farmers Land Pooling Scheme
-
నిన్ను నమ్మం బాబు
సాక్షి, అమరావతి బ్యూరో : ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంత ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో ఏరోజూ ఈ ప్రాంత రైతులను పట్టించుకోని బాబు.. ఇప్పుడు తమపై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ నెల 28వ తేదీన పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించడంతో ఆ ప్రాంత రైతులంతా తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం సమీపంలో 29 గ్రామాల రైతులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని పేరుతో టీడీపీ నాయకులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ఈ ప్రాంతంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాదల మహీంద్ర, బుర్రా వెంకటశివా రెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, అలోకం సురేష్, కొయ్యగార వినోద్, బెజ్జం రాంబాబు,అరెపల్లి జోజి, రెహా్మన్, అక్కల లక్ష్మణరాయన రెడ్డి, మువ్వల కోటేశ్వరరావు, జొన్నల గడ్డ కిషోర్, చనుమోలు రామారావు, మేకల రవి, సవరం సురేంద్ర, అన్నూరు జక్కరయ్య తదితరులు పాల్గొన్నారు. కమీషన్ల రాజధాని రాజధానిని తమ కమీషన్లకు అడ్డాగా చంద్రబాబు, ఆయన మంత్రులు మలుచుకున్నారు. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకే భవన, రోడ్ల అభివృద్ధి పనులు అప్పగించారు. నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేసి కమీషన్లు కాజేశారు. – మేకల రవి, నెక్కళ్లు రైతుల ప్లాట్లను పట్టించుకున్నారా? టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడి భూములు ఇచ్చిన రైతుల్లో ఏ ఒక్కరినైనా పట్టించుకున్నారా? సకల సౌకర్యాలు కల్పించిన తర్వాత ప్లాట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. 34 వేల మంది రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్కటి అయినా అభివృద్ధి చేశారా? – రమణారెడ్డి, రైతు, శాఖమూరు అభివృద్ధి ఎక్కడ.? రాజధాని పరిధిలోని మూడు మండలాల్లోని 29 గ్రామాల్లో అసైన్డ్ భూములను కారుచౌకగా ఎవరు కొనుగోలు చేశారో అందరికీ తెలుసు. దళితులను మభ్యపెట్టి భూములు లాక్కున్నారు. నాలుగేళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడి వేల కోట్లు దోచుకున్నారు. – కొండేపాటి సతీష్‌చంద్ర, రైతు, మందడం -
భూమి లాక్కున్నారు.. డబ్బులివ్వలేదు!
సాక్షి, విజయవాడ: వారంతా రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు... రెండు, మూడు దశాబ్దల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళిత, బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన రైతు కుటుంబాలే. తమకు ఉన్న రెండెకరాల భూమి నే తమ సర్వస్వంగా భావించారు. అయితే అటువంటి 12 మందికి చెందిన 20.86 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. అదేమంటే నష్టపరిహారం ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఆ పేదలంతా లబోదిబోమంటున్నారు. రూ.5.21 కోట్లు బకాయి! పేదలకు జగ్గయ్యపేటలోని బలుసుపాడు రోడ్డులో ఆర్ఎస్ నెం: 530/2,3,5, 531/1,2,4, 532/3, 537/1,2,3 12 మంది పేదలకు 20.86 ఎకరాల భూమి ఉంది. కొంత మందికి రెండు ఎకరాలు ఉండగా.. మరికొంత మందికి ఒక ఎకరా భూమి ఉండేది. వీటిని పేదలకు గతంలో ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ పేదలకు చంద్రన్న, పీఎంఆర్‌వై ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీంతో ఈ భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఒక్కొక్క ఎకరాకు రూ.25 లక్షలు చొప్పున రూ.5,21,50,000 చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భూమి ప్రభుత్వానికి అప్పగించారు. ఆ స్థలంలో 1500 ఇళ్లు నిర్మాణం పేదల వద్ద తీసుకున్న నిధులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో 1500కు పైగా చంద్రన్న పీఎంఆర్‌వై ఇళ్లు నిర్మించి ఆ ఇళ్లను పేద ప్రజలకు అప్పగించారు. ఈ ఏడాది జనవరి వరకు పేదల తమ డబ్బు కోసం అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో 12 మంది తరుపున గారపాటి వెంకటేశ్వరరావు, ముత్యాల వెంకటేశ్వర్లు, కణితి విజయకుమార్, షేక్ గౌస్య తదితరులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి హాజరై తమకు న్యాయం చేయమని ఆర్డీఓ చక్రపాణికి విన్నవించారు. -
‘నిషేధం’ చెరలో రైతుల భూములు
ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది రైతు కుటుంబాలను గత అయిదేళ్లుగా కలచి వేస్తున్న సమస్య ‘నిషేధ జాబితా’. ఈ నిషేధ జాబి తాలోకి ఎప్పుడు తమ భూమి వెళ్తుందో తెలియక ప్రతి రైతు కుటుంబమూ ఆందోళనపడింది. భూ లావాదేవీల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన రైతులకు అక్కడి సిబ్బంది ‘మీ భూమి రిజిస్టర్ చేయడానికి అనుమతిలేద’ని జవాబివ్వడం రివా జుగా మారింది. ఎందుకని ప్రశ్నిస్తే మీ భూమి సెక్షన్ 22ఏ(ప్రొహిబిషన్) జాబితాలో ఉందని అక్కడివారు చెబుతున్నారు. దీని అర్థ్ధమేమిటో, తమ భూమి ఎందుకు ఈ జాబితాలోకి పోయిందో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. వాస్తవానికి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేం దుకు ఈ సెక్షన్ రూపొందించారు. కానీ టీడీపీ హయాంలో ఇది పూర్తిగా దుర్వినియోగమైంది. తమ వ్యతిరేకులని అనుమానం వస్తే చాలు తహసీల్దార్ లకు చెప్పి ఆ రైతుల భూమిని సెక్షన్ 22ఏ జాబితాలో పెట్టించడం టీడీపీ నేతలకు రివాజుగా మారింది. ఇది శ్రుతిమించిందని, ఇదిలాగే సాగితే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని గ్రహించిన అప్పటి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జీవో ఎంఎస్ నంబర్ 575 జారీ చేసింది. దాని ప్రకారం 1954కు ముందున్న భూములు రైతుల హక్కు భుక్తంలో ఉన్నా, వారి పేరున రిజిస్టర్ అయి ఉన్నా ఆ భూములను సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగిం చాలని ఆ జీవో నిర్దేశిస్తోంది. కానీ అందుకు జిల్లా కలెక్టర్లు అభ్యంతరం చెప్పడంతో వివరణతో ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయినప్పటికీ సమస్య మాత్రం ఎప్పటిలా ఉండిపోయింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి రిజిస్ట్రార్ల పరిధిలో సెక్షన్ 22ఏ కింద నాలుగు లక్షల ఎకరాల సర్వే నంబర్లు ఉన్నాయి. దీనిలో కనీసం 25 శాతం...అంటే లక్ష సర్వే నంబర్లకు చెందిన రైతుల భూములన్నీ లావాదేవీలకు అనర్హంగా మిగిలిపో యాయి. మిగిలిన 3 లక్షల సర్వే నంబర్లు కూడా ప్రభుత్వానికి చెందిన భూములుగా చూపుతున్నారు. చాలామంది రైతులకు పట్టాదారు పాస్ పుస్త కాలు ఇచ్చినా... అవి వివిధ కొనుగోళ్లు, అమ్మకాల్లో పలువురి చేతులు మారినా ఉన్నట్టుండి ఆ భూమి సెక్షన్ 22ఏ కిందికిపోతోంది. ఉదా‘‘కు తూర్పు గోదావరి జిల్లాలో 1936లో ఒక భూమి అమ్మకం జరిగింది. 1990లో ఆ భూమిలో రైతు పెద్ద కోళ్ల ఫారం కట్టుకుని దానిపై రూ. 3 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని వ్యాపారం నడుపుకుంటు న్నారు. అయితే నిరుడు అధికారులు షాక్ ఇచ్చారు. ‘మీ భూమి సెక్షన్ 22ఏలో ఉంద’ని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తన హక్కు భుక్తంలో ఉన్న భూమిని ఇలా ఉన్నట్టుండి ‘నిషేధ జాబితా’లోకి నెట్టేస్తే ఆ రైతు ఏమైపోవాలి? చాలామంది తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం భూమిని అమ్ముకుందామని చూస్తుంటే ఈ సెక్షన్ అడ్డొస్తోంది. భూ పరిమితి చట్టం కింద ఉన్న కేసుల రికార్డులు రెవెన్యూ శాఖ వద్ద లేకపోవడంతో అన్ని భూములనూ వారు ఈ సెక్షన్ కిందికి తీసుకొస్తున్నారు. రైతులను ఇబ్బందికి గురిచేస్తున్న మరో అంశమేమంటే–ఒక సర్వే నంబ ర్లో ప్రభుత్వ అవసరాల కోసం కొంత భూమిని తీసుకోవాల్సి వస్తే ఆ సర్వే నంబర్ మొత్తాన్ని సెక్షన్ 22ఏ కింద పెట్టడం. ఈ సమస్యలో చిక్కుకున్న రైతు ముందుగా తహసీల్దార్‌కి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి అది ఆర్డీఓకు వెళ్తుంది. ఆపై సబ్ కలె క్టర్‌కు చేరుతుంది. చివరాఖరికి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమం ఏళ్ల తరబడి నడుస్తుంది. ఇన్నేళ్లూ సర్కారీ కార్యాల యాల చుట్టూ తిరుగుతూ, వివిధ చోట్ల చేతులు తడుపుతూ రైతులు పడే అవస్థ వర్ణ నాతీతం. ఈ జిల్లాలో భూ సంస్కరణల అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీని మొదట రాజమండ్రి, తర్వాత అమలా పురం, అటుపై కాకినాడకు మార్చడం వల్ల రికార్డులు గల్లంతయ్యాయి. పర్యవసానంగా న్యాయస్థానాల్లో రైతులు గెలిచినా వారి భూములు తిరిగి సెక్షన్ 22ఏ కిందికొచ్చాయి. 1923లో భూ సర్వే చేసినప్పుడు కొన్ని భూముల అనుభవదారుల పేర్లు తెలియని సంద ర్భాలుంటే, వాటి వివరాల వద్ద చుక్కలు పెట్టడం ఆనవాయితీగా ఉండేది. కానీ వాటిని సెక్షన్ 22ఏ కిందికి తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెట్టారు. అలాగే ఈనాం రద్దు చట్టంకింద భూములను ఆయా ఈనాందార్లు అమ్ముకోవడానికి హక్కు ఉన్నా ఈ జాబితాలో చేర్చడం వల్ల వాటిని సాగు చేసుకుం టున్న రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ సమ స్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి ఇప్పటికే తీసు కెళ్లాం. ఇది సాధ్యమైనంత త్వరగా పరిష్కారమవు తుందని.. తమ హక్కుభుక్తంలో ఉన్న భూములపై మళ్లీ తమకు పూర్తి హక్కులు లభిస్తాయని లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 94402 04323 కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి -
మా భూమి ఇస్తాం... తీసుకోండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన ‘ఉప్పల్ భగాయత్’ను శివారు రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ తరహాలోనే తమ ప్రాంతాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేయాలంటూ కోరుతున్నారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ‘మీ భూమి ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామం’టూ ఈ నెల ఐదున హెచ్ఎండీఏ మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో శివారు ప్రాంతరైతులు భూములివ్వడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఘట్కేసర్, కీసర, శంషాబాద్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, శామీర్‌పేట, కొహెడ... ఇలా వివిధ ప్రాంతాల రైతులు తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ల్యాండ్‌పూలింగ్ అధికారులను కలసి మాట్లాడుతున్నారు. ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయా రైతులు చెప్పిన భూముల్లో పర్యటించి లేఅవుట్‌కు పనికొస్తాయా, లేదా అని అధికారులు నిర్ధారించుకొని ముందుకెళ్లనున్నారు. 50 ఎకరాలకు తగ్గకుండా... హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత ల్యాండ్‌పూలింగ్ పథకం, ఏరియా డెవలప్మెంట్ ప్లాన్, డెవలప్మెంట్ స్కీం 2017 జీవో ప్రకారం కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలి. భూమిపై సంపూర్ణంగా భూయాజమాన్యపు పట్టా(టైటిల్ క్లియర్) ఉండాలి. ప్రతిపాదిత భూమి మాస్టర్‌ప్లాన్ ప్రకారం బఫర్‌జోన్, చెరువులు, ఫుల్ ట్యాంక్ లెవల్, ఓపెన్ స్పేస్‌లో ఉండరాదు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ తరహాలోనే అంతా అభివృద్ధి చేసిన స్థలంలోని ప్లాట్లలో సగం మేర రైతులకు కేటాయించనుంది. మిగతాసగం ప్లాట్లను హెచ్ఎండీఏనే వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చంతా హెచ్ఎండీఏనే భరిస్తుందన్నారు. స్వతహాగా... పట్టాదారుల అంగీకారంతో... హెచ్ఎండీఏ స్వతహాగా గుర్తించిన ప్రాంతాల్లో భూమి సేకరించి లేఅవుట్ అభివృద్ధి తీసుకునే అధికారం కూడా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ఇరువైపులా కిలోమీటర్ పరిధిలో మినీ నగరాలు అభివృద్ధి చేసేందుకు ఈ అధికారాలు ఉపయోగించుకునే దిశగా హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంగీకరించిన రైతులతో అభివృద్ధి ఒప్పందం–జీపీఏ కుదుర్చుకుంటారు. ఇది ఆమోదం పొందిన ఆరునెలల్లోగా రోడ్లు, పాఠశాలలు, పార్కులు, పచ్చదనం, రవాణాసౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసిన ప్లాట్లను సంబంధిత యజమానికి అప్పగిస్తారు. రోడ్డుకు అనుకొని ఉన్న భూముల యజమానులకు అక్కడే స్థలాన్నిచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మిగతాభూములకు లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ప్లాట్లు కేటాయించిన తర్వాత ఆరునెలల్లోగా అక్కడ మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతను యజమానుల సంఘానికి అప్పగించేలా ల్యాండ్‌పూలింగ్ పథకంలో నిబంధనలు పొందుపరిచారు. మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతినెలా ఆ భూమి మూల విలువ(బేసిక్ వాల్యూ)పై 0.5 శాతం పరిహారాన్ని చెల్లిస్తారు. మినీ నగరాలతోపాటే లాజిస్టిక్ హబ్‌లు... ల్యాండ్ పూలింగ్ పథకం కింద ఉదాహరణకు ఒక ప్రాంతంలో 100 ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇందులో వస్తువు నిల్వ కేంద్రాలు(లాజిస్టిక్ హబ్)ల కోసం 20 ఎకరాలు పక్కన పెడితే, మిగతా 80 ఎకరాల్లో లే అవుట్‌ను అభివృద్ధి చేయాలి. మొత్తం మౌలిక వసతులు కల్పించగా 2,45,000 గజాలు ప్లాట్ల రూపంలో ఉంటుంది. రైతులతో కుదుర్చుకున్న అవగాహన ప్రకారం ఎకరాకు 1,500 గజాలు కేటాయించాలి. అంటే 2,45,000 గజాలలో 100 మంది రైతులకు 1,50,000 గజాలను ఇవ్వనుంది. మిగిలిన 90,000 గజాలలో ఉన్న ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును అదే ప్రాంతంలో ఉన్న లాజిస్టిక్ హబ్‌కు కేటాయించి అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ రానుంది. అటు నగరంపై పడుతున్న రవాణా, ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం, ఇటు శివారు ప్రాంతాలను అభివృద్ధి వైపు తీసుకెళ్లేలా చేయడంలో ఈ ల్యాండ్ పూలింగ్ పథకం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. -
భూములు పాయ.. పరిహారమూ రాకపాయ!
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): జీవనాధారమైన భూములు కోల్పోయి.. పైసా పరిహారం రాక.. కుటుంబాలు గడవక తల్లడిల్లుతున్న రైతుల బాధలు చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. 2015లో నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు నాలుగేళ్లుగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ‘పునరావాసం మాట దేవుడెరుగు.. కనీసం పరిహారం అయినా చెల్లించి ఆదుకోండి’ అంటూ గుండెలు బాధుకుంటున్నా పాలకుల హృదయం కరగడం లేదు. ‘భూములు కోల్పోయాం.. పరిహారం అతీగతీ లేదు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు’ ఇదీ నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల ఆక్రందన. నాలుగేళ్లయినా ఇప్పటికీ పైసా పరిహారం అందక, కుటుంబాలు గడవక రైతులు తీవ్ర వేదన పడుతున్నారు. నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు పంపారు. అలాగే పరిహారం విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పోస్టు, మెయిల్ ద్వారా వినతి పత్రం పంపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 2015లో నిప్పులవాగు విస్తరణలో భాగంగా వెలుగోడు మండలం వేల్పనూరు, అబ్దుల్లాపురం గ్రామాలకు చెందిన 37 మంది రైతుల నుంచి దాదాపు 100 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. వీరికి రూ.91.70 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాల్సి ఉంది. పునరావాసం సంగతి దేవుడెరుగు.. పరిహారం ఇవ్వండంటూ కోరుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. 2016 జనవరిలో అవార్డు ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు భూములు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన భూములకు పరిహారం విడుదల చేసేందుకు కర్నూలు ఆర్డీఓ 2018 నవంబరు 30న బిల్లులను పే అండ్ అకౌంట్స్ అధికారికి సమర్పించారు. మరుసటి రోజునే పీఏఓ బిల్ ఐడీ నంబరు 904684 ద్వారా సీఎఫ్ఎంఎస్ విధానంలో ఆర్బీఐకి పంపారు. అంటే మూడున్నర నెలలుగడచినా రైతుల భూసేకరణ బిల్లులను ప్రభుత్వం పట్టించుకోలేదంటే వీరిపై ఏ పాటి ప్రేమ ఉందో స్పష్టమవుతోంది. ఈ భూసేకరణ బిల్లులను ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పెండింగ్‌లో ఉంచినట్లు స్పష్టమవుతోంది. సీఎఫ్ఎంఎస్ విధానంలో ముందు వెళ్లిన బిల్లులకు ముందుగా నగదు వారి ఖాతాలకు జమచేయాలి. కానీ, బిల్లులు వెళ్లిన తర్వాత పీఏఓ నుంచి వెళ్లిన కాంట్రాక్టర్ల చెల్లింపు బిల్లులు ఆమోదం పొందాయి తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ ఇదేనా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన వారందరూ సన్న, చిన్న కారు రైతులే. వీరు భూములు కోల్పోయి ప్రభుత్వ దయ కోసం ఎదురు చూస్తున్నారు. -
నాలుగేళ్లయినా..నత్తనడకే!
‘తోటపల్లికి నేనే శంకుస్థాపన చేశాను. నేనే పూర్తిచేసి నీరిచ్చాను. అవునా కాదా.. తమ్ముళ్లూ...’ విజయనగరంలో మంగళవారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి. ఆయన వందిమాగధులు వాటికి వంతపాడినా.. వాస్తవమేమిటో ఆ ప్రాంత రైతులకు తెలుసు. ఎవరో పూర్తిచేసినదాన్ని ఆయన ప్రారంభించేసి అదేదో తన ఘనతలా చెప్పుకున్నా... ఆ తరువాత చేయాల్సిన పదిశాతం పనులు చేయడంలో ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తున్నారు. దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరందక... దీనిపైనే ఆశలు పెట్టుకున్న రైతాంగం ఎప్పుడు పూర్తవుతుందా... అని ఎదురు తెన్నులు చూస్తోంది. కానీ నాలుగేళ్లు కావస్తున్నా... ఇంకా అసంపూర్తిగా ఉండిపోవడమే విచారకరం. విజయనగరం గంటస్తంభం: తోటపల్లి ప్రాజెక్టు ఎన్నోఏళ్లనాటి కల. రైతుల డిమాండ్‌ను తాను ఆధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు పట్టించుకోని చంద్రబాబునాయుడు 2004 ఎన్నికలకు ముందు ఓట్లు దండుకునే క్రమంలో ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసి వదిలేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిధులు విరివిగా కేటాయించి పనులు దాదాపుగా పూర్తికానిచ్చారు. 2008లో 450.24కోట్లు అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు ఇవ్వగా పనులు ప్రారంభమయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాతఆయకట్టు 64వేల ఎకరాలతోపాటు కొత్తగా 1.20లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా మరో 15వేల ఎకరాలకు నీరందించేందుకు కూడా ఆయన అనుమతులు మంజూరు చేశారు. ఆయన హాయాంలో రూ.400కోట్లు ఖర్చు చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అంచనాలు రూ.750కోట్లకు పెంచింది. ఎట్టకేలకు నిధులు విడుదల కావడంతో 2014 నాటికి దాదాపుగా 90శాతం పనులు పూర్తయ్యాయి. అడ్డు తాత్కాలికంగా తొలగించి నీరు విడుదల 10శాతం పనులు మిగిలి ఉండడంతో వాటిని పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరివ్వాల్సిన బాధ్యత ప్రస్తుత తెలు గుదేశం ప్రభుత్వంపై పడింది. కానీ ప్రభుత్వం మొత్తం పనులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేదు. అప్పటికే మెయిన్ కెనాల్ పనులతోపాటు బ్రాంచి కెనాల్స్ పనులు పూర్తయి ఉండగా వాటిపై రైతులు పొలాలకు వెళ్లేందుకు ఉన్న అడ్డు తొలగించి కాలినడక వంతెనలు నిర్మించి నీటిని విడుదల చేశారు. ఇది జరిగి నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు మిగతా పనులు పూర్తి చేయకపోవడం విశేషం. కాలువల లైనింగు పనులు, డైవర్షన్ కెనాల్, పొలాలకు నీటి సరఫరాకు పిల్ల కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నా యి. నీరు విడుదల చేసే నాటికి ఈ పనులు పెండింగ్‌లో ఉండగా ఇప్పటికీ పూర్తి చేయకపోవడం విశేషం. వాస్తవానికి పనులు చేసేందుకు ఈ ప్రభుత్వం అంచనాలను రూ.1015కోట్లకు పెంచినా పనులు మాత్రం పూర్తి చేయలేకపోయింది. పనిచేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు సిద్ధంగా ఉన్నా భూసేకరణ, నిధుల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ప్రాజెక్టు పరిధిలో ఇంకా 376 ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉంది. పనులు చేసేందుకు అవసరమైన నిధులు కాంట్రాక్టర్‌కు అందాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.152కోట్లు నిధులు కేటాయించినా బిల్లులు మాత్రం సకాలంలో జరగకపోవడంతో కాంట్రాక్టరు నాన్చుతున్నారు. పూర్తి ఆయకట్టుకు అందని నీరు డైవర్షన్ కెనాల్స్, పిల్ల కాలువ పనులు చేయకపోవడంతో పంట పొలాలకు నీరందే అవకాశం లేదు. నీరు విడుదల చేసిన తర్వాత నాలుగేళ్లకు వచ్చిన ఖరీఫ్ సీజన్లో కూడా రెండు జిల్లాల్లో పూర్తి విస్తీర్ణానికి నీరు విడుదల చేయలేకపోయారు. 1.20లక్షల ఎకరాల్లో ఈ ఏడాది 70వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చామని అధికారులు చెబుతుండడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో కొన్ని మండలాల్లో ఒక ప్రాంతానికి నీరందకపోగా మరికొన్ని మండలాల్లో పూర్తిగా అందలేదు. తెర్లాం మండలంలో 10వేల ఎకరాలకు తోటపల్లి నీరు రావాల్సి ఉండగా ఈ ఏడాది 4900 ఎకరాలకు మాత్రమే విడుదల చేశారు. టైలెండ్లో ఉన్న చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాలకు అసలు నీరు విడుదల కానేలేదు. అక్కడి రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరవు కాలంలో నీరివ్వనపుడు ప్రాజెక్టు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కైనా నీరొస్తుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ జరగాల్సి ఉంది ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదు. డైవర్షన్ కెనాల్స్, పిల్ల కాలువల కోసం భూమి అవసరం ఉంది. రెవెన్యూ అధికారులను సేకరించి ఇవ్వాలని కోరాం. ఇచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. ఈ ఏడాది 70వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చాం. చెరువుల ద్వారా ఇతర భూములకు 40వేల వరకు ఇచ్చాం. వచ్చే జూన్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – పోలేశ్వరరావు, ఎస్ఈ, టీటీపీఆర్ సర్కిల్ -
చంద్రబాబు అక్రమ కట్టడం కనిపించడం లేదా..?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. ప్యాకేజీ ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులపై వివక్ష చూపిందని అమరావతి రైతులు కమిషన్‌ను ఆశ్రయించారు. టీడీపీ ప్రభుత్వంపై దాఖలైన ఫిర్యాదును కమిషన్ స్వీకరించింది. కాగా, రైతులు ఇచ్చిన పిటిషన్‌పై విచారణకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ శ్రీధర్ హాజరుకాకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ఏపీ ప్రభుత్వం తరపున మరొకరు విచారణకు హజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే తాము ప్యాకేజీ అమలు చేశామని ఏపీ ప్రభుత్వ అధికారులు కమిషన్‌కు తెలిపారు. పొంతనలేని సమాధానాలు.. నదీ సమీపంలోని భూములకు కొట్టుకు పోయే ప్రమాదం ఉందని సుప్రీం కోర్టు చెప్పినందునే ఆ భూములకు తక్కువ ప్యాకేజి ఇచ్చామని సీఆర్డీఏ అధికారులు కమిషన్‌కు విన్నవించారు. కాగా, నదీ సమీపంలోనే చంద్రబాబు అక్రమ కట్టడం కూడా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం అక్రమ కట్టడం మీకు కనిపించడం లేదా అని కమిషన్ ఏపీ అధికారులను ప్రశ్నించింది. అధికారులు పొంతన లేని జవాబులు చెప్పడంతో విచారణ వాయిదా వేసింది. మభ్యపెట్టి తమ నుంచి బలవంతంగా లాక్కున్న భూములు వెనక్కి ఇప్పించాలని, సమాన ప్యాకేజీ ఇవ్వాలని రైతులు కమిషన్‌ను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా.. జరీబు రైతులకు ఇచ్చిన మాదిరిగానే అసైన్డ్ భూములకు కూడా సమాన ప్యాకేజీ ఇవ్వాలనీ, రైతు కూలీలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సురేష్ డిమాండ్ చేశారు. అలాగే, జీవో నెంబర్ 41 ని రద్దు చేయాలనీ, లేదంటే హై కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. -
‘ల్యాండ్‌పూలింగ్’కు చిక్కులు!
ప్రతాప్‌సింగారం మెగా వెంచర్‌కు అడ్డంకులు సర్వే దశలోనే చతికిలబడ్డ హెచ్ఎండీఏ సరిహద్దులు తేలక ప్రాజెక్టు పక్కదారి.. సాక్షి, సిటీబ్యూరో: భూ అభివృద్ధి పథకం ద్వారా నగర శివార్లలో మరోసారి రియల్ బూమ్‌ను సృష్టించాలనుకొన్న హెచ్ఎండీఏకు చుక్కెదురైంది. భూములిచ్చేందుకు రైతులు ముందుకొచ్చినా...వాటిని అభివృద్ధి చేసేందుకు సవాలక్ష ఆంక్షలను సాకుగా చూపుతూ హెచ్ఎండీఏ వెనుకడుగు వేస్తోంది. ముఖ్యంగా భూముల సరిహద్దులు తేలడం లేదంటూ... సర్వే దశలోనే చతికిలబడ్డ అధికారులు తమ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఏకంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కే తిలోదకాలిచ్చేందుకు పూనుకొన్నారు. ఫలితంగా శివారు ప్రాంతాల్లోని భూముల్లో సిరులు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. భూ అభివృద్ధి పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద నగరం చుట్టుపక్క ప్రాంతాల్లోని రైతుల నుంచి భూమిని సేకరించి కొత్త లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని ఏడాది క్రితం హెచ్ఎండీఏ నిర్ణయించింది. రైతులకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లో 40 శాతం భూమి (ప్లాట్లు) తిరిగి అప్పగించాలనుకొంది. ఆయా లేఅవుట్లలో రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక అవసరాలకు కొంత భూమిని మినహాయించి అభివృద్ధి చేసినందుకు గాను మిగతా భూమిని హెచ్ఎండీఏ తీసుకొంటుంది. ఇదీ... ల్యాండ్ పూలింగ్ స్కీం ఉద్దేశం. ఈ మేరకు ఉప్పల్‌కు సమీపంలోని ప్రతాప్‌సింగారం వద్ద మూసీని ఆనుకొని ఉన్న 300ల ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. ఇక్కడ కొత్త లేఅవుట్ అభివృద్ధికి భూ సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన హెచ్ఎండీఏ ఆ తర్వాత మనసు మార్చుకొంది. ప్రతాప్‌సింగారం వద్ద 300 ఎకరాల భూముల్లో రెవిన్యూ, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నిర్వహించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు, రికార్డుల్లోని భూములకు పొంతనే లేదని, పైగా సరిహద్దులు కూడా పక్కాగా తేలడం లేదంటున్నారు. రికార్డుల్లో ఉన్న భూ యజమాని పేర్లు, ప్రస్తుతం పొజిషన్లో ఉన్న యజమాని పేర్లకు సంబంధం లేకుండా ఉందని, వీటిని సేకరిస్తే కోర్టు వివాదాలు ఉత్పన్నమవుతాయన్న కారణాన్ని సాకుగా చూపుతూ ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేసినట్లు సమాచారం. ఆశ అడియాసే... తమ భూములను హెచ్ఎండీఏకు ఇస్తే (60-40 ప్రాతిపదికన) అభివృద్ధి చేసిన ప్లాట్లు వస్తాయని ఆశించిన చిన్న, సన్నకారు రైతులకు నిరాశే మిగిలింది. అర ఎకరం భూమినిస్తే వెయ్యి చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్ దక్కుతుందని, దీన్ని అమ్ముకోవడం ద్వారా ఆర్థికంగా సమస్యలను నుంచి బయటపడవచ్చని పేద రైతులు ఆశించారు. కాగా, ఆయా భూముల్లో సర్వే నిర్వహించిన అధికారులు ఇక్కడ మొత్తం 450 మంది రైతులకు చెందిన భూములున్నట్లు గుర్తించారు. ఎక్కడ భూమి తీసుకొంటే అక్కడే ప్లాట్ ఇవ్వాలన్నది నిబంధన. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నరైతులకు ఇది సాధ్యమే. అయితే... మొత్తం రైతుల్లో 1/2 ఎకరా భూమి ఉన్నవారే ఎక్కువగా ఉండటంతో రోడ్లు, పార్కు వంటి వాటి కి భూములు పోయిన వారికి అక్కడే ప్లాట్లు ఇవ్వడం అసాధ్యంగా మారింది. ఇదే విషయమై చివర్లో రైతులు మెలికపెడితే చిక్కులు ఎదురవుతాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ప్రాజెక్టును పక్కకు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో జాప్యంపై సంబంధిత అధికారిని వివరణ కోరగా ఫిజికల్ సర్వేలో ఆయా భూములు రెవిన్యూ రికార్డుల్లోని సరిహద్దుతో మ్యాచ్ కావట్లేదని, ఇప్పుడు వీటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యామని సమాధానం ఇచ్చారు.