flash flood
-
చైనాలో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి
బీజింగ్: నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం కారణంగా వరదలు సంభవించి సిచువాన్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం నాటికి ఈ ప్రాంతంలో 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వాయువ్య గన్సు రాష్ట్రంలోని లాంగ్నాన్ నగరంలోనూ వరదల వల్ల ఆరుగురు చనిపోయినట్లు మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో 3000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించినట్లు పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లోనే వర్షపాతం 98.9 మిల్లీమీటర్లకు చేరిందని, జులై సగటుతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని వెల్లడించింది. ఒకవైపు చైనాలోని తూర్పు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే నైరుతి, వాయవ్య ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. తూర్పు జెజియాంగ్ రాష్ట్రం, షాంఘై నగరాల్లో గతవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయయ్యాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేడి గాలులు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయని, ఆ నీరు ఒక్కసారిగా విడుదలైనప్పుడు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తాయని చెప్పారు. ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తాయని పేర్కొన్నారు. చదవండి: మంటల్లో కాలిపోతున్న ఇల్లు..హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్ -
అస్సాంలో వరదలు..ఐదుగురి మృతి
గువాహటి : ఒకపక్క కరోనా వైరస్, ఆఫ్రికన్ ఫ్లూతో ప్రజలు అల్లాడుతుంటే వరదల రూపంలో మరో పిడుగు పడినట్లయ్యింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది. రాష్ర్టంలోని నల్బరి, గోల్పారా, నాగావ్, హోజాయ్ సహా మరో మూడు జిల్లాలు ముంపునకు గురయ్యారు. దీంతో వరదల్లో చిక్కుకుపోయిన దాదాపు 3.81 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) తెలిపింది. వరదల కారణంగా ముఖ్యంగా గోల్పురా, హోజాయ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం కాగా గురువారం ఈ రెండు జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అస్సాంలో వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర, దాని అనుబంధ ఉపనదుల్లో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. 356 గ్రామాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో 3,880 మందిని 190 సహాయక శిబిరాలకు చేర్చినట్లు తెలిపారు. (జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం ) వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదేశించారు. వరద సమయంలో సత్వర ఉపశమనం, సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమీషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్న ఆయన బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వరదల నేపథ్యంలో కరోనా ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని ప్రజలంతా కలిసికట్టుగా విపత్తును ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. (ఏడాది పాలన: ప్రజలకు మోదీ లేఖ ) -
మెరుపు వరదలు, భూ పాతాలు, భూకంపం..
టోక్యో, జపాన్ : నాలుగు ద్వీపాల సమూహ దేశం జపాన్ను వరద, భూపాతాలు, భూకంపం వణికించాయి. జపాన్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 46 మంది మృతి చెందగా, 50 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతుల సంఖ్య భారీగా పెరిగా అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు 100 సెంటీమీటర్లకు పైగా కురిసిన భారీ వర్షం కారణంగా పలుచోట్ల మెరుపు వరద సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో దాదాపు 5 మీటర్ల మేర నీరు నిల్చొంది. దీంతో రెస్క్యూ టీమ్‌ల సాయం కోసం ఆయా ప్రాంతాల వారు ఇళ్లపైకి ఎక్కారు. పరిస్థితి దారుణంగా ఉందని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని మంత్రి వర్గాన్ని ఆదేశించారు. హిరోషిమా, ఎహైమ్, ఒకయామా, క్యోటో తదితర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటం వల్ల రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడింది. పశ్చిమ జపాన్‌లోని 32 లక్షల మందిని ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు వర్షం ధాటికి కొండచరియలు విరిగిపడి పెను ప్రమాదాలు జరిగాయి. మెట్రో రైలు పట్టాలు తప్పిన ఫొటో జపాన పరిస్థితికి అద్దం పడుతోంది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అసలే మెరుపు వరదలు, భూ పాతాల ధాటికి కుదేలవుతున్న జపాన్‌పై శనివారం సాయంత్రం భూ కంపం విరుచుకుపడింది. రిక్టర్ స్కేలుపై భూ కంప తీవ్రత 6.0గా నమోదైంది. -
ఆకస్మిక వరదలు.. 30 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సులో వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదల్లో 30 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. శనివారం రాత్రి సంభవించిన వరదల్లో ఓ మసీదుతో పాటు కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయని చిత్రాల్ జిల్లా మేయర్ హుస్సేన్ వెల్లడించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో.. చిత్రాల్ నది వరద ఉధృతి పెరగటంతో ఈ ప్రమాదం జరిగినట్లు 'జిన్హువా' వెల్లడించింది. పారా మిలటరీ, విపత్తు సహాయక బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్నాయని హుస్సేన్ వెల్లడించారు.