ముంబై : సొంత స్టూడియో నిర్మించాలని పదేళ్ల కిందట తాను కన్న కలను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సాకారం చేసుకున్నారు. ముంబైలోని పోష్ ఏరియా పాలి హిల్ ప్రాంతంలో తన ఫిల్మ్ స్టూడియోను బుధవారం ప్రారంభించారు. మణికర్ణిక ఫిల్మ్స్ పేరిట ఏర్పాటు చేసిన ఈ స్టూడియోలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించారు. ఈ స్టూడియో కేంద్రంగా ఆమె దర్శక నిర్మాతగా వ్యవహరించనున్నారు. కంగనా స్టూడియోను ఇవాళ ప్రారంభించామని, స్టూడియో వ్యవహారాలను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ ప్రొడక్షన్‌లో శిక్షణ పొందిన అక్షత్ పర్యవేక్షిస్తారని కంగనా సోదరి రంగోలి వెల్లడించారు.
నిజాయితీతో కష్టపడి పనిచేస్తే ప్రజలు ఏదైనా సాధించవచ్చని దాని కోసం చిల్లరమల్లర పనులు చేస్తూ నిజాయితీ లేకుండా ఎందుకు వ్యవహరించాలని స్టూడియో లాంఛింగ్ ఫోటోలను ట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించారు. కంగనా తన సినీ ప్రస్ధానంలో కష్టపడి, నిజాయితీగా వ్యవహరిస్తూ మూవీ మాఫియాకు చెంపపెట్టులా పనిచేస్తూనే తగిన ఆస్తులనూ కూడబెట్టుకున్నారని ఇతర నటీమణులపై సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment