Finally
-
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
దివాలా పరిష్కారాలు అంతంతే
ముంబై: కంపెనీ చట్ట ట్రిబ్యునళ్లలో దాఖలైన దివాలా కేసులు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికం(క్యూ3)లో అంతంతమాత్రంగానే పరిష్కారమయ్యాయి. వెరసి క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో దివాలా పరిష్కారాలు(రిజల్యూషన్లు) 15 శాతంగా నమోదయ్యాయి. ఇన్సాల్వెన్సీ, దివాలా బోర్డు(ఐబీబీఐ) గణాంకాల ప్రకారం 267 దివాలా కేసులలో 15 శాతమే రిజల్యూషన్ల స్థాయికి చేరాయి. ఇక క్లెయిమ్ చేసిన రుణాలలో 27 శాతమే రికవరీ అయినట్లు గణాంకాలు వెల్లడించాయి. 45 శాతం కేసులు లిక్విడేషన్ ద్వారా ముగిసినట్లు ఐబీబీఐ గణాంకాలను విశ్లేషించిన కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో కేసులు 256కు దిగివచ్చాయి. 2019–20లో నమోదైన 2,000 కేసుల రన్‌రేట్‌తో పోలిస్తే భారీగా తగ్గాయి. కాగా.. ఎలాంటి రిజల్యూషన్ ప్రణాళికలు లభించకపోవడంతో లిక్విడేషన్లలో మూడో వంతు కేసులు ముగిసినట్లు కొటక్ విశ్లేషణ వెల్లడించింది. మొత్తం 1,901 కేసులు పరిష్కారంకాగా.. 1,229 కేసులు లిక్విడేషన్కే బ్యాంకర్లు ఓటేశారు. మరో 600 కేసులలో ఎలాంటి పరిష్కార ప్రణాళికలూ దాఖలు కాలేదు. 56 కేసుల విషయంలో నిబంధలకు అనుగుణంగాలేక తిరస్కరణకు గురికాగా.. 16 కేసుల్లో పరిష్కార ప్రొవిజన్లకు రుణదాతలు అనుమతించలేదు. ఇక లిక్విడేషన్ కేసులలో 76 శాతం కంపెనీ మూతపడటం లేదా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ(బీఐఎఫ్ఆర్) వల్ల నమోదుకాగా.. మిగిలినవి ఇతర కారణాలతో జరిగినట్లు కొటక్ వివరించింది. కేసుల పరిష్కారం ఆలస్యమవుతున్నప్పటికీ 2021 క్యూ2 (కరోనా మహమ్మారి కాలం)తో పోలిస్తే తగ్గినట్లే. 270 రోజులకుపైగా ఈ ఏడాది క్యూ3లో దాఖలైన కేసులలో 64% 270 రోజులను దాటేశాయి. మరో 14% కేసులు నమోదై 180 రోజులైంది. వెరసి లిక్విడేషన్ కేసులు అధికమయ్యే వీలున్నట్లు కొటక్ విశ్లేషించింది. రుణ పరిష్కార సగటు 590 రోజులుగా తెలియజేసింది. కొత్త కేసుల విషయంలో 50 శాతంవరకూ నిర్వాహక రుణదాతలు చేపడుతుంటే, 40 శాతం ఫైనాన్షియల్ క్రెడిటర్లకు చేరడం క్యూ3లో కనిపిస్తున్న కొత్త ట్రెండుగా తెలియజేసింది. తాజా త్రైమాసికంలో దాఖౖ లెన కేసులలో 42 శాతం తయారీ రంగం నుంచికాగా, 18 శాతం రియల్టీ, 13 శాతం రిటైల్, హోల్‌సేల్ వాణిజ్యం, 7 శాతం నిర్మాణం నుంచి నమోదయ్యాయి. ఐబీసీ ప్రాసెస్ తొలి నాళ్లలో భారీ కార్పొరేట్ కేసులు అధికంగా నమోదుకాగా.. ప్రస్తుతం దేశీ కార్పొరేట్ పరిస్థితులు పటిష్ట స్థితికి చేరుతు న్నట్లు విశ్లేషణ పేర్కొంది. కొత్త కేసులలో కరోనా మహమ్మారి ప్రభావంపడిన మధ్య, చిన్నతరహా సంస్థల నుంచి నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఐబీసీ ద్వారా మొత్తం రుణ పరిష్కార విలువ రూ. 8.3 లక్షల కోట్లకు చేరగా.. ఫైనాన్షియల్ క్రెడిటర్లు 73 శాతం హెయిర్‌కట్‌ను ఆమోదించాయి. -
జపాన్ లో మొదలైన ఆ సునామీ
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి నాంది పలికిన క్రేజీ గేమ్ పోకిమాన్ గో ఎట్టకేలకు జపాన్ లో లాంచ్ అయింది. ఈ గేమ్ ను రూపొందించిన జపాన్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ నియాంటిక్ ల్యాబ్స్ స్వయంగా ప్రకటించింది. దీంతో పోకిమాన్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పోకీమాన్ గో యూజర్లు ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ గేమ్ పై నిపుణుల హెచ్చరికలు, ప్రమాదాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు అక్కడి అధికారులు సందేశాలు జారీ చేశారు. హెచ్చరికలకు కట్టుబడి ఉండి...ప్రజలు తమ తమ స్మార్ట్ ఫోన్లలో గేమ్ ను సురక్షితంగా ఆడుకోవాలని చీఫ్ కేబినెట్ కార్యదర్శి యోషిండే సుగా ట్వీట్ చేశారు. దీంతో ఇది 15 వేల సార్లు రీట్విట్ అయింది. కాగా ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ ..అమెరికా, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో జూలై ఆరున అధికారికంగా లాంచ్ అయ్యాయి. కెనడాలో జూలై 17న ఈ గేమ్ హవా మొదలైంది. అయితే మిగిలిన చాలా దేశాల్లో అఫీషియల్ లాంచింగ్ ముగియనప్పటికీ అనధికారంగా లక్షలమంది యూజర్లతో పోకిమాన్ గేమ్ మానియా కొనసాగుతోంది. గూగుల్ సెర్చ్ లో పోర్న్ సైట్లు, బ్రెక్సిట్ ను సైతం దాటేసిన పోకెమాన్ గో దూసుకుపోతోంది. అటు ఈ గేమ్ ప్రభావంపై స్పందించిన ఇండోనేషియా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించగా,సౌదీమత పెద్దలు ఆటలు నిషేధిస్తూ ఫత్వాజారీ చేయడం విశేషం. మరోవైపు పోకిమాన్ ఆవిష్కరణతో రికార్డ్ స్థాయిలాభాలను ఆర్జించిన నింటెండో షేర్లు తమ హవాను కొనసాగిస్తున్నాయి. లాంచింగ్ తరువాతజపాన్ మార్కెట్లో సుమారు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. ప్రముఖ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్ స్పాన్సర్ షిప్ డీల్ కుదుర్చుకోవడంతో నష్టాల్లో ఉన్న మెక్ డోనాల్డ్ ఊపిరి పీల్చుకుంటున్న సంగతి తెలిసిందే. Trainers in Japan, thank you for being patient. Pokémon GO is now available to download in Japan! — Pokémon GO (@PokemonGoApp) July 22, 2016 -
ఈ-కామర్స్ ఇయర్‌గా 2014
-
పౌరాణిక జ్ఞానం
శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? బ్రహ్మకి మూడు తలలే కనిపిస్తాయెందుకు? శివుడు లయకర్త. లయమంటే ముగింపు. అది జరిగేది శ్మశానంలోనే కదా! అందుకే ఆయన శ్మశానంలో ఉంటాడు. బ్రహ్మకి అసలు శిరస్సులు ఐదు. శంకరుడు ఒకటి ఖండిస్తే నాలుగు తలలవాడయ్యాడు. మనం గోడమీద చెక్కిన శిల్పాన్ని చూస్తూండడం వల్ల మూడు ముఖాలు కల్గినవానిగా కన్పిస్తూ ఉండవచ్చు గాని ఆయనకి నాలుగు దిక్కులనీ చూస్తూ నాలుగు ముఖాలు ఉంటాయి. అప్సరసల్ని పంపి తపస్సును చెడగొట్టే లక్షణమున్న ఇంద్రుడు దేవతలకు రాజెలా అయ్యాడు? ఇంద్రునిది పరీక్షాధికారి పదవి. ఎవరైనా తపస్సు ప్రారంభించగానే వారిది ఏ స్థాయి తపస్సో, ఎంత గాఢ తపస్సో పరీక్షించవలసిన బాధ్యతనీ ధర్మాన్నీ దేవతలు ఈయన మీద ఉంచారు. అందుచేత ఇంద్రుడు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరింటిలోనూ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున పరీక్షలు నిర్వహిస్తాడు. ఓడిపోవడమనేది (కామంలో మేనకతో విశ్వామిత్రుడు, క్రోధంలో అహల్య విషయంలో గౌతముడు.. ఇలా) ఆ రుషుల త ప్పు తప్ప, పరీక్షించ వచ్చిన అప్సరసలదీ కాదు- వారిని పంపించిన ఇంద్రునిది ఏమాత్రమూ కాదు! దర్భలకి అంతటి పవిత్రత ఎలా వచ్చింది? శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు దాని పైన మందర పర్వతంతో దేవదానవులు చిలకడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేల మీద పడగా అవి దర్భలుగా భూమినుండి మొలకెత్తాయి. ఇక గరుడుడు అమృతభాండాన్ని ఉంచింది ఈ దర్భలమీదే! అలా అమృతాన్ని తమ మీద ధరించినవి కూడ కాబట్టి వీటికింతటి పవిత్రత.