Fifth generation
-
చరిత్ర మరువదు.. మీ ఘనత
ముంబై: ‘‘ఈ స్నేహంలో అగాధం ఇప్పుడు నాతో ఉండిపోయింది. నా మిగిలిన జీవిత కాలంలో దీన్ని పూరించేందుకు కృషి చేస్తాను’’అంటూ శంతను నాయుడు తన స్పందనను వ్యక్తం చేశారు. 31ఏళ్ల ఈ యువకుడు రతన్‌టాటాకు అత్యంత విశ్వసనీయ సహచరుడు. వృద్ధాప్యంలో ఆయన బాగోగులు చూసుకున్న ఆప్త మిత్రుడు. రతన్‌టాటా అంతిమయాత్ర వాహనం ముందు యెజ్డీ మోటారుసైకిల్ నడుపుతున్న శంతనునాయుడిని చూసే ఉంటారు. ‘‘దుఃఖం అనేది ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం. గుడ్‌బై, నా ప్రియమైన దీపస్తంభం’’అంటూ చిన్న పోస్ట్ పెట్టాడు. టాటా గ్రూప్‌లో ఐదవ తరం ఉద్యోగి శంతనునాయుడు. 2014లో రతన్‌టాటా, శంతను కలుసుకున్నారు. వీధి శునకాల పట్ల ప్రేమ వీరిద్దరినీ కలిపిందని చెప్పుకోవాలి. వీధి శునకాలు రాత్రి వేళల్లో వాహన ప్రమాదాలకు గురి కాకుండా, వాటి కోసం మెరిసే కాలర్లను శంతను డిజైన్ చేశాడు. కుక్కల మెడలో ఈ కాలర్‌ను ఉంచితే, రాత్రివేళ వాహన వెలుగులకు మెరవడంతో డ్రైవర్లు వాటిని గుర్తిస్తారన్నది అతడి యోచన. ఇందుకు నిధుల సాయం కావాలంటూ రతన్‌టాటాకు లేఖ రాశాడు. ముంబైలోని తన కార్యాలయానికి రావాలని, తనతో కలసి పనిచేయాలంటూ రతన్ టాటా నుంచి శంతనుకు పిలుపు వచి్చంది. రతన్‌టాటా సహకారంతో మోటోపాస్ అనే కంపెనీని శంతను స్థాపించాడు. వృద్ధులకు తోడుగా యువ సహచరులను కలిపే స్టార్టప్ ‘గుడ్ ఫెలోస్’ను సైతం స్థాపించాడు. ఆ తర్వాత ఎంబీఏ కోసం యూఎస్ వెళుతూ. తిరిగి వచి్చన తర్వాత కలసి పనిచేస్తానని రతన్‌టాటాకు శంతను హామీఇచ్చాడు. తిరిగొచి్చన తర్వాత రతన్‌టాటా అసిస్టెంట్‌గా, టాటా ట్రస్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రతన్‌టాటా తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెన్నంటి ఉన్నాడు. -
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్‌కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్‌లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్‌గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్‌లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్‌పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్‌కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్. -
భారత్‌లో లెక్సస్ ఇండియా లగ్జరీ కార్ డెలవరీ ప్రారంభం
జపాన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తాజాగా భారత్‌లో కొత్త ఐదవ తరం ఐదు సీట్ల ఆర్ఎక్స్ 350 హెచ్ (RX 350H) లగ్జరీ ఎస్యూవీ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌ను జపాన్ సంస్థ లెక్సస్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పో - 2023 ఈవెంట్లో ప్రదర్శనకు పెట్టింది. తాజాగా ఈ లగ్జరీ కార్లను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు లెక్సస్ ఇండియా తెలిపింది. ఇక, చూపరులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడంలో లెక్సస్ ప్రసిద్ధి చెందింది. ఆ అంచనాలతో ఎక్స్ 350 కారును సైతం డిజైన్ చేసింది. ముఖ్యంగా స్కల్ప్టెడ్ లైన్, ఎల్ఈడీ ఇల్యూమినేషన్, బోల్డ్, ఐకానిక్ యాక్సెంట్లతో మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇందులో అత్యాధునికమైన ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీని దాని అసాధారణమైన ఫీచర్లతో భారత ఆటోమొబైల్ రంగంలో ఉన్న విదేశీ ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. లెక్సస్ ఆర్ఎక్స్ డ్రైవర్ కాక్‌పిట్ డిజైన్‌తో హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, మల్టీమీడియా డిస్ప్లే సౌలభ్యాన్ని కలిగి ఉంది.ఈ కార్ ధర రూ.95.80లక్షలు. లెక్సస్ ఇండియా మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్ఎక్స్ డిమాండ్‌ని సాధించింది. -
అకౌంటెన్సీ వారి వారసత్వం...!
ఒకే కుటుంబం నుంచి (రక్తసంబంధీకులు) వరసగా అయిదు తరాల పాటు ఒకే వృత్తిని నిర్వహించిన ఘనత ప్రపంచంలోనే తమ పరివారానిదేనని చతుర్వేది అనే సీఏ ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. భారత వాణిజ్య రాజధాని ముంబయిలో బీఎం చతుర్వేది అండ్ కంపెనీ పేరు గల ఓ సీఏ సంస్థ అధిపతి ఈ మేరకు సవాల్ చేస్తున్నారు. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదుకు ఈ కుటుంబపెద్ద బ్రిజ్మోహన్ చతుర్వేది దరఖాస్తు చేశారు. మూడోతరానికి చెందిన బీఎం చతుర్వేది తన మనవరాలు మోహిని చతుర్వేది(అయిదోతరం) కఠినమైన సీఏ అర్హత పరీక్షలో నెగ్గి వారసత్వంగా వస్తున్న కుటుంబ వృత్తిలో అడుగుపెట్టింది. తొలి అడుగు 1925లో... ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన బిషంబర్నాథ్ చతుర్వేది (బీఎం చతుర్వేది తాత) ఢిల్లీలోని ఓ సంస్థలో శిక్షణ పొందాక 1925లో సీఏ వృత్తి చేపట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మధురలోని దాదాపు 500 మంది ఛార్టెర్డ్ అకౌంటెన్సీ వృత్తిలోకే దిగారు. బిషంబర్ ఇద్దరు కొడుకులు అమర్నాథ్ (బీఎం చతుర్వేది తండ్రి), దీనానాథ్ సీఏ చేశారు. అమర్నాథ్ 1955లో ఈ వృత్తిలో చేరాక ఇరవై ఏళ్లకు బీఎం చతుర్వేది,ఇద్దరు సోదరులు కూడా అదేబాటలో పయనించారు. చతుర్వేది తోడబుట్టిన సోదరులు, సోదరీమణుల పిల్లలు, ఆయన మనవరాలు (చిన్నకుమార్తె బిడ్డ) ప్రత్యేక వారసత్వాన్ని కొనసాగించడంలో చేతులు కలిపారు. ప్రస్తుతం డేవిడ్ కుటుంబం పేరిట... ప్రస్తుతం నైజీరియాలోని డేవిడ్ ఒమ్యూయా డెఫినెన్ కుటుంబం పేరిట ఈ గిన్నెస్ రికార్డ్ నమోదై ఉంది. డేవిడ్ తర్వాతి తరంలో అయిదుమంది సీఏలు (ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు)న్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు సీఏ వృత్తిలో ఎక్కువ మంది (ఆరుగురు) కొనసాగుతున్నందున ఈ విధంగా వీరిని ప్రపంచంలోని తొలి కుటుంబంగా పరిగణిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా 11 మంది తన రక్తసంబంధీకులు సీఏలుగా ఉన్నారని చతుర్వేది చెబుతున్నారు. వరసగా అయిదు తరాల పాటు ఒకే వృత్తిలో కొనసాగడంతోపాటు 11 మంది సీఏలు ఒకే కుటుంబం నుంచి ఉన్నందున గిన్నెస్రికార్డ్ తమకే చెందుతుందని అంటున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హ్యుందాయ్ ‘వెర్నా’లో కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.7.99 లక్షలు న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్’ తాజాగా ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌ను (ఐదో జనరేషన్) మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. మిడ్సైజ్డ్ సెడాన్ విభాగంలో తిరిగి అధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ఈ ఐదో జనరేషన్ వెర్నా ప్రధానంగా హోండా సిటీ, మారుతీ సుజుకీ సియాజ్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని పెట్రోల్ వేరియంట్స్ ధర రూ.7.99 లక్షలు–రూ.12.23 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్స్ ధర రూ.9.19 లక్షలు–రూ.12.61 లక్షల శ్రేణిలో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ వాహనాలకు సంబంధించి నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో వై.కె.కో తెలిపారు. కాగా పైన పేర్కొన్న కార్ల ధరలు తొలి 20,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని, తర్వాత వాహన ధరలను పెంచుతామని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. కొత్త వెర్షన్ వెర్నాలో 1.6 లీటర్ పెట్రోల్/డీజిల్ ఇంజిన్స్, మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, సన్‌రూఫ్, స్టాండర్డ్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు.