female Maoist
-
విప్లవం కోసం అడవిబాట పట్టి.. విగతజీవిగా ఇంటికి..
కాప్రా: విప్లవం కోసం ఉద్యమంలోకి వెళ్లిన మహిళా మావోయిస్టు పల్లెపాటి రాధ అలియాస్ బంటి రాధ అలియాస్ నీల్సో జీవితం విషాదాంతంగా ముగిసింది. కాప్రా సర్కిల్, న్యూ ఇందిరానగర్‌కు చెందిన రాధ డిప్లొమో ఇన్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ పూర్తి చేసింది. అనంతరం విప్లవంపై ఆకర్షితురాలై అడవిబాట పట్టిన రాధ తిరిగి విగతజీవిగా ఇంటికి చేరింది.ఇన్ఫార్మర్ నెపంతో సహచర మావోయిస్టులే ఆమెను హత్య చేశారు. ఓ మహిళా మావోయిస్టును తోటి మావోయిస్టులే హతమార్చడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, చెన్నాపురం అటవీప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాధ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గురువారం ఉదయం రాధ భౌతికకాయాన్ని ఇందిరానగర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు. ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన కుమార్తె విగత జీవిగా తిరిగి ఇంటికి చేరడంతో తల్లిదండ్రుల రోధనలతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. సాయిబాబానగర్‌లోని శ్మశానవాటికలో రాధ అలియాస్ నీల్సో దహన సంస్కరాలు పూర్తి చేశారు. అన్యాయంగా చంపేశారుమావోయిస్టుల అంతర్గత విషయాలు బయటకొస్తాయనే రాధను అన్యాయంగా చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విప్లవ బాటపట్టిన మావోయిస్టుల్లోనూ అగ్రవర్ణాలు, అణగారిన వర్గాలు అనే తారతమ్యం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డనే రాధను సహచర మావోయిస్టులు చంపేశారని ఆరోపిస్తున్నారు. మావోయిస్టుల్లో కొందరు చేసిన తప్పులను రా«ధ ప్రశ్నించిందని, వారి గుట్టు బయటపడుతుందనే భయంతోనే చంపేశారని చెబుతున్నారు. రాధ ఇన్ఫార్మర్గా మారిందనడానికి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్లుగా లేని అనుమానం ఇప్పుడే ఎందుకు వచ్చింది, మూడు నెలల క్రితం కమాండర్ బాధ్యతల నుంచి తప్పిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఆగారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు జరిగిన అన్యాయంపై స్పందించాలని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని రాధ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.దళిత మహిళ అనే వివక్ష ఒక దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డనే మా చెల్లెను అన్యాయంగా చంపేశారు. ఇన్ఫార్మర్ నేపంతో సహచర మావోయిస్టులే చంపి రోడ్డుపై పడేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తే మృతదేహం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అక్కడ ఏరియా ఆస్పత్రికి మేం వెళ్లేసరికే రాధ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అసలు తల్లిదండ్రులు లేకుండా వారికి సమాచారం అందించకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా రాధ మృతదేహానికి పోస్టుమార్టం ఎలా చేస్తారు. – లింగం, రాధ అన్నయ్య.నా బిడ్డను చూస్తా అనుకున్నామూడు రోజుల్లో నా బిడ్డ ఇంటికొస్తుందని తెలిసింది. చాలా ఏళ్ల తర్వాత నా బిడ్డను చూస్తా అనుకున్నా. అంతలోనే రెండు రోజుల తర్వాత చనిపోయిందని చెప్పారు. బిడ్డ ఇక లేదని తెలియడంతో చివరి చూపుకోసం బుధవారం మధ్యాహ్నం అక్కడికి బయలుదేరాం. మేం వెళ్లేసరికే పోస్టుమార్టం పూర్తి చేశామని చెప్పి,మృతదేహాన్ని అప్పగించేశారు. ఇన్ఫార్మర్ పేరుతో నా బిడ్డను అన్యాయంగా చంపేశారు. నా కొడుకుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. –పోచమ్మ(బాలమ్మ), రాధ తల్లిఇన్ఫార్మర్ అనడం అబద్ధంమా అక్క రాధను ఇన్ఫార్మర్ అని చెప్పడం పచ్చి అబద్ధం. ఆరేళ్ల క్రితం మావోయిస్టుల పార్టీలో చేరిన అక్క ఫ్యామిలీ గుర్తుకు వచ్చినప్పుడు కేవలం మెసేజ్ మాత్రం చేసేది. అది కూడా ఆమె వెళ్లిన తర్వాత రెండేళ్ల క్రితం ఒక్క మెసేజ్ చేసింది. ఎలా ఉన్నారు, అమ్మ, నాన్న ఎలా ఉన్నారు అని ఆరా తీసింది. మేం బాగానే ఉన్నాం, నువ్వు ఇంటికి రావొచ్చు కదా అంటే నన్ను మర్చిపోండి, నేను మావోయిస్టుల్లోనే ఉంటానని చెప్పింది. అలాంటి మా అక్క ఇన్ఫార్మర్ అని ముద్ర వేసి అన్యాయంగా చంపేశారు. ఆ తర్వాత ఈ నెల 18న నాకు మెసేజ్ వచ్చింది. కానీ ఆ మెసేజ్ చేసింది మా అక్క కాదని గుర్తించా. అక్కకు ఏం జరిగిందోననే భయంతో మాకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆరా తీశా. ఆ తర్వాతి రోజునే చనిపోయిందని తెలిసింది. ఈ నెల 21న చనిపోయిందని ఫొటో వాట్సాప్ చేశారు. కానీ ఆ ఫొటోలో 19వ తేదీ కనిపించింది. అంటే మా అక్క చనిపోయిన తర్వాత రెండు రోజులకు మాకు సమాచారం అందింది. నాకు డబ్బులు పంపేదని ఆరోపిస్తున్నారు. అలా అయితే నేను క్యాబ్ డ్రైవర్‌గా ఎందుకు పని చేస్తాను. –సూర్యప్రకాష్, రాధ తమ్ముడు -
ఏడేళ్ల కిందట అదృశ్యం..శవమై ప్రత్యక్షం
సాక్షిప్రతినిధి, వరంగల్/ యాదాద్రి/ చర్ల/కాప్రా: ఏడేళ్ల క్రితం అదృశ్యమై..మావోయిస్టు పార్టీలో చేరి కీలకంగా ఎదిగిన బంటి (పల్లెపాటి) రాధ అలియాస్ నీల్సో శవమై ప్రత్యక్షమైంది. చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) సభ్యురాలి నుంచి దండకారణ్యంలో చేరి నాయకత్వ రక్షణదళ కమాండర్‌గా ఎదిగిన ఆమె.. చివరకు దళం సహచరుల చేతిలోనే హత మైంది. విద్యార్థి నుంచి దళనేతగా సాగిన ఏడేళ్ల ప్రస్థానం విషాదాంతంగా ముగిసింది. ఉద్యమంలో కొనసాగుతూనే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులకు ‘కోవర్టు’గా మారిందన్న సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ నాయకత్వం.. ప్రజాకోర్టు నిర్వహించి రాధ అలియాస్ నీల్సోను చర్ల సమీపంలో హతమార్చి ఏవోబీ కార్యదర్శి గణేష్ పేరిట బుధవారం వీడియో, ప్రకటన విడుదల చేసింది. రాధ కేసు..రంగంలోకి దిగిన ఎన్ఐఏ బంటి బాలయ్య– పోచమ్మ (బాలమ్మ)ల స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్ పరిధిలోని కాప్రాలో నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు సూర్యం, కూతురు రాధలు ఉండగా.. బంటి రాధ అలియాస్ నీల్సో 2017లో ఇంటర్ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తూ అదృశ్యమైంది. రాజాపేటకు చెందిన జిట్టా సుదర్శన్‌రెడ్డి పీపుల్‌వార్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసే సమయంలో రాధ విప్లవ గీతాలు ఆకర్షితురాలయ్యారు. అప్పట్లో ఆమె అదృశ్యం సంచలనంగా మారగా.. మొదట హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు 2022, జనవరి 2న విశాఖపట్నం జిల్లా పెద్దబయలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును అక్కడి పోలీసులు ఎటూ తేల్చలేదు. కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కేసును రీ ఓపెన్ చేసింది. మావోయిస్టులు ఆమెను బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారన్న అభియోగంపై మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, కాకరాల మాధవి అలియాస్ అరుణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో 2022, జూన్ 23 హైదరాబాద్‌లోని చిలకానగర్, ఫిర్జాదిగూడ, మెదక్ జిల్లా చేగుంట, వరంగల్ నగరంలలో ఎన్ఐఏ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్)తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాదులు డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పా, దుబాసి స్వప్నలను అరెస్టు చేసి ఎన్ఐఏ రాధ ఆచూకీ కోసం విచారించింది. వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డు, ప్రకాశ్‌రెడ్డి పేటలలోనూ సోదాలు నిర్వహించింది. నేడు కాప్రాలో అంత్యక్రియలుపోలీసులు రాధ మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా చేయించాక, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, రాధ మెడకు ప్లాస్టిక్ తాడు కట్టి చెట్టుకు లాగడం ద్వారా ప్రాణం తీసినట్టు తెలుస్తోంది. గురువారం రాధ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. హేయమైన చర్య : ఎస్పీ రోహిత్ రాజుమావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న దళిత యువతి రాధ అలియాస్ నీల్సోను అతి కిరాతకంగా చంపడం హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సామాజిక న్యాయమంటూ మాటలు చెప్పే మావోయిస్టులు ఇతరులను వదిలేసి కేవలం దళితురాలైన రాధను ఎందుకు చంపారో సమాధానం చెప్పాలన్నారు. కీలకంగా ఎదిగి...సహచరుల చేతిలో హతమైఓ వైపు పోలీసులు, మరోవైపు ఎన్ఐఏ బంటి రాధ కోసం ఆరా తీస్తుండగా.. ఆమె మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఎదిగింది. విశాఖపట్నం వెళ్లి 2017 డిసెంబర్లో అదృశ్యమైన ఆమె.. ఆంధ్ర –ఒడిశా బార్డర్ (ఏవోబీ) మావోయిస్టు కమిటీకి కీలకంగా మారింది. ఏడాదిలోనే పార్టీ నాయకత్వ కమిటీకి రక్షణ దళ కమాండర్‌గా ఎదిగింది. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (కోవిడ్ సమయంలో చనిపోయారు)తో పాటు పలువురు నేతలకు రక్షణ కల్పించే ఫ్లటూన్కు కీలకమైంది. సుమారు ఏడేళ్లపాటు బంటి రాధ అలియాస్ నీల్సో ప్రస్థానం మావోయిస్టు పార్టీలో కొనసాగింది. మూడు నెలల కిందటే అనుమానం వచ్చిన మావోయిస్టు పార్టీ నాయకత్వం ఆమెను ‘కోవర్టు’గా భావించి కీలక బాధ్యతల నుంచి తప్పించి నిఘా పెట్టింది. తన సోదరుడు సూర్యం ద్వారా పోలీసులకు సహకరిస్తుందని భావించిన పార్టీ నాయకత్వం, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన రాధ అలియాస్ నీల్సోను అంతమొందించినట్టు ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను చంపి ఈ హత్య తామే చేసినట్లు మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరిట లేఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని పోలీసులు మళ్లీ అలర్ట్ అయ్యారు. -
మహిళా మావోయిస్టు మృతి
♦ పలువురు దళసభ్యులకు గాయాలు ♦ భారీగా మావోయిస్టు సామగ్రి స్వాధీనం ♦ సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం బరంపురం : కొంధమాల్ జిల్లాలో బల్లిగుడా కామన్కుల్లో ఎస్ఓజీ జవాన్లపై మావోయిస్టుల దాడి అనంతరం కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న కొంధమాల్ జిల్లాలో మళ్లీ కలకలం రేగింది. బల్లిగుడాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతిచెందింది. ఈ సంఘటనతో రాష్ట్రపోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కొంధమాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయాలతో తప్పించుకోగా స్థానిక పోలీసుల సహాయంతో ఎస్ఓజీ జవాన్లు వారి జాడ కోసం జల్లెడపడుతున్నారు. దీంతో స్థానిక గిరిజన గూడాలు పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతున్నాయి. కొంధమాల్ ఎస్పీ మిత్రభాను మహాపాత్రో అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొంధమాల్ జిల్లా బల్లిగుడా పోలీసు స్టేషన్, బరకుమా పండి పరిధిలో గల సులగూడ పంచాయతీ సతలి అటవీ ప్రాంతంలో తుటుకమండా కాలువ దగ్గర పోలీసులు, ఎస్ఓజీ జవాన్లు సయుక్తంగా కూంబింగ్ అపరేషన్ చేపట్టిన సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా, ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. మృతి చెందిన మహిళను ఒడియా భాష తెలియని మహిళా మవోయిస్టుగా గుర్తించామని బహుశా ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు మావోయిస్టుగా అనుమానిస్తున్నట్లు ఎస్పీ తెలియజేస్తున్నారు. సమాచారం మేరకు కూంబింగ్ కొధమాల్ జిల్లా బల్లిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో బరకమా, బడాంఖా, సతలి, డాఖా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందడంతో అయా అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారంతో రెండు ఎస్ఓజీ జవాన్ల బృందం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిందని ఎస్పీ చెప్పారు. ఎస్ఓజీ జవాన్లు కూంబింగ్ చేపట్టిన సమయంలో సతలి అటవీ తుటుక కెనాల్ దగ్గర మావోయిస్టులు, పోలీసులు ముఖాముఖి ఎదురు పడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య హోరాహోరీగా సుమారు 3 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. 45 మీటర్ల దూరంలో సుమారు 200 రౌండ్లకు పైగా ఎదురు కాల్పులు జరిగాయి. అనంతరం పోలీసుల కాల్పుల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. తుటుక కెనాల్ దగ్గర నిర్వహిస్తున్న మావోయిస్టుల బేస్ క్యాంప్‌లో సుమారు 15 నుంచి 16 మంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా మిగిలిన మావోయిస్టులు తీవ్ర గాయాలతో దట్టమైన అడవి ప్రాంతంలోకి పారిపోయినట్లు మావోయిస్టు బేస్ క్యాంప్ ప్రాంగణంలో చుట్టూ పడి ఉన్న రక్తపు ధారలను బట్టి అనుమానిస్తున్నట్లు ఎస్పీ మిత్రభాను విలేకరులకు తెలియజేస్తున్నారు. భారీగా మావోయిస్టు సామగ్రి స్వాధీనం మావోయిస్టులు విడిచి పారిపోయిన బేస్ క్యాంప్ ప్రాంగణంలో 303 రైఫిల్, మూడు చార్జర్ క్లాంప్స్, 13 రౌండ్ల తుటాలు, 5 గుళ్లు ఉన్న పాలిథిన్ కవర్, ఒక కెమెరా, రూ.42వేల నగదు, ఒక నోకియా మొబైల్, చార్జర్, మహిళ చేతి గడియారం, దోమతెర, 3 స్టీల్ మగ్గులు, సబ్బులు, రెండు కుర్చీలు, బ్లేడ్, 3 మెమరీ కార్డులు, టార్చిలైట్, 3 ఎస్బీ కార్డులు, 3 ఇయర్ ఫోన్లు, ఒక హిందీ విప్లవ పుస్తకం, మావోయిస్టుల వివరాల పుస్తకాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిందీలో దొరికిన మావోయిస్టు విప్లవ పుస్తకం ద్వారా మృతిచెందిన మావోయిస్టు మహిళ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తునట్లు ఎస్పీ తెలియజేస్తున్నారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు వివరాలు తెలిసిన అనంతరం వారి కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించనున్నామని అప్పటివరకు మార్చురీలో ఉంచుతామని అప్పటికీ ఎవరూ రాకపోతే తామే దహనం చేయనున్నట్లు ఎస్పీ తెలియజేశారు. జోరుగా కూంబింగ్ ఎదురు కాల్పుల నేపథ్యంలో కొంధమాల్లో మావోయిస్టులు క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు అధికార్లు హైఅలెర్ట్ అయ్యారు. బరకుమా, కామన్కులా, మలిసియా అటవీ ప్రాంతాల్లో జోరుగా కూంబింగ్ అపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు కొలాహండి, బౌధ్, కొంధమాల్ గంజాం జిల్లాల సరిహద్దుల గుండా కారిడార్‌గా ఏర్పరుచుకుని వారి కార్యకలాపాలు ముమ్మరం చేసి భారీ విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసుల సహకారంతో ఎస్ఓజీ జవాన్లు కొంధమాల్, గజపతి, బౌధ్ గంజా జిల్లాల సరిహద్దుల్లో అడుగడుగునా కూంబింగ్ అపరేషన్ ముమ్మరం చేశారు. -
ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతి
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది. కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోర్ఖ అట వీప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అదేసమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగాజరిగిన ఎదురుకాల్పుల్లో మడకం హిడ్మె అనే మావోయిస్టు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. మృతురాలి వద్ద ఉన్న బర్మార్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.