ఆకస్మిక వరదలు.. 30 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సులో వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదల్లో 30 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. శనివారం రాత్రి సంభవించిన వరదల్లో ఓ మసీదుతో పాటు కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయని చిత్రాల్ జిల్లా మేయర్ హుస్సేన్ వెల్లడించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో.. చిత్రాల్ నది వరద ఉధృతి పెరగటంతో ఈ ప్రమాదం జరిగినట్లు 'జిన్హువా' వెల్లడించింది.
పారా మిలటరీ, విపత్తు సహాయక బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్నాయని హుస్సేన్ వెల్లడించారు.