Former IAS
-
S Jaishankar: ఆ విమానంలో నా తండ్రి కూడా ఉన్నారు
జెనీవా: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్‌సిరీస్‌పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు. ఏడుగురు హైజాకర్లు చొరబడి.. ‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్‌కోట్‌లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్‌పిట్‌లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్‌వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్‌కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్‌కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది. ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌లో చేరిన తొలినాళ్లలో.. అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది. ‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్‌గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్‌సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు. అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్‌గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్లు చెప్పారు. -
ఈడీ విచారణకు మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ
-
వీడు మహా కేటుగాడు.. ప్రియురాలితో సహా అజ్ఞాతంలోకి..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో పని చేస్తూ ఆయన సిమ్‌కార్డు కాజేసి, బ్యాంకు ఖాతా నుంచి రూ.13 లక్షలు కాజేసిన కేటుగాడు ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. బోగస్ ఆధార్ కార్డుతో పనిలో చేరిన ఇతగాడు సదరు మాజీ అధికారి అనుమతి లేకుండా ఆయన ఇంటి చిరుమానాతో ఇంకో ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. గతంలో మరో ప్రముఖుడి ఇంట్లోనూ ఇతడు పని చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ మాయగాడి వలలో పడి మోసపోయిన వారి సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మోసగాడి అసలు పేరు ఏమిటనేది ఎవరికీ తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా డోన్ నుంచి పొందినట్లు ఉన్న ఆధార్ కార్డును వినియోగించి ఇతగాడు ఓ కన్సల్టెన్సీ ద్వారా నగరంలో ఉద్యోగాల్లో చేరాడు. అందులో ఇతడి పేరు సురేందర్‌రావుగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సురేందర్‌రావుకు ఉద్యోగం ఇప్పించిన కన్సల్టెన్సీలోనూ పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే అతడు మాజీ ఐఏఎస్ ఇంట్లో సహాయకుడిగా ఉద్యోగంలో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి వద్ద దాదాపు రెండు నెలల పాటు పని చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మాజీ ఐఏఎస్ వద్ద పని చేస్తున్నప్పుడే ఆయన కొంత కాలంగా వినియోగించని సిమ్‌కార్డు తస్కరించిన అతగాడు తన ఫోన్లో వేసుకున్నాడు. దాని ఆధారంగా కొన్ని యూపీఐ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నాడు. వీటి ఆధారంగా దఫదఫాలుగా మొత్తం రూ. 13 లక్షలు కాజేశాడు. దాదాపు ఆరు నెలల పాటు ఈ మాజీ అధికారి వద్ద పని చేసిన సురేందర్‌రావు ఆయన ఇంటి చిరునామాతో, తన పేరిట కొత్తగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. డబ్బు కాజేసిన తర్వాత తన తల్లిదండ్రులకు కరోనా వచ్చిందంటూ చెప్పి పని మానేశాడు. అతగాడు పరారైన తర్వాతే డబ్బు పోయిన విషయం యజమాని గుర్తించారు. సురేందర్‌రావుగా చెప్పుకొన్న అతడు తెలుగు, హిందీ మాట్లాడే వాడని బాధిత కుటుంబం చెబుతోంది. అతడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆధార్ కార్డు ఇటీవలే పోస్టులో మాజీ అధికారి ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని వాళ్లు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. సురేందర్ రావు కాల్ లిస్ట్‌ను పరిశీలించిన పోలీసులు తరచుగా బిహార్‌కు చెందిన తన ప్రియురాలితో మాట్లాడినట్లు గుర్తించారు. కర్నూలు, హైదరాబాద్‌ల్లో ఉన్న వారితో చాలా తక్కువగా సంభాషించినట్లు తేల్చారు. అతడు కన్సల్టెన్సీలో ఇచ్చిన ఆధార్ కార్డులోని చిరునామా బోగస్‌దిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నేరగాడితో పాటు బిహార్‌కు చెందిన అతడి ప్రియురాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సాంకేతిక ఆధారాలను బట్టి వాళ్లు ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు పోలీసుల భావిస్తున్నారు. ఇతగాడు గతంలో చేసిన నేరాలపై కూడా దృష్టి పెట్టిన అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
యూపీ ఎన్నికలు.. మోదీ కీలక నిర్ణయం!
లక్నో: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయా?. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా తన ఆప్తుడు, మాజీ ఐఏఎస్ అధికారి, ఏకే శర్మను సిఫార్సు చేశారు. దీంతో శర్మ నియామకాన్ని పార్టీ అధిష్టానం ధృవీకరిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ శనివారం కీలక పదవులకు సంబంధించిన నేతల పేర్లను ప్రకటించారు. శర్మతో పాటు రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా లక్నోకు చెందిన అర్చనా మిశ్రా, బులంద్ షహర్‌కు చెందిన అమిత్ వాల్మీకిని నియమిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఏకే శర్మ.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కాగా, ఏకే శర్మ స్వస్థలం యూపీలోని మావ్. వైబ్రంట్ గుజరాత్ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి చేరువయ్యాడు శర్మ. ఆమధ్య తన నియోజకవర్గం వారణాసిలో కరోనా సమీక్ష కోసం శర్మనే, నరేంద్ర మోదీ పంపడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈమధ్య యూపీ కేబినేట్ విస్తరణ ఊహాగానాల్లో ఏకే శర్మకు స్థానం దక్కుతుందని అంతా భావించారు కూడా. ఇక తన నియామకంపై ఏకే శర్మ ప్రధానికి, పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. పార్టీని పటిష్టం చేయడంపై చర్చించామన్నారు. కాగా, వీరిది మర్యాదపూర్వక భేటీ అని అధికార వర్గాలు తెలిపాయి. యోగి హయాంలో యూపీ పాలనపై, కరోనా కట్టడిలో విఫలమయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మార్పులు చేయబోతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అదంతా మీడియా సృష్టేనని బీజేపీ నేతలు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తేల్చేశారు. చదవండి: యోగికి బెదిరింపు కాల్ -
మాజీ ఐఏఎస్‌పై యూపీలో కేసు
లక్నో: గంగా నదిలో తేలియాడుతున్న మృతదేహాలతో కూడిన పాత ఫొటోను ట్వీట్ చేయడం ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నావ్‌లో 2014లో తీసిన ఆ ఫొటోను తాజాగా బల్లియా జిల్లాలో తీసినట్లుగా పేర్కొన్నారంటూ యూపీ కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్‌పై ఉన్నావ్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఉన్నావ్ వద్ద గంగానదిలో తేలియాడుతున్న 67 మృతదేహాలను గంగానది ఒడ్డున జేసీబీతో గుంత తవ్వి ఖననం చేశారని కూడా ఈనెల 13వ తేదీన తన ట్వీట్లో ఈ మాజీ అధికారి పేర్కొన్నారని పోలీసులు ఆరోపించారు. మంగళవారం బల్లియా జిల్లా పరిధిలో గంగా నదిలో కనిపించిన 52 మృతదేహాలను వెలికితీసి, అంత్య క్రియలు జరిపామని పోలీసులు వెల్లడించారు. (చదవండి: వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!) -
విధుల్లో చేరేందుకు నో చెప్పిన మాజీ ఐఏఎస్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో విభేదించి ప్రభుత్వ సర్వీసుకు దూరంగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్‌ను కోవిడ్-19 నేపథ్యంలో విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరగా ఆయన నిరాకరించారు. ఈ సంక్షోభ సమయంలో తాను ఐఏఎస్ అధికారిగా కాకుండా సాధారణ పౌరుడిగా ప్రజలకు సేవలందించేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాగా కన్నన్ రాజీనామాను ప్రభుత్వం ఇప్పటివరకూ ఆమోదించకపోవడంతో తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం 33 ఏళ్ల కన్నన్ను కోరింది. అయితే ఇది ప్రభుత్వ వేధింపు చర్యగా అభివర్ణించిన కన్నన్ విధుల్లో చేరేందుకు నిరాకరించారు. డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ యంత్రాంగం సూచనల మేరకు కన్నన్‌కు లేఖ రాసిన ప్రభుత్వం రాజీనామాను ఆమోదించినప్పుడే అది అమలవుతుందని, అప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి విధుల నుంచి వైదొలగుతారని పేర్కొంది. మీకు నిర్ధేశించిన విధులకు హాజరు కావాలని ఆదేశించినా ఇప్పటివరకూ విధులకు హాజరు కాలేదని, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన క్రమంలో తక్షణమే విధుల్లో చేరాలని కోరింది. కాగా తనను విధుల్లో చేరాలని ప్రభుత్వం రాసిన లేఖను తన స్పందనను జోడించి ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. తాను రాజీనామా చేసి 8 నెలలు గడిచిందని, ప్రభుత్వం తనను వేధించడమే పనిగా పెట్టుకుందని, ప్రభుత్వం ఇంకా తనను వేధిస్తుందని తెలుసని..అయినా ఈ సంక్లిష్ట సమయంలో వాలంటీర్‌గా సేవలు అందించేందుకు సిద్ధమని, ఐఏఎస్‌గా మాత్రం తిరిగి చేరేదిలేదని స్పష్టం చేశారు. (చదవండి : కరోనా మృతులు లక్షలోపే: ట్రంప్) -
బీజేపీలో చేరిన అపరాజిత
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారిణి అపరాజిత సారంగి మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా బీజేపీ అధ్యక్షుడు బసంత్ పాండా పాల్గొన్నారు. 1994 బ్యాచ్‌కు చెందిన అపరాజిత ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారిణి. ఆమె 2013 నుంచి సెంట్రల్ డిప్యూటేషన్ మీద ఉన్నారు. అపరాజిత మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆమె చేపట్టిన ఈ పదవీకాలం 2018 ఆగస్టులో ముగిసింది. దీంతో సెప్టెంబర్‌లోనే ఆమె వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 16వ తేదీన ఆమోదించారు. ఆమె ఒడిశాలో విధులు నిర్వర్తిస్తున్న కాలంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తనదైన ముద్ర వేశారు. -
మాజీ IAS పద్మనాభయ్యతో మనసులో మాట
-
నాలుగేళ్ల ప్రజాధనం అంతా అమరావతికి తరలించారు
-
ఏపీ రాజధానిపై 'సుప్రీం'లో పిటిషన్
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారిక దేవ సహాయం ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తూ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఈ అంశంపై వాదనలన్నీ కూడా హైకోర్టు వినిపించాలని పిటిషన్‌దారుకు సూచించింది. ఈ విషయంలో తాను జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
మాజీ ప్రధాని పీవీ పీఏపై నటి సంగీత ఫిర్యాదు
తమిళసినిమా, న్యూస్‌లైన్ : కుక్కల గొడవ కోర్టు కెక్కింది. తనను అసభ్యంగా మాట్లాడారంటూ నటి సంగీత మాజీ ఐఏఎస్ పై ఫిర్యాదు చేశారు. వివరాల్లో కెళితే..స్థానిక వలసరవాక్కం, జానకి నగర్‌లోని ఆరవ వీధిలో ఉషా శంకర్ నారాయణ (68), నటరాజన్ ఇంట్లో, ఆరు నెలల క్రితం అద్దెకు చేరారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వద్ద పీఏగా పని చేశారట. అవివాహితుడైన ఉషా శంకర్ నారాయణన్ తనకు తోడుగా పది శునకాలను పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంటి యజమానికి ముందుగానే తెలియచేయడంతో ఆయన ఎలాంటి అభ్యంతరం తెలపలేదట. ఉషాశంకర్ నారాయణన్ తన శునకాలను పగటివేళల్లో కూడా బయటకు వదలడంతో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయమై వారు పలుమార్లు ఉషా శంకర్ నారాయణన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీంతో అదే వీధిలో నివసిస్తున్న నటి సంగీత కుక్కలను బయటకు వదలవద్దని ఉషా శంకర్ నారాయణన్‌కు చెప్పారు. అందుకాయన తాను మాజీ ఐఏఎస్ అధికారి అని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు పీఏగా పని చేశానంటూ అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో నటి సంగీత ఆ ప్రాంత ప్రజలు కొందరు వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి వ్యతిరేకంగా ఉషా శంకర్ నారాయణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరి ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉషాశంకర్ నారాయణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని వలసరవాక్కం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు నటి సంగీత, ఆ ప్రాంత ప్రజలు కొందరిపై కేసు నమోదు చేశారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం : ఈ సంఘటనపై నటి సంగీత, ఆమె భర్త గాయకుడు క్రిష్ విలేకరులకు తెలుపుతూ ఉషా శంకర్ నారాయణన్ తాను మాజీ ఐఏఎస్ అధికారంటూ వీరంగం చేస్తున్నారని చెప్పారు. ఆయన పెంచుకుంటున్న కుక్కలు వీధిలో తిరగడం వల్లనే పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారన్నారు. మూడు నెలల క్రితం ఒక పిల్లాడిని ఉషా శంకర్ నారాయణన్ పెంచుతున్న కుక్క కరిచిందని తెలిపారు. దీంతో పగటి వేళల్లో కుక్కలను బయటకు వదలకూడదని చెప్పామన్నారు. అందుకాయన తనను దుర్భాషలాడారని తెలిపారు. ఈ విషయమై వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో తాను న్యాయవాదులతో చర్చించి ఉషా శంకర్నారాయణన్పై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.