flying objects
-
మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా.. వారంలో నాలుగోది!
వాషింగ్టన్: గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువులు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. గత వారం రోజులుగా అగ్రరాజ్యంలో వరుస గగనతల ఉల్లంఘన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆకాశంలో 20 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఓ వస్తువును అమెరికా కూల్చేసింది. మిచిగాన్ రాష్ట్రంలోని హురాన్ సరస్సుపై ఎగురుతున్న అనుమానస్పద వస్తువును యూఎస్ యుద్ద విమానం పేల్చేసింది. గతం వారం రోజుల్లో వింత వస్తువులను కూల్చేయడం ఇదే నాలుగోసారి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వస్తువును పేల్చేశారు. ఎఫ్-16 యుద్ద విమానంతో కూల్చివేయాలని బైడెన్ ఆదేశించినట్లు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా గుర్తించిన వస్తువు అష్టభుజి ఆకారంలో తీగలు వేలాడుతూ కనిపించిందని అమెరికా తెలిపింది. ఇది ప్రమాదకరం కాదని, దాని వల్ల ఎలాంటి నష్టంలేదని అమెరికా తెలిపింది. నిఘా సామర్థ్యం, సైనిక ముప్పు కలిగించే శక్తి లేదని నిర్ధారించింది. అయితే ఇది సుమారు 20 వేల అడుగుల ఎత్తులో మిచిగాన్ మీదుగా ఎగురుతుండటం వల్ల పౌర విమానాల రాకపోకలకు విఘాతం కలుగుతుందన్న అనుమానంతో ఈ వస్తువును కూల్చేసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 4న చైనాకు భారీ బెలూన్ను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. దీని వెనక చైనా గూఢచర్యం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణను డ్రాగన్ దేశం కొట్టివేసింది. This footage was uploaded on Reddit by the user u/Grizz_fan12. The Video shows the Grant Park and the Lake Michigan at 12:10pm with a flying object which is the alleged #UFO that has been shot down a few moments ago. No confirmation yet but it‘s all we got. #ufo #usa #Michigan pic.twitter.com/HR9YpKTr2E — DustinsHotSauce (@HotSauceDustin) February 12, 2023 అది వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ మాత్రమేననీ.. దారి తప్పి అమెరికా ఆకాశంలోకి వచ్చిందని చెప్పింది. ఈ వాదనను అమెరికా ఖండించింది. అనంతరం అలాస్కా తీరంలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని శుక్రవారం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. తరువాత శనివారం కెనడాలోని యూకాన్ ప్రాంతంలో.. ఇప్పుడు మిచిగాన్‌లో మరో వస్తువును పేల్చేశారు. అయితే, ఈ మూడు వస్తువులు ఏంటీ? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నదానిపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అమెరికా మిలిటరీ ఆ వస్తువుల శకలాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉంది. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన అమెరికన్లు.. ఇంకా ఎన్ని ఎగురుతాయోనని నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. 🇺🇲 #Unknown #flyingobject in the #sky again #USA #spyballoon #MYSTERY #unexplained #video Connecting with the skies again 😊 pic.twitter.com/CHh6x0zO1S — Tasos Perte Tzortzis (@TasosPerte) February 12, 2023 -
’యోగా డే వేడుకలపై దాడులు జరగొచ్చు’
-
'యోగా డే వేడుకలపై దాడులు జరగొచ్చు'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని నగరంలో ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) హై అలర్ట్ జారీ చేసింది. యోగా డే దినం ఉత్సవాల వేదిక రాజ్‌పథ్ ఆవరణలో దాడులు జరిగే అవకాశం ఉందని... అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరించింది. ఆకాశంలో ఎగిరే బెలూన్లు, గాలిపటాలు లాంటి.. వాటి ద్వారా ఈ దాడులు జరగడానికి ఆస్కారం ఉందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో బెలూన్లు, గాలిపటాలు ఎగరవేయడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. అలాగే ఆకాశం నుంచి ఫోటోలు తీయడాన్ని కూడా నిషేధించారు. మరోవైపు దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలకు భారీ సన్నాహకాలు జరిగాయి. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. 30 కంపెనీల రక్షక దళాలు రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అయిదు వేలమంది సాయుధ రక్షక్ష భటులతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా రాజపథ్ చుట్టూ మోహరించారు. అంతర్జాతీయ యోగా దినంగా జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ శ్వాస నియంత్రణ, ఇతర యోగాసనాలను ప్రదర్శించనున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ, ప్రయివేటు అధికారులు , ఎన్సీసీ తదితరులతో కూడిన సుమారు 35 వేలమంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొననున్నారు.