నీళ్లు పట్టుకుందని... చితక్కొట్టారు!
వీధిపంపు వద్ద నీళ్లు పట్టుకుందని.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత మహిళను పట్టుకుని చితక్కొట్టారు. ఈ దారుణ ఘటన షామ్లి జిల్లాలో జరిగింది. గంగేటు గ్రామానికి చెందిన రామో దేవి (55) అనే మహిళ వీధిపంపు వద్ద నీళ్లు పట్టుకోడానికి వెళ్లింది. అది చూసిన తెహసిన్ ఖురేషి, మొహిసిన్ అనే ఇద్దరు సోదరులు ఆమెను తీవ్రంగా అవమానించి, చితక్కొట్టారు.
దాంతోపాటు ఆమెను కులం పేరుతో దూషించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు సోదరులిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 323, 506లతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. వారిలో తెహసిన్ను అరెస్టు చేయగా.. మొహిసిన్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.