Final resting
-
అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా!
ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్ గార్డెన్తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్ సమ్ టవర్ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్ సమ్ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం. అంతా అత్యాధునికం కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్గార్డెన్ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్‌తో భవనం ఉంటుంది. ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు. పెద్దలను గౌరవించుకోవడానికి మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని మార్గరెట్ చెప్పారు. భర్త మరణంతో.. హాంకాంగ్ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు. ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్‌లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్ సమ్ అందుబాటులోకి వచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రిపోర్టింగ్‌లోనూ.. కమిట్మెంట్
వెండితెరపై భిన్న రూపాల్లో విరబూసి.. దిగంతాలకు చేరిన ఆ నవ్వులో అందరికీ ఓ సాల్మన్‌రాజ్.. ఓ రెనా (రెడ్డినాయుడు).. మరో బొక్కా వెంకట్రావ్.. కనిపిస్తారు. కామన్‌మ్యాన్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీకింగ్ ను స్టార్ రిపోర్టర్‌గా మార్చి ఆయనలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది సిటీప్లస్. రీల్‌లైఫ్‌లో ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషించిన ఎమ్మెస్.. రియల్‌లైఫ్‌లో రిపోర్టర్‌గా అవతారం ఎత్తి తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ముచ్చట్లు మీకోసం.. - భువనేశ్వరి ఎమ్మెస్ స్టార్ రిపోర్టర్‌గా తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేయడం యాధృచ్చికంగా జరగలేదు. ఎమ్మెస్ ఇంటర్వ్యూ చేయడానికి నాలుగు వృత్తులను సూచిస్తే.. ఆయన మాత్రం కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేస్తానన్నారు. ‘ఎందుకు సార్.. అంత ఇంట్రెస్ట్?’ అని అడిగితే.. ‘రిపోర్టర్‌గా నేను నా మనసును కదిలించిన వారిని పలకరిస్తే వృత్తి తృప్తి కలుగుతుంది. పైగా నాకున్న సందేహాలు తీరడంతో పాటు పాఠకులకూ ఆ వృత్తిని నమ్ముకున్న వారి బాధలు తెలుస్తాయని చెప్పారు. ఇంకా నాడు ఏమన్నారంటే.. చెవిలోన చేరేలా.. తెల్లవారుజామున మంచి నిద్రలో ఉండగా ‘ఆక్కూరలు.. బెండకాయ.. దొండకాయ.... కొత్తిమీర.. కరేపాకో..’ అంటూ ఓ అరుపు వినిపిస్తుంది. తలుపులన్నీ బిడాయించి.. ముసుగు తన్ని పడుకున్నా.. ఆ పిలుపు చక్కగా చెవిలోకి చేరిపోతుంది. వాళ్ల ఫ్రీక్వెన్సీ ఆ రేంజ్లో ఉంటుంది మరి. ఆ క్షణంలో కాస్త చికాకు పుట్టినా.. వాళ్లు గుమ్మాల దగ్గరికి రాకపోతే.. మనం కాళ్లీడ్చుకుంటూ మార్కెట్ దాకా వెళ్లాల్సి వస్తుంది. నవనవలాడే కూరగాయలు గుమ్మం ముందుకు వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. అందుకే వారంటే నాకు అభిమానం. లైవ్ రిపోర్టర్లు.. వారు ప్రతి ఇంటికీ కావాల్సిన వారే. ఒక వీధిలో పది ఇళ్లుంటే అందరికీ అతను ఆప్తుడే. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కూరగాయలబ్బిపై మక్కువ కాస్త ఎక్కువే. తాజా కూరగాయలు ఇస్తాడనో.. కసురుకోకుండా కొసరు వేస్తాడనో కాదు.. పక్కవీధి నుంచి తాజా తాజా కబుర్లు మోసుకొస్తాడని.ఆ ఇంటి ముచ్చట్లు ఇక్కడ.. ఈ ఇంతి ముచ్చట్లు అక్కడ చెప్పే పుల్లారావులు కూడా వీరిలో ఉంటారు. ‘మీలా బేరం ఆడకుండా.. డబ్బులిచ్చే వారు ఎక్కడుంటారు చెప్పండి’ అంటూ కాకాపెట్టే కాకారాయుళ్లూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తోపుడుబళ్ల వాళ్లు మనలో ఒకరన్నమాట’ అని వారిని తను చూసిన యాంగిల్లో వివరించారు ఎమ్మెస్. బహుదూరపు వ్యాపారి.. నాలుగు రకాల కూరగాయలు అమ్ముకుని బతికే వారు.. ఈ డబ్బుతో అంతస్తులు కట్టుకోలేడు. కేవలం పొట్టనింపుకోగలడంతే. బండెడు కూరగాయలు అమ్ముకోవడానికి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడో తెలియదు. నేను వాళ్లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా.. పాఠకులకు కొన్ని విషయాలు చెబుదామనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.. దండిగా డబ్బున్న వాళ్లు కూడా ఆకుకూరలు కొనే దగ్గర గీచి గీచి బేరాలాడుతుంటారు. ఓ గంట బేరమాడి ఓ కట్ట ఎక్కువ సాధించనంత మాత్రాన మీరు మరింత ధనవంతులు కాలేరు! బేరమాడకుండా మీరు డబ్బులిచ్చినంత మాత్రాన వాటితో అతనేమీ మేడలు కట్టుకోలేడు !! బేరమాడకుండా తీసుకుంటే ‘చల్లంగా ఉండమ్మా’ అని దీవించి ఆ రోజు హ్యాపీగా ఉంటాడు. రిపోర్టర్‌గా వారిని పలకరిస్తే మానవీయ కథనంగానే కాకుండా వారి ఇబ్బందులను కూడా బయటకు తెచ్చిన వాడిని అవుతాను కదా !’ అంటూ వివరించారు ఎమ్మెస్. ఇంటర్వ్యూ ముగిసాక.. రెహ్మత్‌నగర్ బస్తీలో ఓ పదిమంది బండ్లవారిని ఇంటర్వ్యూ చేసే ముందు వారితో.. ‘మిమ్మల్ని స్టార్‌గా పలకరించడం లేదు. సాక్షి తరఫున స్టార్ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీకున్న ఇబ్బందులన్నీ మన సువిప్పి చెప్పుకోవచ్చు. వాటిని పరిష్కరించడానికి నా వంతు సాయం తప్పకుండా చేస్తాను’ అన్నారు. రిపోర్టింగ్ ముగిశాక ‘తోపుడు బండ్లకు లెసైన్స్‌ల కోసం ప్రయత్నిస్తానని’ లోకల్ కార్పొరేటర్ కబురు పంపడంతో వారింటికి వెళ్లారు ఎమ్మెస్. మీడియా ముఖంగా ఆ హామీ నెరవేరుస్తానని చెప్పాల్సిందిగా ఆమెను అడిగి.. ఓ బాధ్యతగల రిపోర్టర్‌గా వ్యవహరించారు. కొన్ని రోజుల తర్వాత సాక్షి స్టార్ రిపోర్టర్ సక్సెస్ మీట్ సందర్భంగా మళ్లీ ఎమ్మెస్ను కలిసినపుడు.. ఆ తోపుడుబండ్ల వారి లెసైన్స్‌ల పని ఎంత వరకు వచ్చిందని ఆత్రుతతో అడిగి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అలాంటి మంచి వ్యక్తికి.. మా స్టార్ రిపోర్టర్‌కు తుది వీడ్కోలు. 2014 సెప్టెంబర్ 14న సిటీప్లస్ లో ప్రచురితమైన రిప్టోరర్