Fast bowlers
-
టీమిండియా ఫాస్ట్ బౌలర్లంతా వన్ మ్యాచ్ వండర్లేనా.. లోపం ఎక్కడుంది..?
క్రికెట్ అంటే ఇండియా.. ఇండియా అంటే వరల్డ్ క్లాస్ బ్యాటర్స్, స్పిన్నర్స్.. క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ నానుడుతో ఏకీభవించాల్సిందే. ఈ నానుడు ఎంత సత్యమో, మ్యాచ్‌లు గెలవాలంటే బ్యాటర్లు, స్సిన్నర్లు మాత్రమే రాణిస్తే సరిపోదన్నది కూడా అంతే కాదనలేని సత్యం. భారత క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు, స్పిన్నర్లు రాణించడం మనం చూశాం. అయితే నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు కనీసం ఓ దశకం పాటు రాణించడం మనమెప్పుడు కనీవినీ ఎరుగం. 80వ దశకంలో కపిల్ దేవ్ (ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్), 90ల్లో జవగల్ శ్రీనాథ్, ఆతర్వాత జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, ఇటీవలి కాలంలో బుమ్రా, షమీ, హార్ధిక్ పాండ్యా (ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్) లాంటి వారు అడపాదడపా మెరుపులు మెరిపించినా.. నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు అన్న ట్యాగ్‌లకు వీరు న్యాయం చేశారంటే సగటు భారత క్రికెట్ అభిమాని మనసు ఒప్పుకోదు. గతంతో పోలిస్తే, ఇటీవలి కాలంలో దేశవాలీ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల సంఖ్య కాస్త పెరిగినా.. జాతీయ జట్టుకు వచ్చే సరికి వారు వన్ మ్యాచ్ వండర్లుగా మిగిలిపోతున్నారు. బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా మినహాయించి, ఈ మధ్యకాలంలో వచ్చిన ఫాస్ట్ బౌలర్లు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు నిలకడగా రాణించింది లేదు. ఉమేశ్ యాదవ్, నటరాజన్, అవేశ్ ఖాన్, నవ్‌దీప్ సైనీ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ఫాస్ట్ బౌలర్లు.. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఒక్క మ్యాచ్ ఆడితే రెండో మ్యాచ్‌లో గాయమో లేక తేలిపోవడమో జరుగుతుంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. టీ20 వరల్డ్‌కప్‌లో, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించి, భవిష్యత్ ఆశాకిరణంలా కనిపించిన అర్షదీప్ సింగ్ ఇవాల్టి మ్యాచ్‌లో పూర్తి తేలిపోయాడు. లార్డ్‌గా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే శార్దూల్ ఠాకూర్ అయితే మరీ అధ్వానంగా తయారయ్యాడు. అతను ఆల్‌రౌండర్ పాత్రకు ఎన్నడూ న్యాయం చేసింది లేదు. అయినా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదిస్తున్నాడు. ఈ కేటగిరికి చెందిన మరో ఆటగాడు దీపక్ చాహర్ విషయానికొస్తే.. అతను ఆడేది తక్కువ, గాయాలపాలై నేషనల్ క్రికెట్ అకాడమీలో గడిపేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిని నమ్ముకుని టీమిండియా మేనేజ్మెంట్ మెగా టోర్నీల బరిలోకి దిగితే.. ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్‌లలో ఎదురైన పరాభవాలే మున్ముందు పలకరిస్తాయి. భారత దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నా, వేల సంఖ్యలో ప్రొఫెషనల్ ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్ ఆడుతున్నా.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు కరువయ్యారంటే సగటు భారత క్రికెట్ అభిమాని సిగ్గుతో తల దించుకోవాల్సిందే. పరిస్థితి ఇలా తయారవ్వడానికి కారణాలేంటి.. లోపం ఎక్కడుంది..? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకోకపోతే, సమీప భవిష్యత్తులో వెస్టిండీస్‌కు పట్టిన గతే టీమిండియాకు కూడా పట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..!
Shoaib Akhtar Highlights X Factor Lacked By Indian Pacers: టీమిండియా పేసర్లను ఉద్ధేశించి పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో పాక్ పేసర్ల ఆధిపత్యం గురించి ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీతో మాట్లాడుతూ భారతీయుల ఆహారపు అలవాట్లను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో భారత పేస్ దళం బాగా పుంజుకున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో పాక్ పేసర్లతో పోలిస్తే బాగా వెనకపడి ఉందని అన్నాడు. భారత పేసర్లు తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిస్తారని, ఇదే వారికి పాక్ పేసర్లకు తేడా అని పేలాడు. పాక్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి, యాటిట్యూడ్ భారత పేస్ బౌలర్ల ముఖాల్లో కనిపించవని, ఈ వ్యత్యాసం క్రికెట్ తొలినాళ్ల నుంచే ఉందని, అందుకు కారణం మా తిండి, వాతావరణం అని తెలిపాడు. పాక్ బౌలర్లు బౌలింగ్ వేసే సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించరని.. వికెట్ తీయడమే వారి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ యాటిట్యూడే వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుందని వివరించాడు. దీనికి తోడు మేము ఎక్కువగా మాంసాహారం తింటామని, అందుకే దృడంగా ఉంటామని, ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సింహాల్లా పరుగెడతామని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తరం పాక్ పేసర్లలో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని ఈ సందర్భంగా ఉదహరించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా పేస్ యూనిట్‌కు మించిన ఫాస్ట్ బౌలింగ్ దళం ఏ జట్టుకు లేదనడం అతిశయోక్తి కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, టి నటరాజన్ వంటి పేసర్లతో భారత పేస్ విభాగం కలకలలాడుతోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల పేసర్ల కంటే భారత పేస్ దళం దృడంగా కనిపిస్తుంది. చదవండి: ధోని నా భార్య కాదు.. బీసీసీఐలో నాకు గాడ్ ఫాదర్లు ఎవ్వరూ లేరు..! -
ఆ భారత బౌలర్ టీ20లకు పనికిరాడు.. పక్కన పెట్టండి
Sanajay Manjrekar commnets On Mohammed Shami: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శుక్రవారం (నవంబర్5) టీమిండియా కీలక మ్యాచ్‌లో స్కాట్లాండ్తో తలపడనుంది. ఈ సందర్బంగా భారత బౌలర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియా టీ20 జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. టీ20లకు కాకుండా ఇతర ఫార్మాట్లకు సరిపోయే ఆటగాళ్లను తొలగించి వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అతడు సూచించాడు. దీనికి ఉదాహరణగా మహ్మద్ షమీని అతడు పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్లో షమీ ఒక ఆద్బుతమైన పేసర్, అయితే పొట్టి ఫార్మాట్లో అతని కంటే మెరుగైన ఆటగాళ్ళు ఉన్నారని మంజ్రేకర్ చేప్పాడు. "భారత్ టీ20 జట్టులో మార్పులు చేయవలిసిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత జట్టులో కొంతమంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో కాకుండా, ఇతర ఫార్మాట్లో ఆడేందుకు బాగా సరిపోతారు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. నేను మహ్మద్ షమీ గురించి మాట్లాడుతున్నాను. నా దృష్టిలో షమీ భారత క్రికెట్ కు గొప్ప ఆస్తి. మంచి నాణ్యమైన బౌలర్ కూడా. అయితే అది టెస్టు మ్యాచ్ ల వరకే పరిమితం. టీ20లలో అతడి ఎకానమీ 9 కి చేరింది. అతడు ఆఫ్ఘనిస్తాన్పై బాగా బౌలింగ్ చేశాడని నాకు తెలుసు. అయితే టీ20 క్రికెట్లో మహ్మద్ షమీ కంటే మెరుగైన బౌలర్లు భారత్‌లో ఉన్నారు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli- Anushka Sharma: గట్టిగా అరిచి ఈ ప్రపంచానికి చెప్పాలని ఉంది.. అనుష్క భావోద్వేగం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20లపై బౌలింగ్ దిగ్గజం ఆందోళన
తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాల్లో డబ్బులు ఆటగాళ్లకు అందడంతో యువ క్రికెటర్లకు ఆటపై ఆసక్తి తగ్గిపోతుందని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి పీసీఏ స్టేడియంతో ట్రైనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్, టీ20 లాంటి లీగ్ ల వల్ల ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు దెబ్బతింటున్నారని పేర్కొన్నాడు. ఇది ఒక్క భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే అన్ని దేశాలలో ఇలాంటి ధోరణి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశాడు. టెస్టు క్రికెట్ అయితే పేస్ బౌలర్లకు స్వర్గధామమని, తమ సత్తా నిరూపించుకునేందుకు పొట్టి ఫార్మాట్లో ఇలాంటి చాన్స్ ఉండదన్నాడు. ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత లీగ్స్ ఆడి తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జిస్తున్నందున మరింత రాటుదేలేందుకు బౌలర్లు కృషి చేయడం లేదన్న అంశాన్ని గుర్తించినట్లు చెప్పారు. మంచి క్రికెట్ ఆడి దేశానికి మరింత గౌరవం తీసుకురావాలని యువ క్రికెటర్లకు పిలుపునిచ్చాడు. 'భారత్ త్వరలో నిర్వహించబోయే దులీప్ ట్రోఫీలో పింక్ బాల్ వాడకం మంచి పరిణామమే. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లలో ఫ్లడ్ లైట్స్ వెలుగులలో పింక్ బాల్ వాడకం విజయమంతమైంది' అని మెక్ గ్రాత్ వివరించాడు. -
ఇంకా నేర్చుకుంటున్నారా..!
చివరి వన్డేలో భారత జట్టు ఓటమికి కారణమేంటి? కెప్టెన్ ధోనికి ఎదురైన సూటి ప్రశ్న ఇది. ‘ఈ ప్రశ్న ఇవాళ మాత్రం అడగొద్దు. వాళ్లు దాదాపు 450 పరుగులు చేశారు. మీరేమో తప్పు ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అన్ని వ్యూహాలూ ప్రయత్నించాం’... సుడి గాలి వేగంతో ధోని ఇచ్చిన జవాబు! ఛలోక్తులు విసరడంలో ముందుండే ధోని, కాస్త హాస్యం జోడించే ప్రయత్నం చేసినా అది అతనిలోని ఒక రకమైన అసహనాన్ని బయట పెట్టింది. ఒక దశలో ఎవరితో బౌలింగ్ చేయించాలో, ఎక్కడ ఫీల్డర్ని పెట్టాలో అర్థం కాని స్థితిలో నిలిచిన కెప్టెన్.... తన బౌలర్లలో ఒక్కరూ నమ్మకాన్ని నిలబెట్టలేని సమయంలో పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ పేసర్లతోనా... మన దగ్గర ఉన్నది ఫాస్ట్ బౌలర్లు కాదు, మీడియం పేసర్లేననేది జగమెరిగిన సత్యం. కానీ 135 కిలోమీటర్ల వేగం దాటని తమ బౌలింగ్‌తో భువీ, మోహిత్ విపరీతంగా షార్ట్ పిచ్ బంతులు విసిరిన వ్యూహం బెడిసికొట్టింది. దాంతో ఈ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న సఫారీ బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. కనీసం 145 కిలోమీటర్ల వేగంతో వేస్తే కానీ ముంబైలాంటి వికెట్‌పై బౌన్స్ రాబట్టడం కష్టం. మన బలహీనతను గుర్తించి ధోని... లైన్ అండ్ లెంగ్త్‌కే కట్టుబడే విధంగా మరో వ్యూహాన్ని ఎంచుకోవాల్సింది. కానీ అతను దానిని అమలు చేయలేకపోయాడు. ‘మనం ఎంతో మంది పేసర్లను పరీక్షించాం. ఉన్నంతలో వీరే మెరుగు. దేశవాళీలోబాగా ఆడి వచ్చినవారు అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారు’ అని ధోని చెప్పడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఆల్‌రౌండర్ లేడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం భారత్‌లో బిన్నీ, అక్షర్, జడేజా మాత్రమే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలిగే బౌలింగ్ ఆల్‌రౌండర్లు అని ధోని వ్యాఖ్యానించడం అర్థం లేనిది. వన్డేల కోసమంటూ జట్టులోకి తీసుకున్న గుర్కీరత్ సింగ్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇలాంటి వ్యాఖ్య చేయడం అతని స్థాయికి తగింది కాదు. ఫలితాలు ముఖ్యం కాదని ప్రక్రియ మాత్రమే ప్రధానమని తాను ఎప్పుడూ చెప్పే డైలాగే మరో సారి ఉచ్ఛరించిన ధోని... బ్యాటింగ్ ఆర్డర్‌ను అడ్డగోలుగా మార్చడం మినహా తాను కొత్తగా చేసిన ప్రయోగం ఏమీ ఈ సిరీస్‌లో కనిపించలేదు. ఇది సరిపోదా... గత నాలుగేళ్లుగా వన్డేల్లో వరుస విజయాలు... ఇటీవల ప్రపంచకప్‌లోనూ మెరుగైన ప్రదర్శన... ఆటగాళ్లందరికీ కావాల్సినంత అనుభవం. అయితే భారత కెప్టెన్ ధోని మాత్రం జట్టు ఇంకా ‘కుదురుకునే’ దశలోనే ఉందంటున్నాడు. జట్టులో అందరికంటే జూనియర్ అయిన అక్షర్ పటేల్ కూడా ఇప్పటికే 22 వన్డేలు ఆడేశాడు. వరల్డ్ కప్ వరకు బాగా ఆడిన జట్టు ఒక్కసారిగా బంగ్లాదేశ్‌లో, ఆ తర్వాత స్వదేశంలో ఇలా భంగపడటం అందరినీ నిరాశపర్చింది. పిచ్ బాగా లేదనో, స్పిన్నర్లకు అనుకూలించలేదనో చెప్పుకోవడం అర్థం లేనిది. ‘దీన్ని చెత్త ప్రదర్శన అనే మాట కూడా తక్కువే. అంతకంటే పెద్ద పదం ఏదైనా కావాలి’ అని ధోని స్వయంగా అంగీకరించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. వచ్చే జనవరిలో భారత జట్టు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లే వరకు ధోని సీన్లో ఉండకపోవచ్చు. కానీ అతనికి తగినంత సమయం ఉంది. అన్ని స్థానాల్లో సరిపోయే ఆటగాళ్లను సిద్ధం చేయాల్సి ఉందంటూ స్వయంగా తానే చెప్పిన మహి... అలాంటి ప్రణాళికలతో ఏమైనా ముందుకొస్తేనే ఇకపై ఇలాంటి పరాభవాలకు బ్రేక్ పడుతుంది. సాక్షి క్రీడావిభాగం -
పేస్ పటాస్!
ఉపఖండంలో జరిగిన గత ప్రపంచ కప్‌తో పోలిస్తే ఈసారి బంతికి, బ్యాట్‌కు మధ్య సమానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఏకపక్షంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూల మ్యాచ్‌లే జరగకుండా... బౌలర్లు కూడా తమ సత్తా చాటేందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పిచ్‌లు ఉపకరిస్తాయి. ముఖ్యంగా పేస్ బౌలర్లు తమ పదును ప్రదర్శించేందుకు ఈ వరల్డ్ కప్ సరైన వేదిక. పెర్త్, బ్రిస్బేన్లాంటి బౌన్సీ వికెట్లతో పాటు కివీస్‌లో స్వింగ్‌కు అనుకూలించే మైదానాలు సీమర్లకు అనుకూల వాతావరణం సృష్టిస్తాయి. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు, వారిపై చెలరేగేం దుకు అన్ని జట్ల ఫాస్ట్ బౌలర్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ జట్టులోని ప్రధాన పేసర్లపై అందిస్తున్న కథనమిది. -సాక్షి క్రీడావిభాగం మిషెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీ, అనుకూల మైదానాలు, కనీసం 150 కిలోమీటర్లు తాకుతున్న వేగం. ఈ ప్రపంచ కప్‌లో మిషెల్ జాన్సన్‌ను ఆపడం సులువు కాకపోవచ్చు.స్ట్రయిక్ బౌలర్ గా ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలడు. అతని వేగమే అతని బలంగా చెప్పవచ్చు. కొంత విశ్రాంతి తర్వాత ముక్కోణపు సిరీస్ ఫైనల్ ఆడిన జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశా డు. అతనిపై ఆసీస్ భారీగా ఆశలు పెట్టుకుంది. లసిత్ మలింగ (శ్రీలంక) ‘చివరి ఓవర్లలో బౌలర్‌పై ఒత్తిడా! అది ఎలా ఉంటుందో నాకు తెలీదు’ ఈ మాట చెప్పగలిగిన ఒకే ఒక పేసర్ లసిత్ మలింగ. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తమ వైపుతిప్పగలడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో యార్కర్లతో చెలరేగి బ్యాట్స్‌మన్ పరుగులు చేయకుండా నిరోధించగలడు. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో అతని డెత్ బౌలింగ్ ఏమిటో భారత్ రుచి చూసింది. గత ప్రపంచ కప్ పరాజయాన్ని మరిచే ప్రదర్శన ఇవ్వాలని మలింగ పట్టుదలగా ఉన్నాడు. కీమర్ రోచ్ (వెస్టిండీస్) వెస్టిండీస్ ఇప్పుడు ఒక్క అసలు సిసలు పేసర్‌ను తయారు చేయలేకపోతోంది. ఈసారి ప్రపంచ కప్‌లో కీమర్ రోచ్, జెరోమీ టేలర్లకే కాస్తో, కూస్తో అనుభవం ఉంది. వీరిలో రోచ్ ఆ జట్టుకు ప్రధాన బౌలింగ్ వనరుగా చెప్పవచ్చు. 27లోపు సగటుతో కెరీర్లో 98 వికెట్లు తీసిన రోచ్, ఒకప్పుడు విండీస్ మార్క్ పదునైన వేగానికి చిరునామా. గాయాలతో కాస్త వేగం తగ్గినా ఇప్పటికి అతనే ఆ జట్టు ఫాస్టెస్ట్ బౌలర్‌గా చెప్పవచ్చు. జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) వన్డే క్రికెట్లో ఎక్కువ అనుభవం ఉన్న అసలైన పేస్ బౌలర్లలో అండర్సన్‌దే అగ్రభాగం. ఇరువైపులా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం గల అతను ఆసీస్ గడ్డపై చెలరేగిపోగలడు. ఇక్కడి వికెట్లు అతని శైలికి అచ్చి వస్తాయి. తన శైలికి సరిపడే బ్రిస్బేన్, పెర్త్ వికెట్లపై అతడిని ఎదుర్కోవడం సులువు కాదు. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) 25 ఏళ్ల ఈ ఎడంచేతి వాటం పేసర్ ఇటీవల ఒక్కసారిగా న్యూజిలాండ్ జట్టుకు కీలక బౌలర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా కివీస్ పిచ్‌లపై అతను చాలా ప్రమాదకారి. ఏ దశలోనూ 140 కిలో మీటర్ల వేగానికి తగ్గకుండా వైవిధ్యంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇటీవల షేన్ బాండ్ శిక్షణలో మరింత రాటుదేలాడు. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) సుదీర్ఘ కాలంగా ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్న స్టెయిన్ దక్షిణాఫ్రికాకు అతి పెద్ద బలం. ఆసీస్ పిచ్‌లపై అతడిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ప్రధాన వికెట్లు తీసి జట్టుకు శుభారంభం ఇవ్వడంలో స్టెయిన్ ఎప్పుడూ ముం దుంటాడు. చివరి ఓవర్లలో కూడా దక్షిణాఫ్రికా అతడిని సమర్థంగా ఉపయోగించుకుంటోంది. పదేళ్ల కెరీర్లో వందలోపు మ్యాచ్‌లే ఆడినా... కేవలం 25 సగటుతో 150కి పైగా వికెట్లు తీసిన స్టెయిన్కిది రెండో ప్రపంచ కప్. ఈసారైనా టైటిల్ అందుకోవాలని కలలు కంటున్న సఫారీల బౌలింగ్ బృందాన్ని నడిపించాల్సిన బాధ్యత స్టెయిన్దే. మన సంగతేంటి... భారత జట్టులో ఇప్పుడు నలుగురు ప్రధాన పేస్ బౌలర్లు ఉన్నారు. వీరిలో ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ షమీ ప్రధానంగా వేగంపై ఆధారపడే బౌలర్లు కాగా... భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మలు స్వింగ్ బౌలర్లు. మంచి ప్రతిభ ఉన్న బౌలర్లుగా గుర్తింపు ఉన్నా... జాన్సన్, స్టెయిన్‌లాంటి వాళ్లతో పోలిస్తే ఎవరూ ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ మాత్రం కాదు. వీరిలో ఏ ఇద్దరైనా ఖచ్చితంగా ప్రతీ మ్యాచ్‌లో నిలకడగా రాణిస్తేనే మనం ప్రపంచ కప్ ఆశలు ఉంచుకోవాలనేది స్పష్టం. ఇటీవల టెస్టు సిరీస్ ఆడిన ఉమేశ్ నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుండటం ఆశలు రేపే అంశం. మరోవైపు షమీపై కెప్టెన్ ధోని అమిత విశ్వాసం ఉంచుతున్నా... అతను మాత్రం దానిని నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఏ మాత్రం నియంత్రణలేని బౌలింగ్‌తో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఇక కెరీర్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన భువనేశ్వర్ ఇటీవల పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. పైగా ఫిట్నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇషాంత్ స్థానంలో వచ్చిన మోహిత్ కొంత వరకు పొదుపైన బౌలర్‌గా చెప్పవచ్చు. ఓవరాల్‌గా ఇతర ప్రధాన జట్లతో పోలిస్తే భారత్ పేస్ అంత పదునుగా లేదనేది వాస్తవం. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఫాస్ట్ బౌలర్ మన వద్ద లేకపోవడం లోటు.