భారత్, శ్రీలంక అండర్-19 వన్డే రద్దు
దంబుల్లా: భారీ వర్షం కారణంగా భారత్, శ్రీలంక అండర్-19 యూత్ తొలి వన్డే రద్దయ్యింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం సమంగా ఉంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో... మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 301 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ విజయ్ జోల్ (76) చెలరేగగా... అంకుష్ బయాన్స్ (59), శామ్సన్ (58) రాణించారు. రికీ బుయ్ (49), హుడా (31 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
ననయకారా 3, పెరీరా ఒక్క వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక 14.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం రావడంతో ఆట కొనసాగించే అవకాశం లేకపోయింది. భానుకా (30), సమరవిక్రమ (25 నాటౌట్) రాణించారు.