female infanticide
-
అమ్మా.. నేనేం పాపం చేశాను!
సాక్షి, నస్పూర్: తల్లిపొత్తిళ్లల్లో సేదతీరాల్సిన శిశువు చెట్లపొదల్లో విగతజీవిగా పడి ఉంది.. నవమాసాలు మోసిన కన్నతల్లి, బిడ్డ కళ్లు తెరిచే సమయానికి ఎందుకో మరి కనిపించకుండాపోయింది.. ‘అమ్మా.. నేనేం పాపం చేశాను?’అని అడుగుతున్నట్టుగా అక్కడ ఆడశిశువు మృతదేహం పడి ఉంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి రోడ్లో చెట్లపొదల్లో శరీరభాగాలు చిందరవందరగా పడి ఉన్న ఓ గుర్తుతెలియని ఆడశిశువు మృతదేహాన్ని శుక్రవారం స్థానికులలు గమనించారు. స్థానికుల సమాచారం మేరకు మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి, స్థానిక ఎస్సై టి.శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వైద్యులు వచ్చి మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. గుర్తు తెలియనివ్యక్తులు మూడురోజుల క్రితం శిశువును కవర్లో చుట్టి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని జంతువులు పీక్కుతినడంతో తల, చేయి లేకుండాపోయాయి. ఈ హృదయవిదారకమైన దృశ్యాన్ని చూసిన పలువురు మహిళలు కంటతడి పెట్టారు. చదవండి: (ఆక్సిజన్ అందక.. ఊపిరి ఆగింది!) -
నెత్తుటి ముద్దల రక్త నినాదం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేకం మహారాష్ట్రలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి పక్కన మురికి కాలువలో19 ఆడశిశువుల పిండాలు బయటపడడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది. మేం రక్తపు ముద్దలుగా కూడా మిగలకూడదు. మెత్తటి పురిటి గుడ్డులమైన మా నోట్లో వడ్ల గింజ కరుకుదనాన్ని సైతం తట్టుకొని ఇంకా బతుకుతామేమోననే మీకు భయం. చెత్తకుప్పలో విసిరిన మా దేహాలు తిరిగి ప్రాణం పోసుకుంటాయేమోనని భయం. ఎన్నటికైనా మీ హత్యాకాండకు బలైన బాలికల లెక్కలు కడతారేమోనని భయం. గొంతునులిమి చంపేస్తే గొంతు పెగలని గోడల్ని సైతం బద్దలు కొట్టుకొని ఎపుడో ఒకపుడు నిజాలు బయటపడతాయేమోనని అంతులేని భయం. అందుకే మా రక్తపు ముద్దల్ని చిదిమేసి డ్రైనేజీల్లో కలిపేసారు. మురికినీటి కాల్వలే ఆడబిడ్డల నెత్తుటి ప్రవాహాలయ్యాయిప్పుడు. ఇంత జరుగుతున్నా ఎందుకీ నిశ్శబ్దం? మా ఉనికే ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది? ప్రతి యేటా లక్షలాది మంది కనులైనా తెరవకుండానే కాటికి చేరుతున్న నెత్తుటి ముద్దల రక్తనినాదం ఇది. ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నా కొత్త లోకపు చిన్ని తల్లుల్ని కోల్పోతున్న దౌర్భాగ్యం ఇది. మహారాష్ట్రలో... ఒక ప్రైవేటు ఆసుపత్రికి సమీపంలోని మురికి నీటి కాల్వలో రెండు రోజుల క్రితం 19 ఆడ శిశు పిండాలు పైకి తేలాయి! మొత్తం దేశమంతా ఉలిక్కిపడింది. నిజానికి ఇది ఒక్క ఆసుపత్రే. మొత్తం దేశంలోనైతే ప్రతి ఏటా రెండు కోట్ల మంది స్త్రీలు అత్యంత ప్రమాదకరమైన ‘అన్‌సేఫ్ అబార్షన్స్’ పాలిటపడుతున్నారని లెక్కలు తేలాయి. అవన్నీ కచ్చితంగా చిన్నితల్లుల దేహాలేనని చెప్పక తప్పదు. అలాగని స్త్రీల పునరుత్పత్తి హక్కులను కాలరాసే మూలాలను వెతక్కండి. ఆ పాపం అమ్మది కాదు. కానేరదు. చిన్నారుల చిర్నవ్వుల్ని చిత్రవధ చేసి చంపేస్తుంటే మీరెవ్వరూ అడక్కండి. ఎందుకంటే కోటి ఆశల కలలతో పుట్టే బిడ్డకోసం వేయికళ్లతో ఎదురుచూసే అమ్మకు ఈ సమాజాన్ని ప్రశ్నించే అవకాశమే లేదు. అడిగే హక్కు అంతకన్నాలేదు. అమ్మ ప్రమేయమే లేకుండా హతమౌతోన్న ఆడబిడ్డల ఆర్తనాదాలు తరాలుగా అమ్మ గుండెల్ని చీల్చేస్తున్నాయి. పురిటినొప్పులను పంటిబిగువున అదిమిపట్టి, చిన్నితల్లిని కొత్తలోకంలోకి ఆహ్వనించే అమ్మ అంగీకారమిక్కడెవ్వరికీ అక్కరలేదు. చివరకు ఆమె ప్రమేయమే లేకుండానే, ఆమెనుంచి వేరుచేసి పుట్టకుండానే నెత్తుటి గడ్డలైన పసిగుడ్లను డ్రైనేజీల్లోనూ, టాయ్‌లñ ట్ తూముల్లోనూ తోసేస్తోన్న సమాజాన్ని ప్రశ్నించడం మనం ఎప్పుడో మర్చిపోవడం అత్యంత విషాదం. తాజాగా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మైసల్ గ్రామంలో భారతి అనే ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు ఆడపిల్లల భ్రూణహత్యలకు పాల్పడి దేశం యావత్తు సిగ్గుతో తల వంచుకునేలా చేసాడు! డాక్టర్ కిడ్రాపూరే, ఆయన భార్యతో కలిసి ఇటువంటి ఘాతుకాలకు పాల్పడినట్టు పోలీసుల పరిశోధనలో తేలింది. 26 సంవత్సరాల వయస్సు కలిగిన స్వాతి అనే మహిళ మరణంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిజానికి డాక్టర్ పూరే నిపుణుడైన డాక్టర్ కాదు. ఆపరేషన్లు చేసే అర్హతే ఆయనకు లేదు. కేవలం హోమియోపతి బ్యాచులర్ డిగ్రీ మాత్రమే అతని అర్హత. పుట్టబోయేది ఆడబిడ్డేనని తెలిసి స్వాతి భర్త, అత్తమామలతో కలిసి ఈ బలవంతమైన అబార్షన్‌కి పూనుకోవడంతో స్వాతి ప్రాణాలు కోల్పోయింది. స్వాతి తల్లిదండ్రులు, బంధువులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆలస్యంగానైనా స్పందించి విచారణ చేపట్టారు. ఆ ఆసుపత్రి వెనకనే ఉన్న మురికి కాల్వలో మరికొన్ని (పైన చెప్పుకున్న 19) ఆడపిల్లల పిండాలు బయటపడటంతో అక్కడ జరుగుతోన్న ఘాతుకం ప్రపంచానికి తెలిసింది. మహారాష్ట్రలోని మరో ప్రాంతమైన బీడ్‌లో కూడా ఇలాంటిదే ఘాతుకం వెలుగుచూసింది. లేక్ లడ్కీ అభియాన్ అనే సంస్థ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా డాక్టర్ సుధాం ముండే, డాక్టర్ సరస్వతీ ముండే చేసిన పరిశోధనల ఈ ఆడపిల్లల భ్రూణ హత్యల ఘోరాలు వెలుగులోనికి వచ్చాయి. రాజస్థాన్‌లో కూడా ఇటువంటి అబార్షన్ రాకెట్ ఒకటి ఇటీవలే బయటపడింది. రాజస్థాన్‌కి చెందిన డాక్టర్ మహమ్మద్ నియాజ్ ఇటువంటి అక్రమమైన అబార్షన్ల కేసులో అరెస్టయ్యాడు. ప్రతి అబార్షన్‌కు దాదాపు 60 వేల రూపాయల చొప్పున అక్కడి డాక్టర్లు వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ సంఘటనలు కేవలం ఈ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, బీహార్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను కూడా కుదిపేసాయి. అమెరికాలోని గుట్టుమచార్ ఇనిస్టిట్యూట్ జరిపిన సర్వేలో భారతదేశంలో దాదాపు ప్రతియేడాది 12 లక్షల 40 వేల అబార్షన్లు జరుగుతున్నట్టు తేలింది. రక్షణలేని(అన్‌సేఫ్) అబార్షన్లన్నీ కేవలం ఆడపిల్లల భ్రూణహత్యలేనన్న నిజాన్ని సాంగ్లీ ఘటనతో సహా చాలా సందర్భాల్లో తేలింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి భ్రూణ హత్యలు జరిగినట్టు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తేల్చాయి. అదేవిధంగా ఆడపిల్లల భ్రూణ హత్యలను నివారించే (పిసిపిఎన్డిటి) ప్రికన్సెప్షన్ అండ్ ప్రినాటల్ డైగ్నోస్టిక్ టెక్నిక్స్ (ప్రొబేషన్ ఆఫ్ సెక్స్ సెలక్షన్)యాక్ట్ ఉన్నా లేనట్టేనా అనే అనుమానం కలుగుతోంది. పాలకుల నిర్లక్ష్యం, వైద్యుల ధనదాహం, మొత్తంగా పురుషాధిపత్య భావజాలం ఆడపిల్లల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. – అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, ‘సాక్షి -
అందరినీ బతకనివ్వండి: స్వామి అగ్నివేశ్
నాంపల్లి: అల్ట్రా సౌండ్ పరీక్షల ద్వారా తల్లి కడుపులోనే ఆడ శిశువులను గుర్తించి హత్య చేస్తున్నారని, ఇలాంటి చర్యలు ఉగ్రవాదానికికంటే ప్రమాదకరమని స్వామీ అగ్నివేశ్ అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడో ఒక చోట దాడులు చేస్తే, ఆల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా ప్రతి రోజూ వేలాది భ్రూణ హత్యలు చేస్తున్నారన్నారు. పి.ఆర్.ఓ.బి.ఇ(ప్రోబ్) ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కళా మందిరంలో ‘ఉగ్రవాదం నుంచి మానవత్వాన్ని రక్షించండి’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టే బిడ్డ ఆడైనా మగయైనా ఒక్కటేనని, పూర్వం ఆడ పిల్లలను తల్లిదండ్రులు చదివించే వారు కాదన్నారు. జన్మతో ఎవరూ ఉన్నతులు కాలేరని, జీవనంతోనే ఉన్నతులవుతారని పేర్కొన్నారు. మను ష్యులందరూ సమానమైనప్పుడు, మనతో పాటు భూమిపై జీవించే పశుపక్ష్యాదులను హరించడం ఎందుకన్నారు. ఏటా వంద కోట్ల పక్షులు, జంతువులను చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోవధ మానుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడి రూ.4.5 కోట్లతో బంగారం దారాలతో నేసిన కోటును ధరించడం భావ్యం కాదన్నారు. పేద వాడు నూలుతో వడికిన వస్త్రాన్ని ధరించినప్పుడు ప్రధాని అంత విలువైన దుస్తులెందుకని ప్రశ్నించారు. ఇలాంటి వ్యత్యాసాల మీద ప్రజలందరూ పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో సేవలందిస్తున్న లవణం, సంఘ సేవకులు చలసాని రాజారామ్ మోహన్ రావు, ఇస్లామి ఫిఖ్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానిలకు అంతర్జాతీయ మానవత్వ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రోబ్ సంస్థ అధ్యక్షులు శ్రీశైలం అధ్యక్షతన జరిగిన సభలో శ్రీరామానుజ మిషన్ ట్రస్టు చెన్నై మేనేజింగ్ ట్రస్టీ ఎస్ఎఆర్.ప్రసన్న వెంకటాచారియార్ చతుర్వేది స్వామి, విఠల్ రావు, విల్సన్ మెకో తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. అమ్మకే..
‘అమ్మా.. అమ్మకే అంటూ శిశువు రోదిస్తోంది. నీవూ ఆడదానివే కదా.. నేను ఆడపిల్లగా పుట్టిన పాపానికి అమ్మేస్తావా?.. ’ అంటూ శిశువు మూగమనసుతో తల్లిని ప్రశ్నిస్తోంది. ⇒ ఆడ శిశువులపై కొనసాగుతున్న వివక్ష ⇒ ఆరు నెలల్లో జిల్లాలో 13 మంది శిశువుల విక్రయం ⇒ పల్లెలు, తండాల్లో అవగాహన లేకనే.. ⇒ ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యతా కారణమే మెదక్ రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడుతూ మహిళలు ముందుకు పరుగులు తీస్తుంటే.. పలు గ్రామాలు, పట్టణాల్లో ఆడవారిపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. రెండో లేదా మూడో కాన్పులో ఆడబిడ్డ పుట్టిందంటే చాలు అంగడి సరుకులా జమకట్టి విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఆరునెలల్లో 13 మంది ఆడ శిశు విక్రయాలు జరిగినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా లెక్కకు రానివి మరె న్ని ఉంటాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాచైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రస్తుత ఫిబ్రవరి వరకు జిల్లాలో 13 మంది ఆడ శిశువులు తిరస్కరణకు గురయ్యారు. అందులో కొంద రు ఆడశిశులను చెత్తబుట్టల్లో, ముళ్లపొదల్లో పడేయగా మరికొందరిని తాము సాదలేమంటూ ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. బాలికల సంరక్షణ కోసం ఎన్నిచట్టాలు వచ్చిన అవేవీ ఆడశిశువులకు అండగా నిలవటంలేదు. అమ్మాయి పుట్టిందంటే తల్లిదండ్రులు వదిలించుకోవాలనే చూస్తున్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో ఈ దుస్థితి అధికంగా కన్పిస్తోంది. ఒక్క మెదక్ మండలంలోనే గత మూడేళ్లుగా ముగ్గురు ఆడశిశువులను ఒక్క మగశిశువును విక్రయించారు. 2013 నబంబర్ 25న వాడి పంచాయతీ పరిధిలోని మెట్టుతండాకు చెందిన లంబాడి రవి, అనిత దంపతులు మూడో సంతానంలోనూ ఆడబిడ్డే పుట్టిందని విక్రయించారు. 2014 మార్చి 5న రాజిపేట పంచాయతీ కప్రాయిపల్లి తండాకు చెందిన లంబాడి పీర్య, విజ్జిలకు రెండో సంతానంలో ఆడబిడ్డ పుట్టిందని బహిరంగంగా విక్రయించేందుకు సిద్ధపడ్డారు. అదే ఏడాది ఔరంగాబాద్ గిరిజన తండాకు చెందిన లండాడి దశరథం, శాంతి దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా మూడో సంతానంలోనూ మగబిడ్డ పుట్టిందని విక్రయించారు. ఈ మూడు సంఘటనలు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లగా చిన్నారులను స్వాధీనం చేసుకొని సంగారెడ్డిలోని శిశువిహార్‌కు తరలించారు. తాజాగా ఈనెల 23న కొత్తపల్లి గ్రామానికి చెందిన గార్ల కిష్టయ్య, నర్సవ్వ దంపతులకు మూడో సంతానంలోనే ఆడబిడ్డే పుట్టిందని విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ చిన్నారిని ఆసుపత్రి లో చూపించగా అనారోగ్యంతో ఉందని చెప్పడంతో అతను ఆ చిన్నారిని ఆ తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయం పత్రికల్లో రావడం తో ఐసీడీఎస్ అధికారులతోపాటు శిశుసంరక్షణ జిల్లా అధికారులు కొత్తపల్లికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. సదరు తల్లిదండ్రులతోపాటు కొనుగోలు చేసిన, విక్రయించిన, మధ్యవర్తిగా వ్యవహరించిన ఆశ వర్కర్‌పై అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా ఆడ శిశువుల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత వల్లే అవగాహన లేక ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నట్టు సమాచారం. విషయమై ప్రభుత్వం పల్లెలు, తండాల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. -
‘భ్రూణ హత్యల నియంత్రణలో నిర్లక్ష్యం’
న్యూఢిల్లీ: ఆడ శిశువుల భ్రూణ హత్యలను అరికట్టడంలో కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. చట్టాలను ప్రభుత్వం అమలు చేయకుండా విధికి వదిలేస్తోందని దుయ్యబట్టింది. లింగ నిర్ధరణ నిషేధ చట్టం అమలుకుతీసుకున్న చర్యలు, వాటి వల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో నాలుగు వారాల్లో చెప్పాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలో ఆరేళ్లలోపు బాలబాలికల నిష్పత్తి తగ్గిపోతోందంటూ ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిల్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 914 మంది బాలికలే ఉన్నారు. వారిపై చర్యలెందుకు తీసుకోకూడదు? ఆయుధాలను అక్రమంగా అమ్ముతూ పట్టుబడి నామమాత్రపు జరిమానాతో బయటపడ్డ సైనికాధుకారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది