film News
-
ఆ పెద్దలు వేసిన బాటలో నడుస్తున్నాం: కొరియోగ్రాఫర్ జానీ
‘‘ప్రభుదేవాగారు చేసిన ‘వెన్నెలవే.. వెన్నెలవే’ (‘మెరుపు కలలు’ సినిమాలోనిది) పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ తరహా పాటను నేనూ చేయాలని కల కనేవాడిని. ఆ అవకాశం ధనుష్‌గారి ‘తిరుచిత్రాంబలమ్’తో దక్కింది. అక్కడ (తమిళం) ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసేందుకు ధనుష్‌గారు నన్నే పిలిపించారు’’ అని జానీ మాస్టర్ అన్నారు. ఇటీవల 70వ జాతీయ సినీ అవార్డ్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ అవార్డ్స్‌లో కొరియోగ్రఫీ విభాగంలో ‘తిరుచిత్రాంబలమ్’ సినిమాలోని ‘మేఘం కరుక్కుద’ పాటకు గాను జాతీయ అవార్డు గెల్చుకున్నారు జానీ మాస్టర్. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు చిత్ర ప్రముఖుల సమక్షంలో సన్మానం జరిగింది. జానీ మాస్టర్ మాట్లాడుతూ– ‘‘మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నామంటే అందుకు ముక్కురాజు మాస్టర్, డ్యానర్స్ అసోసియేషన్ నాయకుల కృషే కారణం.ఎన్నో అవమానాలు ఎదుర్కొని మద్రాస్ నుంచి తెలుగు డ్యాన్సర్స్‌ను ఇక్కడికి తీసుకొచ్చి, అసోసియేషన్ స్థాపించి నిలబెట్టారు ముక్కురాజు మాస్టర్. ఆ పెద్దలు వేసిన బాటలో మేమంతా ముందుకెళ్తున్నాం’’ అని తెలిపారు. ‘‘నేను, గణేశ్, జానీ... ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది’’ అన్నారు శేఖర్ మాస్టర్. -
నిర్మాత వేణుగోపాల్ మృతి
‘నక్షత్రం’(2017) సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎస్వీఎస్ వేణుగోపాల్(60) బుధవారం రాత్రి మృతిచెందారు. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న రైలు నుంచి ఆయన ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. సీరియల్స్ నిర్మాతగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులే. ‘ఆనందో బ్రహ్మ’ (1996) సీరియల్‌తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. దాదాపు పది సీరియల్స్ నిర్మించారాయన. ‘ప్రియురాలు పిలిచె’ ఆయన తీసిన చివరి సీరియల్. ‘తులసీదళం’ సీరియల్‌కి నంది అవార్డు అందుకున్నారు వేణుగోపాల్. సినిమా నిర్మాతగా ‘నక్షత్రం’ ఆయన తొలి చిత్రం.. అదే చివరి చిత్రం కూడా. హీరో చిరంజీవి నటించిన తొలి టీవీ షో ‘విజయం వైపు పయణం’ కి వేణుగోపాల్ నిర్మాత. ఈ షోకి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. వేణుగోపాల్‌కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుగోపాల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ‘నక్షత్రం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సజ్జు మాట్లాడుతూ ‘‘వేణుగోపాల్‌గారు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నది అవాస్తవం. ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు’’ అన్నారు. -
‘వాస్తు’ కోసం బాగా ప్రాక్టీస్ చేశా! : చైతన్యా రావు
చైతన్యా రావు, బ్రహ్మానందం, రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్, విష్ణు, జీవన్, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కీడా కోలా’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రానా సమర్పణలో కె. వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఓ కీల్ రోల్ చేసిన చైతన్యా రావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో టూరెట్ సిండ్రోమ్ (నత్తిగా మాట్లాడటం, మాట్లాడుతున్నప్పడు మధ్యలో ఆగడం)తో ఇబ్బందిపడే వాస్తు పాత్ర చేశాను. మనకు ఓ సమస్య ఉన్నప్పటికీ, అందరిలానే మాములు జీవితం గడపొచ్చనేది నా పాత్రలో ఉన్న సందేశం. యూ ట్యూబ్ వీడియోలు, హాలీవుడ్ సినిమాలు చూసి వాస్తు పాత్రకు ప్రాక్టీస్ చేసుకుని ఆడిషన్‌కు వెళ్లాను’’ అని అన్నారు. -
మెలోడీ మోగెనా...
‘‘ఉన్నట్టుండి మదిలోన ఏదో మెలోడీ మోగెనా..’ అంటూ మొదలయ్యే ‘ప్లాంట్ మ్యాన్’ చిత్రంలోని ‘కన్నమ్మ’ పాట లిరికల్ వీడియో విడుదలైంది. పన్నా రాయల్ నిర్మించిన చిత్రం ఇది. ఆనంద బాలాజీ స్వరపరచిన ఈ పాటకు ఈశ్వర్ హేమకాంత్ సాహిత్యం అందించగా, రోహిత్ శ్రీనివాసన్, కుమార వాగ్దేవి పాడారు. పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో సంతోషి బాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. -
రామ్ పోతినేని - వారియర్ మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్
-
Breaking News: టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్..!
-
"విరాట పర్వం" తప్పక చూడవలసిన సినిమా: దర్శకుడు కె రాఘవేంద్రరావు
-
గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
-
విరాటపర్వం పబ్లిక్ టాక్
-
కిరోసిన్ మూవీ పబ్లిక్ టాక్
-
"ఆచార్య" రామ్ చరణ్ కొరటాల శివ స్పెషల్ ఇంటర్వ్యూ
-
‘బీస్ట్’మూవీ రివ్యూ
-
హ్యాపీ బర్త్ డే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్
-
RRR Movie Review: బాక్సాఫీస్ కుంభస్థలం బద్దలుగొట్టిన ఆర్ఆర్ఆర్
-
వచ్చేస్తున్నాడు తొలి సూపర్ సోల్జర్..
-
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా ??
-
నెరవేరిన క్వీన్ కల..
ముంబై : సొంత స్టూడియో నిర్మించాలని పదేళ్ల కిందట తాను కన్న కలను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సాకారం చేసుకున్నారు. ముంబైలోని పోష్ ఏరియా పాలి హిల్ ప్రాంతంలో తన ఫిల్మ్ స్టూడియోను బుధవారం ప్రారంభించారు. మణికర్ణిక ఫిల్మ్స్ పేరిట ఏర్పాటు చేసిన ఈ స్టూడియోలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించారు. ఈ స్టూడియో కేంద్రంగా ఆమె దర్శక నిర్మాతగా వ్యవహరించనున్నారు. కంగనా స్టూడియోను ఇవాళ ప్రారంభించామని, స్టూడియో వ్యవహారాలను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ ప్రొడక్షన్లో శిక్షణ పొందిన అక్షత్ పర్యవేక్షిస్తారని కంగనా సోదరి రంగోలి వెల్లడించారు. నిజాయితీతో కష్టపడి పనిచేస్తే ప్రజలు ఏదైనా సాధించవచ్చని దాని కోసం చిల్లరమల్లర పనులు చేస్తూ నిజాయితీ లేకుండా ఎందుకు వ్యవహరించాలని స్టూడియో లాంఛింగ్ ఫోటోలను ట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించారు. కంగనా తన సినీ ప్రస్ధానంలో కష్టపడి, నిజాయితీగా వ్యవహరిస్తూ మూవీ మాఫియాకు చెంపపెట్టులా పనిచేస్తూనే తగిన ఆస్తులనూ కూడబెట్టుకున్నారని ఇతర నటీమణులపై సెటైర్లు వేశారు. -
స్క్రీన్ ప్లే 7th November 2018