Financial Technology
-
వచ్చే వారం ఫిన్‌టెక్ చీఫ్‌లతో ఆర్థిక మంత్రి భేటీ
న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ– పేటీఎం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే వారం ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల అధిపతులతో సమావేశం కానున్నారు. నియంత్రణ నిబంధనలను కచి్చతంగా పాటించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆమె వివరించనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అలాగే ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను కూడా ఆరి్థకమంత్రి ఈ సందర్భంగా తెలుసుకుని, వాటి పరిష్కారంపై దృష్టి సారించనున్నారు. ఈ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్, ఆరి్థక మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం– అంతర్గత వాణిజ్యం తదితర శాఖల సీనియర్ అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. -
డేటా గోప్యత విషయంలో రాజీ పడకూడదు
న్యూఢిల్లీ: డేటా గోప్యత విషయంలో రాజీ పడకూదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో క్లయింట్ల డేటాకు రక్షణ ఉండాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2021’ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) నిర్వహించింది. ‘‘డిజిటల్ లావాదేవీల విలువ 2021 జనవరి–ఆగస్ట్ కాలంలో రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020లో ఈ మొత్తం రూ.4లక్షల కోట్లు, 2019లో రూ.2 లక్షల కోట్లుగానే ఉంది. డేటా గోప్యత అన్నది ఎంతో ముఖ్యమైనది. ఈ అంశంపై ఎన్నో వివాదాస్పద అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ డేటా గోప్యతను గౌరవించడం కనీస సూత్రం. క్లయింట్ల సమాచారానికి తగినంత రక్షణ కల్పించడం అన్నది విశ్వాస కల్పనకు వెన్నెముక అవుతుంది. నా సమాచారానికి రక్షణ లేనంత వరకు ఈ అంశాల పట్ల ఆసక్తి చూపించను’’ అని మంత్రి సీతారామన్ తన అభిప్రాయాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలోనే ‘బాధ్యతాయుత చెల్లింపుల విషయమై ఐక్యరాజ్యసమితి సూత్రాలు’ అనే నివేదికను ఆవిష్కరించారు. భారత్‌లో ఫిన్‌టెక్ అమలు 87%గా ఉందని.. అదే ప్రపంచవ్యాప్తంగా దీని సగటు అమలు 64 శాతమేనని తెలిపారు. డిజిటల్ కార్యకలాపాలు, లావాదేవీలకు భారత్ ప్రముఖ కేంద్రంగా అవతరించినట్టు పేర్కొన్నారు. డిజిటల్ మోసాలకు చెక్.. డిజిటల్ మోసాలను నివారించడంలో ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు) సంస్థలు కీలక పాత్ర పోషించగలవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ అన్నారు. డిజిటల్ మోసాలను తగ్గించడంపైనే అందరి దృష్టి ఉండాలన్నారు. ఇదే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ కార్యకలాపాల విస్తరణ ప్రధానంగా పట్టణాలు, మెట్రో ప్రాంతాల్లోనే ఉంటోందంటూ.. దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. స్మార్ట్ఫోన్లు అందరి వద్ద లేనందున.. జనాభాలో ఎక్కువ మందిని చేరుకునేందుకు గాను టెక్నాలజీ పరిష్కారాలు అవసరమన్నారు. ఆర్బీఐ శాండ్బాక్స్ కార్యక్రమం ద్వారా మెరుగైన ఆప్షన్లను గుర్తించినట్టు చెప్పారు. ఫిన్‌టెక్ విభాగంలో ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి మద్దతుగా.. నియంత్రణ సంస్థలు, భాగస్వాములు అందరూ తమ వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. వాట్సాప్ ఏపీఐ విస్తృత సేవలు ప్రభుత్వ సేవలు, రిటైల్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ తదితర డిజిటల్ సేవల్లో వాట్సాప్ ఏపీఐ ముఖ్యభూమిక పోషిస్తున్నట్టు వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ అన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. వ్యాపారాలను డిజిటల్‌గా మార్చడానికి వాట్సాప్ ఏపీఐ సాయపడుతున్నట్టు చెప్పారు. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌పై సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. వందలాది వ్యాపారాలు, సేవలు ప్రతి నెలా ప్రారంభమవుతున్నాయి. మా యూజర్లు ఈ సేవలను వినియోగించుకోవడం కూడా వేగవంతం అయ్యింది. ఏ రంగంలో అయినా పెద్ద సంస్థ లేదా చిన్న సంస్థ అయినా వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారం అందించడం ఇప్పుడు సులభతరం అయింది. ప్రభుత్వం ‘కోవిన్’, ‘మైజీవోవీ’కు ఏపీఐని ఇటీవలే ప్రారంభించగా.. వాట్సాప్‌లోనూ ఈ సేవలను విస్తరించాము. దీంతో వాట్సాప్ నుంచే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు, వ్యాక్సిన్ స్లాట్లను తెలుసుకోవడం, టీకాలకు అపాయింట్మెంట్లు తీసుకోవడం, టీకా సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కలిగింది’’ అని బోస్ చెప్పారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు కలసి పనిచేయాలి స్టాన్‌చార్ట్ బ్యాంకు ఎండీ దరువాలా బ్యాంకులు, పెద్ద టెక్నాలజీ కంపెనీలు (బిట్ టెక్), ఫిన్‌టెక్ కంపెనీలు సహకారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకోవచ్చని.. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఎండీ జరిన్ దరువాలా అభిప్రాయపడ్డారు. అలాగే, రుణ వితరణలోనూ నిర్ణయాలు తీసుకునేందుకు అనలైటిక్స్‌ను వినియోగించుకోవచ్చన్నారు. కలసికట్టుగా సాగడం వచ్చే కొన్నేళ్లలో సాధ్యపడొచ్చని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో భాగంగా దరువాలా మాట్లాడారు. తమదగ్గరున్న భారీ డేటాబేస్ (కస్టమర్ల సమాచారం/వివరాలు)ను తగిన విధంగా వినియోగించుకోవడంలో బ్యాంకులు వెనుకబడ్డాయని.. అయినప్పటికీ గత రెండు మూడేళ్లలో వేగంగా పుంజుకున్నట్టు చెప్పారు. ఫిన్‌టెక్‌లతో కలసి పనిచేయడం వల్ల బ్యాంకులు ఖర్చులను తగ్గించుకోగలవన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
ఫిన్‌టెక్ డీల్స్‌లో చైనాను మించిన భారత్
కోల్‌కతా: ఆసియా ఖండంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) డీల్స్‌కు భారత్ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవిస్తోంది. ఈ విషయంలో 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో చైనాను కూడా అధిగమించింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సేవల సంస్థ ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో 33 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ 647.5 మిలియన్ డాలర్లు. ఇదే సమయంలో చైనాలో 284.9 మిలియన్ డాలర్ల విలువ చేసే ఫిన్‌టెక్ డీల్స్ మాత్రమే నమోదయ్యాయి. ‘కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ 2020 ప్రథమార్ధంలో భారత్‌లోకి ఫిన్‌టెక్ పెట్టుబడులు 60 శాతం పెరిగాయి. దేశీయంగా ఈ పరిశ్రమ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ .. రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందగలదు. డిజిటల్ రుణాలు తదితర విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది‘ అని ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్ ఎండీ రాజీవ్ షా తెలిపారు. నాలుగున్నరేళ్లలో 10 బిలియన్ డాలర్లు.. గడిచిన నాలుగున్నరేళ్లలో (2016 నుంచి 2020 ప్రథమార్ధం దాకా) దేశీ ఫిన్‌టెక్ రంగంలోకి 10 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. చాలా మటుకు ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థల ప్రధాన కార్యాలయాల కేంద్రాలుగా బెంగళూరు, ముంబై టాప్‌లో ఉన్నాయి. దేశీయంగా మొత్తం 21 యూనికార్న్‌లు ఉండగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ సాధించిన సంస్థలు), వీటిలో మూడింట ఒక వంతు ఫిన్‌టెక్ సంస్థలే ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం 16 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో అగ్రస్థానంలో ఉంది. -
హైదరాబాద్ లో ఇన్వెస్కో ఇన్నోవేషన్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ దేశాల్లో ఇన్వెస్ట్ మెంట్ సేవలందిస్తున్న ఫైనాన్షియల్ దిగ్గజం ఇన్వెస్కో... టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు హైదరాబాద్‌లో తమ తొలి గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను ఆరంభించింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఉద్యోగులు, స్టార్టప్‌ల వినూత్న ఐడియాలను ప్రోత్సహించేందుకు ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీటీవో డోనీ లోచన్ తెలిపారు. మంగళవారం దీన్ని ఆరంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘హబ్ ఆరంభం సందర్భంగా 24 గంటల పాటు అంతర్గతంగా మా ఉద్యోగుల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం. దీన్లో సుమారు 600 మంది పాల్గొంటున్నారు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఇన్వెస్కో దాదాపు 835 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని, 6 వేల మంది పైచిలుకు ఉద్యోగులున్నారని సంస్థ గ్లోబల్ హెడ్ (స్ట్రాటెజీ ఇన్నోవేషన్ అండ్ ప్లానింగ్ విభాగం) డేవ్ డోసెట్ వివరించారు. భారత్‌లో 1100 మంది దాకా సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. -
వాటా తగ్గించుకోండి
న్యూఢిల్లీ: ప్రమోటర్లుగా తమ వాటాను నెల రోజుల్లోగా 2% లోపునకు తగ్గించుకోమంటూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్)ను మల్టీ కమోడి టీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్) బోర్డు కోరింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎఫ్ఎంసీ ఆదేశాల మేరకు ఎంసీఎక్స్ బోర్డ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్) సంక్షోభం నేపథ్యంలో ఎక్స్ఛేంజీల నిర్వహణకు ఎఫ్టీఐఎల్తోపాటు, సంస్థ చీఫ్ జిగ్నేష్ షాను గత వారం ఎఫ్ఎంసీ అనర్హులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం ఎఫ్‌టీఐఎల్‌కు 26% వాటా ఉంది. బోర్డులకు మార్గదర్శకాలు ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ ఎక్స్ఛేంజీలకు సంబంధించి కార్పొరేట్ పాలన(గవర్నెన్స్) నిబంధనలను ఎఫ్ఎంసీ కఠినతరం చేసింది. దీనిలో భాగంగా అన్ని రకాల ప్రధాన వ్యాపార నిర్ణయాలను తగిన స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఎక్స్ఛేంజీల బోర్డులను ఆదేశించింది. ఈ బాటలో సీఈవోల ఆర్థికపరమైన అధికారాలపై కన్నేయడంతోపాటు, ప్రమోటర్లు, యాజమాన్య సంబంధిత వ్యక్తుల లావాదేవీలపై సైతం తగిన పరిశీలన చేపట్టాల్సిందిగా సూచించింది. ఇవికాకుండా డొనేషన్లు, పబ్లిసిటీ, మీడియా, లీగల్ తదితర చార్జీల వంటి అంశాలలో తగిన స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా సలహా ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ఎంసీఎక్స్సహా ఆరు జాతీయస్థాయి ఎక్స్ఛేంజీలకు మార్గదర్శకాలను జారీ చేసింది.