fishermen issue
-
మత్స్యకారుల ఐక్యతను దెబ్బతీసేందుకు టీడీపీ కుట్ర
తిరుపతి అర్బన్: మత్స్యకారుల ఐక్యతను దెబ్బతీసేందుకు టీడీపీ కుట్రపన్నింది. వైఎస్సార్సీపీ నేతలను కలవకూడదని ఓ వర్గం చెప్పగా.. సమస్యల పరిష్కారం కోసం కలిస్తే తప్పేంటని మరో వర్గం వాదనకు దిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ భవనంలో శనివారం ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల రౌండ్‌టేబుల్ సమావేశం జేఏసీ కన్వీనర్ సత్యనారాయణ నేతృత్వంలో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే కొండబాబు మత్స్యకారులకు చంద్రబాబు పాలనలోనే న్యాయం జరిగినట్లు చెప్పే ప్రయత్నం చేశారు. కొందరు టీటీపీ మద్దతుదారులు వైఎస్సార్సీపీ నాయకులకు మత్స్యకారుల సమస్యలు చెప్పవద్దని, అసలు వారిని కలవకూడదని అనడం వివాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నందున, ఏంచేయాలన్నా వాళ్లను కలవాల్సి ఉంటుందని.. సమస్యల పరిష్కారం కోసం వారిని కలిస్తే తప్పేంటని నిలదీశారు. మత్స్యకారుల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రస్థాయి సమావేశం తిరుపతిలో నిర్వహించనున్న దృష్ట్యా మత్స్యకారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని, ఇందులో టీడీపీ నేతలు ఇతర విషయాలను చర్చించడం ఏమిటని వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితుల నడుమ పలువురు మత్స్యకారులు సమావేశంలో పాల్గొనకుండా ఆవరణలోనే ఉండిపోయారు. సమావేశం రసాభాసగా మారడంతో ఎవరికీ సర్దిచెప్పలేక కొల్లు రవీంద్ర మౌనం దాల్చారు. కొంతసేపటికి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. -
ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం: మంత్రి సీదిరి అప్పలరాజు
-
ఏపీ: నాలుగు ఫిషింగ్ హార్బర్లకు నేడు శంకుస్థాపన
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పాదయాత్ర హామీ మేరకు... తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో మత్స్యకారుల సమస్యలను స్వయంగా పరిశీలించిన సీఎం జగన్ వారి ఇబ్బందులను తొలగించేందుకు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలిదశలో రూ.1,510 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్లను రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా డిసెంబర్ రెండో వారంలో ఖరారు కానున్నాయి. రెండోదశలో ప్రారంభమయ్యే మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చిస్తోంది. నియోజకవర్గానికో ఆక్వా హబ్ వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, పౌష్టికాహార భద్రతలో భాగంగా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆక్వాహబ్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలిదశలో భాగంగా 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు సీఎం జగన్ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. లైవ్ ఫిష్, తాజా చేపలు, డ్రై చేపలు, ప్రాసెస్ చేసిన చేపలు, రొయ్యలు, పీతలు ఇతర మత్స్య ఉత్పత్తులు వీటిల్లో లభిస్తాయి. మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ హబ్‌లను జనతా బజార్లతో అనుసంధానం చేయనున్నారు. ఆక్వా రైతుల సొసైటీలు ఈ హబ్‌లను నిర్వహిస్తాయి. -
‘రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం’
సాక్షి, అమరావతి : ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మండలి రద్దుకు ప్రభుత్వం చట్ట ప్రకారం తీర్మానం చేసిందని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన నేతలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు మేలు చేసే ఇంగ్లిష్ మీడియం బిల్లును టీడీపీ మండలిలో అడ్డుకుందని మండిపడ్డారు. పెద్దల సభ అంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టులా టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ కుట్రపూరితంగానే మండలిలో బిల్లులను అడ్డుకుందన్నారు. ఆ ఆదాయం ఏపీ నుంచే అధికం.. మెరైన్ ఎక్స్పోర్ట్ వల్ల విదేశీ మారక ద్రవ్య ఆదాయం ఏపీ నుంచే అధికమని మంత్రి తెలిపారు. తీర ప్రాంతంలోని ప్రతి జిల్లాకు ఒక పోర్ట్ నిర్మించే యోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టులను విస్తృత పరుస్తామని చెప్పారు. అందులో భాగంగా సెకండ్ ఫేస్‌లో ఫిషింగ్ జట్టీలు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలో ఫిషింగ్ జట్టీలు నిర్మించనున్నట్టు వెల్లడించారు. రూ. 100 కోట్లతో విశాఖలో ఫిషింగ్ హార్బర్ విస్తరణ పనులు చేపడతామన్నారు. -
జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం
శ్రీలంక-భారత్ నిర్ణయం కొలంబో: ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తున్న మత్స్యకారుల సమస్యకు సృజనాత్మక, శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని భారత్, శ్రీలంక నిర్ణయించాయి. భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, శ్రీలంక విదేశాంగమంత్రి మంగళ సమరవీర శుక్రవారం కొలంబోలో 9వ ‘ఇండో-లంక జాయింట్ కమిషన్’ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రక్షణ, విమానయానం, వాణిజ్యరంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురూ సమీక్షించారు. విద్య, వైద్య రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మత్స్యకారుల సమస్యపై చర్చించేందుకు లంక మత్స్య మంత్రి అమరవీర భారత్‌కు రానున్నారు. తమ ప్రాదేశిక జలాల్లోకి భారత జాలర్లు వస్తున్నార లంక వాదిస్తుండగా.. తాము ఇదివరకు వేటాడే ప్రాంతంలోకే వెళ్తున్నామని భారత జాలర్లు చెబుతున్న నేపథ్యంలో ఈ అంశం ఇరుదేశాల మధ్య అపరిష్కృత సమస్యగా మారింది. -
సుబ్రహ్మణ్యస్వామికి సమన్లు
చెన్నై: భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామికి వచ్చే నెల 30న కోర్టు ముందు హాజరుకావాలని స్థానిక కోర్టు సమన్స్ జారీ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువునష్టం దావాకు సంబంధించి ఈ సమన్లు జారీ చేశారు. . తమిళనాడుకు చెందిన మత్స్యకారుల సమస్యలపై సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రచురించినందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా, తమిళ దినపత్రిక దినమలార్ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్లకు కూడా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సమన్లు జారీ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి వాస్తవానికి విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని, దురుద్దేశంతో కూడిన విమర్శలు గుప్పించారని జయలలిత వేసిన పిటిషన్లో ఆరోపించారు. సిటీ కోర్టులో వేసిన ఈ కేసులో స్వామి విమర్శలు సీఎం ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా చెన్నై ఎడిషన్ ప్రింటర్, పబ్లిషర్పైన, ఇంటర్వ్యూ చేసిన విలేకరిపైన కూడా మొదటి సెషన్స్ కోర్టులో ముఖ్యమంత్రి జయలలిత తరపున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ 8వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ** -
జాలర్ల సమస్యపై రాజపక్సేను కలవండి
న్యూఢిల్లీ.తమిళనాడుకు చెందిన జాలర్లను శ్రీలంక నావికాదళం తరచూ అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో తగిన పరిష్కారంకోసం శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సను కలుసుకోవలసిందిగా బీజేపీ నేత సుబ్రమణియం స్వామి మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సూచించారు. శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతాన్ని సందర్శించాలని కూడా ఆయన తన ప్రకటనలో జయలలితనుకోరారు. జాఫ్నా తీరానికి సమీపంలో భారతీయ జాలర్లు చేపలవేట సాగిస్తున్నట్టుగా అక్కడి తమిళులు ఫిర్యాదు చేస్తున్నారని, మన్నార్ సింధుశాఖ ప్రాంతంలో భారతీయ జాలర్లు ప్రతిసారీ అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమిస్తున్నారని సుబ్రమణియం స్వామి అన్నారు. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో చేపలవేట సాగించారన్న ఆరోపణలతో ఆరెస్టయి, అక్కడి జైళ్లలో కస్టడీలో ఉన్న జాలర్లను విడుదల చేయించేందుకు స్వయంగా జోక్యం చేసుకోవాలంటూ జయలలిత ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన నేపథ్యంలో జాలర్ల సమస్యపై సుబ్రమణియం స్వామి తాజా ప్రకటన చేశారు.