రకటించాలి’అని ఆయన కోరారు. ప్రజా పరిపాలనలో జయలలిత అందరికీ ముఖ్యంగా మహిళలకు ఆదర్శంగా నిలిచారని శ్లాఘించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మార్గదర్శకంలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం అభివృద్ధి దిశగా జనరంజక పాలన అందిస్తున్నారన్నారు. డీఎంకే, కాంగ్రెస్‌లకు లంచాలు, రౌడీయిజం, భూ కబ్జా, కుటుంబ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అని విమర్శించారు. ఎంజీఆర్ సేవలకు గుర్తింపుగా చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు ఆయన పేరునే పెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. ఇటీవలే కన్నుమూసిన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తల్లిని ఉద్దేశించి ఇటీవల డీఎంకే నేత రాజా చేసిన కించపరిచే వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా చేశాయని చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని డీఎంకే నేతలు అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తున్నారన్నారు. గతంలో జయలలితను సైతం డీఎంకే దూషించిన సంగతిని ప్రజలు మరువజాలరని చెప్పారు. జల్లికట్టుపై నిషేధానికి కారణం రాహుల్‌గాంధీ, అయితే నేడు అదే జల్లికట్టు గురించి డీఎంకే, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. నేడు మధురైలో ప్రధాని మోదీ ప్రచారం ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాత్రి మధురైకి చేరుకున్నారు. 2వ తేదీన మధురై, కన్యాకుమారిల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం తదితరులు ఆయనతోపాటు ప్రచారంలో పాల్గొంటారు. -
ఉద్యమకారులకు టీఆర్ఎస్లో చోటు లేదు
అది ఓ ఫ్యామిలీ పార్టీ 1969 ఉద్యమకారుల సమాఖ్య ధ్వజం హైదరాబాద్, న్యూస్‌లైన్: కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఓ ఫ్యామిలీ పార్టీ అని, ఆ పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదని 1969 ఉద్యమకారుల సమాఖ్య ధ్వజమెత్తింది. నాయిని నర్సింహారెడ్డి మినహా ఎవ్వరూ నాటి ఉద్యమకారులు లేరని, నరేంద్ర లాంటి వారిని బయటకు పంపించేశారని ఆరోపించింది. టీఆర్ఎస్ పార్టీలో సామాజిక చైతన్యం కనిపించదని సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కొల్లూరి చిరంజీవి దుయ్యబట్టారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమంలో అవినీతి ఉందని, నాటి 1969 ఉద్యమం అందుకు భిన్నంగా నడిచిందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చిరంజీవి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం 1969లో ప్రారంభమైందని, ఉద్యమం ప్రారంభంలో జన హక్కుల పరిరక్షణ సమితి ఉండేదని గుర్తుచేశారు. తదనంతరం మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని చేపట్టారని వివరించారు. 2009లో కేసీఆర్ నిమ్మరసం సేవించి దీక్ష విరమించిన తర్వాత కూడా విద్యార్థులే ఉద్యమాన్ని నడిపించారన్నారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని చెప్పారు. రాజకీయ పార్టీ ఆవిర్భావం దిశగా: 1969 ఉద్యమకారుల సమాఖ్య ఇకపై రాజకీయ వేదికగా రూపుదిద్దుకునేందుకు ఆలోచన చేస్తోంది. తెలంగాణలోని పది జిల్లాల్లోని ఉద్యమకారులందరిని ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల చివర్లో రెండు రోజుల సదస్సును నిర్వహించి దీనిపై తుదినిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకుని వెళ్లే దిశగా యోచిస్తున్నట్లు కొల్లూరి చిరంజీవి తెలిపారు. ఎన్నికల లోపు కొత్త పార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 1969 ఉద్యమకారులు కేఎం ఆరీఫుద్దీన్, ఎల్ పాండురంగారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, మేచినేని కిషన్‌రావు, పి.విఠల్‌రావు, అన్వర్ పటేల్, బాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.