
సోనాలి
‘‘ఉన్నట్టుండి మదిలోన ఏదో మెలోడీ మోగెనా..’ అంటూ మొదలయ్యే ‘ప్లాంట్ మ్యాన్’ చిత్రంలోని ‘కన్నమ్మ’ పాట లిరికల్ వీడియో విడుదలైంది. పన్నా రాయల్ నిర్మించిన చిత్రం ఇది. ఆనంద బాలాజీ స్వరపరచిన ఈ పాటకు ఈశ్వర్ హేమకాంత్ సాహిత్యం అందించగా, రోహిత్ శ్రీనివాసన్, కుమార వాగ్దేవి పాడారు.
పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో సంతోషి బాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment