famous personalities
-
వీఐపీల మ్యాప్ వచ్చేసింది.. టక్కున సమాధానం
ఈ ప్రశ్నకు మీరు బదులిచ్చినా ఇవ్వకున్నా ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ మ్యాప్ (ప్రపంచ పటం) మాత్రం టక్కున సమాధానం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులు పుట్టిన ప్రాంతాలను చిటికెలో చూపిస్తోంది. ఉదాహరణకు లండన్‌లో పుట్టిన అత్యంత ప్రముఖ వ్యక్తి ఎవరు? అని యూజర్లు అడిగితే చార్లీ చాప్లిన్ పేరును మ్యాప్ సూచిస్తోంది. అమెరికాలోని హోనలులులో పుట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు వస్తోంది. అలాగే భారత్ నుంచి టిప్పుసుల్తాన్, ఔరంగజేబు వంటి నాటి రాజులు మొదలు మహాత్మాగాంధీ, నెహ్రూ, రాజీవ్‌గాంధీ వంటి నేతల వరకు ఆయా వ్యక్తులు పుట్టిన ప్రాంతాలనుబట్టి మ్యాప్ చూపుతోంది. మీ ప్రాంతంలోని ప్రముఖుల వివరాల కోసం ఈ లింక్‌ను tjukanovt.github.io/notable-people క్లిక్చేయండి. గుర్తించేది ఇలా.. వికీపీడియా, వికీడేటాలోని సమాచా రం ఆధారంగా ప్యారిస్ వర్సిటీకి చెందిన పరిశోధకులు వివిధ రంగాల వ్య క్తుల ప్రాముఖ్యతను ఇటీవల లెక్కగట్టారు. దీని ఆధారంగా ప్రముఖ భూ గోళ శాస్త్రవేత్త, వార్తావెబ్సైట్లు, సంస్థలకు ఆన్లైన్ మ్యాప్లందించే మ్యాప్ బాక్స్ కంపెనీ సీనియర్ డిజైనర్ టోపీ జుకనోవ్ ఇంటరాక్టివ్ మ్యాప్‌ను రూ పొందించారు. వికీపీడియాలో నమోదైన ఎంట్రీలు, వాటి పొడవు, 2015 నుంచి 2018 మధ్య వికీపీడియాలో ఒక్కో ప్రముఖ వ్యక్తికి లభించిన సగ టు వ్యూయర్షిప్ తదితరాలను పరిగణనలోకి తీసుకొని ఈ మ్యాప్‌ను రూ పొందించినట్లు జుకనోవ్ చెప్పారు. సంస్కృతి, శాస్త్ర పరిశోధన, నాయకత్వం, క్రీడలు లేదా ఆటలు అనే నాలుగు రంగాలకు చెందిన వ్యక్తుల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. -
వీకెండ్ స్పెషల్ : వార్తల్లో వ్యక్తులు
రంజన్ గొగోయ్ దేశ రాజకీయాలను మలుపుతిప్పే ఎన్నో తీర్పులు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెలువరించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి– బాబ్రీ మసీదు సమస్యని పరిష్కరిస్తూ తీర్పునిచ్చారు. సీజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి చేర్చారు. ఆయన పదవీ విరమణకు ఏడెనిమిది రోజుల ముందు ఈ కీలక తీర్పులు వెలువడటం విశేషం. టీఎన్ శేషన్ దేశం గర్వించదగ్గ ఐఏఎస్ అధికారి టీఎన్శేషన్. నీతికీ, నిజాయితీకీ, నిఖార్సయిన వ్యక్తిత్వానికీ పర్యాయపదంగానే ఆయన్ను చెప్పాలి. భారత ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించిన శేషన్... ఎన్నికల సంస్కర్త గా పేరొందారు. ఆయన చెన్నైలో నవంబర్ 10న కన్నుమూయడం ప్రజాస్వామ్య కాంక్షాపరులందర్నీ దుఃఖసాగరంలో ముంచింది. పీఎస్ కృష్ణన్ దళిత ఆదివాసీల పక్షపాతి, నిత్య ఉద్యమకారుడు, ప్రజాస్వామ్య కాంక్షాపరుడు అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీఎస్.కృష్ణన్ కూడా నవంబర్ పదోతేదీన టీఎన్.శేషన్ కన్నుమూసిన రోజునే మరణించారు. కేరళలోని తిరువనంతపురంలో అగ్రవర్ణ కుటుంబంలో జన్మించిన కృష్ణన్ చివరి శ్వాస వరకు అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. భగత్ సింగ్ కొష్యారీ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ సంసిద్ధంగా లేకపోవడంతో రాష్ట్రపతి పాలనను పరిశీలించాల్సిందిగా కేంద్రానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. షఫాలీ వర్మ హరియాణాలోని రోహతక్‌కు చెందిన పదిహేనేళ్ళ షఫాలీ వర్మ క్రికెట్ దిగ్గజం, కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ సామ్రాజ్యాన్నేలిన సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టి ప్రపంచం లోనే అతిచిన్న వయ స్సులో అర్ధ సెంచరీ సాధించిన ద్వితీయ మహిళగా నిలిచారు. -
ఎస్పీని కలిసిన ప్రముఖులు
కామారెడ్డి క్రైం: జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్వేతారెడ్డిని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కైలాస్ శ్రీనివాస్, యాద నాగేశ్వర్రావు, కొండా బైరయ్య ముప్పారపు ఆనంద్, ఉప్పల హరిధర్, గబ్బుల బాలయ్య, టీఆర్ఎస్ నాయకులు లద్దూరి లక్ష్మీపతి, వైద్య విధాన పరిషత్ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్, ఐఎంఏ బృందం ప్రతినిధులు వెంకట్రాజం, నరేందర్‌రావు, విజయ్‌కుమార్, దేవేంద్రసింగ్, రాజమౌళి, టీఆర్ఎస్వీ నాయకులు రాజేశ్, అర్చిత్, గంగారాం, మహేశ్, గంగాధర్, తదితరులున్నారు.