శ్రీలంక-భారత్ నిర్ణయం
కొలంబో: ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తున్న మత్స్యకారుల సమస్యకు సృజనాత్మక, శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని భారత్, శ్రీలంక నిర్ణయించాయి. భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, శ్రీలంక విదేశాంగమంత్రి మంగళ సమరవీర శుక్రవారం కొలంబోలో 9వ ‘ఇండో-లంక జాయింట్ కమిషన్’ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రక్షణ, విమానయానం, వాణిజ్యరంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురూ సమీక్షించారు.
విద్య, వైద్య రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మత్స్యకారుల సమస్యపై చర్చించేందుకు లంక మత్స్య మంత్రి అమరవీర భారత్‌కు రానున్నారు. తమ ప్రాదేశిక జలాల్లోకి భారత జాలర్లు వస్తున్నార లంక వాదిస్తుండగా.. తాము ఇదివరకు వేటాడే ప్రాంతంలోకే వెళ్తున్నామని భారత జాలర్లు చెబుతున్న నేపథ్యంలో ఈ అంశం ఇరుదేశాల మధ్య అపరిష్కృత సమస్యగా మారింది.
జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం
Published Sat, Feb 6 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM
Advertisement